Bouquet
-
ఫ్లవర్ ఫేవర్
ముసి ముసి నవ్వులలోన.. కురిసిన పువ్వుల వాన.. ఏ నోము నోచినా.. ఏ పూజ చేసినా.. తెలిసి ఫలితమొసగే వాడు.. ఈ పాట వినడానికి ఎంత అందంగా ఉంటుందో.. పువ్వును చూస్తే.. మనసు అంత ప్రశాంతతను ఆనందాన్ని కలిగిస్తుంది. అందుకే ఎవరినన్నా కలిసేందుకు వెళ్లేటప్పుడు వారి ఆనందంగా ఉండాలని కోరుతూ గౌరవ సూచికంగా పుష్పగుచ్ఛాలు తీసుకెళతారు.. ఇప్పుడిది ట్రెండ్‌గా మారింది.. ఒకప్పటి దండల స్థానాన్ని బొకేలు భర్తీ చేస్తున్నాయి.. దీనికోసం దేశీయ పూలనే కాకుండా, దేశ విదేశాల నుంచి వివిధ రకాల పూలను దిగుమతి చేసుకుంటున్నారు. ఆ కథేంటో తెలుసుకుందాం.. సాధారణంగా పువ్వులు అనగానే బంతి, చామంతి, గులాబీ, లిల్లీ, కనకాంబరాలు, మల్లి, సన్నజాజి వంటి రకాలు ఎక్కువగా వాడుకలో ఉన్నాయి. ఫ్లవర్ డెకరేషన్, బొకేల్లో వినియోగించేందుకు మాత్రం హైబ్రిడ్ గులాబీ, చామంతి, సన్‌ఫ్లవర్, మొదలైన రకాలకు తోడు ప్రొటీయా, పింక్షన్, సింబిడియం, పియోని, చేయి, బటర్ఫ్లైగిట్, టాన్జేరియన్, తులిప్స్, డెలి్పనియం, జిప్సోఫిలా, ఆసరిన, డ్రైసిన, జొనడా, ఓరెంటీ లిల్లి, సూడాటియం, క్రైశాంతిమం మొదలైన రకాల పువ్వులు దిగుమతి చేసుకుంటున్నారు. అదే సమయంలో ఇండోర్ ప్లాంట్లకు సైతం డిమాండ్ పెరిగింది. పిండోడియం అనే ఫ్లవర్ ఒక్కొక్కటీ కనీసం రూ.800 నుంచి రూ.3 వేల వరకూ ఉంటుంది. ఈ పూలతో బొకే తయారు చేస్తే దాని ధర ఎంత ఉంటుందో చెప్పనక్కర్లేదు.థాయ్‌లాండ్ నుంచి..నగరంలో ఫ్లవర్ డెకరేషన్‌కు అవసరమైన ముడి సరుకు, ఫ్లవర్స్, ఇతరత్రా అన్నీ థాయ్‌లాండ్, బెంగళూరు, ఊటీ, పూణే, కోల్‌కతా తదితర నగరాలపై ఆధారపడుతున్నారు. దీంతో అక్కడి వ్యాపారులతో సత్సంబంధాలు కలిగి ఉంటున్నారు. ఎప్పటికప్పుడు కొత్త మోడల్స్, ఫ్లవర్స్, ఇతర అంశాలను తెలుసుకుని అప్డేట్ అవుతున్నారు. మార్కెట్‌ను బలోపేతం చేసుకుంటూ, ఫ్రెష్ ఐటమ్స్, మంచి ధరకు తెచ్చుకుంటున్నారు. స్థానికంగా మెహిదీపట్నం, ఇతర మార్కెట్లో పువ్వులు దొరుకుతున్నప్పటికీ వాటిని ఆధ్యాతి్మకం, గృహ అవసరాలకు, దండల తయారీలో వినియోగిస్తున్నారు.బొకేలకు డిమాండ్ ..భాగ్యనగరంలో గతంలో పూల బొకే కావాలంటే ఫలానాదగ్గర మాత్రమే ఉంటాయని ల్యాండ్ మార్క్ ఉండేది. ఇప్పుడు బొకేలు, ఫ్లవర్ బాక్స్‌లు, ఇతర ఫ్లవర్ ఐటమ్స్‌కు మార్కెట్లో డిమాండ్ పెరిగింది. దీంతో ప్రధాన కూడళ్ల నుంచి ఎక్కడ చూసినా దుకాణాల్లో రకరకాల అలంకరణలతో విరివిగా బొకేలు లభిస్తున్నాయి. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ ఎవరిని కలవాలన్నా బొకే తప్పనిసరైంది. దీంతో సుమారు ఒక్కో బొకేకి రూ.350 నుంచి రూ.10 వేల వరకూ వెచి్చస్తున్నారు. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో బొకేలో వినియోగించే పువ్వుల రకాలను బట్టి ధర నిర్ణయిస్తున్నారు.డెకరేషన్ రూ.లక్షల్లో..గృహ ప్రవేశం నుంచి వివాహాది శుభకార్యాలు, సత్యన్నారాయణ వ్రతం, ఇతర ఆధ్యాత్మిక కార్యక్రమాల వరకూ సందర్భం ఏదైనా స్వాగత తోరణాలు, పూల అలంకరణలు తప్పనిసరి అయ్యింది. ఫ్లవర్ డెకరేషన్ స్టేటస్‌గా సింబల్‌గా భావిస్తున్నారు. దీంతో లక్షలు వెచి్చంచి ఫ్లవర్ డెకరేటర్స్‌కు కాంట్రాక్టులు అప్పగిస్తున్నారు. ఆన్లైన్లో కొత్తకొత్త మోడల్స్ ఎంపిక చేస్తున్నారు. ఆర్థికంగా ఉన్నవారు మరో అడుగు ముందుకేసి ఇంపోర్టెడ్ ఐటమ్స్ డిమాండ్ చేస్తున్నారు. ఖర్చు ఎంతైనా వెనుకడుగు వేయట్లేదు. స్థోమతను బట్టి ఒక్కో ఫంక్షన్‌కు డెకరేషన్ కోసం సుమారుగా రూ.లక్ష నుంచి రూ.10 లక్షల వరకూ వెచి్చస్తున్నారు.లక్షతో బర్తడే డెకరేషన్మా పాప మొదటి బర్తడే సందర్భంగా బందువులు, స్నేహి తులతో కలసి చిన్నగా ఫంక్షన్ పెట్టుకున్నాం. ఫొటో షూట్లో బ్యాక్‌గ్రౌండ్ ఫ్లవర్ డెకరేషన్ చేద్దాం అన్నారు. సరే అన్నాను. డెకరేటర్‌ను సంప్రదిస్తే మాకు నచి్చన మోడల్‌కు రూ.1.20 లక్షలు చెల్లించాను. – మనోజ్, మణికొండఅభిరుచికి అనుగుణంగా... దశాబ్దకాలంగా ఫ్లవర్ బిజినెస్ చేస్తున్నాను. ప్రస్తుత ఫంక్షన్లకు ఫ్లవర్ డెకరేషన్ చేయించడం, ప్రతి చిన్న సందర్భంలోనూ బొకేలు ఇచ్చిపుచ్చుకోవడం ట్రెండ్‌గా మారింది. దీంతో పాటే ఇండోర్ మొక్కలకు సైతం మంచి డిమాండ్ ఉంది. వినియోగదారుల అభిరుచికి అనుగుణంగా బొకే, బాక్స్, బంచ్, ఇతర మోడల్స్ సరఫరా చేస్తున్నాం. – సూర్య, వీజే పెటల్స్, రోడ్ నెం–1, బంజారాహిల్స్ -
ఈ ఫోటోలో కనిపిస్తున్నవి పూలగుత్తులనుకుంటే పప్పులో కాలేసినట్లే..!
ఈ ఫొటోల్లో కనిపిస్తున్న వాటిని పూలగుత్తులనుకుంటున్నారా?! అయితే పొరపాటే! ఇవి అచ్చంగా పూలగుత్తుల్లాగానే కనిపించే ఐస్‌క్రీములు. జపాన్‌లోని క్యోటో నగరానికి చెందిన షిజెన్ కేఫ్ కస్టమర్లను ఆకట్టుకోవడం కోసం ఇటీవల ఈ పూలగుత్తుల ఐస్‌క్రీమ్‌లను తన మెన్యూలోకి ప్రవేశపెట్టింది. జపాన్‌కు వచ్చే విదేశీ పర్యాటకులు వీటిని అమితంగా ఇష్టపడుతుండటమే కాకుండా, వీటితో ఫొటోలు దిగుతూ వీడియోలు చేస్తుండటంతో అనతికాలంలోనే ఈ పూలగుత్తుల ఐస్‌క్రీములు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. అచ్చంగా అసలైన పూలనే తలపించే రంగుల్లో, ఆకారాల్లో వీటిని కళాఖండాల్లా మలచి అందిస్తున్న తీరు కస్టమర్లను అమితంగా ఆకట్టుకుంటోంది. పూల రకాలు, ఆకారాలు, రంగులు, పరిమాణం బట్టి ఈ ఐస్‌క్రీముల ధర 200 యెన్ల నుంచి 1350 యెన్ల (రూ.113 నుంచి రూ.763) వరకు ఉంటోంది. మామూలు ఐస్‌క్రీములతో పోల్చుకుంటే వీటి ధర కాస్త ఎక్కువగానే ఉన్నా, వీటిని ఆస్వాదించడానికి విపరీతంగా ఎగబడుతున్నారు. ఈ ఐస్‌క్రీములను అందించే షిజెన్ కేఫ్ పర్యాటక ప్రదేశాలైన క్యోటో మ్యూజియం, నిజో కోటలకు దగ్గరగా ఉండటంతో పూలగుత్తుల ఐస్‌క్రీముల అమ్మకాలు ప్రారంభించాక దీనికి విదేశీ పర్యాటకుల తాకిడి బాగా పెరిగింది. (చదవండి: ఆ గ్రామం పూల రాజధాని! అక్కడ ఎటు చూసినా..!) -
ఏపీలో అమెరికా పూల సోయగాలు
సాక్షి, అమరావతి: లిసియాంతస్.. ఉత్తర అమెరికా ప్రాంతానికి చెందిన ఈ పువ్వులు గులాబీలను పోలి ఉండే కట్ ఫ్లవర్స్. విభిన్న రంగుల్లో ఉండే ఇవి మైదాన, కొండ ప్రాంతాల్లోనే కాదు ఇంటి ఆవరణలో పూలకుండీల్లోనూ పెంచుకునేందుకు అనువైనవి. బొకేలు, అలంకరణకు ఉపయోగించే ఈ పూలకు విదేశాల్లో మంచి డిమాండ్ ఉంది. వీటిని ఏపీలోనూ సాగు చేసేవిధంగా శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనలు ఫలించాయి. దేశంలోని బెంగళూరు పరిసర ప్రాంతాల్లో కొద్దిపాటి విస్తీర్ణంలో లిసియాంతస్ పూల ను సాగు చేస్తున్నారు. వీటి సాగుకు ఆంధ్రప్రదేశ్‌లోనూ అనువైన వాతావరణం ఉన్నట్టు వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు గుర్తించారు. అల్లూరి జిల్లాలోని చింతపల్లి ఉద్యాన పరిశోధన కేంద్రంలోని పాలీహౌస్లో 6 రకాల లిసియాంతస్పై పరిశోధనలు జరిపారు. పింక్, ఆకుపచ్చ, పసుపు, తెలుపు, నీలం, పికోటీ, చాంపేన్ రకాలను ప్రయోగాత్మకంగా సాగు చేశారు. శీతాకాలంలో మైదాన ప్రాంతాల్లోను, కొండ ప్రా ంతాల్లో వేసవి కాలంలోనూ వీటిని సాగు చేయవచ్చని గుర్తించారు. ఇండోర్ డెకరేషన్‌కు ఉప యోగించే ఈ పూలు కనీసం ఐదారు రోజుల పాటు తాజాదనం కోల్పోకుండా ఉంటున్నాయి. అలంకరణ కోసం ఉపయోగించే ఈ పూలకు యూరోప్, చైనా, ఇంగ్లాండ్, వియత్నాం, మలేíÙ యా, జపాన్ దేశాల్లో మంచి డిమాండ్ ఉంది. రూ.40 