బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలకు ఆర్‌బీఐ మార్గదర్శకాలు
సమాచార సేకరణపైదృష్టి పెట్టాలని నిర్దేశం
ముంబై: అక్రమ లావాదేవీలపై బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు (ఎన్‌బీఎఫ్‌సీ)సహా తన నియంత్రణలో ఉన్న అన్ని సంస్థలూ ఎల్లప్పుడు అప్రమత్తంగా ఉండాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) నిర్దేశించింది. ఈ సమస్య అరికట్టడానికి సంబంధిత అంతర్గత, బాహ్య వనరుల నుండి పొందిన సమాచారాన్ని వినియోగించుకోవాలని సూచించింది.
ఈ మేరకు సెంట్రల్ బ్యాంక్ ‘మనీ లాండరింగ్/టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్ ఇంటర్నల్ రిస్క్ అసెస్‌మెంట్ గైడెన్స్’ను జారీ చేసింది. అక్రమ ధనార్జన, తీవ్రవాదులకు ఫైనాన్షింగ్ వంటి అంశాలు వ్యవస్థలపై త్రీవ ప్రభావం చూపుతాయని, బ్యాంక్ సాధరణ ఖాతాదారులకు, దేశాలకు, భౌగోళిక ప్రాంతాలకు, ఉత్పత్తులకు, సేవలకు, లావాదేవీలకు అలాగే డెలివరీ చానెళ్ల ప్రయోజనాలకు తీవ్ర విఘాతం కలుగజేస్తాయని వివరించింది.
ఈ నేపథ్యంలో ఈ సమస్యకు సంబంధించిన సవాళ్లను ఎదుర్కొనడానికి నిరంతర నిఘా, కాలానుగుణమైన పర్యవేక్షణ అవసరమని సెంట్రల్ బ్యాంక్ స్పష్టం చేసింది. ఎప్పటికప్పుడు మారుతున్న వ్యాపార పరిస్థితులు, బ్యాంకులు– తదితర నియంత్రిత సంస్థలు అందించే బ్యాంకింగ్, ఇతర ఆరి్థక ఉత్పత్తులలో పెరుగుతున్న సంక్లిష్టత స్థాయిలు, పోటీ పరిస్థితుల నేపథ్యంలో మనీలాండరింగ్, ఉగ్రవాద ఫైనాన్సింగ్ వంటి సవాళ్లు పెరిగే అవకాశం ఉంటుందని హెచ్చరించింది. అత్యాధునిక సాంకేతికత వినియోగం, చెల్లింపుల విధానాల్లో కొత్త పద్ధతులు వంటి అంశాలు సమస్యను మరింత తీవ్రతరం చేస్తున్నాయని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment