స్టాక్ ఎక్సే్ఛంజీ దిగ్గజాలు బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈ నేటి(గురువారం) నుంచి టీప్లస్‌జీరో సెటిల్‌మెంట్‌కు తెరతీస్తున్నాయి. తొలుత 25 షేర్లలో ఆప్షనల్ పద్ధతిన అమలు చేయనున్నాయి. ఈక్విటీ నగదు మార్కెట్లో ప్రస్తుతం అమలవుతున్న టీప్లస్1 సెటిల్‌మెంట్‌కు జతగా పరిశీలన పద్ధతిలో టీప్లస్0కు శ్రీకారం చుడుతున్నాయి. కొద్దిమంది బ్రోకర్ల ద్వారా మాత్రమే ఇందుకు వీలు కలి్పస్తున్నాయి. వెరసి ఈ నెల 28 నుంచి లావాదేవీ చేపట్టిన రోజునే సెటిల్‌మెంట్ పూర్తికానుంది.
ఈ జాబితాలో బజాజ్ ఆటో, వేదాంతా, హిందాల్కో, ఎస్‌బీఐ, ట్రెంట్, టాటా కమ్యూనికేషన్స్, నెస్లే, సిప్లా, ఎంఆర్‌ఎఫ్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, బీపీసీఎల్, ఓఎన్‌జీసీ, ఎన్‌ఎండీసీ, అంబుజా సిమెంట్స్ తదితరాలున్నాయి. తాజా సెటిల్‌మెంట్‌తో సమయం, వ్యయాలు ఆదా అవుతాయని అంచనా. మార్కెట్ లావాదేవీల్లో ఈ వ్యవస్థ మరింత పారదర్శకత తీసుకువస్తుందని భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment