హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ కియా ఇండియా తాజాగా సెల్టోస్ కొత్త వేరియంట్లను ప్రవేశపెట్టింది. అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ (ఏడీఏఎస్) లెవెల్–2 సాంకేతికతతో ఇవి రూపుదిద్దుకున్నాయి. జీటీఎక్స్ ప్లస్ (ఎస్), ఎక్స్-లైన్ (ఎస్) వేరియంట్లలో పెట్రోల్ ఇంజన్‌తో 7 స్పీడ్ డ్యూయల్ క్లచ్ ట్రాన్స్‌మిషన్, డీజిల్ ఇంజన్‌తో 6 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో ఇవి తయారయ్యాయి.
ఎక్స్‌షోరూలో ధర రూ. 19.39 లక్షల నుంచి ప్రారంభం. కొత్త సెల్టోస్ సగటు వెయిటింగ్ పీరియడ్ 15=16 వారాలు ఉంది. నూతన వేరియంట్లను 7-9 వారాల్లోనే డెలివరీ చేయనున్నట్టు కంపెనీ ప్రకటించింది. రెండు నెలల్లోనే కొత్త సెల్టోస్ 50,000 యూనిట్ల బుకింగ్స్ మైలురాయిని అధిగమించిందని కియా ఇండియా వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment