
ప్రతీకాత్మక చిత్రం
యశవంతపుర: విద్యార్థి హృదయ భాగంలోని గుండుసూదిని వైద్యులు శస్త్రచికిత్స చేసి పునర్జన్మనిచ్చారు. కర్ణాటకలోని మంగళూరు నగరంలో బజార్ పక్కలడ్కకి వీధికి చెందిన ఆబ్దుల్ ఖాదర్ కుమారుడు ముఖశ్కీర్(12)కు పదేపదే జ్వరం వస్తుండేది. పలువురు వైద్యుల వద్ద చూపించినా నయం కాలేదు. దీంతో మంగళూరులోని చిన్నపిల్లల వైద్యుడు డాక్టర్ రామ్‌గోపాలశాస్త్రి వద్దకు తీసుకెళ్లారు. ఎక్స్‌రే తీయించి పరిశీలించగా హృదయ భాగంలో గుండుసూది ఉన్నట్లు తేలింది. దీంతో శుక్రవారం వైద్యులు శస్త్రచికిత్స చేసి గుండుసూదిని బయటకు తీసి బాలుడి ప్రాణం కాపాడారు.
చదవండి: చేపకు.. ఆపరేషన్
Comments
Please login to add a commentAdd a comment