భారత్‌ - జపాన్‌ స్మార్ట్ నగరాల వారసత్వ ఒప్పందం | PM India and Japan sign Kyoto-Varanasi partnership agreement | Sakshi
Sakshi News home page

భారత్‌ - జపాన్‌ స్మార్ట్ నగరాల వారసత్వ ఒప్పందం

Published Sat, Aug 30 2014 8:39 PM | Last Updated on Wed, Aug 15 2018 2:20 PM

నరేంద్ర మోడీ,షిన్జో అబేల సమక్షంలో ఒప్పంద పత్రాలను మార్చుకుంటున్నదీపా గోపాలన్, దైసాక కాడోకవా. - Sakshi

నరేంద్ర మోడీ,షిన్జో అబేల సమక్షంలో ఒప్పంద పత్రాలను మార్చుకుంటున్నదీపా గోపాలన్, దైసాక కాడోకవా.

క్యోటో:భారత్‌ - జపాన్‌ స్మార్ట్ నగరాల వారసత్వ ఒప్పందం కుదిరింది.  ప్రధాని నరేంద్ర మోడీ ప్రాతినిధ్యం వహించే అతి పురాతన భారతీయ ఆధ్యాత్మిక నగరం వారణాసికి, వెయ్యి ఏళ్లకు పైగా జపాన్కు రాజధానిగా ఉంటున్న క్యోటో నగరాల మధ్య ఈ ఒప్పందం కుదిరింది. భారత ప్రధాని నరేంద్ర మోడీ, జపాన్ ప్రధాని షిన్జో అబేల సమక్షంలో భారత రాయభారి దీపా వాధ్వా, క్యోటో మేయర్ దైసాక కాడోకవా ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. పత్రాలను మార్చుకున్నారు. ఈ ఒప్పందం ప్రకారం వారసత్వ పరిరక్షణ, విద్య, సాంస్కృతిక రంగాలలో ఈ రెండు నగరాలు సహకరించుకుంటాయి.

అంతకు ముందు అయిదు రోజుల జపాన్ పర్యటకు వచ్చిన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి ఒసాకా ఎయిర్‌పోర్ట్‌లో ఘన స్వాగతం పలికారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement