లక్నో: ఇటీవల దారుణ హత్యకు గురైన గ్యాంగ్‌స్టర్, పొలిటీషియన్ అతీక్ అహ్మద్‌కు చెందిన కార్యాలయంలో కత్తి, రక్తపు మరకలు కన్పించడం చర్చనీయాంశమైంది. ఈ ఆఫీస్‌ను అధికారులు పాక్షికంగా కూల్చారు. అయితే కార్యాలయం లోపల రక్తపు మరకలు, ఓ తెల్లటి వస్త్రం కన్పించడం చూసి షాకయ్యారు. అక్కడే ఓ కత్తి కూడా లభించింది.
దీంతో ఈ రక్తపు మరకలు ఎవరివై ఉంటాయని తెలుసుకునేందుకు ఫోరెన్సిక్ టీంను రప్పించారు. వారు నమూనాలు సేకరించి పరిశీలిస్తున్నారు. అతీక్ అహ్మద్‌కు చెందిన ఈ ఆఫీస్ ప్రయాగ్‌రాజ్‌లోని ఖుల్దాబాద్ పోలీస్ స్టేషన్ పరిధి కర్బాల ప్రాంతంలో ఉంది. ఈ కార్యాలయం ఆవరణలోనే 10 అక్రమ ఆయుధాలతో పాటు రూ.74.62 లక్షల నగదను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
మరోవైపు ప్రయాగ్‌రాజ్‌లోని ఓ హోటల్‌లో.. డిప్యూటీ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డా.సుశీల్ కుమార్ సింగ్ మృతదేహాన్నిగుర్తించడం కలకలం రేపింది. పోలీసులు వెంటనే హోటల్‌కు చేరుకుని అతను ఆత్మహత్య చేసుకున్నాడా? లేక హత్య చేసుకున్నాడా అనే విషయంపై దర్యాప్తు చేపట్టారు.
కాగా.. అతీక్ అహ్మద్, అతని సోదరుడు అష్రఫ్ ఇటీవలే దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. పోలీసులు, మీడియా ముందే ముగ్గరు యువకులు వీరిని పాయింట్ బ్లాంక్ రేంజ్‌లో కాల్చిచంపడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
చదవండి: యూపీలో దారుణం.. హోటల్ గదిలో విగతజీవిగా వైద్యాధికారి
Comments
Please login to add a commentAdd a comment