దక్షిణ కొరియాకు చెందిన దిగ్గజ వాహన తయారీ సంస్థలైన కియా, హ్యుందాయ్ కంపెనీల కార్లను అమెరికా దేశంలో రీకాల్ చేసేయాలని ఆ దేశ ఫెడరల్ ప్రభత్వానికి అభ్యర్థనలు వచ్చాయి. ఎందుకంటే ఆ కార్లను సులువుగా దొంగిలిస్తున్నారట. ‘అసోసియేటెడ్ ప్రెస్’ కథనం ప్రకారం.. అమెరికాలోని 17 రాష్ట్రాల అటార్నీ జనరల్‌లు మిలియన్ల కొద్దీ కియా, హ్యుందాయ్ కార్లను రీకాల్ చేయాలని ఫెడరల్ ప్రభుత్వాన్ని అభ్యర్థించారు.
ఇదీ చదవండి: వాహన ఇన్సూరెన్స్ చేయిస్తున్నారా? వీటితో భలే బెనిఫిట్స్!
అమెరికా దేశంలో గత దశాబ్దంలో విక్రయించిన కొన్ని కియా, హ్యుందాయ్ కార్లలో ఇంజిన్ ఇమ్మొబిలైజర్‌లు లేవు. వీటిని చాలా కార్లలో ప్రామాణిక ఫీచర్‌గా పరిగణిస్తారు. కీ లేకుండా ఇంజిన్‌ను స్టార్ట్ చేయకుండా ఈ ఇంజిన్ ఇమ్మొబిలైజర్‌లు నిరోధిస్తాయి. కేవలం స్క్రూడ్రైవర్, యూఎస్‌బీ కేబుల్‌తో కియా, హ్యుందాయ్ కార్లను ఎలా కొట్టేయొచ్చో చూపించే కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో, టిక్‌టాక్‌లో దర్శనమిస్తున్నాయి.
లాస్ ఏంజిల్స్‌లో కేవలం హ్యుందాయ్, కియా కార్ల దొంగతనాలు 2022లో దాదాపు 85 శాతం పెరిగాయి. నగరంలో జరిగిన మొత్తం కార్ల దొంగతనాలలో హ్యుందాయ్, కియా కార్ల దొంగతనాలు 20 శాతం ఉన్నాయని కాలిఫోర్నియా అటార్నీ జనరల్ కార్యాలయం తెలిపింది.
దొంగిలించిన ఈ కార్లు 14 ప్రమాదాలు, ఎనిమిది మరణాలకు కారణమయ్యాయని నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్ పేర్కొంటోంది. గత అక్టోబరులో న్యూయార్క్‌లోని బఫెలోలో జరిగిన కారు ప్రమాదంలో నలుగురు టీనేజర్లు చనిపోయారు. టిక్‌టాక్ ఛాలెంజ్‌లో భాగంగా కియా కారును దొంగిలించిన ఆరుగురు యువకులు వేగంగా దూసుకెళ్లి ప్రమాదానికి గురయ్యారు.
ఈ నేపథ్యంలో కాలిఫోర్నియా అటార్నీ జనరల్ రాబ్ బొంటా, ఇతర అటార్నీ జనరల్‌లు కియా, హ్యుందాయ్ కార్ల దేశవ్యాప్త రీకాల్‌ను అభ్యర్థిస్తూ నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్‌కు లేఖ పంపారు. కియా, హ్యుందాయ్ కంపెనీలు తమ అనేక వాహనాలకు ప్రామాణిక భద్రతా ఫీచర్లను కల్పించడంలో విఫలమవడం వల్ల వాహనదారులను, సామాన్య ప్రజలను ప్రమాదంలో పడేశాయని ఆరోపించారు.
ఇదీ చదవండి: బిర్యానీ అమ్ముతూ రోజుకు రూ.37 లక్షలు సంపాదిస్తున్నాడు.. ఫుడీ ఐఐటీయన్!
Comments
Please login to add a commentAdd a comment