లక్షల ఆదాయం వీటి పంట కాలం నాలుగు నెలలు. నర్సరీల్లో 70 నుంచి 75 రోజులు ఉంచాలి. నాటిన 60 రోజులకు పుష్పిస్తాయి. ఒక మొక్క మూడు కొమ్ములతో ఉంటుంది. కాండానికి 9 నుంచి 12 పువ్వులు వస్తాయి. సీజన్ బట్టి ఒక్కొక్క పువ్వు రూ.20 నుంచి రూ.35 వరకు పలుకుతుంది. రూ.24 లక్షల వరకు పెట్టుబడి పెడితే.. రూ.40 లక్షల వరకు ఆదాయం వస్తుంది. పెట్టుబడి పోనూ రూ.12 లక్షల నుంచి రూ.16 లక్షల నికర ఆదాయం పొందొచ్చు. మన ప్రాంతానికి రోసిట 3 బ్లూ పికోటీ వెరైటీ–2, ఎక్స్ కాలిబూర్ 3 బ్లూ పికోటీ, రోసిట 4 ప్యూర్ వైట్, రోసిట 3 పింక్ పికోటీ, రోసిట 4 గ్రీన్ రకాలు అనుకూలమని తేల్చారు. -
బొకేలు వద్దు.. మొక్కలు ముద్దు
– నూతన సంవత్సర వేడుకల్లో మొక్కలను కానుకలుగా పంచుదాం - ఎస్పీ ఆకె రవికృష్ణ కర్నూలు : నూతన సంవత్సర వేడుకల్లో మొక్కలను కానుకలుగా పంచుదామని ఎస్పీ ఆకె రవికృష్ణ పిలుపునిచ్చారు. ప్రాణం లేని ఖరీదైన బొకేలు, గ్రీటింగ్, స్వీట్స్‌కు బదులుగా ప్రాణమున్న మొక్కలను నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుటకు ఉపయోగిద్దామని బుధవారం కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఎస్పీ విజ్ఞప్తి చేశారు. జాతీయ పర్యావరణ కన్వీనర్(జేవీవీ) సి.యాగంటప్ప ఆధ్వర్యంలో జనవిజ్ఞాన వేదిక బృందం కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఎస్పీని కలిశారు. ఈ సందర్భంగా మొక్కలతో శుభాకాంక్షలు తెలిపి గ్రీట్ విత్ గ్రీన్ అనే కార్యక్రమాన్ని ఎస్పీ ప్రారంభించారు. భూమిపై ఉండే సకల జీవజాతులకు సేవ చేసే మొక్కలను శుభాకాంక్షలు తెలిపేందుకు ఉపయోగించాలని జిల్లా ప్రజలు యువతకు ఎస్పీ విజ్ఞప్తి చేశారు. జనవరి 1వ తేదీన ప్రతి ఒక్కరూ మొక్కలను ఉపయోగించి నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పుకోవడాన్ని అలవాటు చేద్దామన్నారు. ఒక బొకే ఖరీదుతో 8 నుంచి 10 మొక్కలను పంచవచ్చని, బొకే కన్నా మొక్క ఎక్కువ కాలం ఉంటుందన్నారు. జీవ మనుగడకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. జేవీవీ చిన్నారులు.. లహరి, భవ్య, కిరణ్మయి, జుహిర్మయి, జశ్వంత్ తదితరులు 'గ్రీట్ విత్ గ్రీన్' అనే కార్యక్రమంతో మొక్కలను ఎస్పీకి అందజేసి అడ్వాన్స్‌గా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. జేవీవీ జాతీయ పర్యావరణ రాష్ట్ర కోశాధికారి సురేష్‌కుమార్, జిల్లా కార్యదర్శి బాబు, దామోదర్‌రావు, నాయకులు మల్లేష్, ఇండియన్ రెడ్‌క్రాస్ చైర్మన్ శ్రీనివాసులు, కప్పట్రాళ్ల హైస్కూల్ హెడ్మాస్టర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
నువ్వెంత.. నువ్వెంత
