అమెజాన్ ఫౌండర్, సీఈవో జెఫ్ బెజోస్ (54), మెకంజీ (48) దంపతులు అధికారికంగా విడిపోయారు. తాము విడిపోబోతున్నామని ఇటీవల ప్రకటించిన తెలిసిందే. గురువారం వీరి విడాకుల అంశం తేలిపోవడంతో మెకంజీ ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు.
ప్రేమించే భర్తే లేనపుడు అతని సొమ్ము మాత్రం ఎందుకు అనుకున్నారో ఏమో తెలియదుగానీ భర్తనుంచి వచ్చే భారీ సొమ్మును తృణప్రాయంగా త్యజించేశారు. సోషల్ మీడియా వేదిక ట్విటర్‌లో తొలిసారి స్పందించిన మెకంజీ తన అభిప్రాయాన్ని పోస్ట్ చేశారు. జెఫ్‌తో వివాహ బంధం ముగిసిందనీ ట్వీట్ చేశారు. తన భవిష్యత్ ప్రణాళికల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నానన్నారు.
మెకంజీ తన వాటాపై వచ్చే కీలక హక్కులను, ఇతర అధికారాలను మాజీ భర్తకే వదులుకుంటున‍్నట్టు వెల్లడించారు. విడాకులు ఫైనల్ కావడంతో ఆమెకు భరణం కింద లభించే వాటాల మార్కెట్ విలువ (36 బిలియన్ డాలర్లు) రూ. 2.49 లక్షల కోట్లు. అయితే ఇవేవీ తనకు అవసరం లేదని తెగేసి చెప్పారు.
తనకిష్టమైనవన్నీ ఆయనకు సంతోషంగా ఇచ్చేస్తాను. ముఖ్యంగా ది వాషింగ్టన్ పోస్ట్, బ్లూ ఆరిజిన్, అమెజాన్‌లోని 75శాతం వాటాలను వదులుకుంటున్నట్టు ప్రకటించారు. అమెజాన్‌లో బెజోస్‌కు 12 శాతం వాటా వుంది. అంతేకాదు తనకు లభించే వాటాలపై ఓటింగ్ హక్కులను జెఫ్‌కే వదులుకుంటున్నాని ట్వీట్ చేశారు. దీనికి స‍్పందించిన జెఫ్ బెజోస్ మెకంజీతో భాగస్వామ్యం, స్నేహం కొనసాగుతుందని ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా తనకు అండగా నిలిచి, ప్రేమ పంచిన స్నేహితులు, కుటుంబ సభ్యులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.
కాగా ప్రపంచ కుబేరుడు అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్, మెకంజీ తాము విడాకులు తీసుకోబోతున్నట్టు ట్విటర్ ద్వారా ఈ ఏడాది జనవరిలో ప్రకటించారు. టీవీ యాంకర్ లారెన్‌తో బెజోస్‌కు సంబంధాలే వీరిద్దరి విభేదాలకు కారణమైనట్టు సమాచారం. అయితే ఫోర్బ్స్ ప్రకారం ఈ విడాకుల సెటిల్‌మెంట్ సొమ్ముతో ప్రపంచంలోనే మూడవ అత్యంత సంపన్న మహిళగా మెకంజీ నిలిచే అవకాశం వుంది. కానీ ఈ అవకాశాన్ని వదులుకోవడంతోపాటు కొత్త ప్రణాళికలతో ముందుకు సాగబోతున్నానంటూ ప్రకటించడం విశేషం.
చదవండి : అమెజాన్ సీఈవో సంచలన ప్రకటన
— MacKenzie Bezos (@mackenziebezos) April 4, 2019
Comments
Please login to add a commentAdd a comment