=జరిమానాలకు తాజా మార్గదర్శకాలు విడుదల
=గత ఆదేశాల అమలులో కరువైన చిత్తశుద్ధి
=భయపడుతున్నవారు కొందరు..అమ్ముడుపోతున్నవారు మరికొందరు..
=విధి నిర్వహణలో అధికారుల వెనుకంజ
=కాలర్ ఎగరేస్తున్న ఇసుక మాఫియా
యలమంచిలి, న్యూస్‌లైన్: ఇసుక స్మగ్లర్లపై ప్రభుత్వం మరోసారి కన్నెర్ర చేసింది. నదుల్లో ఇసుక తరలిస్తున్న వాహనాలకు జరిమానా విధింపులో మరోసారి మార్గదర్శకాలను జారీ చేసింది. అక్రమ ఇసుక తరలింపునకు సంబంధించి ప్రభుత్వ చర్యలు ఆది నుంచి బెడిసికొడుతున్నాయి. ప్రభుత్వ ఆదేశాలను చిత్తశుద్ధితో అమలుచేసే అధికార యంత్రాంగం లేకపోవడంతో ఇసుక స్మగ్లర్లు పేట్రేగిపోతున్నారు. తాజాగా నదుల్లో ఇసుకను తరలిస్తున్న వాహనాలను కేటగిరీలుగా విభజించారు. ట్రాక్టరు, లారీలు ఇసుక తరలింపుతో పట్టుబడినట్టయితే మొదటిసారి రూ.5 వేలు, రెండోసారి రూ.10 వేలు, లారీల్లో ఇసుక తరలిస్తే మొదటిసారి రూ.15 వేలు, రెండోసారి రూ.20 వేలు జరిమానా విధించాలంటూ ప్రభుత్వం ఆదేశించింది. మూడోసారి పట్టుబడితే వాహనాలను సీజ్ చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది.
ఆదేశాలు సరే.. అమలేదీ?
నదుల్లో ఇసుక తరలింపును అడ్డుకోవలసిందిగా అప్పుడప్పుడు ప్రభుత్వం అధికార యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేస్తూనే ఉంది. గత రెండేళ్లలో ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను ఒకసారి పరిశీలిస్తే.. నదుల్లో ఇసుక తరలింపును అడ్డుకోవడానికి గ్రామ, మండల, డివిజన్ స్థాయి కమిటీలు ఏర్పాటు చేయాలన్న ఆదేశాలు జారీ అయ్యాయి. వీటి ఏర్పాటును అధికారులు పెద్దగా పట్టించుకోలేదు. క్రిమినల్ కేసులు, వాహనాల సీజ్ వంటితో ఇసుక తరలింపును కట్టడి చేయాలన్న ఆదేశాల వల్ల కూడా పెద్దగా ప్రయోజనం లేకుండా పోయింది. ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన ప్రతిసారీ రెండు మూడు రోజులపాటు హడావిడి చేస్తున్న అధికారులు.. ఆ తర్వాత ఆదేశాలను బుట్టదాఖలు చేస్తున్నారు.
పేట్రేగిపోతున్న ఇసుక స్మగ్లర్లు
వరాహ, శారద, తాండవ నదుల్లో ఇసుక రవా ణా చేసే స్మగ్లర్ల ఆగడాలకు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. ఇసుక అక్రమ తవ్వకాలను అడ్డుకుంటున్న ప్రభుత్వ సిబ్బందిపై దాడులకు తెగబడడంతో పలువురు సిబ్బంది మాకెందుకులే అన్నట్టు వ్యవహరిస్తున్నారు. ఇసుక అక్రమ తవ్వకాల ద్వారా స్మగ్లర్లు నెలకు లక్షల్లో ఆర్జిస్తున్నారు.దీంతో అధికారులు అప్పుడప్పుడు కేసు లు పెట్టి, జరిమానా వసూలు చేస్తున్నా పెద్దగా పట్టించుకోవడంలేదు.
ఒక ట్రాక్టరు ఉన్న ఇసు క స్మగ్లర్ ఆదాయం నెలకు 3 లక్షల పైమాటే. దీంతో స్మగ్లర్లు ఇసుక అక్రమ రవాణాకు రెవె న్యూ, పోలీసు శాఖలకు వేలల్లో మామూళ్లు సమర్పిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నా యి. స్థానికులను మేనేజ్ చేయడానికి స్మగ్లర్లు పెద్దఎత్తున డబ్బు ఖర్చు చేస్తున్నారు. ఇసుక స్మగ్లర్ల స్థాయిలో సెటిల్‌మెంట్ చేసే గ్యాంగ్‌లు కూడా పనిచేస్తున్నాయన్న విమర్శ లు వినిపిస్తున్నాయి. ఇక నదుల్లో కెమెరాలు పట్టుకుని వెళ్తున్న వాళ్లకు వేలల్లో నెలవారీ మామూళ్లు సమర్పిస్తున్నారు. దీంతో ప్రభుత్వం ఎన్ని ఆదేశాలు జారీ చేసినప్పటికీ మాకేమీ కాదంటూ స్మగ్లర్లు తమ పని తాము చేసుకుపోతున్నారు.
ఇసుకాసురులపై కన్నెర్ర
Published Thu, Dec 19 2013 2:48 AM | Last Updated on Tue, Aug 28 2018 8:41 PM
Advertisement
Advertisement