పోలీస్ స్టేషన్లోనే కానిస్టేబుల్, ఎంపీపీ మధ్య వాగ్వాదం ఇద్దరి మధ్య తిట్ల పురాణం ఎస్ఐల ప్రేక్షకపాత్ర గుత్తి : ఒకరు కానిస్టేబుల్. మరొకరు ఎంపీపీ. చిన్న విషయంగా వారిద్దరూ వాగ్వాదానికి దిగారు. ఒకానొక దశలో ‘నువ్వెంతంటే.. నువ్వెంత’ అనే స్థాయికి వచ్చారు. ఇదంతా ఎస్ఐల ముందే జరగ్గా, వారు ప్రేక్షకపాత్ర వహించారు. గుత్తి పోలీస్ స్టేషన్లో ఈ సంఘటన గురువారం జరిగింది. జరిగిందేమిటంటే... బసినేపల్లి వద్ద లారీ ఢీకొని అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి గాయపడ్డాడు. ఆ విషయంగా మాట్లాడేందుకు ఎంపీపీ వీరేశ్, బసినేపల్లి సర్పంచు భర్త మహ్మదాలీ, మార్కెట్ యార్డు చైర్మన్ శ్రీనివాస యాదవ్, ధర్మాపురం సర్పంచు శ్రీనివాసచౌదరి పోలీసు స్టేషన్‌కు వెళ్లారు. అక్కడ మోహన్ అనే కానిస్టేబుల్ ఎదురయ్యారు. అతన్ని ఉద్దేశించి.. బాబు.. మీ ఎస్ఐ లేరా?అని ఎంపీపీ అడిగారు. దీంతో సదరు కానిస్టేబుల్.. నన్ను బాబూ అని పిలుస్తావా? నువ్వెవరు? అంటూ ప్రశ్నించారు. కోపోద్రుక్తుడైన ఎంపీపీ.. నన్నే ఎవరంటావా?నన్నెప్పుడూ చూడలేదా? అంటూ ఎదురు ప్రశ్నించారు. ఈ విషయంగా వారిద్దరి మధ్య మాటామాటా పెరిగి తిట్ల పురాణానికి దిగారు. ‘నీ సంగతి చూస్తా’నంటే.. నీ సంగతి చూస్తా’నంటూ ఒకర్నొకరు చాలెంజ్ చేసుకున్నారు. ఈ తతంగమంతా ఎస్ఐ సమక్షంలోనే జరగడం గమనార్హం. అనంతరం తమపై దురుసుగా ప్రవర్తించాడంటూ పోలీసు కానిస్టేబుల్ మోహన్‌పై ఎంపీపీ , టీడీపీ నాయకులు ఎస్ఐకు ఫిర్యాదు చేశారు. -
విశ్రాంత ఉద్యోగిని చితకబాదిన కానిస్టేబుల్
గుత్తి: రిటైర్డ్ రైల్వే ఉద్యోగిని ఒక కానిస్టేబుల్ చితకబాదిన సంఘటన గుత్తి ఆర్ఎస్లో సోమవారం చోటు చేసుకుంది. బాధితుడి వివరాల మేరకు.. గుత్తి మున్సిపాలిటీ పరిధిలోని ఎస్ఎస్ పల్లికి చెందిన రైల్వే విశ్రాంతఉద్యోగి గోవిందు పాత రూ.500, రూ.1000 నోట్లను మార్చుకోవడానికి గుత్తి ఆర్ఎస్లోని ఆంధ్రా బ్యాంకుకు వెళ్లి క్యూలో నిలుచున్నాడు. లంచ్ సమయం కావడంతో బ్యాంకర్లు మధ్యాహ్నం గంట పాటు లావాదేవీలు నిలిపి వేశారు. దీంతో గోవిందు క్యూలో నిలబడలేక పక్కకు వెళ్లి కూర్చున్నాడు. బ్యాంకు అధికారులు తిరిగి లావాదేవీలు ప్రారంభించడంతో క్యూలో నిలుచోవడానికి వెళ్లాడు. అయితే మోహన్ అనే కానిస్టేబుల్ అతన్ని పక్కకు తోసివేశాడు. ఉదయం నుంచి వేచి ఉన్నానని చెప్పినా కానిస్టేబుల్ వినలేదు. నానా బూతులు తిడతూ చేయి చేసుకున్నాడు. దీంతో అతను కిందపడిపోయాడు. అవమానం భరించలేక ఏడ్చాడు. 100కు కాల్ చేసి కానిస్టేబుల్ మోహన్‌పై ఫిర్యాదు చేశాడు. -
కారు స్వాధీనం.. దొంగ అరెస్ట్
గుత్తి: అపహరణకు గురైన కారును పోలీసులు స్వాధీనం చేసుకుని, దొంగను అరెస్ట్ చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను సీఐ మధుసూదన్‌గౌడ్, ఎస్ఐ రామాంజనేయులు సోమవారం గుత్తి పోలీసుస్టేషన్లో విలేకరులకు వెల్లడించారు. అక్టోబర్ 11న కర్ణాటక రాష్ట్రం∙బీదర్‌కు చెందిన విజయకుమార్ కారు( హోండా అకర్డ్–కెఎ 04 ఎంసి 8383)ను బీదర్‌కే చెందిన చంద్రకాంత్ మరో వ్యక్తి బెంగుళూరు నుంచి నాగపూర్‌కు బాడుగకు మాట్లాడుకున్నారు. అదే రోజూ రాత్రి పది గంటల సమయంలో గుత్తి శివారులోని రాయల్ డాబా వద్దకు చేరుకున్నారు. రాత్రి అయిందని విశ్రాంతి తీసుకుని ఉదయాన్నే బయలుదేరుదామని డ్రైవర్ కమ్ ఓనర్ విజయకుమార్‌ను నమ్మించారు. రాత్రి డాబాలో పడుకున్నారు. బాడుగ మాట్లాడుకున్న వారు తెల్లవారు జామున డ్రైవర్‌ను గదిలోనే పెట్టి తాళం వేసుకుని కారుతో ఉడాయించారు. బాధితుడు విజయకుమార్ గుత్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సోమవారం హైవేలో పోలీసులు తనిఖీ చేస్తుండగా అపహరణకు గురై కారు కనిపించింది. వెంటనే కారును స్వాధీనం చేసుకుని, నిందితుడు చంద్రకాంత్‌ను అరెస్టు చేశారు. నిందితున్ని కోర్టులో హాజరు పరచగా మెజిస్ట్రేట్ రిమాండ్‌కు ఆదేశించారు. -
బిస్కెట్ల లారీ దగ్ధం
గుత్తి రూరల్: అనంతపురం జిల్లా గుత్తి పట్టణ శివారులోని శ్రీకష్ణదేవరాయ (ఎస్కేడీ) ఇంజనీరింగ్ కళాశాల వద్ద 44వ జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున బిస్కెట్ల లారీ దగ్ధమైంది. పోలీసులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. లారీ నాగ్‌పూర్ నుంచి బెంగళూరుకు బిస్కెట్ల లోడుతో వెళుతోంది. గుత్తి శివారుకు రాగానే బ్యాటరీల వద్ద మంటలు చెలరేగాయి. డ్రైవర్ గమనించకుండా వేగంగా ముందుకు తీసుకెళ్లాడు. పది కిలోమీటర్ల వరకూ అలాగే వెళ్లడంతో మంటలు వ్యాపించి.. బిస్కెట్ డబ్బాలు కాలిపోయాయి. మంటలు లారీ టైర్లకు కూడా పాకాయి. వెనుక వచ్చిన లారీ డ్రైవర్లు కేకలు వేయడంతో డ్రైవర్ అప్రమత్తమై లారీని అపాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే మంటలు భారీగా చెలరేగాయి. బిసెట్లన్నీ బూడిదయ్యాయి. -
అబ్బో.. గుత్తి ఎంత గబ్బో..
గుత్తి: స్థానిక మున్సిపాలిటీలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. మున్సిపాలిటీలో మొత్తం 24 వార్డులుండగా, వాటిలో సగం వార్డుల్లో డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేదు. దీంతో మురుగునీరు రోడ్లపై, ఇళ్ల ముందర నిల్వ ఉంటున్నారుు. ఫలితంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా తురకపల్లి రోడ్డు, జంగాల కాలనీ, సీపీఐ కాలనీ, స్వీపర్స్ కాలనీ, జెండావీధి, బండగేరి, కోట, మాల వీధి, కమాటం వీధితో పాటు గుత్తి ఆర్ఎస్లోని ఎస్సీ కాలనీ, తోళ్లషాపు కాలనీ, 7, 8వ వార్డులు, ఎంఆర్ ఫ్యాక్టరీ రోడ్డు, జడ్పీ బాలికల పాఠశాల వీధి తదితర చోట్ల డ్రైనేజీ సరిగా లేదు. డ్రైనేజీలను మెరుగు పరచాలని పలుసార్లు మున్సిపాలిటీ అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని ఆయా కాలనీ వాసులు వాపోయూరు. ఈ విషయంపై మున్సిపల్ కమిషనర్ ఇబ్రహీం సాహెబ్‌ను వివరణ కోరగా.. గుత్తి పట్టణం కొత్తగా మున్సిపాలిటీగా ఏర్పడిందన్నారు. దీంతో నిధులు లేమి కారణంగా డ్రై నేజీలను ఏర్పాటు చేయలేక పోతున్నామన్నారు. పారిశుద్ధ్య కార్మికులు కూడా చాలా తక్కువగా ఉన్నారన్నారు. దశల వారీగా డ్రైనేజీ వ్యవస్థను మెరుగు పరుస్తామన్నారు. -
ఆందోళకారులకు పూల బొకేలు
ఇస్లామాబాద్: పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ కు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న నిరసనకారులకు క్రైస్తవ నాయకుడొకరు పుష్పగుచ్చాలు పంపారు. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా పాకిస్థాన్ పార్లమెంట్ హౌస్ వెలుపల ఆందోళన చేస్తున్న వారికి జే సాలిక్ అనే క్రిస్టియన్ నాయకుడు 200 పూల బొకేలు పంపించారని స్థానిక మీడియా వెల్లడించింది. ఆందోళనకారులకు మద్దతుగా పుష్ప గుచ్ఛాలిచ్చారని తెలిపింది. వీటిపై 'ఇంకిలాబ్ మార్చ్' అని రాసివుందని పేర్కొంది. నవాజ్ షరీష్ రాజీనామా చేయాలంటూ పాకిస్థాన్ అవామీ తెహ్రీకే, తెహ్రీకే ఇన్సాఫ్ కార్యకర్తలు ఆందోళన చేస్తున్నారు. -
బొకేలొద్దు.. మొక్కలివ్వండి
కర్నూలు (ఓల్డ్‌సిటి) : ఫంక్షన్లలో బొకేలకు బదులు చిన్నమొక్కలు ఇచ్చే సంప్రదాయాన్ని అలవర్చుకోవాలని జాయింట్ కలెక్టర్ కన్నబాబు సూచించారు. కోరారు. పెరిగిపోతున్న వాతావరణ కాలుష్యాన్ని నియంత్రించేందుకు ప్రతి ఒక్కరూ తమ పరిధిలో కృషి చేయాలన్నారు. ఆంద్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్టక్చర్ కర్పొరేషన్ అండ్ లిమిటెడ్ ఆధ్వర్యంలో శుక్రవారం కల్లూరు ఏస్టెట్స్‌లో పారిశ్రామిక పర్యావరణ మెరుగుదల కార్యక్రమం నిర్వహించారు. ఏపీఐఐసీ రాష్ట్రవ్యాప్తంగా జూన్ 5 ప్రపంచ పర్యావరణ దినోత్సవం నుంచి జూలై 5వ వరకు ఈ కార్యక్రమం నిర్వహించనుంది. కార్యక్రమంలో పరిశ్రమల నుంచి వెలువడుతున్న వాతావరణ కాలుష్యాన్ని నియంత్రించే అంశంపై చర్చించారు. పరిశ్రమలే ప్రధానం: వాతావరణ కాలుష్యానికి చాలా వరకు పరిశ్రమల నుంచి వెలువడుతున్న పొగ, ఇతర వాయువులే కారణమని, దీన్ని దృష్టిలో ఉంచుకుని సాధ్యమైనంత కాలుష్యాన్ని తగ్గించేలా చర్యలు తీసుకోవాలని జేసీ కన్నబాబు పారిశ్రామిక వేత్తలకు సూచించారు. ప్రతీ కుటుంబం నాలుగు కార్లను వాడడం ఫ్యాషన్‌గా మరిందని, ఒక్కకారు వాడితే వాతావరణ కాలుష్యాన్ని నియంత్రించిన వారవుతారన్నారు. కార్యక్రమంలో సుందర్రావ్ (జీఎమ్‌డీఐసీ), రమణ (సెట్కూర్ మేనేజర్), సుభాన్ (ఏపీపీసీబీ), శ్రీనివాసరావ్ (ఏపీఎస్ఎఫ్సీ), సిల్వర్జూబ్లి కాలేజీ లెక్చరర్ రంగనాథ్, సర్వీస్ సొసైటీ చైర్మన్ జీఆర్‌కెరెడ్డి, రంజిత్(జడ్‌ఎమ్ ఏపీఐఐసీ) తదితరులు పాల్గొన్నారు.