ఈ ఫోటోలో కనిపిస్తున్నవి పూలగుత్తులనుకుంటే పప్పులో కాలేసినట్లే..! | This Store In Kyoto Makes Ice Cream Cones That Look Flower Bouquet | Sakshi
Sakshi News home page

ఈ ఫోటోలో కనిపిస్తున్నవి పూలగుత్తులనుకుంటే పప్పులో కాలేసినట్లే..!

Published Sun, Feb 11 2024 6:02 PM | Last Updated on Sun, Feb 11 2024 6:02 PM

This Store In Kyoto Makes Ice Cream Cones That Look Flower Bouquet - Sakshi

ఈ ఫొటోల్లో కనిపిస్తున్న వాటిని పూలగుత్తులనుకుంటున్నారా?! అయితే పొరపాటే! ఇవి అచ్చంగా పూలగుత్తుల్లాగానే కనిపించే ఐస్‌క్రీములు. జపాన్‌లోని క్యోటో నగరానికి చెందిన షిజెన్‌ కేఫ్‌ కస్టమర్లను ఆకట్టుకోవడం కోసం ఇటీవల ఈ పూలగుత్తుల ఐస్‌క్రీమ్‌లను తన మెన్యూలోకి ప్రవేశపెట్టింది. జపాన్‌కు వచ్చే విదేశీ పర్యాటకులు వీటిని అమితంగా ఇష్టపడుతుండటమే కాకుండా, వీటితో ఫొటోలు దిగుతూ వీడియోలు చేస్తుండటంతో అనతికాలంలోనే ఈ పూలగుత్తుల ఐస్‌క్రీములు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.

అచ్చంగా అసలైన పూలనే తలపించే రంగుల్లో, ఆకారాల్లో వీటిని కళాఖండాల్లా మలచి అందిస్తున్న తీరు కస్టమర్లను అమితంగా ఆకట్టుకుంటోంది. పూల రకాలు, ఆకారాలు, రంగులు, పరిమాణం బట్టి ఈ ఐస్‌క్రీముల ధర 200 యెన్‌ల నుంచి 1350 యెన్‌ల (రూ.113 నుంచి రూ.763) వరకు ఉంటోంది. మామూలు ఐస్‌క్రీములతో పోల్చుకుంటే వీటి ధర కాస్త ఎక్కువగానే ఉన్నా, వీటిని ఆస్వాదించడానికి విపరీతంగా ఎగబడుతున్నారు. ఈ ఐస్‌క్రీములను అందించే షిజెన్‌ కేఫ్‌ పర్యాటక ప్రదేశాలైన క్యోటో మ్యూజియం, నిజో కోటలకు దగ్గరగా ఉండటంతో పూలగుత్తుల ఐస్‌క్రీముల అమ్మకాలు ప్రారంభించాక దీనికి విదేశీ పర్యాటకుల తాకిడి బాగా పెరిగింది. 

(చదవండి: ఆ గ్రామం పూల రాజధాని! అక్కడ ఎటు చూసినా..!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement