kilometers
-
దగ్గరకానున్న చైనా సరిహద్దు.. చమోలి- పితోర్‌గఢ్ రోడ్డు పనులు షురూ!
ఇకపై ఉత్తరాఖండ్‌లోని చమోలీ జిల్లాకు ఆనుకుని ఉన్న చైనా సరిహద్దుల్లో ఇండియన్ ఆర్మీ, ఐటీబీపీల కదలికలు మరింత సులభతరం కానున్నాయి. బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (బీఆర్ఓ) చమోలిలోని లాప్తాల్ నుండి పితోర్‌గఢ్ వరకు రోడ్డు పనులను ప్రారంభించింది.2028 నాటికి ఈ రోడ్డు నిర్మాణ పనులు పూర్తి చేయాలని బీఆర్ఓ లక్ష్యంగా పెట్టుకుంది. చమోలీ నుంచి పితోర్‌గఢ్ వరకు ఉన్న 500 కి.మీ. దూరం ఈ రహదారి నిర్మాణంతో 80 కి.మీకి తగ్గనుంది. నీతి లోయలోని చివరి గ్రామమైన నీతిని ఆనుకుని చైనా సరిహద్దు ప్రాంతం ప్రారంభమవుతుంది. ఇక్కడ ఆర్మీ,ఐటీబీపీకి చెందిన ఫార్వర్డ్ పోస్ట్‌లు ఉన్నాయి.ప్రస్తుతం ఈ పోస్ట్‌లు మంచుతో కప్పబడి ఉన్నాయి. ప్రతికూల భౌగోళిక పరిస్థితుల మధ్య బీఆర్ఓ కార్మికులు ఇక్కడ సుమారు 40 కిలోమీటర్ల రహదారి కోసం కొండను కట్ చేసే పనుల్లో నిమగ్నమయ్యారు. లాప్తాల్ నుండి మిలాం వరకు రోడ్డు కటింగ్ పనులు ప్రారంభించినట్లు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. మూడు నెలలుగా ఈ పనులు నిలిచిపోగా, ఇప్పుడు మళ్లీ ప్రారంభమయ్యాయి.చమోలీకి ఆనుకుని ఉన్న ఈ సరిహద్దు ప్రాంతంలో చైనా రైలు మార్గాన్ని కూడా విస్తరించింది. ఈ ప్రాంతంలోకి చైనా తరచూ చొరబడేందుకు ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలోనే భారత ప్రభుత్వం ఇక్కడ రోడ్డు విస్తరణపై ప్రత్యేక దృష్టి సారించింది. లాప్తాల్ నుండి మిలామ్ పితోర్‌గఢ్ వరకు రహదారి నిర్మాణం చేపట్టడం ద్వారా పర్యాటకాన్ని ప్రోత్సహించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది.గత ఏడాది జూలైలో ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కలిసి, లాప్తాల్ నుంచి మిలామ్ వరకు 30 కిలోమీటర్ల పొడవైన సొరంగ ప్రాజెక్టును ఆమోదించాలని అభ్యర్థించారు. ఈ నిర్మాణం చేపడితే పితోర్‌ఘర్‌లోని జోహార్ లోయ చమోలీకి అనుసంధానమవుతుంది. భవిష్యత్తులో లేహ్ లడఖ్ మాదిరిగా ఇక్కడ కూడా పర్యాటక కార్యకలాపాలను ప్రారంభించే ప్రణాళిక ప్రభుత్వం వద్ద ఉంది. -
వైరల్ 75 కాదు 25!
సాధారణంగా 75 సంవత్సరాల వయసులో కొద్దిదూరం నడిచినా ఆయాసపడుతుంటారు. అస్సాంలోని దిబ్రూఘర్‌కు చెందిన 75 సంవత్సరాల హీర బోరా అలా కాదు. ఆరోగ్యకరమైన జీవనశైలి విషయంలో యువతను చైతన్యవంతం చేయడానికి త్రివర్ణ పతాకం చేతబూని పదికిలోమీటర్లు పాదయాత్ర చేసింది. ట్విట్టర్లో పోస్ట్ చేసిన ఈ వీడియో వైరల్ అయింది. ‘ఆమె వయసు 75 నుంచి 25కు వచ్చింది’ అంటూ నెటిజనులు స్పందించారు. -
ఇదేం పువ్వురా బాబూ.. ముక్కు పేలిపోతోంది.. ఇది ప్రపంచంలోనే
అది ప్రపంచంలోనే అత్యంత పెద్ద పుష్పం.. అయితే దానిని చూడాలని ముచ్చట పడితే.. అంతే సంగతులు. ఎందుకంటే దానికి మనం కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉండగానే.. దాని నుంచి మన ముక్కులు పేలిపోయేంత దుర్వాసన వస్తుంది. రండి.. ఆ పువ్వు కథేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రపంచంలోనే అత్యంత దుర్వాసన వెదజల్లే పువ్వు పేరు ‘కార్ప్స్ ఫ్లవర్’ ఈ పుష్పం ఎంతో ప్రత్యేకమైనది. ఈ పువ్వు పదేళ్లకు ఒకసారి మాత్రమే వికసిస్తుంది. ఈ పువ్వు వికసించగానే దాని నుంచి కొన్ని కిలోమీటర్ల దూరం వరకూ దుర్వాసన వ్యాపిస్తుంది. కార్ప్స్ ఫ్లవర్‌ను టైటాన్ వాన్కాగ్ అని కూడా పిలుస్తారు. ప్రస్తుతం ఇది అమెరికాలోని వాషింగ్టన్ స్టేట్ యూనివర్శిటీలో వికసించింది. ఈ పుష్పం 24 గంటల నుంచి 48 గంటల పాటు వికసిస్తుంది. దీని నుంచి కుళ్లిన మాంసం వాసన వస్తుంది. అందుకే దీనిని శవ పుష్పమని, మృత్యు పుష్పమని కూడా అంటారు. దీనికి ముందు ఈ పుష్పం కరోనా కాలంలో అమెరికాలోని ఫ్రాన్సిస్కోలో కనిపించింది. అప్పుడు కూడా ఈ పుష్పం చర్చల్లో నిలిచింది. కొన్ని కిలోమీటర్ల వరకూ దీని దుర్వాసన వ్యాపిస్తుండంతో స్థానికులు పలు ఇబ్బందులు పడుతుంటారు. 2011లోనూ ఈ పుష్పం వికసించింది. ఇది చూసేందుకు ఎంతో వింతగా ఉంటుంది. ఇది అతి అరుదైన పుష్పం. ఈ పుష్పం 12 అడుగుల ఎత్తు కలిగివుంటుంది. ఈ పుష్పం వికసించేందుకు 10 ఏళ్లు పడుతుంది. ఈ కాలం ముగిశాకనే అది పూర్తిస్థాయిలో వికసిస్తుంది. అప్పుడు అది ఎంతో అందంగా కనిపిస్తుంది. అయితే దీనిని చూడాలనుకుంటే ముక్కు మూసుకోవాల్సిందే. ఇది కూడా చదవండి: ఇకపై రెంట్‌కు డాడీ.. మమ్మీ చిల్ అవ్వొచ్చు! -
రూ. రెండు కోట్ల ఖర్చుతో 20 కోట్ల లబ్ది.. ‘ఏక్ దిన్ కా సుల్తాన్’.. అంతా గాల్లోనే
మహా అయితే ఇన్ని దేశాలు తిరిగొచ్చాను అని చెబుతుంటారు. లేదంటే సుమారు లక్షల మైళ్ల వరకు వెళ్లి ఉండొచ్చని అంటారు. కానీ, నిరతరం ప్రయాణించడం మాత్రం అసాధ్యమే. అది కూడా కొద్ది మొత్తం డబ్బుతోనే.. దాదాపు ఆరు సార్లు చంద్రుని పర్యటనకి వెళ్లడానికి పట్టేంత దురాన్ని చుట్టి రావడం అంటే నమ్మశక్యం కానీ విషయమే! కానీ అది నిజం అతను అంత దురాన్ని విమానంలో చుట్టొచ్చాడు. కేవలం ఆకాశం, ఎయిర్‌పోర్ట్‌లలోనే గడుపుతూ.. నిర్విరామంగా ప్రయాణించాడు. ఆ వ్యక్తే యూఎస్‌కి చెందిన 69 ఏళ్ల టామ్ స్టుకర్. అతను 1999లో యునైటెడ్ ఎయిర్‌లైన్స్‌కి సుమారు రూ. 2 కోట్లు చెల్లించి జీవితకాల ఎయిర్ పాస్ని పొందాడు. దీన్ని తాను పెట్టిన అత్యుత్తమమైన పెట్టుబడిగా స్టుకర్ చెప్పుకుంటాడు. 33 ఏళ్ల క్రితం తీసుకున్న ఈ పాస్‌తో కనీసం 23 మిలియన్ల కి.మీ. దూరం ప్రయాణిస్తే చాలు అనుకున్నాడు. గానీ ఏకంగా 37 మిలియన్ కిలోమీటర్లు ప్రయాణిస్తానని ఊహించలేదు. ఈ జర్నీలో అతను కొన్ని సమయాల్లో సుమారు 12 రోజుల వరకు బెడ్‌పై పడుకోకుండా అలానే ప్రయాణించినట్లు తెలిపాడు. ఎయిర్‌పోర్ట్‌లో విమానం ల్యాండ్ అయినప్పుడూ తప్ప మిగతా అన్ని వేళలా ఆకాశంలోనే ఉన్నట్లు చెప్పుకొచ్చాడు. ఈ ప్రయాణంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న లగ్జరీ హోటల్ సూట్లు, క్రిస్ట్ క్రూయిజ్‌లు వంటి వాటిల్లో కొన్ని వారాల పాటు ‘ఏక్ దిన్ సుల్తాన్’ మాదిరి భోగాలు అనుభవించాడు. మొత్తం 1.46 మిలియన్ల మైళ్ల దురం పర్యటించేందుకు సుమారు 373 విమానాల్లో ప్రయాణించినట్లు చెప్పాడు. నిజానికి అతడు గనుక ఈ పాస్ బుక్ తీసుకోనట్లయితే ఇంత దూరం పర్యటించినందుకు ఆ ఫ్లైట్లకి సుమారు రూ. 20 కోట్లు ఖర్చయ్యేవి. అదీగాక ఇన్ని మైళ్ల దూరం జర్నీ చేసేందుకు అన్ని విమానాలను ప్రతిసారి బుక్‌చేసుకోవడం కూడా కష్టమే కానీ ఈ పాస్ ఉండటం కారణంగానే అతను ఈజీగా అన్ని విమానాల్లో ప్రయాణించగలిగాడు. అతను 2019లో ఇంత దూరం పర్యటించాడు. అతను పర్యటించిన దూరం ఆరుసార్లు చంద్రుని పర్యటనకు వెళ్లిన దానితో సమానమని యునైటెడ్ ఎయిర్‌లైన్స్ తెలిపింది. అంతేగాదు చరిత్రలో అతని మాదిరి అంతలా పర్యటించిన వ్యక్తి మరొకరు లేరని కూడా సదరు విమానయాన సంస్థ పేర్కొనడం విశేషం. (చదవండి: వాట్ యాన్ ఐడియా! ఆ తల్లి చేసిన పనికి ఫిదా అవ్వాల్సిందే!) -
భారతదేశంలోని టాప్ 10 అతిపెద్ద నదులు
-
ఆంబులెన్స్ రాలేదు, నిండు గర్భిణిని 3 కిలోమీటర్ల వరకు..
సాక్షి, భువనేశ్వర్: రహదారి సౌకర్యం లేకపోవడంతో ఓ గర్భిణిని స్థానికులు మూడు కిలోమీటర్ల దూరం మోసుకెళ్లారు. ఆపై ఆంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన కాసీపూర్ సమితి కీరాఅంబొ గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. కీరాఅంబొ గ్రామానికి చెందిన కొసేయి మజ్జి భార్య బాసంతికి పురిటి నొప్పులు రావడంతో.. అంబులెన్స్‌కు సమాచారం అందించారు. అయితే, సరైన రహదారి లేకపోవడంతో ఆంబులెన్స్‌ను మూడు కిలోమీటర్ల దూరంలోనే నిలిపేశారు. దీంతో గర్భిణిని గ్రామస్తులు మోసుకుంటూ ఆంబులెన్స్ వద్దకు చేర్చారు. టకిరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించగా, బాసంతి ఆడశిశువుకు జన్మన్చింది. తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ప్రజా ప్రతినిధులు స్పందించి గ్రామీణ రహదారులను మెరుగు పరచాలని గ్రామస్తులు కోరుతున్నారు. చదవండి: డెల్టా ప్లస్ డేంజర్ కాదు -
వందల కిలోమీటర్లు నడిచి..
-
జల విలయం
-
దిగ్బంధంలో రాస్తా
జాతీయ, రాష్ట్ర రహదారులపై ఎక్కడివాహనాలు అక్కడే ఆగిపోయాయి. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. దీంతో రోడ్డు రవాణా పూర్తిగా పడకేసింది. వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపుమేరకు నాయకులు, కార్యకర్తలు చేపట్టిన 48గంటల రహదారుల దిగ్బంధం వరుసగా రెండోరోజూ గురువారం విజయవంతమైంది.