Millionaires
-
400 మంది ఉద్యోగులను కోటీశ్వరులను చేశాడు!
సాధారణంగా కంపెనీల అధినేతలు తమ సొంత ప్రయోజనాల కోసమే ఆలోచిస్తారు. ఉద్యోగులను ప్రయోజనాలను పట్టించుకోరు. కానీ ఓ కంపెనీ ఫౌండర్ తీసుకున్న నిర్ణయం ఆ సంస్థలోని 400 మంది ఉద్యోగులను కోటీశ్వరులను చేసింది.భారతీయ సంతతికి చెందిన జ్యోతి బన్సల్ తన మొదటి సాఫ్ట్వేర్ స్టార్టప్ యాప్‌డైనమిక్స్‌ను 2017లో విక్రయించినప్పుడు తన కెరీర్లో అత్యంత కఠినమైన నిర్ణయం తీసుకున్నారు. తన స్టార్టప్‌ను 3.7 బిలియన్ డాలర్లకు (ప్రస్తుత విలువ రూ. 31,090 కోట్లు) సిస్కోకు విక్రయించడం అప్పుడు సరైన నిర్ణయమేనని ఆయన భావించారు. కంపెనీలో 14 శాతానికి పైగా వాటా ఉన్న బన్సల్‌కు కూడా ఈ ఒప్పందం ఆర్థికంగా ముఖ్యమైనది. సిస్కో ఆఫర్‌ను అంగీకరించిన తర్వాత 400 మంది యాప్‌డైనమిక్స్ ఉద్యోగుల షేర్స్ విలువ ఒక మిలియన్ డాలర్లకు ఎగబాకినట్లు బన్సల్ ప్రతినిధి తెలిపారు. దీంతో వీరందరూ కోటీశ్వరులయ్యారు.అప్లికేషన్స్ అండ్ బిజినెస్ పెర్ఫార్మెన్స్ మానిటరింగ్ సాఫ్ట్వేర్ కంపెనీ అయిన యాప్‌డైనమిక్స్‌ను జ్యోతి బన్సల్ 2008లో స్థాపించారు. ఈ స్టార్టప్ సరిగ్గా ఐపీఓకి వచ్చే ఒక రోజు ముందు విక్రయించారు. ఐఐటీ ఢిల్లీ పూర్వ విద్యార్థి అయిన బన్సాల్ ప్రస్తుతం ట్రేసబుల్, హార్నెస్ అనే మరో రెండు సాఫ్ట్వేర్ స్టార్టప్‌లకు సీఈవో, కో ఫౌండర్.ఎవరీ జ్యోతి బన్సల్?జ్యోతి బన్సల్ రాజస్థాన్‌లోని ఒక చిన్న పట్టణంలో పుట్టి పెరిగారు. ఆయన తండ్రి నీటిపారుదల యంత్రాలను విక్రయించే వ్యాపారం చేసేవాడు. 1999లో ఢిల్లీ ఐఐటీ నుంచి కంప్యూటర్ సైన్స్‌లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేశారు. నెక్ట్స్ జనరేషన్ టెక్నాలజీ అభివృద్ధిలో మక్కువ ఉన్న జ్యోతి బన్సల్ 2017లో ఆయన బిగ్ ల్యాబ్స్‌ను ప్రారంభించారు. 2018లో జాన్ వ్రియోనిస్తో కలిసి అన్‌యూజవల్ వెంచర్స్‌ను సహ-స్థాపించారు. జ్యోతి బన్సల్ ప్రస్తుతం యూఎస్‌లోని శాన్ ఫ్రాన్సిస్కోలో ఉంటున్నారు. -
చట్టసభల్లో పెరుగుతున్న కోటీశ్వరులు
రాచరిక ప్రభుత్వాలు, నియంతృత్వ ప్రభుత్వాల కంటే ప్రజాస్వామిక ప్రభుత్వాలు... సంక్షేమ ప్రభుత్వాలుగా ప్రజల కోసం, ముఖ్యంగా పేద ప్రజల కోసం, వారి సంక్షేమం కోసం బాధ్యతాయుతంగా పనిచేస్తాయని బలంగా విశ్వసిస్తారు. ప్రపంచంలో పేదలు అధికంగా ఉన్న దేశాలలో భారతదేశం కూడా ఒకటి. దేశంలో 25 కోట్ల మంది పేదరికంలో ఉన్నారనీ, దాదాపు 11.2 శాతం మంది దారిద్య రేఖ దిగువన నివసిస్తున్నారనీ 2023లో నీతి ఆయోగ్ విడుదల చేసిన తన రిపోర్టులో వెల్లడి చేసింది. దేశంలో 80 కోట్ల పేద కుటుంబాలు ‘ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన’ లాంటి పథకాల ద్వారా ఉచిత రేషన్ బియ్యం పొందుతున్న దేశంలో ఇటీవల 18వ లోక్ సభకు జరిగిన ఎన్నికలలో 93 శాతం మంది కోటీశ్వరులు, 50 శాతం మంది క్రిమినల్ కేసులు ఉన్నవారు లోక్ సభ సభ్యులుగా ఎన్నికయ్యారని ‘అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫారమ్స్’ (ఏడీఆర్) సంస్థ తన అధ్యయనంలో వెల్లడి చేసింది. ఈ నేపథ్యంలో భారతదేశం లాంటి అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికలు ధనస్వామ్యంగా, నేరస్వామ్యంగా మారినాయనే ఆందోళన కలుగక మానదు. 18వ లోక్ సభకు ఎన్నికైన మొత్తం 543 మంది లోక్ సభ సభ్యులలో 504 మంది అంటే 93 శాతం సభ్యులు కోటీశ్వరులే అని ఏడీఆర్ తన నివేదికలో వెల్లడించింది. అలాగే వరుసగా మూడోసారి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్న బీజేపీ నుండి 240 మంది లోక్ సభ సభ్యులు విజయం సాధిస్తే వారిలో 227 మంది లోక్ సభ సభ్యులు కోటీశ్వరులే. అలాగే ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ నుండి 92 మంది కోటీశ్వరులు లోక్ సభ సభ్యులుగా ఎన్నికైనారు. ప్రస్తుత ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటులో కీలక భాగస్వామ్య పక్షాలైన టీడీపీ నుండి గెలిచిన 16 మంది లోక్ సభ సభ్యులూ, జేడీ(యూ) నుండి గెలిచిన 12 మంది సభ్యులూ... అందరూ కోటీశ్వరులే!2009 లోక్ సభ ఎన్నికల నుండి ప్రతి ఎన్నిక లోనూ ఎన్నికయ్యే కోటీశ్వరుల సంఖ్య పెద్ద ఎత్తున పెరుగుతూనే ఉన్నదని గణాంకాలు చెబుతున్నాయి. 2009లో 315 మంది, 2014లో 443 మంది, 2019లో 475 మంది, 2024లో 504 మంది కోటీశ్వరులు ఎన్నికయ్యారు.లోక్ సభకు ఎన్నికవుతున్న వారిలో ఒకపక్క కోటీశ్వరుల సంఖ్య పెరుగుతుంటే మరొకవైపు క్రిమినల్స్, క్రిమినల్ కేసులు, క్రిమినల్ రికార్డ్స్ ఉన్నవారు కూడా పెరిగిపోవటం ఆందోళన కలిగించే విషయమే. 18వ లోక్ సభలో క్రిమినల్ కేసులు ఉన్నవారు 50 శాతం, క్రిమినల్ రికార్డ్స్ ఉన్నవారు 46 శాతం మంది లోక్ సభ సభ్యులుగా ఎన్నికయ్యారు. వీరిలో బీజేపీ నుండి 94 మంది, కాంగ్రెస్ నుండి 49 మంది లోక్ సభ సభ్యులుగా ఎన్నికయ్యారు. మరీ ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే మహిళలపై దాడులూ, అత్యాచారాలూ చేసిన 15 మంది, విద్వేషపు ప్రసంగాలు చేసే 43 మంది కూడా లోక్ సభ సభ్యులుగా ఎన్నికవ్వటం. కోటీశ్వరులు, నేరగాళ్లు, క్రిమినల్ రికార్డ్స్ ఉన్నవారు, బ్యాంకులకు డబ్బులు ఎగవేతదారులు లోక్‌సభ లాంటి అత్యున్నత విధాన నిర్ణాయక సభలలోకి అడుగుపెడుతుంటే... సభలో వారి సంఖ్య పెరుగుతుంటే, ఆ సభకి గౌరవం పెరుగుతుందా? పేదల స్థితిగతులు, సమస్యలు వారికి అవగతం అవుతాయా? చట్టసభలలో జరిగే చర్చలలో వారు పాల్గొంటారా? పాల్గొన్నా సహేతుకమైన సూచనలు చేస్తారా! అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కాబట్టి చట్టసభలకు నేరగాళ్ళనూ, సొంత లాభాల కోసం వ్యాపారాలు చేసే కార్పొరేట్లనూ కాకుండా దేశ అభివృద్ధి కోసం పేదల సంక్షేమం కోసం పనిచేసే వారిని ప్రజలు ఎన్నుకునే రోజులు రావాలని ఆశిద్దాం. డా‘‘ తిరునహరి శేషు వ్యాసకర్త పొలిటికల్ ఎనలిస్ట్, కాకతీయ విశ్వవిద్యాలయం ‘ 98854 65877 -
అత్యధిక మిలియనీర్స్ ఉన్న భారతీయ నగరం ఇదే..!
ప్రపంచంలోనే అత్యధిక మిలియర్లు ఉన్న నగరాల జాబితాను ఏటా ఇమ్మిగ్రేషన్ కన్సల్టెన్సీ అయిన హెన్లీ & పార్ట్నర్స్ ఇస్తుంది. సంపన్న నగరాల జాబితాలో న్యూయార్క్ దాదాపు మూడు లక్షల మిలియనీర్లతో రెండో స్థానంలో ఉంది. ఇక్కడ నివాసితులు ప్రపంచంలోని ఇతర మెట్రో నగరాల కంటే దాదాపు మూడు డాలర్ల ట్రిలయన్లకు పైగా సంపదను కలిగి ఉన్నట్లు పేర్కొంది. ఇక్కడ మిలియనీర్ల సంఖ్య సుమారు 4% పెరిగినట్లు తెలిపింది. న్యూయార్క్‌లో 2013 నుంచి ఇప్పటి వరకు అంత్యంత సంపన్నుల సంఖ్యలో పెద్ద వాటాను కలిగి ఉంది. ఇక్కడ సుమారు 60 బిలియనీర్లు ఉన్నారని, వారిలో చాలామంది దాదాపు రూ. 800 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టగలరని వెల్లడించింది. ఇక శాన్ జోస్, శాన్ ఫ్రాన్సిస్కో బేఏరియా, పాలో ఆల్టోల వంటి నగరాల్లో శాన్ ఫ్రాన్సిస్కో బేఏరియాలో మాత్రం మూడు లక్షల మంది కోట్లల్లో నికర విలువ కలిగి ఉండటంతో రెండో స్థానంలో ఉందని తెలిపింది. ఇక ఈ అత్యధిక మిలియనీర్స్ జాబితాలో టోక్యో మూడో స్థానంలో ఉండగా, సింగపూర్ నాల్గో స్థానంలో ఉంది. కాగా హెన్లీ & పార్ట్నర్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జుర్గ్ స్టెఫెన్ ప్రకారం గత కొన్ని ఏళ్లలో ఆర్థిక మార్కెట్లలో విజృంభణ ఒక్కసారిగా ప్రపంచంలోని కొన్ని అత్యంత సంపన్న నగరాల వృద్దిని పెంచింది. పైగా వాటి గ్లోబల్ ఈక్విటీలు 2023లోనే సుమారు 20% పెరగగా, ఈ ఏడాది ఏకంగా 7% పెరిగాయి. దీంతో కొన్ని ప్రపంచ నగరాల అదృష్టం తారుమారయ్యిందని చెబుతోంది హెన్లీ & పార్ట్నర్స్ సర్వే. గత దశాబ్దంలో లండన్ తన మిలియనీర్ జనాభాలో 10% కోల్పోయింది. దీనికి యూరోపియన్ యూనియన్ నుంచి నిష్క్రమించాలని యూకే తీసుకున్న నిర్ణయమని చెబుతోంది. అలాగే చైనా మహమ్మారి టైంలో విధించిన ఆంక్షలు కారణంతో సంపన్న ప్రవాసులు సింగపూర్‌కు తరలిరావడంతో హాంకాంగ్ దాని మిలియనీర్ ర్యాంక్‌లలో 4% క్షీణతను చవి చూసింది. ఇదే సమయంలో కొన్ని నగరాల్లో మిలియనీర్ల వృద్ది అనూహ్యంగా పెరిగింది వాటిలో షెన్జెన్ కూడా ఉంది, ఇక్కడ గత దశాబ్దంలో మిలియనీర్ల సంఖ్య సుమారు 140% పెరిగింది. ఇక గత 10 ఏళ్లలో రెట్టింపుకు పైగా మిలియనీర్ జనాభా పెరిగిన నగరాలు వరుసగా భారతదేశంలోని బెంగళూరు, హో చి మిన్ సిటీ, వియత్నాం, యూఎస్‌లో అరిజోనాలోని స్కాట్స్‌డేల్ వంటి నగరాలు. కాగా ఆ జాబితాలో సంపన్న నగరంగా దుబాయ్ 21వ స్థానం దక్కించుకోగా, మొనాకో నెంబర్ 1 స్థానంలో ఉంది. మొనాకోలో సుమారు 40%కి పైగా మిలియనీర్లు ఉన్నారని హెన్లీ & పార్ట్నర్స్ సర్వే చెబుతోంది. (చదవండి: సోమవారాల్లో నలిగిన బట్టలే ధరించండి! సీఎస్ఐఆర్ పరిశోధన సంస్థ) -
Association for Democratic Reforms: మూడో విడతలో... మహిళలు 9 శాతమే
తొలి రెండు విడతల్లో మాదిరిగానే లోక్‌సభ ఎన్నికల మూడో విడతలోనూ మహిళలకు సముచిత స్థానం దక్కలేదు. 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 94 లోక్‌సభ స్థానాలకు మే 7న పోలింగ్ జరగనుంది. 1,352 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. వీరిలో మహిళలు 123 మందే (9 శాతం) ఉన్నారు. ఇక ప్రతి పది మంది అభ్యర్థుల్లో ఇద్దరు క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నట్టు అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫారమ్స్ (ఏడీఆర్) డేటా వెల్లడించింది. వీరిలో13 శాతం మందిపై మహిళలపై అత్యాచారం వంటి తీవ్ర కేసులున్నాయి. మొత్తం 38 మంది అభ్యర్థులు మహిళలకు సంబంధించిన కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. శివసేన (ఉద్ధశ్) అభ్యర్థుల్లో ఏకంగా 80 శాతం, ఎన్సీపీ (శరద్ పవార్) అభ్యర్థుల్లో 67 శాతం, ఎస్పీ అభ్యర్థుల్లో 50 శాతం, జేడీ(యూ)లో 33 శాతం, తృణమూల్ కాంగ్రెస్‌లో మందిపై క్రిమినల్ కేసులుండటం విశేషం! బీజేపీ నుంచి 22 మంది, కాంగ్రెస్ నుంచి 26, ఆర్జేడీ నుంచి ముగ్గురిపై కేసులున్నాయి. అభ్యర్థుల్లో ముగ్గురు, అంతకంటే ఎక్కువ మందిపై క్రిమినల్ కేసులున్నప్పుడు ప్రకటించే రెడ్ అలర్ట్‌ను 43 నియోజకవర్గాల్లో జారీ చేశారు. మూడో వంతు కోటీశ్వరులే మొత్తం అభ్యర్థుల్లో 392 మంది కోటీశ్వరులేనని వారు దాఖలు చేసిన అఫిడవిట్లు తెలియజేస్తున్నాయి. దక్షిణ గోవా బీజేపీ అభ్యర్థి పల్లవీ శ్రీనివాస్ డెంపో రూ.1,361 కోట్ల ఆస్తులతో టాప్‌లో ఉన్నారు. తర్వాత మధ్యప్రదేశ్ గుణ బీజేపీ అభ్యర్థి జ్యోతిరాదిత్య సింధియా రూ.424 కోట్లు, మహారాష్ట్రలో కొల్హాపూర్ కాంగ్రెస్ అభ్యర్థి ఛత్రపతి సాహు మహారాజ్ రూ.342 కోట్లతో రెండు, మూడో స్థానాల్లో ఉన్నారు. మూడో దశలో 82 మంది బీజేపీ అభ్యర్థుల్లో 77 మంది; 68 మంది కాంగ్రెస్ అభ్యర్థుల్లోనూ ఏకంగా 60 మంది కోటీశ్వరులే. జేడీ(యూ), శివసేన (ఉద్ధవ్), ఎన్సీపీ, ఆర్జేడీ, శివసేన, ఎన్సీపీ (శరద్ పవార్) అభ్యర్థులంతా కోటీశ్వరులే. ఐదుగురు అభ్యర్థులు తమకెలాంటి ఆస్తులూ లేవని పేర్కొనడం విశేషం. సగం మంది ఇంటర్ లోపే అభ్యర్థుల్లో 639 మంది విద్యార్హత ఆరో తరగతి నుంచి ఇంటర్ లోపే! 19 మందైతే ఏమీ చదువుకోలేదు. 56 మంది ఐదో తరగతి లోపే చదివారు. 591 మందికి డిగ్రీ, అంతకంటే ఉన్నత విద్యార్హతలు ఉన్నాయి. 44 మంది డిప్లొమా చేశారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Lok sabha elections 2024: బరిలో కుబేరులు
లోక్‌సభ ఎన్నికల బరిలో దిగుతున్న వారిలో కోట్లకు పడగలెత్తిన వారి సంఖ్య అనూహ్యంగా పెరుగుతోంది. ప్రధాన పార్టీల టికెట్లు దక్కించుకునేందుకు ధనబలం కూడా ప్రాతిపదికగా మారుతోంది. లోక్‌సభ ఎన్నికల్లో తొలి విడతలో బరిలో ఉన్న 1,625 మంది అభ్యర్థుల్లో ప్రతి ముగ్గురిలో ఒకరు కోటీశ్వరులేనని అసోసియేషన్ ఆఫ్ డెమొక్రటిక్ రైట్స్ (ఏడీఆర్) వెల్లడించింది. దేశవ్యాప్తంగా 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలో 102 లోక్‌సభ స్థానాల్లో ఏప్రిల్ 19న తొలి విడత పోలింగ్ జరగనుంది. బీజేపీ నుంచే ఎక్కువ... తొలి విడతలో మొత్తం 1,625 మంది అభ్యర్థుల్లో 450 మందికి రూ.కోటి, అంతకంటే ఎక్కువ ఆస్తులున్నాయి. జాబితాలో బీజేపీ నుంచి అత్యధికంగా 69 మంది ఉన్నారు. తర్వాతి స్థానాల్లో కాంగ్రెస్ (49 మంది), అన్నాడీఎంకే (35), డీఎంకే (21), బీఎస్పీ (18), టీఎంసీ (4), ఆర్జేడీ (4 మంది) ఉన్నాయి. అభ్యర్థుల సగటు ఆస్తులపరంగా అన్నాడీఎంకే టాప్‌లో ఉంది. ఈ పార్టీ అభ్యర్థులు ఒక్కొక్కరికి సగటున రూ.35.61 కోట్ల ఆస్తులున్నాయి. తొలి దశ అభ్యర్థుల్లో అత్యంత సంపన్నుడిగా మధ్యప్రదేశ్ మాజీ సీఎం కమల్‌నాథ్ కుమారుడు నకుల్‌నాథ్ నిలిచారు. అఫిడవిట్లో వెల్లడించిన ఆయన ఆస్తుల విలువ రూ.717 కోట్లు. ఛింద్వారా సిటింగ్ ఎంపీ అయిన ఆయన ఈసారి కూడా అక్కడినుంచే కాంగ్రెస్ అభ్యరి్థగా పోటీ చేస్తున్నారు. రెండో స్థానంలో తమిళనాడులోని ఈరోడ్ అభ్యర్థి అశోక్ కుమార్ ఉన్నారు. ఈ అన్నాడీఎంకే నేత తనకు రూ.662 కోట్ల ఆస్తులున్నట్టు పేర్కొన్నారు. 10 మంది స్వతంత్ర అభ్యర్థులు తమకు ఎలాంటి ఆస్తులూ లేవని ప్రకటించడం విశేషం! 93 మంది నేరచరితులు తొలి విడతలో బరిలో ఉన్న అభ్యర్థుల్లో నేరచరిత్ర కలిగిన వారి సంఖ్య కూడా ఎక్కువే. జాబితాలో బీజేపీ నుంచి 28 మంది, కాంగ్రెస్ నుంచి 19 మంది ఉన్నారు. తర్వాతి స్థానాల్లో డీఎంకే (13), అన్నాడీఎంకే (13), బీఎస్పీ (11), ఆర్జేడీ (4), ఎస్పీ (3), టీఎంసీ (2) ఉన్నాయి. వీరిలో బీజేపీ నుంచి 14 మందిపై తీవ్ర నేరపూరిత కేసులున్నాయి. ఈ జాబితాలో తర్వాతి స్థానాల్లో కాంగ్రెస్ (8), బీఎస్పీ (8), డీఎంకే (6), అన్నాడీఎంకే (6), ఆర్జేడీ (2), ఎస్పీ (2), టీఎంసీ (1) ఉన్నాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
మొదటి దశ అభ్యర్థులెందరు? క్రిమినల్స్‌తో పాటు కోటీశ్వరులెవరు?
2024 లోక్‌సభ ఎన్నికల మొదటి దశ పోలింగ్ ఏప్రిల్ 19న జరగనుంది. ఏడు దశల్లో జరిగే ఓటింగ్ ప్రక్రియ ఏప్రిల్ 19 నుండి ప్రారంభమై జూన్ ఒకటి వరకు కొనసాగనుంది. ఎన్నికల ఫలితాలను జూన్ 4న ప్రకటించనున్నారు. తొలి దశలో 21 రాష్ట్రాల్లోని మొత్తం 102 స్థానాలకు పోలింగ్ జరగనుంది. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) లోక్‌సభ ఎన్నికల మొదటి దశలోపోటీ చేసే అభ్యర్థుల పూర్తి వివరాలను అందించింది. ఏడీఆర్ నివేదిక ప్రకారం తొలి దశలో మొత్తం 1625 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 1,618 మంది అభ్యర్థుల అఫిడవిట్లను విశ్లేషించగా, ఏడుగురు అభ్యర్థుల అఫిడవిట్లు స్పష్టంగా లేనందున వాటిని విశ్లేషించలేకపోయినట్లు తేలిపింది. మొదటి దశ ఎన్నికల బరిలోకి దిగిన 1,618 మంది అభ్యర్థులలో 252 మందిపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయని ఏడీఆర్ తెలిపింది. 450 మంది అభ్యర్థులు కోటీశ్వరులు కాగా, ఈ అభ్యర్థుల సగటు సంపద రూ.4.51 కోట్లు. 1618 మంది అభ్యర్థుల్లో 161 మంది అభ్యర్థులపై తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉన్నాయి. 15 మంది అభ్యర్థులపై నేరారోపణలు ఉండగా, ఏడుగురు అభ్యర్థులపై హత్యకు సంబంధించిన కేసులు (ఐపీసీ-302) నమోదయ్యాయి. 18 మంది అభ్యర్థులపై మహిళలపై అఘాయిత్యాలకు సంబంధించిన కేసులు ఉన్నాయి. అలాగే ఉద్రేకపూరిత ప్రసంగాలతో ముడిపడిన కేసులలో చిక్కుకున్న 35 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. తొలి దశలో పోటీ చేసే 1618 మంది అభ్యర్థుల్లో 28 శాతం అంటే 450 మంది అభ్యర్థులు కోటీశ్వరులే. 77 మంది బీజేపీ అభ్యర్థుల్లో 69 మంది, 56 మంది కాంగ్రెస్ అభ్యర్థుల్లో 49 మంది, ఆర్జేడీ అభ్యర్థులు 36 మంది, ఏఐఏడీఎంకే అభ్యర్థుల్లో 35 మంది, డీఎంకే అభ్యర్థులు 22 మందిలో 21 మంది, తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థుల్లో నలుగురు, బీఎస్పీ అభ్యర్థుల్లో 86 మందిలో 18 మంది కోటీశ్వరులు. ఎన్నికల అఫిడవిట్లలో ఈ అభ్యర్థులు తమ ఆస్తుల విలువ కోటికి పైగా ఉన్నట్లు ప్రకటించారు. మొదటి దశలో ఒక్కో అభ్యర్థి సగటున రూ.4.51 కోట్ల ఆస్తులు కలిగి ఉన్నారు. తొలి దశలో అత్యధిక ఆస్తులను ప్రకటించిన అభ్యర్థి మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్ కుమారుడు నకుల్ నాథ్. చింద్వారా నుంచి కాంగ్రెస్ తరపున పోటీకి దిగిన ఇతని మొత్తం ఆస్తుల విలువ రూ.716 కోట్లు. ఈ జాబితాలో ఏఐఏడీఎంకేకు చెందిన అశోక్ కుమార్ రెండో స్థానంలో ఉన్నారు. తమిళనాడులోని ఈరోడ్ స్థానం నుంచి పోటీ చేస్తున్న కుమార్ తన అఫిడవిట్లో రూ.662 కోట్ల సంపద ఉన్నట్లు ప్రకటించారు. మూడవ అత్యంత సంపన్న అభ్యర్థి బీజేపీకి చెందిన దేవనాథన్ యాదవ్. తమిళనాడులోని శివగంగై స్థానం నుంచి పోటీ చేస్తున్న దేవనాథన్ ఆస్తుల విలువ రూ.304 కోట్లు. -
Rajasthan Elections 2023: కోట్లకు పడగలెత్తారు
సాక్షి, న్యూఢిల్లీ: రాజస్తాన్ అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగిన అభ్యర్థుల్లో ఏకంగా 35 శాతం మంది కోటీశ్వరులే! బరిలో నిలిచిన 1,875 మంది అభ్యర్థుల అఫిడవిట్లను విశ్షించి అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫారమ్స్ (ఏడీఆర్), రాజస్తాన్ ఎలక్షన్ వాచ్ ఈ మేరకు తేల్చాయి. వారి ఆస్తులు, క్రిమినల్ కేసుల వివరాలతో శనివారం నివేదిక విడుదల చేశాయి. బీజేపీ, కాంగ్రెస్‌ల్లో కోటీశ్వరులదే హవా ఏడీఆర్ నివేదిక ప్రకారం రాజస్తాన్‌లో బరిలో నిలిచిన అభ్యర్థుల్లో 651 (35%) మంది కోటీశ్వరులున్నారు. ప్రధాన పారీ్టలు కాంగ్రెస్, బీజేపీ కూడా వారికే ఎక్కువగా టికెట్లిచ్చాయి. మొత్తం 200 అసెంబ్లీ స్థానాకలు గాను బీజేపీ నుంచి 176 మంది, కాంగ్రెస్ నుంచి 167 మంది రూ.కోటికి మించి ఆస్తులు ప్రకటించారు. ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి 29 మంది, బీఎస్పీ నుంచి 36 మంది కూడా కోటీశ్వరులే. చురు కాంగ్రెస్ అభ్యర్థి రఫీక్ మండేలియా రూ.166 కోట్లతో అందర్లోనూ సంపన్నుడిగా నిలిచారు. రూ.123 కోట్లతో నీమ్ కా థానా బీజేపీ అభ్యర్థి ప్రేమ్ సింగ్ బజోర్ రెండో స్థానంలో ఉన్నారు. అయితే 8 అభ్యర్థులు తమకు ఒక్క రూపాయి ఆస్తి కూడా లేదని పేర్కొనడం విశేషం. 922 మంది తమకు అప్పులున్నట్టు వెల్లడించారు. ఇక 326 మంది అభ్యర్థులపై క్రిమినల్ కేసులున్నాయి. బీజేపీ 61 మందికి, కాంగ్రెస్ 47, ఆప్ 18, బీఎస్పీ 12 మంది నేర చరితులకు టికెట్లిచ్చాయి. క్రిమినల్ కేసులున్న ముగ్గురు, అంతకంటే ఎక్కువ మంది బరిలో ఉన్న రెడ్ అలర్ట్ నియోజకవర్గాలు రాష్ట్రంలో 45 ఉన్నాయి. 643 మంది, 34 శాతం మంది అభ్యర్థులు 25–40 ఏళ్ల మధ్య వయస్కులు. 80 ఏళ్ల పై చిలుకు అభ్యర్థులు 8 మంది ఉన్నారు. 183 మంది, అంటే 10 శాతం మంది పోటీలో ఉన్నారు. 137 మంది అభ్యర్థులు కేవలం అక్షరాస్యులు కాగా 11 మంది నిరక్షరాస్యులమని ప్రకటించారు. కోటీశ్వరుల్లో చాలామంది కోట్లలో అప్పు కూడా చూపించారు. -
రాష్ట్ర ఎమ్మెల్యేల్లో 106 మంది కోటీశ్వరులే!
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలోని ఎమ్మెల్యేల్లో 90శాతం అంటే 106 మంది కోటీశ్వరులేనని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) సంస్థ వెల్లడించింది. అధికార బీఆర్ఎస్కు చెందిన 101 మంది ఎమ్మెల్యేలలో 93 మంది (92%), ఏడుగురు ఎంఐఎం ఎమ్మెల్యేలలో ఐదుగురు (71%), ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలలో నలుగురు (67%), బీజేపీకి ఉన్న ఇద్దరు ఎమ్మెల్యేలు (100%), ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేల ఆస్తులు రూ.కోటి కంటే ఎక్కువేనని తెలిపింది. మొత్తంగా సిట్టింగ్ ఎమ్మెల్యేల సగటు ఆస్తులు రూ.13.57 కోట్లు అని వెల్లడించింది. పార్టీల వారీగా చూస్తే.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సగటు ఆస్తి రూ.14.11 కోట్లు, ఎంఐఎం ఎమ్మెల్యేల సగటు ఆస్తి రూ.10.84 కోట్లు, కాంగ్రెస్ ఎమ్మెల్యేల సగటు ఆస్తి రూ.4.22 కోట్లు, బీజేపీ ఎమ్మెల్యేల సగటు ఆస్తి రూ.32.61 కోట్లు, ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేల సగటు ఆస్తి రూ.4.66 కోట్లుగా తేల్చింది. రాష్ట్రంలో మొత్తం 119 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. అందులో కంటోన్మెంట్ అసెంబ్లీ సెగ్మెంట్ ఖాళీగా ఉంది. ఈ క్రమంలో మిగతా 118 నియోజకవర్గాల సిట్టింగ్ ఎమ్మెల్యేల ఆస్తులు, నేర చరిత్ర తదితర అంశాలపై 2018 ఎన్నికల సమయంలో దాఖలు చేసిన అఫిడవిట్ల ఆధారంగా ఏడీఆర్ సంస్థ శనివారం తమ నివేదికను విడుదల చేసింది. బహిష్కరణకు గురైన, పార్టీని వీడి ఇతర పార్టీలో చేరిక ఖరారుకాని ఇద్దరు ఎమ్మెల్యేలను స్వతంత్రులుగా చూపింది. పార్టీలు మారినవారు 16 మంది ఏడీఆర్ నివేదిక ప్రకారం.. తెలంగాణలో 2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత మొత్తం 16 మంది ఎమ్మెల్యేలు పార్టీలు మారారు. అందులో 12 మంది కాంగ్రెస్ నుంచి గెలిచినవారుకాగా, ఇద్దరు టీడీపీ నుంచి, ఒకరు ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ నుంచి గెలిచారు. వీరంతా బీఆర్ఎస్లో చేరారు. ఇక బీఆర్ఎస్ నుంచి గెలిచిన మల్కాజ్గిరి ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో చేరారు. గ్రాడ్యుయేట్లు 58 శాతమే.. రాష్ట్రంలోని మొత్తం ఎమ్మెల్యేలలో.. 43 మంది (36%) విద్యార్హత 5వ తరగతి నుంచి 12వ తరగతి మధ్య ఉంది. మరో 69 మంది (58%) గ్రాడ్యుయేషన్/ఆపై విద్యార్హత కలిగి ఉన్నారు. ఐదుగురు ఎమ్మెల్యేలు డిప్లొమా చేశారు. ఒక ఎమ్మెల్యే తాను సాధారణ అక్షరాస్యుడినని ప్రకటించుకున్నారు. ఎమ్మెల్యేల వయసును పరిశీలిస్తే.. 43 మంది (36%) వయసు 30 నుంచి 50ఏళ్ల మధ్య ఉండగా, 75 మంది (64%) వయసు 51 నుంచి 80 ఏళ్ల మధ్య ఉంది. మొత్తం 118 మంది ఎమ్మెల్యేల్లో ఆరుగురు (5%) మాత్రమే మహిళా ఎమ్మెల్యేలు ఉన్నారు. రూ.161 కోట్లతో మర్రి జనార్దన్‌రెడ్డి టాప్ అత్యధిక ఆస్తులున్న సిట్టింగ్ ఎమ్మెల్యేల జాబితాలో.. రూ.161 కోట్లతో నాగర్‌కర్నూల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి టాప్‌లో ఉన్నారు. తర్వాతి స్థానాల్లో రూ.91 కోట్లతో కందాల ఉపేందర్‌రెడ్డి (పాలేరు–బీఆర్ఎస్), రూ.91 కోట్లతో పైళ్ల శేఖర్‌రెడ్డి (భువనగిరి–బీఆర్ఎస్) నిలిచారు. మంత్రి కేటీఆర్‌కు రూ.41 కోట్లు ఆస్తులు, రూ.27 కోట్లు అప్పులు ఉండగా.. సీఎం కేసీఆర్‌కు రూ.23 కోట్లు ఆస్తులు, రూ.8కోట్లు అప్పులు ఉన్నట్లు గత అఫిడవిట్లలో చూపారు. బీఆర్ఎస్ను వీడి బీజేపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే ఈటల రాజేందర్ హుజూరాబాద్ ఉప ఎన్నిక సమయంలో చూపిన అఫిడవిట్ ప్రకారం ఆయన ఆస్తులు రూ.56 కోట్లు, అప్పులు రూ.8 కోట్లు కావడం గమనార్హం. యాకుత్‌పురా ఎమ్మెల్యే సయ్యద్ అహ్మద్ పాషాఖాద్రీ రూ.19 లక్షల విలువైన ఆస్తులతో రాష్ట్రంలో తక్కువ ఆస్తులున్న ఎమ్మెల్యేగా ఉన్నారు. రూ.కోటికిపైగా అప్పులున్న ఎమ్మెల్యేల జాబితాలో రూ.94 కోట్లతో కందాల ఉపేందర్‌రెడ్డి టాప్‌లో ఉన్నారు. తర్వాతి స్థానాల్లో రూ.63 కోట్లతో మర్రి జనార్దన్‌రెడ్డి, రూ.40 కోట్లతో దానం నాగేందర్ ఉన్నారు. సగానికిపైగా ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు రాష్ట్రంలో అన్నిపార్టీలు కలిపి ప్రస్తుతమున్న 118 మంది ఎమ్మెల్యేలకుగాను.. 72 మంది (61%)పై క్రిమినల్ కేసులు ఉన్నాయని.. ఇందులో బీఆర్ఎస్ వారే 59 మంది అని ఏడీఆర్ నివేదిక వెల్లడించింది. బీఆర్ఎస్కు ఉన్న 101 మంది ఎమ్మెల్యేల్లో ఇది 58శాతమని తెలిపింది. ఎంఐఎంకు చెందిన ఏడుగురు ఎమ్మెల్యేల్లో ఆరుగురిపై (86%), ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో నలుగురిపై (67%), బీజేపీకి చెందిన ఇద్దరు (100%) ఎమ్మెల్యేలపై, ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేల్లో ఒకరిపై (50%) క్రిమినల్ కేసులు ఉన్నట్టు వారు గత ఎన్నికల అఫిడవిట్లలో తెలిపారని వివరించింది. మొత్తంగా 46 మంది (39%) సిట్టింగ్ ఎమ్మెల్యేలపై తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉన్నాయని పేర్కొంది. అందులో బీఆర్ఎస్ వారు 38 మంది అని తెలిపింది. ఏడుగురు ఎమ్మెల్యేలపై హత్యాయత్నం, నలుగురిపై మహిళలపై నేరాలకు సంబంధించిన కేసులు ఉన్నాయని.. ఒక ఎమ్మెల్యేపై అత్యాచారానికి సంబంధించిన కేసు ఉందని వివరించింది. -
రాజస్తాన్‌లో 157 మంది ఎమ్మెల్యేలు కోటీశ్వరులు
సాక్షి, న్యూఢిల్లీ: త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న రాజస్తాన్ రాష్ట్రంలో 157 మంది ఎమ్మెల్యేలు కోటీశ్వరులు ఉన్నారు. వీరిలో అత్యధికంగా కాంగ్రెస్ పార్టీకి ఉన్న మొత్తం 108 ఎమ్మెల్యేల్లో 88 మంది, ప్రతిపక్ష పార్టీ బీజేపీకి ఉన్న 69 మంది ఎమ్మెల్యేల్లో 54 మంది, 14 మంది ఇండిపెండెంట్లలో 12 మంది ఎమ్మెల్యేలు కోటీశ్వరులని అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫారŠమ్స్(ఏడీఆర్) వెల్లడించింది. ధోడ్ (ఎస్సీ) నియోజకవర్గ సిట్టింగ్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పరశురామ్ మోర్దియా రూ.172 కోట్లతో అత్యధిక ఆస్తులు ఉన్న ఎమ్మెల్యేగా నిలిచారు. కాగా, చోరాసి(ఎస్టీ) నియోజకవర్గ భారతీయ ట్రైబల్ పార్టీకి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే రాజ్‌కుమార్ రూ.1.22 లక్షలతో రాష్ట్రంలో అతి తక్కువ ఆస్తిపరుడైన ఎమ్మెల్యేగా ఉన్నారు. రాష్ట్రంలోని మొత్తం 200 అసెంబ్లీ స్థానాలు ఉండగా, ప్రస్తుతం ఉదయ్‌పూర్ అసెంబ్లీ నియోజకర్గం ఖాళీగా ఉన్న నేపథ్యంలో 199 నియోజకవర్గాల ప్రస్తుత ఎమ్మెల్యేల ఆస్తులు, నేరచరిత్ర తదితర అంశాలపై సమీక్ష చేపట్టి శుక్రవారం నివేదిక విడుదల చేసింది. ఏడీఆర్ నివేదిక ప్రకారం రాజస్తాన్‌లో 2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఏడుగురు ఎమ్మెల్యేలు పార్టీలు మారారు. అందులో ఆరుగురు బీఎస్పీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరగా, ధోలాపూర్ ఎమ్మెల్యే శోభారాణి కుషా్వహాను బీజేపీ తమ పార్టీ నుంచి బహిష్కరించింది. కాగా, మొత్తం 199 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలలో 46 (23%) మంది తమపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు అఫిడవిట్లలో ప్రకటించారు. తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉన్నట్లు 28 (14%) సిట్టింగ్ ఎమ్మెల్యేలు ప్రకటించారు. పార్టీల పరంగా చూస్తే కాంగ్రెస్ పార్టీకి ఉన్న 108 మంది ఎమ్మెల్యేలలో 27 (25%) మంది, బీజేపీకి చెందిన 69 మంది ఎమ్మెల్యేల్లో 11 (16%) మంది, సీపీఎంలోని ఇద్దరు ఎమ్మెల్యేల్లో 2 (100%), 14 మంది స్వతంత్ర ఎమ్మెల్యేల్లో ఆరుగురు (43%) ఎమ్మెల్యేలు అఫిడవిట్లలో తమపై క్రిమినల్ కేసులను ప్రకటించారు. మొత్తం 199 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో 157 మంది (79%) కోటీశ్వరులు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి 88 (81%) మంది, బీజేపీ నుంచి 54 (78%) మంది, స్వతంత్ర ఎమ్మెల్యేల్లో 12 (86%) మంది కోటీశ్వరులుగా తమ ఆస్తులను ప్రకటించారు. ఒక్కో సిట్టింగ్ ఎమ్మెల్యే ఆస్తుల సగటు రూ.7.49 కోట్లుగా ఉంది. కాగా, కాంగ్రెస్‌లో ఒక్కో ఎమ్మెల్యే సగటు ఆస్తులు రూ.9.28 కోట్లు, బీజేపీలో ఒక్కో ఎమ్మెల్యే సగటు ఆస్తి రూ.5.45 కోట్లుగా ఉంది. అయితే మొత్తం ఎమ్మెల్యేల్లో 59 (30%) ఎమ్మెల్యేలు తమ విద్యార్హత 5 తరగతి నుంచి 12 తరగతి మధ్య ఉన్నట్లు ప్రకటించారు. 128 మంది (64%) ఎమ్మెల్యేలు గ్రాడ్యుయేట్ లేదా అంతకంటే ఎక్కువ విద్యార్హత కలిగి ఉన్నట్లు ప్రకటించారు. వయస్సు పరంగా చూస్తే 80 (40%) మంది ఎమ్మెల్యేలు తమ వయస్సు 25 నుంచి 50 సంవత్సరాల మధ్య ఉన్నట్లు, 119 (60%) మంది ఎమ్మెల్యేలు తమ వయస్సు 51 నుంచి 85 సంవత్సరాల మధ్య ఉన్నట్లు ప్రకటించారు. కాగా ఏడీఆర్ విశ్లేషించిన మొత్తం 199 ఎమ్మెల్యేల్లో 27 (14%) మంది మహిళా ఎమ్మెల్యేలు ఉన్నారు. -
తొలిసారి తగిలిన లాటరీ.. రైతులను కోటీశ్వరులను చేసిన టమాటా
సాక్షి, అమరావతి: ఒకప్పుడు కిలో టమాటాలను రూపాయి.. రెండు రూపాయలకు విక్రయించిన రైతులు అనూహ్యంగా లక్షాధికారులుగా మారారు. కొందరైతే కోటీశ్వరులయ్యారు కూడా. ఈ సీజన్లో టమాటా ధరలు పెరగడం రైతుల అదృష్టాన్ని మలుపు తిప్పింది. టమాటా ఎక్కువగా సాగయ్యే మహారాష్ట్రతో పాటు పలు రాష్ట్రాల్లో ఆకస్మిక వర్షాలతో పంటలు దెబ్బతినడంతో డిమాండ్‌కు సరిపడా ఉత్పత్తిలేక టమాటా ధరలు జాతీయ స్థాయిలో అనూహ్యంగా పెరిగాయి. మండీలలోనే కిలోకు సగటున రూ.130 నుంచి రూ.150 ధర లభించగా.. ఒక దశలో కిలో రూ.270 వరకు పలికింది. వ్యాపారులు పోటీపడి ధరలు పెంచడంతో రైతులకు మంచి లాభాలు వచ్చాయి. సుమారు 7 వేల మంది రైతులకు ప్రయోజనం రాష్ట్రంలో 1.50 లక్షల ఎకరాల్లో టమాటా సాగ వుతోంది. ఏటా ఖరీఫ్‌లో 60 శాతం, రబీలో 30 శాతం, వేసవిలో 10 శాతం విస్తీర్ణంలో సాగవుతుంది. వేసవి పంటను కర్ణాటక రాష్ట్రంలోని కోలార్, బెంగళూరు రూరల్ జిల్లాలతో పాటు ఏపీలోని చిత్తూరు, అన్నమయ్య, వైఎస్సార్ జిల్లాల్లో సాగు చేస్తుంటారు. ఏపీలో టమాటా రైతులు 70 వేల మంది ఉండగా, వారిలో 5–7 వేల మంది రైతులు మాత్రమే సుమారు 10 వేల ఎకరాల్లో వేసవి పంట సాగు చేస్తుంటారు. ఎకరాకు రూ.1.50 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు పెట్టుబడి అవుతుంది. సాధారణంగా సాగు చేస్తే 15 కోతలు, ట్రెల్లీస్ కింద సాగు చేస్తే 25–30 కోతలు వస్తుంది. హెక్టార్‌కు ఖరీఫ్‌లో 60 టన్నులు, రబీలో 65–70 టన్నులు, వేసవిలో 50–60 టన్నులు వస్తుంది. ఎకరాకు గరిష్టంగా రూ.25 లక్షలకు పైగా ఆదాయం గతేడాది వేసవి పంటకు కిలో రూ.100కు పైగా లభించడంతో ఈ ఏడాది అదే స్థాయిలో ధర లభిస్తుందన్న ఆశతో రైతులు వేసవి పంట సాగుకు మొగ్గు చూపారు. సాధారణంగా వేసవి పంట ఫిబ్రవరి–మార్చిలో వేస్తారు. కొద్దిమంది కాస్త ఆలస్యంగా మార్చి–ఏప్రిల్‌లో పంట వేశారు. ఈ వేసవిలో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతల వల్ల ఎకరాకు సగటున 15–20 టన్నుల వరకు దిగుబడి వచ్చింది. అనూహ్యంగా పెరిగిన ధర ల ఫలితంగా చిత్తూరు జిల్లాలో 2,500 మంది రైతులు, అన్నమయ్య జిల్లాలో 3,200 మంది రైతులు రికార్డు స్థాయి లాభాలను ఆర్జించారు. సగటున ఎకరాకు రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు ఆదాయం రాగా, కొంతమందికి ఎకరాకు రూ.25 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు కూడా ఆదాయం వచ్చింది. సుమారు 10–20 మంది రైతులు రూ.కోట్లలో ఆర్జించా రు. మదనపల్లెలో కిలోకు గరిష్టంగా రూ. 200 పలుకగా, కలికిరిలో రూ.245 పలికింది. ఇక అంగర మార్కెట్లో రూ.215 ధర వచ్చింది. రూ.3 కోట్లు మిగిలింది చిత్తూరు జిల్లా సోమల మండలం కరమండ గ్రామానికి చెందిన ఈ రైతు పేరు పెసలప్పగారి మురళి. 24 ఎకరాల్లో టమాటా సాగు చేశారు. ఎకరాకు 20 నుంచి 25 టన్నుల వరకు దిగుబడి వచ్చింది. పంట చేతికొచ్చే సమయంలో టమాటా ధర అనూహ్యంగా పెరిగింది. సగటున కిలో రూ.130 నుంచి రూ.150 వరకు ధర పలికింది. కేవలం 45 రోజుల్లోనే రికార్డు స్థాయిలో రూ.4 కోట్లకు పైగా ఆదాయం రాగా.. పెట్టుబడి పోనూ రూ.3 కోట్లకుపైగా మిగిలింది. ఈ సందర్భంగా మురళి మాట్లాడుతూ.. ‘నాలుగేళ్ల క్రితం 12 ఎకరాల్లో టమాటా సాగుచేసే వాడిని. ప్రభుత్వ ప్రోత్సాహంతో ప్రస్తుతం 24 ఎకరాల్లో పంట వేశా. ప్రభుత్వం 20 ఎకరాలకు సబ్సిడీపై డ్రిప్‌తోపాటు మల్చింగ్ షీట్స్ ఇచ్చింది. గతంలో విద్యుత్ సరఫరా సక్రమంగా ఉండేది కాదు. ప్రస్తుతం 9 గంటలు ఇస్తున్నారు. ఇటీవలే మా ప్రాంతంలో ట్రాన్స్ఫార్మర్ కాలిపోతే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దృష్టికి తీసుకెళ్లిన 4 గంటల్లోనే కొత్త ట్రాన్స్ఫార్మర్ వేశారు. టమాటా రైతులకు అండగా నిలుస్తున్న ప్రభుత్వానికి, మంత్రి పెద్దిరెడ్డికి రుణపడి ఉంటాం’ అని కృతజ్ఞతలు తెలిపారు. వినియోగదారులకు బాసటగా ప్రభుత్వం టమాటా ధరలు చుక్కలనంటడంతో ప్రభుత్వం జోక్యం చేసుకుని వినియోగదారులకు బాసటగా నిలిచింది. రైతుల నుంచి సగటున కిలో రూ.107.49 చొప్పున రూ.14.65 కోట్ల విలువైన 1,363 టన్నులు సేకరించి రైతుబజార్ల ద్వారా కిలో రూ.50కే సబ్సిడీపై వినియోగదారులకు అందించింది. బుధవారం కూడా కిలో రూ.83 చొప్పున రూ.16.60 లక్షలతో 20 టన్నులు సేకరించి సబ్సిడీపై పంపిణీ చేసింది. ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో కిలో రూ.80 నుంచి రూ.125 మధ్య ధర పలుకుతుంటే రైతుబజార్లలో రూ.70 నుంచి రూ.84 మధ్య పలుకుతున్నాయి. అప్పులన్నీ తీర్చేశా రెండెకరాల్లో 15 ఏళ్లుగా టమాటా సాగు చేస్తున్నా. దిగుబడులు ఘనంగా వచ్చినా మార్కెట్లో ధరలు అంతంతమాత్రంగానే ఉండేవి. పెట్టుబడి పోనూ ఆదాయం పొందిన సందర్భాలు చాలా తక్కువ. ఈ ఏడాది ఫిబ్రవరిలో పంట వేశా. దిగుబడుల కోసం అధికంగా ఎరువులు వినియోగించడం వల్ల రూ.8 లక్షల వరకు పెట్టుబడి అయ్యింది. మే 20 నుంచి ఇప్పటిæవరకు 23 కోతలు కోశాను. పెట్టుబడి ఖర్చులు పోనూ రూ.36 లక్షల వరకు ఆదాయం పొందాను. ఈ ఏడాది టమాటాకు వచ్చిన ధర గతంలో ఎప్పుడూ లేదు. ఈ ఆదాయంతో మాకున్న అప్పులన్నీ తీర్చేశా. – వెంకటేష్ రాయల్, చిప్పిలి, మదనపల్లె -
‘డాలర్ మిలియనీర్ల విదేశీ వలసలు తగ్గుతున్నాయి’
ఇండియా నుంచి పది లక్షల డాలర్ల (మిలియన్) మించిన సంపద ఉన్న ధనికులు పెట్టుబడులతో విదేశాలకు తరలిపోవడం క్రమంగా పెరుగుతోందని కిందటేడాది ఆందోళన వ్యక్తమైంది. నిజమే, కొత్తగా కోట్లాది రూపాయలు సంపాదించిన తెలివైన భారతీయులు స్వదేశం విడిచి ఆస్ట్రేలియా, సింగపూర్, దుబాయ్, పోర్చుగల్, స్పెయిన్ వంటి దేశాలకు తరలిపోవడం ఎవరికైనా మొదట దిగులు పుట్టిస్తుంది. కష్టపడి వ్యాపారాల ద్వారా సంపాదించిన వ్యక్తులు మిలియన్ డాలర్ల విలువైన ఆస్తులు పోగేసుకున్న తర్వాత కూడా తమకు అనుకూలంగా కనిపించే దేశాలకు పెట్టుబడుల ద్వారా వలసపోవడానికి అనేక కారణాలుంటాయి. తమ ఆర్జనపైన, విదేశాల్లో పెట్టే పెట్టుబడుల నుంచి వచ్చే ఆదాయాలపైన భారత ప్రభుత్వం విధించే పన్నులు సబబుగా, హేతుబద్ధంగా లేవనే కారణంతో కొందరు పైన చెప్పిన డాలర్ మిలియనీర్లు విదేశాలకు వలసపోతుంటారు. మరి కొందరు మిలియనీర్లు ఇక్కడ కన్నా మెరుగైన సామాజిక జీవనశైలి సాధ్యమని భావించిన దేశాలకు పోయి స్థిరపడుతుంటారు. ఇలా రకరకాల కారణాలతో కొద్ది మంది కొత్త కోటీశ్వరులు ఇండియా నుంచి బయటకు పోతున్నారు. వలసపోయే మిలియనీర్ల సంఖ్య తగ్గడం శుభవార్తే! 2022లో దేశం నుంచి మిలియన్ డాలర్ల సంపన్నులు 7,500 మంది విదేశాలకు తరలిపోయారు. కాని, ఇలా విదేశాల్లో పెట్టుబడులు పెట్టడానికి బయటకు పోతున్న సంపన్నులను ఆకట్టుకోవడానికి భారత ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల ఫలితంగా 2023లో ఇలాంటి ధనికుల సంఖ్య 6,500కు తగ్గుతుందని అంచనా. ఇలాంటి పెట్టుబడి వలసలపై ప్రపంచవ్యాప్తంగా అధ్యయనం చేసే లండన్ కు చెందిన హెన్లీ అండ్ పార్టనర్స్ సంస్థ విడుదల చేసిన వివరాలు పై విషయాలను వెల్లడిస్తున్నాయి. ఇండియా వదిలిపోవాలనుకునే భారత సంపన్నుల్లో ఎక్కువ మంది ఇష్టపడే దేశం ఆస్ట్రేలియా. తర్వాత స్థానం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో ఒకటైన దుబాయి. ఇప్పటికే దుబాయి మాదిరిగానే భారత సంతతి ప్రజలున్న సింగపూర్ పోయి స్థిరపడానికి కూడా కొందరు భారతీయులు ఉత్సాహపడుతున్నారని హెన్లీ అండ్ పార్టనర్స్ సర్వే చెబుతోంది. ఆస్ట్రేలియాలో 2023లో పెట్టుబడులతో వచ్చి స్థిరపడే విదేశీయులు గరిష్ఠంగా 5,200 వరకూ ఉండొచ్చని అంచనా వేశారు. డాలర్ మిలియనీర్ల వలసల్లో చైనాదే ప్రథమ స్థానం! 20వ శతాబ్దంలో 1978 నుంచీ ఆర్థిక సంస్కరణలు అమలు చేసిన చైనా, 1991 నుంచీ పేదరికం నిర్మూలించి, సంపద సృష్టించడానికి కొత్త మార్గంలో ప్రయాణం మొదలెట్టిన ఇండియాలో కొత్త ఐడియాలతో, వినూత్న పరిశ్రమతో కొత్త డాలర్ మిలియనీర్లు ఏటా గణనీయ సంఖ్యలో పుట్టుకొస్తున్నారు. ఆర్థిక వ్యవస్థ సైజులో పెద్దదైన చైనా ఇలాంటి వలసల విషయంలో కూడా ప్రపంచంలో మొదటిస్థానంలో ఉంది. 2023లో చైనా నుంచి 13,500 మంది కోటీశ్వరులు ఇతర దేశాలకు వలసపోతారని భావిస్తున్నారు. 2022లో ఈ సంపన్నుల సంఖ్య 10,800 మాత్రమే. అంటే ఏటా చైనా నుంచి బయటకు పోయే కొత్త ధనికుల (పది లక్షల అమెరికన్ డాలర్లకు మించిన సంపద ఉన్న హైనెట్ వర్త్ ఇండివిడ్యువల్స్) సంఖ్య పెరుగుతుండగా ఇండియాలో వారి సంఖ్య తగ్గుముఖం పట్టడం విశేషం. ఆరో అతిపెద్ద ఆర్థిక శక్తి ఇంగ్లండ్ నుంచి కూడా డాలర్ మిలియనీర్లు చెప్పుకోదగ్గ సంఖ్యలో విదేశాలకు తరలిపోతున్నారట. ఇంకా ఈ తరహా దేశాల్లో రష్యా, బ్రెజిల్ కూడా ఉన్నాయి. భారతదేశానికి సంబంధించి సంపన్నుల విదేశీ వలసల విషయంలో శుభపరిణామం ఏమంటే–ఇండియాలో మెరుగవుతున్న ఆర్థిక,సామాజిక పరిస్థితులను, అవకాశాలను దృష్టిలో పెట్టుకుని అనేక మంది భారతీయులు విదేశాల నుంచి వెనక్కి వచ్చి స్వదేశంలో స్థిరపడుతున్నారు. వారి సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతోంది. ప్రపంచంలో ఏకైక అగ్రరాజ్యం, అవకాశాల స్వర్గంగా భావించే అమెరికా నుంచి కూడా మిలియనీర్లు ఇతర దేశాలకు వలసపోవడం సాధారణ విషయంగా నేడు మారిపోయింది. - విజయసాయిరెడ్డి, వైఎస్సార్సీపీ, రాజ్యసభ ఎంపీ. -
Tripura Assembly Election: 45 మంది కోటీశ్వరులు, 41 మందిపై క్రిమినల్ కేసులు
అగర్తాలా: త్రిపుర అసెంబ్లీకి ఈ నెల 16న జరగనున్న ఎన్నికల్లో పోటీ చేస్తున్న 259 మంది అభ్యర్థుల్లో 45 మంది కోటీశ్వరులని, 41 మంది క్రిమినల్ కేసులున్నాయని అసోసియేషన్ ఫర్ డెమొక్రాటిక్ రిఫార్మ్స్(ఏడీఆర్) నివేదిక వెల్లడించింది. కోటీశ్వరుల్లో అధికార బీజేపీకి చెందిన అభ్యర్థులు 17 మంది ఉంటే, టిప్రామోతాకి చెందిన వారు తొమ్మిది మంది, సీపీఐ(ఎం) అభ్యర్థులు ఏడుగురు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఆరుగురు కోట్లకు పడగలెత్తితే, తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన వారు నలుగురు ఉండగా, ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు కూడా కోటీశ్వరులేనని ఆ నివేదిక చెప్పింది. త్రిపుర ఉప ముఖ్యమంత్రి జిష్ణు దేవ్ వర్మ రూ.15.58 కోట్ల ఆస్తులతో అత్యంత ధనికుడిగా ఉంటే రూ.13.90 కోట్ల ఆస్తిపాస్తులతో రాష్ట్ర ముఖ్యమంత్రి , డాక్టర్ కూడా అయిన మాణిక్ సాహ నిలిచారు. ఇక 41 మంది అభ్యర్థులు తమపై క్రిమినల్ కేసులున్నాయని అఫిడివిట్లో దాఖలు చేశారు. ఇక కాంగ్రెస్ పార్టీకి చెందిన 13 మంది అభ్యర్థుల్లో ఏకంగా ఏడుగురిపై క్రిమినల్ కేసులున్నాయి. -
భారత్‌లో అపర కుబేరులున్న ప్రాంతం ఇదే..ఒక్కొక్కరి వద్ద ఎంత డబ్బు ఉందంటే!
