ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ కియా కార్ల ధరల్ని భారీగా పెంచింది. సోనెట్ కాంపాక్ట్ ఎస్‌యూవీ కార్ల ధరల్ని ఒకే సారి రూ.34వేలు పెంచింది. ఈ ఏడాది క్యూ1 ఫలితాల సందర్భంగా జనవరిలో కార్ల ధరల్ని పెంచిన కియా ఇప్పుడు మరోసారి పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
కియా సోనెట్ సిరీస్‌లో హెచ్‌టీఈ,హెచ్‌టీకే, హెచ్‌టీకే ప్లస్, హెచ్‌టీఎక్స్, హెచ్‌టీఎక్స్ ప్లస్,జీటీఎక్స్‌ప్లస్‌తో పాటు ఇతర యానివర్సరీ ఎడిషన్ వేరియంట్‌లు ఉన్నాయి. వీటిలో హెచ్‌టీఈ 1.2 పెట్రోల్ వేరియంట్ కార్ల ధరల్ని అత్యధికంగా రూ.34వేలకు పెంచింది. ఇతర వేరియంట్లపై రూ.10వేలు, రూ.16వేల వరకు పెంచుతున్నట్లు ప్రకటించింది.
కార్లలో అదిరిపోయే ఫీచర్లు
కియా ఇండియా మై2022పేరుతో సోనెట్ వెర్షన్‌ను మార్కెట్‌కు పరిచయం చేసింది. ఈ కార్లలో సైడ్ ఎయిర్ బ్యాగ్స్, టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టం, బ్రేక్ అసిస్ట్, హిల్ అసిస్ట్ కంట్రోల్, ఎలక్ట్రానిక్స్ స్టేబులిటీ కంట్రోల్ ఫీచర్లను అప్‌డేట్ చేసింది. ఇంపీరియల్ బ్లూ, స్పార‍్క్లింగ్ సిల్విర్ కలర్ ఆప్షన్‌తో న్యూ బ్రాండ్ లోగోను ఆవిష్కరించింది.
ఇక ఈ కియా సోనెట్‌లో మొత్తం మూడు ఇంజిన్లు ఉన్నాయి. వాటిలో ఒకటి 1.2లీటర్ల నేచురల్ యాస్పిరేటెడ్ పెట్రోల్, 1.0లిటర్ల టర‍్బో పెట్రోల్, 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ సౌకర్యం ఉండగా.. ఫైవ్ స్పీడ్ మ్యాన్యువల్, సిక్స్ స్పీడ్ ఐఎంటీ, సిక్స్ స్పీడ్ మ్యాన్యువల్, సిక్స్ స్పీడ్ ఆటోమెటిక్ వంటి గేర్ బాక్స్ ఆప్షన్స్ ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment