Updated variant
-
సరికొత్తగా కియా కార్నివాల్ మార్కెట్లలోకి లాంచ్...!
దక్షిణ కొరియా కార్ల తయారీ సంస్థ కియా భారత మార్కెట్లలోకి సరికొత్త కియా కార్నివాల్‌ను ఎమ్‌పీవీను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. అప్డేట్ చేసిన కార్నివాల్ ఇప్పుడు కియా న్యూలోగోతో రానుంది. కియా భారత మార్కెట్లలోకి సెల్టోస్, సొనెట్ ఎస్‌యూవీలను ప్రవేశపెట్టింది. కార్నివాల్ మల్టీపర్పస్ వెహికిల్(ఎమ్‌పీవీ) లిమోసిన్, లిమోసిన్+ వేరియంట్లను కూడా కియా మార్పులను చేసింది. చదవండి: టాటా మోటార్స్ ఎలక్ట్రిక్ సెడాన్ రిఫ్రెష్ చేయబడిన కియా కార్నివాల్ శ్రేణి వాహనాలు సుమారు రూ. 24,95,000 (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభకానున్నాయి. దేశవ్యాప్తంగా కియా డీలర్షిప్ నుంచి, కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌ను ఉపయోగించి కార్నివాల్‌ను బుక్ చేసుకోవచ్చు. కియా కార్నివాల్ నాలుగు వేరియంట్లో రానుంది. లిమోసిన్+, లిమోసిన్, ప్రెస్టీజ్, ప్రీమియం. అప్డేట్ చేసిన కార్నివాల్లో కియా ఇండియా అనేక కొత్త ఫీచర్లను ప్రవేశపెట్టింది. కారు రెండో వరుసలో లెగ్ సపోర్ట్, 20.32 సెంటీమీటర్లఇన్ఫోన్మెంట్తో ఓటీఐ మ్యాప్ అప్డేట్లతో, వీఐపీ ప్రీమియం లేథర్ సీట్లను అందించనుంది. లిమోసిన్ వేరియంట్లో వెరియల్లో వెనుకసీట్లో కూర్చున్న వారి కోసం కొత్తగా 10.1 "రియర్ సీట్ ఎంటర్టైన్మెంట్ సిస్టమ్ యూనిట్, స్మార్ట్ ఎయిర్ప్యూరిఫైయర్ను అమర్చారు. హర్మన్ కార్డాన్ ప్రీమియం స్పీకర్ సౌండ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, 10 వే పవర్ డ్రైవర్ సీట్, డ్రైవర్ సీట్ వెంటిలేషన్, లెదర్ఢ్ స్టీరింగ్ వీల్, గేర్ నాబ్, ప్రీమియం వుడ్ గార్నిష్ వంటి ఫీచర్లతో టాప్-స్పెక్స్‌తో లిమోసిన్ ప్లస్ వేరియంట్లో అమర్చారు. చదవండి: బైక్ కొనుగోలుదారులకు హీరో మోటోకార్ప్ షాక్! -
రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయ కొత్త మోడల్
సాక్షి, న్యూఢిల్లీ : రాయల్ ఎన్ఫీల్డ్ రానున్న కొత్త ఉద్గార నిబంధనలకనుగుణంగా పాపులర్ మోడల్ హిమాలయను బైక్‌ను అప్డేట్ చేసింది. బీఎస్-6 ఇంజిన్‌తో సోమవారం లాంచ్ చేసింది. దీని ప్రారంభ ధర రూ .1.86 లక్షల (ఎక్స్‌షోరూమ్, న్యూఢిల్లీ) గా ఉంచినట్లు కంపనీ తెలిపింది. ఏబీఎస్ ఫీచర్‌తో మూడు రంగుల్లో వీటిని తీసుకొచ్చింది. 411 సీసీ ఇంజీన్, 24.3 బీహెచ్పీ పవర్, 32 ఎన్ఎం టార్క్ ప్రధాన ఫీచర్లుగా ఉన్నాయి. బుకింగ్స్‌ను ఇప్పటికే ప్రారంభించగా, మూడేళ్ల వారంటీ ప్యాకేజీని అందిస్తోంది. విలక్షణమైన అడ్వెంచర్ టూరర్ గా 2016 నుండి, హిమాలయ బైక్స్ జాతీయంగా అంతర్జాతీయంగా ఆదరణ పొందిందని రాయల్ ఎన్ఫీల్డ్ సీఈవో వినోద్ దాసరి ఒక ప్రకటనలో తెలిపారు. ప్రత్యేకమైన ఫీచర్స్, డిజైన్ ఫంక్షన్లతో కొత్త బిఎస్-6 హిమాలయన్ లాంచ్ చేయడం దేశంలో అడ్వెంచర్ మోటార్ సైక్లింగ్ కొత్త ప్రమాణాలను