దేశ వ్యాప్తంగా పేదరికం,ద్రవ్యోల్బణం, ఆకలి కేకలు తీవ్ర స్థాయిలో ఉన్నాయి. ఫలితంగా సామాన్యులు జానెడు పొట్ట నింపుకునేందుకు పడరాని పాట్లు పడుతుంటే..ధనికుడు మరింత ధనికుడవుతున్నాడు. ఇటీవల ఇన్వెస్ట్మెంట్ మైగ్రేషన్ అడ్వైజరీ సంస్థ హెన్లీ & పార్ట్నర్స్ విడుదల చేసిన ప్రపంచ దేశాల సెంటీ మిలియనీర్ల జాబితాలో భారత్ 3 స్థానాన్ని సంపాదించుకుంది. హెన్లీ నివేదిక ప్రకారం..ఒక వ్యక్తి వద్ద రూ. 830 కోట్లు, అంతకంటే ఎక్కువ ఉండటాన్ని సెంటీ మిలియనీర్లుగా పరిగణలోకి తీసుకుంది. వరల్డ్ వైడ్‌గా ఈ సెంటీ మిలియనీర్లు 25,490 మంది ఉండగా ఒక్క భారత్‌లోనే 1132 మంది ఉన్నారు. వెరసీ యూకే, రష్యా, స్విట్జర్లాండ్ వంటి దేశాలను అధిగమించి సూపర్ రిచ్ టెక్ టైటాన్స్, ఫైనాన్షియర్లు, బహుళజాతి సీఈఓలు, వారసులు వేగంగా అభివృద్ధి చెందుతున్న, శక్తివంతమైన జాబితాలో భారతీయులు నిలిచారు. ఏ దేశంలో ఎంత మంది ఉన్నారంటే పైన పేర్కొన్నట్లుగా ప్రపంచ వ్యాప్తంగా 25,490మంది సెంటీ మిలియనీర్లు ఉండగా వారిలో భారతీయులు 1132 మంది, కెనడాలో (514) , జర్మనీలో (966), రష్యాలో (435), చైనాలో (2,021), జపాన్‌లో (765), అమెరికాలో (9,730), యూకేలో (968), స్విట్జర్లాండ్‌లో (808), ఆస్ట్రేలియాలో (463) మంది ఉన్నారు. ఏ సిటీల్లో ఎంతమంది ఉన్నారంటే సెంటీ మిలియనీర్లు భారత్‌కు చెందిన ముంబైలో 243 మంది, అమెరికా న్యూయార్క్ నగరంలో (737), అమెరికా కాలిఫోర్నియా రాష్ట్రం లాస్ ఏంజెలెస్ నగరంలో (393), చైనా రాజధాని బీజింగ్‌లో (363), చైనాలోని అతిపెద్ద నగరం, ఫైనాన్షియల్ హబ్ షాంఘైలో (350), ఇంగ్లండ్ రాజధాని లండన్‌లో (406), శాన్ప్రాన్స్సిస్కో బే ఏరియాలో (623), స్విట్జర్లాండ్ దేశం జెనీవా నగరంలో (345), అమెరికాకు చెందిన రాష్ట్రాల్లో అత్యధిక జనాభా ఉన్న చికాగోలో (340), సింగపూర్‌లో (336), అమెరికా హూస్టన్ నగరంలో (314), చైనా పరిపాలన విభాగ ప్రాంతం హాంగ్ కాంగ్ నగరంలో (280), రష్యా రాజధాని మాస్కోలో (269), జపాన్ రాజధాని టోక్యోలో (263), స్విట్జర్లాండ్ దేశం జురిచ్ నగరంలో (258) ఉన్నారు. సెంటీ మిలియనీర్లు పెరుగుతున్న మార్కెట్ శాతం ఎంతంటే ప్రపంచ దేశాల్లో సెంటీ మీలియనీర్లు పెరుగుతున్న మార్కెట్ శాతాన్ని హెన్లీ నివేదిక వెలువరించింది. అందులో వియాత్నంలో సెంటీమిలియనీర్ల గ్రోత్‌రేటు 95శాతం, భారత్‌లో 80 శాతం, మారిషస్‌లో 75 శాతం, న్యూజిల్యాండ్‌లో 72 శాతం, ఈస్ట్ ఆఫ్రికా రువాండాలో 70 శాతం, ఉగాండాలో 65 శాతం, ఆస్ట్రేలియాలో 60 శాతం, పోలాండ్‌లో 58 శాతం, యూరప్ దేశం మాల్టాలో 56 శాతం, కెన్యాలో 55 శాతం, స్విట్జర్ ల్యాండ్‌లో 54 శాతం, చైనాలో 53 శాతం, యూఏఈలో 52 శాతం, మోనాకోలో 50 శాతం, ఇజ్రాయిల్‌లో 50 శాతంతో సెంటీ మీలియనీర్లు మార్కెట్ వృద్ధి చెందుతున్నట్లు తేలింది. చదవండి👉 ఆకాష్ అంబానీ మాస్టర్ ప్లాన్ అదిరింది, జియో యూజర్లకు బంపరాఫర్ -
ఓ కుటుంబాన్ని కోటిశ్వరులుగా మార్చిన ప్లవర్‌వేజ్
ఒక్కోసారి అదృష్టం ఏ రూపంలో వస్తుందో ఎవరూ ఊహించలేరు. మన దగ్గర ఉన్నవాటి నుంచే అదృష్టం తలుపుతడుతుందని కూడా అనుకోం. ఒక్కోసారి చాలా వింతగా అనుకోను కూడా అనుకోని, ఊహించని సంఘటనలు ఎదరువుతుంటాయి. ఇలాంటి సంఘటనల కారణంగానే మన కళ్లముందు అప్పటి వరకు చాలా సాదాసీదాగా ఉన్నవాడు ఒక్కసారిగా రాత్రికి రాత్రే స్టార్ అయ్యిపోతుంటాడు. అలాంటి వారిని ఇప్పటి వరకు ఎంతోమందిని చూసుంటాం. కానీ ఇంట్లో వృద్ధాగా పడి ఉన్న ఒక ఫ్లవర్ వేజ్ ఒక కుటుంబాన్ని కోటిశ్వరుణ్ణి చేసిందంటే నమ్మగలరా!.ఔను నిరుపయోగంగా ఒక మూలన పడి ఉన్న ప్లవర్ వేజ్ ఓ కుటుంబం తలరాతని మార్చేసింది. వివరాల్లోకెళ్తే...యూకేలోని మిడ్‌ల్యాండ్స్‌లో నివసిస్తున్న ఒక కుటుంబం 1980లలో ఒక ప్లవర్ వేజ్ జాడీని కొనుగోలు చేశారు. ఐతే వాళ్లు దాన్ని ఇంట్లో అలంకరణ వస్తువుగా కొన్నేళ్లు ఉపయోగించారు. కాలక్రమేణ పగుళ్లు రావడంతో దాన్ని వంటగదిలో ఓ మూలన పెట్టేశారు. ఆ ప్లవర్ వేజ్‌ని వాడడం మానేసి చాలా ఏళ్లయ్యింది. ఐతే అనుకోకుండా ఒక రోజు వారింటికి వచ్చిన ఓ ఆర్కియాలజిస్ట్ దృష్టిలో ఆ ప్లవర్ వేజ్ పడింది. ఆయన ఆ ప్లవర్ వేజ్ జాడీ విశిష్టత గురించి వివరించి చెప్పాడు. ఇది నీలిరంగులో ఉన్న వెండి, గోల్డ్‌తో తయారు చేయబడిన పాత్ర అని చెప్పాడు. ఇది 18వ శతాబ్దపు రాజు కియాన్లాంగ్ కాలంలో ఉపయోగించేవారని ఆ పాత్రపై ఉన్న ఆరు అక్షరాల ముద్ర ద్వారా తెలియజేశాడు. అంతేకాదు ఈ రాజరికపు ప్లవర్ వేజ్ జాడీతో బంగారం, వెండికి సంబంధించిన పనులు చేసేవారని తెలుసుకుని ఆ కుటుంబం ఆశ్చర్యపోయింది. దీనిపై ఎనిమిది అమర చిహ్నాలు ఉన్నాయని, అవి దీర్ఘాయువును శ్రేయస్సును సూచిస్తుందని ఆ నిపుణుడు వివరించాడు. ప్రస్తుతం ఈ జాడి ధర రూ. 1 కోటి 44 లక్షల రూపాయల వరకు పలుకుతుందని కూడా చెప్పాడు. ఈ విషయం తెలుసుకున్న ఒక చైనా ధనవంతుడు ఆ ఫ్లవర్ వేజ్ జాడీని 1.2 మిలియన్ పౌండ్లకు (దాదాపు రూ.11 కోట్ల 53 లక్షలు) కొనుగోలు చేశాడు. అంతేగాదు తమ వంశీయులు పోగొట్టుకున్న వారసత్వ సంపదను తిరిగి పొందినందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పాడతను. (చదవండి: బోనులో ఉన్న సింహంతో పరాచకాలు ఆడాడు...ముచ్చెమటలు పట్టించేసిందిగా: వీడియో వైరల్) -
భారత్‌కు బైబై!! సర్వేలో ఆసక్తికర విషయాలు!
మనదేశంలో అత్యంత సంపన్నుడు ఎవరు అంటే? ముఖేష్ అంబానీ అనే సమాధానం ఠక్కున వినిపిస్తుంది. ఆయన ఆస్తి లక్షల కోట్లలో ఉంటే..అంబానీ తరువాత సంపన్నులుగా ఎవరెవరు ఉన్నారు. వాళ్ల ఆస్తుల విలువ ఎంత? రానున్న రోజుల్లో భారత్‌లో సంపన్నుల సంఖ్య పెరుగుతుందా? ధనవంతులు వారి పిల్లల్ని ఎక్కడ చదివించాలని అనుకుంటున్నారు. వాళ్లు ఏ బ్రాండ్ కార్లను వినియోగిస్తున్నారు. ఇలా ధనవంతుల స్థితిగతులు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తుంటుంది చైనాకు చెందిన హురున్ ఇనిస్టిట్యూట్. అందుకు సంబంధించి రిపోర్ట్‌లను విడుదల చేస్తుంది. తాజాగా హురున్ ఇండియా వెల్త్ రిపోర్ట్ - 2021 పలు ఆసక్తికర విషయాల్ని వెలుగులోకి తెచ్చింది. హురున్ నిర్వహించిన ఓ సర్వేలో పాల్గొన్న 70శాతం మంది ధనవంతులు తమ పిల్లల్ని విదేశాల్లో చదివించేందుకు ఇష్టపడుతున్నట్లు తేలింది. హురున్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ 350 మంది భారతీయ మిలియనీర్లపై సర్వే నిర్వహించింది. ఆ సర్వేలో ఒక్కో భారతీయ ధనవంతుడి వ్యక్తిగత సంపద రూ.7 కోట్లకు సమానంగా ఆస్తులు ఉన్నట్లు తెలిపింది. వారిలో 12శాతంతో 42మంది అత్యంత ధనవంతులుగా ఉండగా వారి నికర ఆస్తుల విలువ రూ.100 కోట్లు. వారి సగటు వయస్సు 35 సంవత్సరాలు. ఇక వారి పిల్లల్ని విదేశాల్లో చదివించాలని భావిస్తున్నట్లు హురున్ రిపోర్ట్‌లో పేర్కొంది. అందులో యూఎస్(29 శాతం), యునైటెడ్ కింగ్డమ్ (19 శాతం), న్యూజిలాండ్ (12 శాతం), జర్మనీ (11%) మంది పిల్లల్ని పంపేందుకు ఇష్టపడుతున్నారు. ధనవంతులు వినియోగించే కార్లలో నాలుగింట ఒక వంతు మంది మూడేళ్లలోపు కార్లను మార్చారు. మెర్సిడెస్ బెంజ్ అత్యంత ప్రజాదరణ పొందిన లగ్జరీ కార్ బ్రాండ్. తర్వాత రోల్స్ రాయిస్, రేంజ్ రోవర్ ఉన్నాయి. లంబోర్ఘిని అత్యంత ప్రజాదరణ పొందిన లగ్జరీ స్పోర్ట్స్ కార్లను వినియోగిస్తున్నట్లు తేల్చింది. -
సంపద పెరిగింది.. సంతోషం తగ్గింది!
