ఆందోళకారులకు పూల బొకేలు | Pakistani Christian leader sends flowers to protestors | Sakshi
Sakshi News home page

ఆందోళకారులకు పూల బొకేలు

Published Fri, Sep 5 2014 6:16 PM | Last Updated on Sat, Mar 23 2019 8:36 PM

Pakistani Christian leader sends flowers to protestors

ఇస్లామాబాద్: పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ కు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న నిరసనకారులకు క్రైస్తవ నాయకుడొకరు పుష్పగుచ్చాలు పంపారు. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా పాకిస్థాన్ పార్లమెంట్ హౌస్ వెలుపల ఆందోళన చేస్తున్న వారికి జే సాలిక్ అనే క్రిస్టియన్ నాయకుడు 200 పూల బొకేలు పంపించారని స్థానిక మీడియా వెల్లడించింది.

ఆందోళనకారులకు మద్దతుగా పుష్ప గుచ్ఛాలిచ్చారని తెలిపింది. వీటిపై 'ఇంకిలాబ్ మార్చ్' అని రాసివుందని పేర్కొంది. నవాజ్ షరీష్ రాజీనామా చేయాలంటూ పాకిస్థాన్ అవామీ తెహ్రీకే, తెహ్రీకే ఇన్సాఫ్ కార్యకర్తలు ఆందోళన చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement