ఫొటోలో ఉన్న పువ్వును మీరెప్పుడైనా చూశారా? చూసే ఉంటారులెండి. ఈ పూల నుంచి సేకరించిన ఒక రసాయనం కేన్సర్‌కు విరుగుడుగా పనిచేస్తుందని అంటున్నారు బర్మింగ్‌హామ్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు. ఫీవర్‌ఫ్యూ అని పిలిచే ఈ పువ్వును కొన్నిచోట్ల చాలాకాలంగా తలనొప్పి నివారణకు వాడుతూంటారు. కానీ పువ్వులోని పార్థీనియోలైడ్ అనే రసాయనం క్రానిక్ లింఫోసైటిక్ లుకేమియా కణాలపై ప్రభావం చూపుతున్నట్లు బర్మింగ్‌హామ్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు గుర్తించారు. కేన్సర్ కణాల్లోని రియాక్టివ్ ఆక్సిజన్ స్పీషీస్ (రాస్) మోతాదులను పెంచడం ద్వారా ఈ రసాయనం పనిచేస్తున్నట్లు తెలిసింది. కేన్సర్ కణాల్లో సహజంగానే ఎక్కువగా ఉండే రాస్‌ను మరింత పెంచడం ద్వారా ఈ రసాయనం కణాలను నాశనం చేస్తోందని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త జాన్ ఫోసే తెలిపారు. మెడ్‌కెమ్ కామ్ జర్నల్ తాజా సంచికలో ఈ పరిశోధన వివరాలు ప్రచురితమయ్యాయి. మరిన్ని జంతు, మానవ ప్రయోగాలు జరిగితే పార్ఠీనియోలైడ్‌కున్న లక్షణాలు నిర్ధారణ అవుతాయని తద్వారా దీన్ని కేన్సర్ చికిత్సకు మరో మందుగా వాడుకునేందుకు అవకాశం ఏర్పడుతుందని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment