India: Kia discontinues these diesel variants of Seltos SUV and Carnival MPV - Sakshi
Sakshi News home page

Kia India: కీలక నిర్ణయం..ఆ మోడల్స్ పూర్తిగా నిలిపివేత..!

Published Sat, Feb 19 2022 11:00 AM | Last Updated on Sat, Feb 19 2022 12:57 PM

Kia discontinues these diesel variants of Seltos SUV and Carnival MPV in India - Sakshi

సౌత్ కొరియన్ ఆటోమొబైల్ దిగ్గజం కియా ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. కంపెనీకి చెందిన పలు కార్ల వేరియంట్లను భారత్లో  నిలిపివేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.


ఆ వేరియంట్స్ కనిపించవ్...!
ఇండియాలో ప్రజాదరణ పొందిన సెల్టోస్ SUV, కార్నివాల్ MPV   కార్లకు చెందిన పలు వేరియంట్లను భారతదేశంలో నిలిపివేయాలని కియా నిర్ణయించుకుంది.  సెల్టోస్ SUV రేంజ్ లోని  మిడ్-రేంజ్ HTK+ డీజిల్-ఆటోమేటిక్ ట్రిమ్, ఏడు సీట్ల ప్రీమియం MPV కార్నివాల్ బేస్ వేరియంట్‌ను కంపెనీ ఉపసంహరించుకుందని ఒక ప్రకటనలో తెలిపింది. కాగా ఈ నిర్ణయం వెనుక నిర్దిష్ట కారణాలను కియా ఇండియా వెల్లడించలేదు.


తక్కువ డిమాండ్...
ఇండియాలో ఆయా వెరియంట్లకు తక్కువ డిమాండ్ ఉన్నందున కంపెనీ  ఉపసంహరించుకోవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇక ఈ కార్ల కోసం డీలర్ల నుంచి బుకింగ్‌లు తీసుకోవడానికి కియా ఇండియా నిరాకరించినట్లుగా తెలుస్తోంది.


వాటి బదులుగా..
కియా సెల్టోస్ HTK+ డీజిల్ ఆటోమేటిక్ వేరియంట్ ధర రూ.14.25 లక్షలు (ఎక్స్-షోరూమ్).  కియా కార్నివాల్ బేస్ వేరియంట్ డీజిల్ ఆటోమేటిక్ రూ. 25.49 లక్షలకు (ఎక్స్-షోరూమ్) అందుబాటులో ఉంది. కాగా సెల్టోస్ డీజిల్ ఆటోమేటిక్‌ని కొనుగోలు చేయాలనుకునే కస్టమర్‌లు ఇప్పుడు GTX+ ఆటోమేటిక్ వేరియంట్‌ను బుక్ చేసుకోవాల్సి ఉంటుంది., దీని ధర రూ.17.95 లక్షలు (ఎక్స్-షోరూమ్).  ఇది HTK+ వేరియంట్ కంటే రూ. 3.7 లక్షలు ఎక్కువ. కార్నివాల్ MPV కొత్త బేస్ వేరియంట్ ఇప్పుడు ప్రెస్టీజ్ ట్రిమ్ సెవెన్-సీటర్ యూనిట్, దీని ధర రూ. 29.99 లక్షలు (ఎక్స్-షోరూమ్).  ఇది HTK+ డీజిల్ ఆటోమేటిక్ వేరియంట్‌ల కంటే రూ.4.5 లక్షలు ఎక్కువ.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement