high range
-
సింగిల్ ఛార్జ్‌కి 501 కిలోమీటర్ల రేంజ్: కియా కొత్త ఎలక్ట్రిక్ కార్
దక్షిణ కొరియాకు చెందిన రెండో అతిపెద్ద కార్ల తయారీ సంస్థ కియా కొత్త ఎలక్ట్రిక్ కార్‌ను మార్కెట్లోకి తీసుకొస్తోంది. ఎలక్ట్రిక్ కార్ల విభాగాన్ని విస్తృతం చేయడంలో భాగంగా ఆల్-ఎలక్ట్రిక్ ఈవీ9 ఫ్లాగ్షిప్ ఎస్‌యూవీని విడుదల చేయనున్నట్లు తాజాగా తెలిపింది. ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో ఈవీ6 ఎస్‌యూవీని 2021లో విడుదల చేసిన కియా కంపెనీకి ఇది రెండో ఎలక్ట్రిక్ కార్. మూడు వరుసల సీటర్ అయిన ఈ ఎస్యూవీ 99.8 కిలోవాట్-హవర్ బ్యాటరీతో వస్తుంది. ఒక్కసారి ఛార్జింగ్‌తో 501 కిలోమీటర్లు ప్రయాణించగలదు. ఇందులో ఆల్-వీల్-డ్రైవ్ మోడల్ కూడా అందుబాటులో ఉందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. దక్షిణ కొరియాలో సోమవారం (జూన్ 19) విడుదల కానున్న ఈవీ9 ఎస్యూవీ ధర 73 నుంచి 82 మిలియన్ వాన్లు ( రూ. 46.8 లక్షలు నుంచి రూ.52.5 లక్షలు) ఉంటుంది. తర్వాత విడతలో ఈ ఎస్‌యూవీని యూరప్, యునైటెడ్ స్టేట్, ఇతర మార్కెట్లలో విడుదల చేయాలని కియా కంపెనీ యోచిస్తోందని యాన్హాప్ అనే కొరియన్ వార్తా సంస్థ నివేదించింది. The future of driving isn’t just a technological jump forward. It will incorporate the humanity and user experience of passengers to help people move in a better way. Learn more: https://t.co/mRhnWQ1OEz#KiaEV9 #Kia pic.twitter.com/dHaRcrrxLY — Kia Worldwide (@Kia_Worldwide) June 16, 2023 -
మార్కెట్లోకి మరో ఎలక్ట్రిక్ స్కూటర్.. ఒక్కసారి చార్జి చేస్తే 140 కిలోమీటర్లు..
న్యూఢిల్లీ: విద్యుత్ వాహనాల తయారీ సంస్థ ఈ–స్ప్రింటో కొత్తగా ఎమెరీ పేరిట ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ప్రవేశపెట్టింది. ఇది ఒక్కసారి చార్జి చేస్తే 140 కిలోమీటర్ల రేంజి (మైలేజీ) ఇస్తుంది. 6 సెకన్ల వ్యవధిలోనే గంటకు 0–40 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదని, గరిష్టంగా గంటకు 65 కి.మీ. వేగంతో ప్రయాణించగలదని సంస్థ తెలిపింది. ఇదీ చదవండి: Uber Green: ఉబర్‌లో సరికొత్త సేవలు.. తొలుత ఆ మూడు నగరాల్లో ప్రారంభం ప్రధానంగా పట్టణ ప్రాంతాల్లో 20–35 ఏళ్ల వయస్సు గల చోదకులు లక్ష్యంగా దీన్ని రూపొందించామని పేర్కొంది. ఇందులో రిమోట్ కంట్రోల్ లాక్, యాంటీ–థెఫ్ట్ అలారం, మొబైల్ చార్జింగ్ సాకెట్ తదితర ఫీచర్లు ఉంటాయని సంస్థ సహ వ్యవస్థాపకుడు అతుల్ గుప్తా తెలిపారు. దీని ప్రారంభ ధర రూ. 1,29,999 (ఎక్స్ షోరూం)గా ఉంటుంది. ఇదీ చదవండి: భారీగా పడిపోయిన ఎలక్ట్రిక్ టూవీలర్ల అమ్మకాలు.. కారణం ఇదే.. -
