ఇంటిప్స్
కిచెన్ ప్లాట్‌ఫాం మీద కాని, స్టవ్ మీద కాని జిడ్డు మరకలుంటే ముందుగా కొద్దిగా నీళ్లు చల్లి సోడాబైకార్బనేట్ చల్లాలి. రెండు - మూడు నిమిషాల తర్వాత స్పాంజ్‌తో కాని క్లాత్‌తో కాని తుడవాలి. థర్మాస్ ఫ్లాస్కు లోపల వాసన వస్తుంటే ఒక టేబుల్ స్పూన్ సోడాబైకార్బనేట్ వేసి నిండా నీటిని పోయాలి. రాత్రంతా అలాగే ఉంచి ఉదయాన్నే కడిగితే వాసనపోయి శుభ్రంగా ఉంటుంది. అవసరమనిపిస్తే బ్రష్‌తో రుద్దవచ్చు.
కిచెన్‌లో అవెన్, స్టవ్, ప్లాట్‌ఫాం తుడిచే స్పాంజ్‌లు, బ్రష్‌లు కొద్దిరోజులు వాడిన తరవాత వాసన పట్టేస్తుంటాయి. వాటిని నీటిలో ఒక టేబుల్‌స్పూన్ సోడాబైకార్బనేట్, నాలుగు చుక్కల డిష్‌వాష్ లిక్విడ్ కలిపి రాత్రంతా నానబెట్టి శుభ్రం చేయాలి. {ఫిజ్‌ను శుభ్రం చేయాలంటే లీటరు నీటిలో కప్పు సోడా బైకార్బనేట్ కలిపి ఆ మిశ్రమంలో స్పాంజ్‌ను ముంచి లోపలి అరలన్నీ తుడవాలి. తరవాత మంచినీటిలో ముంచి పిండేసిన స్పాంజ్‌తో మరొకసారి తుడవాలి.స్టెయిన్‌లెస్ స్టీల్ సింకులో రెండు స్పూన్ల సోడా బైకార్బనేట్ చల్లి కొద్దిగా నీటిని చల్లి రుద్ది కడిగితే కొత్తదానిలా మెరుస్తుంది. పింగాణీ కప్పులకు, సాసర్లకు కాఫీ, టీ మరకలు పట్టి వదలనట్లయితే సోడాబైకార్బనేట్‌లో కొద్దిగా నీటిని కలిపి దానితో శుభ్రం చేయాలి.