
న్యూఢిల్లీ: కియా తన సెల్టోస్ ‘ఎక్స్‌లైన్ వెర్షన్’లో బ్లాక్ కలర్ వేరియంట్‌ను తెచ్చింది. అందరి దృష్టిని ఆకర్షిస్తున్న ఈ కొత్త కలర్ వేరియంట్‌లో కేవలం ఎక్ట్సీరియర్‌లో మాత్రమే కాకుండా ఇంటీరియర్‌లో కూడా కొన్ని మార్పు లు చేశారు.
సెల్టోస్ ఎక్స్ లైన్ క్యాబిన్ బ్లాక్, స్ల్పెండిడ్ సేజ్ గ్రీన్ 2టోన్ కాంబినేషన్‌లో వేర్వేరు రంగులను కలిగి ఉంది. రియర్ స్కిడ్ ప్లేట్లు, షార్క్ ఫిన్ యాంటెన్నా, ఫాక్స్ ఎగ్జాస్ట్, వెనుక బంపర్‌పై ఫ్రంట్, ఔటర్ రియర్ మిర్రర్లు, టెయిల్ గేట్ గార్నిష్ తో సహా మరికొన్ని మార్పులు చేశారు.

‘‘ఇప్పటి వరకు గ్రే కలర్ వేరియంట్‌లో మాత్రమే అందుబాటులో ఉండే సెల్టోస్ అతి తక్కువ సమయంలో 5 లక్షల యూనిట్లు అమ్ముడైంది. కస్టమర్ల నుంచి డిమాండ్ భారీగా ఉంది. వారి ఫీడ్ బ్యాక్ ఆధారంగానే దీనిని బ్లాక్ కలర్ ఆప్షన్‌లో తీసుకొచ్చాము’’ అని కియా ఇండియా చీఫ్ సేల్స్ ఆఫీసర్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment