హైరేంజ్‌లో పైరవీలు
కలెక్టరేట్, న్యూస్‌లైన్: సార్వత్రిక ఎన్నికల వేడి తగ్గిందనుకు న్న అధికారులకు ఇప్పడు తహశీల్దార్ల బది లీల ప్రక్రియ వేడి పుట్టిస్తోంది. అనుకున్న మండలాలు దక్కించుకునేందుకు తహశీ ల్దార్లు చేస్తున్న పైరవీలు మామాలు స్థాయి లో కాకుండా హైరేంజ్‌లో ఉండటంతో అధికారులంతా కంగుతింటున్నారు. వీరంతా ప్రస్తుతం ఇతర జిల్లాల్లో పనిచేస్తూనే జిల్లా లో అనుకున్న మండలాన్ని దక్కించుకునేం దుకు శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నారు. పైరవీలకు ముందు వీరు ఉన్నతాధికారుల ను కలిసి విన్నవించుకుంటున్నారు. ఆ త ర్వాత సహకరించాలని యూనియన్ నేతలను కలుస్తున్నారు.
వారి నుంచి సరైన స్పందన రాకపోవడంతో ఏకంగా ప్రజాప్రతినిధులను రంగంలోకి దింపారు. దీంతో జిల్లా, రాష్ట్రస్థాయి నేతలు తహశీల్దార్లకు మద్దతుగా నిలవడంతో బదిలీల ప్రక్రియ రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. కొత్త ప్రభుత్వంలో ఇలాంటి వత్తిళ్లు ఉండకపోవచ్చనుకున్న అధికారులకు ఇప్పుడే ఒత్తిళ్లు ఎక్కువ కావడంతో వారి పరిస్థితి అయోమయంగా మారింది.
ఎంపీడీఓల విధానాన్ని ప్రవేశపెట్టాలి
జిల్లాలోని వివిధ మండలాల్లో పనిచేస్తున్న ఎంపీడీఓలను ఎన్నికల సమయంలో ఇతర జిల్లాలకు బదిలీ చేశారు. ఆ తర్వాత యధావిధిగా వారిని ఆయా మండలాల్లోనే నియమించారు. ఇప్పుడు తహశీల్దార్లు సైతం అదే తరహాలో నియమించాలని పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఉన్నతాధికారులు నోరు విప్పడం లేదు. ఇతర జిల్లాలో పనిచేస్తోన్న జిల్లాకు చెందిన 33మంది తహశీల్దార్లకు గాను ఇప్పటి వరకు 17మంది రిలీవ్ అయి కలెక్టరేట్‌కు వ చ్చి రిపోర్టు చేశారు. ఇంకా 16మంది రావాల్సి ఉంది. వీరంతా సోమవారం వచ్చి రిపోర్టు చేయనున్నారు. అందరూ వచ్చాకే మండలాలకు కేటాయిస్తామని డీఆర్వో రాంకిషన్ పేర్కొన్నారు.
38మంది తహశీల్దార్లు రిలీవ్...
జిల్లాలో ఇతర ప్రాంతాలకు చెందిన 39 మంది తహశీల్దార్లు పని చేస్తుండగా, వీరిలో 38 మంది అధికారులు ఆదివారం రిలీవ్ అయి తమ జిల్లాలకు వెళ్లిపోయారు. అయితే మిడ్జిల్ తహశీల్దార్ సుజాత ఎన్నికల సమయంలో విధుల్లో చేరేటప్పుడు ఏర్పడిన టెక్నికల్ సమస్య వల్ల బదిలీ కాలేకపోయారు. ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా వెంటనే సరి చేసినట్లు అధికారులు చెబుతున్నారు. దీంతో ఆమె సోమవారం రిలీవ్ కానున్నారు.