ఇంటిప్స్
టీ ఫ్లాస్కులు, పాల ఫ్లాస్కులను శుభ్రం చేయడం చాలా కష్టం. అలాంటప్పుడు కొద్దిగా సబ్బు నీటిలో పాత పేపర్లను ముక్కలు ముక్కలుగా చేసి అందులో వేయాలి. పదిహేను నిమిషాలు వాటిని అలాగే ఉంచి, తర్వాత ఆ ఫ్లాస్క్‌ను బాగా కదపాలి. అప్పుడు ఆ నీటిని పారబోసి, మళ్లీ మంచి నీటితో కడిగితే ఆ ఫ్లాస్క్ పరిశుభ్రంగా ఉంటుంది.చాలామంది ఇళ్లల్లో తులసి మొక్కకు తరచు తెగులు సోకుతుంది. అలా జరగకుండా ఉండాలంటే తులసి కోట మట్టిలో ఒక ఉల్లిగడ్డను పాతి పెట్టాలి.
అలా చేసేటప్పుడు దాని పైపొర తీసేయాలి. తెల్లటి దుస్తులకు కానీ తెల్లటి షూలకు కానీ ఏవైనా మరకలు అంటితే - వాటిని అలాగే శుభ్రం చేయకూడదు. ముందు ఒక దూది ఉండను తీసుకొని, దాన్ని నెయిల్ పాలిష్ రిమూవర్‌లో ముంచి ఆ మరకలపై రుద్దాలి. అలా చేస్తే మరకలు తగ్గుముఖం పడతాయి.