వారెన్ బఫ్ఫెట్‌కు చెందిన బెర్క్‌షైర్ హాత్వే యాజమాన్యంలోని రియల్ ఎస్టేట్ కంపెనీ ‘హోమ్ సర్వీసెస్ ఆఫ్ అమెరికా’ అమెరికా దేశవ్యాప్తంగా వ్యాజ్యాలను పరిష్కరించుకునేందుకు 250 మిలియన్ డాలర్లు (సుమారు రూ.20 వేల కోట్లు) చెల్లించడానికి అంగీకరించింది.
రియల్ బ్రోకరేజీలు తమ నుంచి అధికంగా బ్రోకర్ కమీషన్లు వసూలు చేశాయంటూ అమెరికాలోని గృహ యజమానులు ఈ వ్యాజ్యాలు దాఖలు చేశారు. ప్రతిపాదిత సెటిల్‌మెంట్ ద్వారా తమ 51 బ్రాండ్‌లు, దాదాపు 70,000 రియల్ ఎస్టేట్ ఏజెంట్లు, 300 ఫ్రాంఛైజీలకు ఈ వ్యాజ్యాల నుంచి విముక్తి లభిస్తుందని హోమ్ సర్వీసెస్ ఆఫ్ అమెరికా తెలిపింది.
కెల్లర్ విలియమ్స్ రియాల్టీ, రీ/మ్యాక్స్, కంపాస్, ఎనీవేర్ రియల్ ఎస్టేట్‌తో సహా అనేక ఇతర పెద్ద బ్రోకరేజ్ సంస్థలు ఇదివరకే సెటిల్మెంట్‌కు సిద్ధమైన నేపథ్యంలో ‘హోమ్ సర్వీసెస్ ఆఫ్ అమెరికా’ కంపెనీ కూడా సెటిల్మెంట్ సిద్ధమైంది. గత నెలలో, నేషనల్ అసోసియేషన్ ఆఫ్ రియల్టర్స్ 418 మిలియన్ డాలర్లు చెల్లించడానికి అంగీకరించింది.
Comments
Please login to add a commentAdd a comment