ఏర్పరచడంతోపాటు, రైడర్లను ఆకట్టుకుంటుందనే విశ్వాసాన్ని కంపెనీకి కలిగిస్తోందన్నారు. తమ కొత్త బైక్స్ భారతదేశంలోని రాయల్ ఎన్ఫీల్డ్ డీలర్‌షిప్‌లలో లభిస్తాయని అన్నారు. అలాగే హెల్మెట్లు, జెర్సీలు, టీ-షర్టులు, స్వెర్ట్‌షర్ట్స్, హెడ్‌గేర్ తదితరాలను సరికొత్త గా తీసుకొస్తున్నట్టు చెప్పారు. స్నో వైట్, గ్రానైట్ కలర్ ఆప్షన్ బైక్ ధర రూ .1,86,811 (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభం స్లీట్ గ్రే , గ్రావెల్ గ్రే మోడల్ ధర రూ .1,89,565 (ఎక్స్-షోరూమ్) కొత్తగా వచ్చిన డ్యూయల్ టోన్ కలర్స్ - రాక్ రెడ్ , లేక్ బ్లూ - రూ .1,91,401 (ఎక్స్-షోరూమ్) వద్ద లభిస్తాయి. -
సరికొత్తగా మారుతి ఈకో
దేశీయ కారు మేకర్ మారుతి తనపాపులర్ మోడల్ ఈకో క్యాబ్ ఆరును కొత్తగా తీర్చి దిద్దింది. రానున్న భద్రతా నిబంధనలకనుగుణంగా బేసిక్ భద్రతా ఫీచర్లతో సరికొత్తగా లాంచ్ చేసింది. ఈ అప్డేటెడ్ మోడల్ వాహనం ధరను రూ. 3.55 లక్షలుగా (ఎక్స్ షో రూం ఢిల్లీ) గతంకంటే రూ.23వేల దర పెంచింది. 1.2 పెట్రోల్ ఇంజీన్, సీఎన్జీ వేరియంట్లలో ఈ కారు లభ్యం కానుంది. 73 పవర్, 101 గరిష్ట టార్క్ ఫీచర్లకు తోడు డ్రైవర్ సైడ్ ఎయిర్‌బ్యాగ్, ఫ్రంట్, రియర్ పార్కింగ్ సెన్సర్లు, స్పీడ్ అలర్ట్ తదితర ఫీచర్లను అదనంగా జోడించింది. -
టయోటా ఇటియోస్.. కొత్త వేరియంట్లు
న్యూఢిల్లీ: టయోటా కిర్లోస్కర్ మోటార్ కంపెనీ ఇటియోస్ మోడల్లో అప్డేటెడ్ వేరియంట్, ఇటియోస్ ఎక్స్‌క్లూజివ్‌ను సోమవారం మార్కెట్లోకి తెచ్చింది. ఈ కారు పెట్రోల్ వేరియంట్ ధరలు రూ.7.82 లక్షల నుంచి, డీజిల్ వేరియంట్ ధరలు రూ.8.92 లక్షల రేంజ్(ఎక్స్ షోరూమ్, ఢిల్లీ)ల నుంచి ప్రారంభమవుతాయని కంపెనీ తెలిపింది. సౌకర్యవంతమైన ఫీచర్లతో ఈ కొత్త ఇటియోస్ ఎక్స్‌క్లూజివ్‌ను అందిస్తున్నామని కంపెనీ డెరైక్టర్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (సేల్స్, మార్కెటింగ్) ఎన్. రాజా చెప్పారు. మారుతున్న జీవన శైలి, వినియోగదారుల అభిరుచులకనుగుణంగా ఎప్పటికప్పడు తమ మోడళ్లను అప్‌గ్రేడ్ చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. -
ఎక్స్‌ట్రీమ్‌లో కొత్త వేరియంట్
ధర రూ. 72,725 న్యూఢిల్లీ: హీరోమోటోకార్ప్ కంపెనీ 150 సీసీ కేటగిరీలో అప్డేటెడ్ వేరియంట్‌ను మంగళవారం మార్కెట్లోకి తెచ్చింది. ఎక్స్ట్రీమ్ స్పోర్ట్స్ పేరుతో ఈ అప్‌డేటెట్ వేరియంట్‌ను అందిస్తున్నామని కంపెనీ తెలిపింది. ఈ బైక్ దర రూ.72,725 (ఎక్స్ షోరూమ్, ఢిల్లీ) అని పేర్కొంది. కొత్త రకంగా డిజైన్ చేసిన హెడ్‌ల్యాంప్, ట్విన్ ఎల్ఈడీ పైలట్ ల్యాంప్స్ తదితర ప్రత్యేకతలున్నాయని వివరించింది. శక్తివంతమైన ఇంజిన్, స్టైల్‌ల కలబోతగా రూపొందించిన ఈ బైక్‌కు మంచి ఆదరణ లభించగలదని కంపెనీ ఆశిస్తోంది. గత నెలలో కంపెనీ అందించిన రెండవ ఉత్పత్తి ఇది. గత నెల ప్రారంభంలో ప్యాషన్ ప్రొలో అప్డేటెడ్ వేరియంట్‌ను మార్కెట్లోకి తెచ్చింది.