
గోదావరిఖని: రెండు జిల్లాలను కలిపే వారధి. కింద నుంచి గలగలా ప్రవహించే గోదావరి. కానీ ఈ వారధిపై ఉన్న పూల మొక్కలకు గుక్కెడు నీరు కరువైంది. రెండు జిల్లాలకు చెందిన ప్రజాప్రతినిధులు, అధికారులు ఈ వంతెన గుండానే రాకపోకలు సాగిస్తున్నా వాడిపోయిన పూల మొక్కలు పట్టించుకే వారే కరువయ్యారు.
లక్షలు ఖర్చు చేసి వంతెనపై పెట్టిన పూల కుండీలు చివరకు అలంకారప్రాయమయ్యాయి. వంతెను కొత్త అందాలను తీసుకువచ్చేందుకు రామగుండం మున్సిపల్ కార్పోరేషన్ చేపట్టిన పని ఆరంభ శూరత్వమే అయ్యింది. హరితహారం స్ఫూర్తి ఆవిరైపోయింది.
సాక్షి ఫోటోగ్రాఫర్, పెద్దపల్లి
Comments
Please login to add a commentAdd a comment