సాక్షి, అమరావతి: లిసియాంతస్.. ఉత్తర అమెరికా ప్రాంతానికి చెందిన ఈ పువ్వులు గులాబీలను పోలి ఉండే కట్ ఫ్లవర్స్. విభిన్న రంగుల్లో ఉండే ఇవి మైదాన, కొండ ప్రాంతాల్లోనే కాదు ఇంటి ఆవరణలో పూలకుండీల్లోనూ పెంచుకునేందుకు అనువైనవి. బొకేలు, అలంకరణకు ఉపయోగించే ఈ పూలకు విదేశాల్లో మంచి డిమాండ్ ఉంది. వీటిని ఏపీలోనూ సాగు చేసేవిధంగా శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనలు ఫలించాయి.
దేశంలోని బెంగళూరు పరిసర ప్రాంతాల్లో కొద్దిపాటి విస్తీర్ణంలో లిసియాంతస్ పూల ను సాగు చేస్తున్నారు. వీటి సాగుకు ఆంధ్రప్రదేశ్‌లోనూ అనువైన వాతావరణం ఉన్నట్టు వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు గుర్తించారు. అల్లూరి జిల్లాలోని చింతపల్లి ఉద్యాన పరిశోధన కేంద్రంలోని పాలీహౌస్లో 6 రకాల లిసియాంతస్‌పై పరిశోధనలు జరిపారు.
పింక్, ఆకుపచ్చ, పసుపు, తెలుపు, నీలం, పికోటీ, చాంపేన్ రకాలను ప్రయోగాత్మకంగా సాగు చేశారు. శీతాకాలంలో మైదాన ప్రాంతాల్లోను, కొండ ప్రా ంతాల్లో వేసవి కాలంలోనూ వీటిని సాగు చేయవచ్చని గుర్తించారు. ఇండోర్ డెకరేషన్‌కు ఉప యోగించే ఈ పూలు కనీసం ఐదారు రోజుల పాటు తాజాదనం కోల్పోకుండా ఉంటున్నాయి. అలంకరణ కోసం ఉపయోగించే ఈ పూలకు యూరోప్, చైనా, ఇంగ్లాండ్, వియత్నాం, మలేíÙ యా, జపాన్ దేశాల్లో మంచి డిమాండ్ ఉంది.
రూ.40 లక్షల ఆదాయం
వీటి పంట కాలం నాలుగు నెలలు. నర్సరీల్లో 70 నుంచి 75 రోజులు ఉంచాలి. నాటిన 60 రోజులకు పుష్పిస్తాయి. ఒక మొక్క మూడు కొమ్ములతో ఉంటుంది. కాండానికి 9 నుంచి 12 పువ్వులు వస్తాయి. సీజన్ బట్టి ఒక్కొక్క పువ్వు రూ.20 నుంచి రూ.35 వరకు పలుకుతుంది.
రూ.24 లక్షల వరకు పెట్టుబడి పెడితే.. రూ.40 లక్షల వరకు ఆదాయం వస్తుంది. పెట్టుబడి పోనూ రూ.12 లక్షల నుంచి రూ.16 లక్షల నికర ఆదాయం పొందొచ్చు. మన ప్రాంతానికి రోసిట 3 బ్లూ పికోటీ వెరైటీ–2, ఎక్స్ కాలిబూర్ 3 బ్లూ పికోటీ, రోసిట 4 ప్యూర్ వైట్, రోసిట 3 పింక్ పికోటీ, రోసిట 4 గ్రీన్ రకాలు అనుకూలమని తేల్చారు.
Comments
Please login to add a commentAdd a comment