అబ్బో.. గుత్తి ఎంత గబ్బో..
గుత్తి: స్థానిక మున్సిపాలిటీలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. మున్సిపాలిటీలో మొత్తం 24 వార్డులుండగా, వాటిలో సగం వార్డుల్లో డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేదు. దీంతో మురుగునీరు రోడ్లపై, ఇళ్ల ముందర నిల్వ ఉంటున్నారుు. ఫలితంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా తురకపల్లి రోడ్డు, జంగాల కాలనీ, సీపీఐ కాలనీ, స్వీపర్స్ కాలనీ, జెండావీధి, బండగేరి, కోట, మాల వీధి, కమాటం వీధితో పాటు గుత్తి ఆర్‌ఎస్‌లోని ఎస్సీ కాలనీ, తోళ్లషాపు కాలనీ, 7, 8వ వార్డులు, ఎంఆర్ ఫ్యాక్టరీ రోడ్డు, జడ్‌పీ బాలికల పాఠశాల వీధి తదితర చోట్ల డ్రైనేజీ సరిగా లేదు.
డ్రైనేజీలను మెరుగు పరచాలని పలుసార్లు మున్సిపాలిటీ అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని ఆయా కాలనీ వాసులు వాపోయూరు. ఈ విషయంపై మున్సిపల్ కమిషనర్ ఇబ్రహీం సాహెబ్‌ను వివరణ కోరగా.. గుత్తి పట్టణం కొత్తగా మున్సిపాలిటీగా ఏర్పడిందన్నారు. దీంతో నిధులు లేమి కారణంగా డ్రై నేజీలను ఏర్పాటు చేయలేక పోతున్నామన్నారు. పారిశుద్ధ్య కార్మికులు కూడా చాలా తక్కువగా ఉన్నారన్నారు. దశల వారీగా డ్రైనేజీ వ్యవస్థను మెరుగు పరుస్తామన్నారు.