గోదావరి నమూనా స్వర్ణవంతెన
రాజమహేంద్రవరం కల్చరల్ : నగరానికి చెందిన స్వర్ణకారుడు పెదపాటి నాని తాను రూపొందించిన స్వర్ణ గోదావరి నమూనా వంతెనను బుధవారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల ముందు ప్రదర్శించారు. నగర చారిత్రక,సాంస్కృతిక వైభవాన్ని చాటి చెప్పడానికే ఈ వంతెనను రూపొందించానని పెదపాటి నాని విలేకరుల సమావేశంలో తెలిపారు. వంతెనలోనే పుష్కరఘాట్ శివలింగం, నంది విగ్రహాలు ఇమిడిపోయేటట్టు రూపొందించానని పేర్కొన్నారు. ఏడు గ్రాముల బంగారంతో, ఏడు అంగుళాల పొడవుగల ఈ నమూనా వంతెనను నెలరోజుల్లో రూపొందించానని తెలిపారు. గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డు్సలో స్థానం సంపాదించడమే తన లక్ష్యమన్నారు. స్వర్ణకార సంఘం ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు నమూనా వంతెనను చూసి అభినందనలు తెలిపారని పేర్కొన్నారు. పొన్నాడ సోమలింగాచారి, వెదురువాడ సుబ్రహ్మణ్యం తదితరులు తనకు ప్రోత్సాహాన్ని అందజేశారని నాని వివరించారు.