బట్టలపై మరకలు పడ్డప్పుడు డ్రై క్లీనింగ్‌కి ఇద్దామంటే ఆ ధరకు కొత్తదే వస్తుందమే అనిపిస్తుంది. అయితే మరకలను తొలగించుకునేందుకు కొన్ని చిట్కాలున్నాయి. అవేమిటో చూద్దాం.
►మీ దుస్తులు మెరిసేలా చేయాలంటే ఆస్పిరిన్ మాత్రలు బాగా ఉపయోగపడతాయి. ఆస్పిరిన్‌లో ఉండే ఎసిటైల్‌సాలిసిలిక్ ఆమ్లం బట్టలపై పడిన మరకలను తొలగించేందుకు సాయం చేస్తుంది.
►తెల్లని దుస్తులను నాలుగైదు ఆస్పిరిన్ టాబ్లెట్లు వేసిన నీళ్ల బకెట్‌లో బాగా నానబెట్టండి. తరవాత బట్టల సబ్బుతో ఉతకడమో లేదా వాషింగ్ మెషీన్‌లో వేసి మామూలుగా ఉతికి జాడించి ఆరేస్తే సరి!
► రక్తపు మరకలను తొలగించడానికి..
ఆస్పిరిన్‌ను చల్లటి నీటిలో కరిగించి బట్టలను నానబెట్టండి. వేడినీటితో రక్తపు మరకలను తొలగించడానికి ప్రయత్నించవద్దు. ఇది ప్రోటీన్లు గడ్డకట్టడానికి కారణమవుతుంది. ఆ తరువాత మరకను తొలగించడం కష్టం అవుతుంది. చేస్తుంది.
► నూనె, గ్రీజు మరకలకు..
ఒక నిమ్మకాయను రెండు ముక్కలుగా కోయాలి. ఒక ముక్క మీద ఉప్పు వేసి మరకపై రుద్దాలి. ఇది నిమిషాల్లో బట్టలపై ఉన్న మరకలను తొలగిస్తుంది.
► వక్కపొడి, పాన్ మసాలా మరకలు
పెరుగు లేదా మజ్జిగను మరక పడ్డ చోట ఉంచి పది నిమిషాలు అలాగే ఉంచండి. తర్వాత శుభ్రమైన నీటితో వస్త్రాన్ని కడగాలి. ఇది బట్టలపై ఉన్న మరకలను తొలగిస్తుంది.
► టీ–కాఫీ మరకలు
టీ–కాఫీ మరకలు పడ్డప్పుడు ముందుగా గోరువెచ్చటి నీటిలో ఆ వస్త్రాన్ని పదిహేను నిమిషాలు ఉంచిన తర్వాత లిక్విడ్ డిటర్జెంట్లో నానబెట్టాలి. తర్వాత మరక పడ్డ చోట చేతితో రుద్దితే మరకలు తొలగుతాయి.
► టర్కీ టవళ్లు, దుప్పట్ల వంటి వాటిని బట్టలుతికే సోడా కలిపిన నీటిలో నానబెట్టి ఉతికితే త్వరగా శుభ్ర పడతాయి.
Comments
Please login to add a commentAdd a comment