ఒక్కోసారి అదృష్టం ఏ రూపంలో వస్తుందో ఎవరూ ఊహించలేరు. మన దగ్గర ఉన్నవాటి నుంచే అదృష్టం తలుపుతడుతుందని కూడా అనుకోం. ఒక్కోసారి చాలా వింతగా అనుకోను కూడా అనుకోని, ఊహించని సంఘటనలు ఎదరువుతుంటాయి. ఇలాంటి సంఘటనల కారణంగానే మన కళ్లముందు అప్పటి వరకు చాలా సాదాసీదాగా ఉన్నవాడు ఒక్కసారిగా రాత్రికి రాత్రే స్టార్ అయ్యిపోతుంటాడు. అలాంటి వారిని ఇప్పటి వరకు ఎంతోమందిని చూసుంటాం. కానీ ఇంట్లో వృద్ధాగా పడి ఉన్న ఒక ఫ్లవర్ వేజ్ ఒక కుటుంబాన్ని కోటిశ్వరుణ్ణి చేసిందంటే నమ్మగలరా!.ఔను నిరుపయోగంగా ఒక మూలన పడి ఉన్న ప్లవర్ వేజ్ ఓ కుటుంబం తలరాతని మార్చేసింది.
వివరాల్లోకెళ్తే...యూకేలోని మిడ్‌ల్యాండ్స్‌లో నివసిస్తున్న ఒక కుటుంబం 1980లలో ఒక ప్లవర్ వేజ్ జాడీని కొనుగోలు చేశారు. ఐతే వాళ్లు దాన్ని ఇంట్లో అలంకరణ వస్తువుగా కొన్నేళ్లు ఉపయోగించారు. కాలక్రమేణ పగుళ్లు రావడంతో దాన్ని వంటగదిలో ఓ మూలన పెట్టేశారు. ఆ ప్లవర్ వేజ్‌ని వాడడం మానేసి చాలా ఏళ్లయ్యింది. ఐతే అనుకోకుండా ఒక రోజు వారింటికి వచ్చిన ఓ ఆర్కియాలజిస్ట్ దృష్టిలో ఆ ప్లవర్ వేజ్ పడింది. ఆయన ఆ ప్లవర్ వేజ్ జాడీ విశిష్టత గురించి వివరించి చెప్పాడు. ఇది నీలిరంగులో ఉన్న వెండి, గోల్డ్‌తో తయారు చేయబడిన పాత్ర అని చెప్పాడు.
ఇది 18వ శతాబ్దపు రాజు కియాన్‌లాంగ్ కాలంలో ఉపయోగించేవారని ఆ పాత్రపై ఉన్న ఆరు అక్షరాల ముద్ర ద్వారా తెలియజేశాడు. అంతేకాదు ఈ రాజరికపు ప్లవర్ వేజ్ జాడీతో బంగారం, వెండికి సంబంధించిన పనులు చేసేవారని తెలుసుకుని ఆ కుటుంబం ఆశ్చర్యపోయింది. దీనిపై ఎనిమిది అమర చిహ్నాలు ఉన్నాయని, అవి దీర్ఘాయువును శ్రేయస్సును సూచిస్తుందని ఆ నిపుణుడు వివరించాడు.
ప్రస్తుతం ఈ జాడి ధర రూ. 1 కోటి 44 లక్షల రూపాయల వరకు పలుకుతుందని కూడా చెప్పాడు. ఈ విషయం తెలుసుకున్న ఒక చైనా ధనవంతుడు ఆ ఫ్లవర్ వేజ్ జాడీని 1.2 మిలియన్ పౌండ్లకు (దాదాపు రూ.11 కోట్ల 53 లక్షలు) కొనుగోలు చేశాడు. అంతేగాదు తమ వంశీయులు పోగొట్టుకున్న వారసత్వ సంపదను తిరిగి పొందినందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పాడతను.
(చదవండి: బోనులో ఉన్న సింహంతో పరాచకాలు ఆడాడు...ముచ్చెమటలు పట్టించేసిందిగా: వీడియో వైరల్)
Comments
Please login to add a commentAdd a comment