దక్షిణ కొరియా కార్ల తయారీ సంస్థ కియా భారత మార్కెట్లలోకి సరికొత్త కియా కార్నివాల్‌ను ఎమ్‌పీవీను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. అప్‌డేట్ చేసిన కార్నివాల్ ఇప్పుడు కియా న్యూలోగోతో రానుంది. కియా భారత మార్కెట్లలోకి సెల్టోస్, సొనెట్ ఎస్‌యూవీలను ప్రవేశపెట్టింది. కార్నివాల్ మల్టీపర్పస్ వెహికిల్(ఎమ్‌పీవీ) లిమోసిన్, లిమోసిన్+ వేరియంట్‌లను కూడా కియా మార్పులను చేసింది.
చదవండి: టాటా మోటార్స్ ఎలక్ట్రిక్ సెడాన్
రిఫ్రెష్ చేయబడిన కియా కార్నివాల్ శ్రేణి వాహనాలు సుమారు రూ. 24,95,000 (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభకానున్నాయి. దేశవ్యాప్తంగా కియా డీలర్‌షిప్ నుంచి, కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌ను ఉపయోగించి కార్నివాల్‌ను బుక్ చేసుకోవచ్చు. కియా కార్నివాల్ నాలుగు వేరియంట్లో రానుంది. లిమోసిన్+, లిమోసిన్, ప్రెస్టీజ్, ప్రీమియం. అప్‌డేట్ చేసిన కార్నివాల్‌లో కియా ఇండియా అనేక కొత్త ఫీచర్లను ప్రవేశపెట్టింది. కారు రెండో వరుసలో లెగ్ సపోర్ట్, 20.32 సెంటీమీటర్లఇన్ఫోన్‌మెంట్‌తో ఓటీఐ మ్యాప్ అప్‌డేట్లతో, వీఐపీ ప్రీమియం లేథర్ సీట్లను అందించనుంది.
లిమోసిన్ వేరియంట్‌లో వెరియల్‌లో వెనుకసీట్‌లో కూర్చున్న వారి కోసం కొత్తగా 10.1 "రియర్ సీట్ ఎంటర్‌టైన్‌మెంట్ సిస్టమ్ యూనిట్, స్మార్ట్ ఎయిర్‌ప్యూరిఫైయర్‌ను అమర్చారు. హర్మన్ కార్డాన్ ప్రీమియం స్పీకర్ సౌండ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, 10 వే పవర్ డ్రైవర్ సీట్, డ్రైవర్ సీట్ వెంటిలేషన్, లెదర్ఢ్ స్టీరింగ్ వీల్, గేర్ నాబ్, ప్రీమియం వుడ్ గార్నిష్ వంటి ఫీచర్లతో టాప్-స్పెక్స్‌తో లిమోసిన్ ప్లస్ వేరియంట్లో అమర్చారు.
Comments
Please login to add a commentAdd a comment