గ్రీన్‌ డిపాజిట్లకు మార్గదర్శకాలు | RBI issues framework for acceptance of green deposits by banks, NBFCs | Sakshi
Sakshi News home page

గ్రీన్‌ డిపాజిట్లకు మార్గదర్శకాలు

Published Wed, Apr 12 2023 4:55 AM | Last Updated on Wed, Apr 12 2023 4:55 AM

RBI issues framework for acceptance of green deposits by banks, NBFCs - Sakshi

న్యూఢిల్లీ: బ్యాంకులు, నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీలు (ఎన్‌బీఎఫ్‌సీ) ‘గ్రీన్‌ డిపాజిట్ల’ను పొందేందుకు ఉద్దేశించి రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) వివరణాత్మక మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ డిపాజిట్‌ నిధులను పునరుత్పాదక ఇంధనం, గ్రీన్‌ ట్రాన్స్‌పోర్ట్,  గ్రీన్‌ బిల్డింగ్‌ల వంటి ఫైనాన్సింగ్‌ కార్యకలాపాలకు ఉపయోగించడానికి వీలు కలుగుతుంది. 

వాతావరణ మార్పును ప్రపంచ వ్యాప్తంగా అత్యంత క్లిష్టమైన సవాళ్లలో ఒకటిగా పరిగణిస్తున్న నేపథ్యంలో ఈ మార్గదర్శకాలు జారీ కావడం గమనార్హం. ప్రపంచవ్యాప్తంగా  ఉద్గారాలను తగ్గించడంతోపాటు వాతావారణంలో సుస్థిరతను ప్రోత్సహించేందుకు  వివిధ ప్రయత్నాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. తాజా ఫ్రేమ్‌వర్క్‌ జూన్‌ 1 నుంచి అమల్లోకి వస్తుంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement