దక్షిణ కొరియాకు చెందిన రెండో అతిపెద్ద కార్ల తయారీ సంస్థ కియా కొత్త ఎలక్ట్రిక్ కార్‌ను మార్కెట్‌లోకి తీసుకొస్తోంది. ఎలక్ట్రిక్ కార్ల విభాగాన్ని విస్తృతం చేయడంలో భాగంగా ఆల్-ఎలక్ట్రిక్ ఈవీ9 ఫ్లాగ్‌షిప్ ఎస్‌యూవీని విడుదల చేయనున్నట్లు తాజాగా తెలిపింది.
ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో ఈవీ6 ఎస్‌యూవీని 2021లో విడుదల చేసిన కియా కంపెనీకి ఇది రెండో ఎలక్ట్రిక్ కార్. మూడు వరుసల సీటర్ అయిన ఈ ఎస్‌యూవీ 99.8 కిలోవాట్-హవర్ బ్యాటరీతో వస్తుంది. ఒక్కసారి ఛార్జింగ్‌తో 501 కిలోమీటర్లు ప్రయాణించగలదు. ఇందులో ఆల్-వీల్-డ్రైవ్ మోడల్ కూడా అందుబాటులో ఉందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.
దక్షిణ కొరియాలో సోమవారం (జూన్ 19) విడుదల కానున్న ఈవీ9 ఎస్‌యూవీ ధర 73 నుంచి 82 మిలియన్ వాన్‌లు ( రూ. 46.8 లక్షలు నుంచి రూ.52.5 లక్షలు) ఉంటుంది. తర్వాత విడతలో ఈ ఎస్‌యూవీని యూరప్, యునైటెడ్ స్టేట్, ఇతర మార్కెట్లలో విడుదల చేయాలని కియా కంపెనీ యోచిస్తోందని యాన్‌హాప్ అనే కొరియన్ వార్తా సంస్థ నివేదించింది.
The future of driving isn’t just a technological jump forward. It will incorporate the humanity and user experience of passengers to help people move in a better way.
— Kia Worldwide (@Kia_Worldwide) June 16, 2023
Learn more: https://t.co/mRhnWQ1OEz#KiaEV9 #Kia pic.twitter.com/dHaRcrrxLY
Comments
Please login to add a commentAdd a comment