హైరేంజ్లో పైరవీలు
కలెక్టరేట్, న్యూస్‌లైన్: సార్వత్రిక ఎన్నికల వేడి తగ్గిందనుకు న్న అధికారులకు ఇప్పడు తహశీల్దార్ల బది లీల ప్రక్రియ వేడి పుట్టిస్తోంది. అనుకున్న మండలాలు దక్కించుకునేందుకు తహశీ ల్దార్లు చేస్తున్న పైరవీలు మామాలు స్థాయి లో కాకుండా హైరేంజ్లో ఉండటంతో అధికారులంతా కంగుతింటున్నారు. వీరంతా ప్రస్తుతం ఇతర జిల్లాల్లో పనిచేస్తూనే జిల్లా లో అనుకున్న మండలాన్ని దక్కించుకునేం దుకు శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నారు. పైరవీలకు ముందు వీరు ఉన్నతాధికారుల ను కలిసి విన్నవించుకుంటున్నారు. ఆ త ర్వాత సహకరించాలని యూనియన్ నేతలను కలుస్తున్నారు. వారి నుంచి సరైన స్పందన రాకపోవడంతో ఏకంగా ప్రజాప్రతినిధులను రంగంలోకి దింపారు. దీంతో జిల్లా, రాష్ట్రస్థాయి నేతలు తహశీల్దార్లకు మద్దతుగా నిలవడంతో బదిలీల ప్రక్రియ రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. కొత్త ప్రభుత్వంలో ఇలాంటి వత్తిళ్లు ఉండకపోవచ్చనుకున్న అధికారులకు ఇప్పుడే ఒత్తిళ్లు ఎక్కువ కావడంతో వారి పరిస్థితి అయోమయంగా మారింది. ఎంపీడీఓల విధానాన్ని ప్రవేశపెట్టాలి జిల్లాలోని వివిధ మండలాల్లో పనిచేస్తున్న ఎంపీడీఓలను ఎన్నికల సమయంలో ఇతర జిల్లాలకు బదిలీ చేశారు. ఆ తర్వాత యధావిధిగా వారిని ఆయా మండలాల్లోనే నియమించారు. ఇప్పుడు తహశీల్దార్లు సైతం అదే తరహాలో నియమించాలని పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఉన్నతాధికారులు నోరు విప్పడం లేదు. ఇతర జిల్లాలో పనిచేస్తోన్న జిల్లాకు చెందిన 33మంది తహశీల్దార్లకు గాను ఇప్పటి వరకు 17మంది రిలీవ్ అయి కలెక్టరేట్‌కు వ చ్చి రిపోర్టు చేశారు. ఇంకా 16మంది రావాల్సి ఉంది. వీరంతా సోమవారం వచ్చి రిపోర్టు చేయనున్నారు. అందరూ వచ్చాకే మండలాలకు కేటాయిస్తామని డీఆర్వో రాంకిషన్ పేర్కొన్నారు. 38మంది తహశీల్దార్లు రిలీవ్... జిల్లాలో ఇతర ప్రాంతాలకు చెందిన 39 మంది తహశీల్దార్లు పని చేస్తుండగా, వీరిలో 38 మంది అధికారులు ఆదివారం రిలీవ్ అయి తమ జిల్లాలకు వెళ్లిపోయారు. అయితే మిడ్జిల్ తహశీల్దార్ సుజాత ఎన్నికల సమయంలో విధుల్లో చేరేటప్పుడు ఏర్పడిన టెక్నికల్ సమస్య వల్ల బదిలీ కాలేకపోయారు. ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా వెంటనే సరి చేసినట్లు అధికారులు చెబుతున్నారు. దీంతో ఆమె సోమవారం రిలీవ్ కానున్నారు.