ముంబై: దేశీయంగా డాలర్ మిలియనీర్ల (రూ. 7 కోట్ల పైగా వ్యక్తిగత సంపద ఉన్న వారు) సంఖ్య 2021లో 4.58 లక్షల కుటుంబాల స్థాయికి చేరింది. అంతక్రితం సంవత్సరంతో పోలిస్తే ఇది 11 శాతం అధికం. హురున్ రిపోర్ట్ రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం 2026 నాటికి భారత్‌లో డాలర్ మిలియనీర్ల సంఖ్య 30 శాతం పెరిగి 6 లక్షల కుటుంబాల స్థాయికి చేరనుంది. ముంబైలో అత్యధికంగా 20,300 కుటుంబాలు, ఢిల్లీలో 17,400, కోల్‌కతాలో 10,500 కుటుంబాలు డాలర్ మిలియనీర్ల కేటగిరీలో ఉన్నాయి. మరోవైపు, ఇటు వ్యక్తిగత అటు వృత్తిగత జీవితాల్లో సంతోషంగా ఉన్న వారి సంఖ్య మాత్రం 72 శాతం నుంచి 66 శాతానికి తగ్గింది. ఈ అంశానికి సంబంధించి హురున్ నిర్వహించిన సర్వేలో 350 మంది డాలర్ మిలియనీర్లు పాల్గొన్నారు. ‘భారత మార్కెట్లో అడుగు పెట్టడానికి లేదా ఇప్పటికే ఉన్న తమ కార్యకలాపాలను మరింత పటిష్టం చేసుకోవడానికి లగ్జరీ బ్రాండ్లు, సర్వీస్ ప్రొవైడర్లకు వచ్చే దశాబ్ద కాలంలో ఎన్నో అర్థవంతమైన అవకాశాలు లభించగలవు‘ అని హురున్ ఇండియా ఎండీ, చీఫ్ రిసర్చర్ అనాస్ రెహ్మాన్ జునైద్ చెప్పారు. 130 కోట్ల పైగా జనాభా గల దేశంలో ఆర్థిక అసమానతలు పెరిగిపోతున్నాయంటూ ఆందోళనలు వ్యక్తమవుతున్న ప్రస్తుత తరుణంలో కుబేరులపై హురున్ నివేదికలోని అంశాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. స్వచ్ఛంద సంస్థ ఆక్స్‌ఫామ్ ఇటీవలి నివేదిక ప్రకారం భారత్‌లోని టాప్ 100 మంది సంపన్నుల సంపద ఏకంగా 775 బిలియన్ డాలర్లుగా ఉంది. 2021లో ప్రపంచం మొత్తం మీద కడు పేదరికంలోకి జారిపోయే వారి సంఖ్యలో దాదాపు సగభాగం (4.6 కోట్ల మంది) భారత్‌లోనే ఉంటారని ఆక్స్‌ఫామ్ అంచనా వేసింది. సర్వేలోని ఇతర విశేషాలు.. ► పన్నులు చెల్లించడమనేది తమ సామాజిక బాధ్యతకు నిదర్శనంగా భావించే వారి సంఖ్య.. సర్వేలో పాల్గొన్న వారిలో మూడో వంతుకన్నా తక్కువే ఉంది. ► సమాజానికి ఎంతో కొంత తిరిగి ఇవ్వాలని అభిప్రాయపడిన వారి సంఖ్య కేవలం 19 శాతమే. ► మూడింట రెండొంతుల మంది తమ సంతానాన్ని ఉన్నత విద్య కోసం విదేశాలు పంపించేందుకు ప్రాధాన్యమిస్తామని చెప్పారు. ఫేవరెట్ గమ్యంగా అమెరికా ఉండగా, బ్రిటన్, న్యూజిలాండ్, జర్మనీ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. ► ఇక వినియోగంపరమైన అంశాల విషయానికొస్తే.. నాలుగో వంతు మంది తమ కార్లను ప్రతి మూడేళ్లకోసారి మార్చేస్తున్నారు. చాలా మందికి మెర్సిడెస్ బెంజ్ కార్లు ఫేవరెట్‌గా ఉంటున్నాయి. ఇంకా మిలియనీర్లకు అత్యంత ఇష్టమైన హాబీల్లో.. వాచీల కలెక్షన్ కూడా ఉంది. సర్వేలో పాల్గొన్న మూడింట రెండొంతుల మంది.. తమ దగ్గర కనీసం నాలుగు వాచీలైనా ఉన్నట్లుగా తెలిపారు. మళ్లీ వీటిలో రోలెక్స్ అత్యంత ఇష్టమైన బ్రాండ్‌గా ఉంది. ► ఆతిథ్యానికి సంబంధించి అత్యధిక శాతం మంది ఇష్టపడే హోటల్‌గా ఇండియన్ హోటల్స్‌కి చెందిన తాజ్, ఫేవరెట్ ఆభరణాల రిటైలర్‌గా తనిష్క్ (రెండూ టాటా గ్రూప్‌నకు చెందివే) అగ్రస్థానంలో ఉన్నాయి. లగ్జరీ ఉత్పత్తుల బ్రాండ్ లూయి విటన్, ప్రైవేట్ జెట్ బ్రాండ్ గల్ఫ్‌స్ట్రీమ్.. అత్యధిక శాతం మంది డాలర్ మిలియనీర్లకు ఫేవరెట్‌గా ఉన్నాయి. ► చెల్లింపుల కోసం యూపీఐని ఉపయోగిస్తున్న డాలర్ మిలియనీర్ల సంఖ్య 2021లో రెట్టింపై 36 శాతానికి చేరింది. -
పాపం.. మిలియనీర్ల పుట్టి ముంచుతున్న బిట్‌కాయిన్
Bitcoin Crash Effect Thousands Of Investors Vanished: బిట్‌కాయిన్.. క్రిప్టోకరెన్సీలో అత్యంత విలువైంది. దీని దరిదాపుల్లో మరే కరెన్సీ లేకపోవడం గమనార్హం. ఏళ్ల తరబడి వీటికి నమ్ముకున్న వాళ్లకు అదృష్టం కలిసొచ్చి.. ఇప్పుడు విపరీతమైన లాభాలు తెచ్చిపెడుతోంది. ఇప్పటివరకు బాగానే ఉన్నా.. ఈ మధ్యకాలంలో పరిణామాలతో బిట్‌కాయిన్‌కు బ్యాడ్ టైం స్టార్ట్ అయ్యింది!. ప్రస్తుతం ఇది చేస్తున్న నష్టం మాత్రం మామూలుగా ఉండడం లేదు. సుమారు 30 వేలమంది బిట్‌కాయిన్ మిలియనీర్లు క్రిప్టో మార్కెట్ నుంచి పూర్తిగా కనుమరుగు అయిపోయారు. కారణం.. గత మూడు నెలల్లో బిట్‌కాయిన్ డిజిటల్ మార్కెట్లో జరుగుతున్న పరిణామాలు. నవంబర్‌లో 69,000 డాలర్లుగా ఉన్న బిట్‌కాయిన్ విలువ తాజాగా(గురువారం) 36,000 డాలర్లకు చేరుకుంది. క్రిప్టోకరెన్సీపై పలు దేశాల నియంత్రణ పరిశీలన, భౌగోళిక రాజకీయ అశాంతి, అల్లకల్లోలం అవుతున్న మార్కెట్లు, కరోనా పరిస్థితుల వల్లే ఇదంతా అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఫిన్బోల్డ్ అనే పోర్టల్ సమాచారం ప్రకారం.. అక్టోబర్ నుంచి జనవరి మధ్య 1 మిలియన్ డాలర్ కంటే ఎక్కువ ఉన్న బిట్‌కాయిన్ కలిగి ఉన్న వాలెట్లు 28,186( 24.26 శాతం) తగ్గాయి. ముఖ్యంగా ఈ మూడు నెలల్లో గతంలో బిట్‌కాయిన్ ద్వారా ధనవంతులైన ఎంతో మంది.. భారీ నష్టంతో బికారీలుగా మారిపోయారు. అంతేకాదు ‘‘1,00,000డాలర్లు కంటే ఎక్కువ ఉన్న వాలెట్లు 30.04 శాతం పడిపోయి 505,711 నుండి 353,763కి చేరుకున్నాయి. ఒక మిలియన్ డాలర్, అంతకు మించి ఉన్నవి 105,820 నుండి 80,945కి 23.5 శాతం పడిపోయి 80,945కి పడిపోయింది. 10 మిలియన్ల డాలర్లు.. అంతకంటే ఎక్కువ ఉన్న వాలెట్లు కూడా 32.08 శాతం తగ్గి 10,319 నుండి 7,008కి పడిపోయాయి’’ అని ఫిన్బోర్డ్ నివేదిక పేర్కొంది. అయితే పెరుగుతున్న ద్రవ్యోల్బణానికి వ్యతిరేకంగా రక్షణగా బిట్‌కాయిన్‌ను అభివర్ణిస్తున్నారు కొందరు ఆర్థిక నిపుణులు. బిట్‌కాయిన్ చేస్తున్న డ్యామేజ్‌ను పరిగణనలోకి తీసుకోవద్దని చెప్తూ.. ముందు మంచి భవిష్యత్తు ఉందని అంచనా వేస్తున్నారు. కానీ, బిట్‌కాయిన్, ఇతర డిజిటల్ క్రిప్టోకరెన్సీలు కనిష్టానికి చేరుకోవడంతో పాటు గ్లోబల్ క్రిప్టో మార్కెట్లో 1 ట్రిలియన్ డాలర్ల మేర నష్టం వాటిల్లజేశాయి మరి!. చదవండి: బిట్‌కాయిన్ చెల్లదంటే చెల్లదు- ఐఎంఎఫ్ -
బజ్జీల బండి.. కోట్ల ఆస్తులండీ!
ఓ చిన్న పాన్‌షాపు.. పక్కనే ఓ బజ్జీలు, మిర్చీల దుకాణం.. ఆ పక్కన ఓ కిరాణా.. చూస్తే ఏదో మధ్య తరగతి బతుకుల్లా కనిపిస్తాయి. కానీ ఇంటికెళ్లి చూస్తే వైభోగమే. పెద్ద పెద్ద ఇళ్లు, కార్లు, కోట్ల విలువైన భూములు, ఆస్తులు.. ఇలా ఏదో ఒకరిద్దరు కాదు.. వందలాది మంది. ఇటీవల ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఆదాయ పన్ను (ఐటీ) శాఖ చేసిన దాడుల్లో కళ్లు బైర్లు కమ్మే ఇలాంటివెన్నో వెలుగుచూశాయి. ఆ వివరాలు తెలుసుకుందామా? చిన్న దుకాణాలు.. వీధి వ్యాపారులు ఇబ్బడిముబ్బడిగా సంపాదిస్తున్నా పన్ను కట్టకుండా ఎగ్గొడుతున్నవారిపై కన్నేసిన ఆదాయ పన్ను (ఐటీ) శాఖ ఇటీవల కాన్పూర్‌లో నిఘా పెట్టింది. పలు ప్రాంతాల్లో చిన్న చిన్న కిరాణా, మందులు, కూరగాయల దుకాణాలు నడుపుతున్నవారు, వీధి వ్యాపారులు కూడా లక్షలు, కోట్ల రూపాయల్లో సంపాదిస్తున్నట్టు గుర్తించింది. అలాంటి 250 మందిపై దాడులు చేసిన అధికారులు.. వారి ఆస్తులు చూసి బిత్తరపోవడం గమనార్హం. ఈ 250 మంది గత నాలుగేళ్లలోనే ఏకంగా రూ.375 కోట్ల మేర వెనకేసినట్టు ఐటీ అధికారులు తేల్చారు. వారు కాన్పూర్‌లోని స్వరూప్ నగర్, ఆర్యనగర్, హులాగంజ్, బిర్హానారోడ్ వంటి ఖరీదైన ప్రాంతాల్లో భూములు, స్థలాలు కొన్నట్టు గుర్తించారు. కొందరు పాన్ షాపుల ఓనర్లు గత ఏడాది లాక్డౌన్ నాటి నుంచి ఏకంగా రూ.5 కోట్ల మేర ఆస్తులు సంపాదించుకున్నారు. బికాన్గంజ్కు చెందిన ఇద్దరు, లాల్‌బంగ్లా ప్రాంతానికి చెందిన ఒక శానిటేషన్ వర్కర్లు గత రెండేళ్లలో రూ.10 కోట్ల విలువైన ఇళ్లు, స్థలాలు కొన్నారు. రెండు, మూడు కార్లు.. కాన్పూర్‌లో గుర్తించిన సీక్రెట్ మిలియనీర్స్ (రహస్య కోటీశ్వరులు)లో చాలా మందికి రెండు, మూడు కార్లు ఉన్నాయి. మాల్‌రోడ్‌లో ఓ స్నాక్స్ (పానీపూరీ, వడాపావ్ వంటివి) షాపు యజమాని తాను కిరాయికి తీసుకున్న కార్లు, ఇతర వాహనాల కోసం ప్రతినెలా లక్షా 25 వేలు అద్దె చెల్లిస్తున్నాడు. లక్షలు, కోట్లలో వ్యాపారం చేస్తున్నా.. ఐటీ అధికారులు దాడులు చేసిన 250 మంది కూడా లక్షలు, కోట్లలో వ్యాపారం చేస్తున్నా ఎలాంటి పన్నులూ కట్టడం లేదని గుర్తించారు. బిగ్‌డేటా సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించి వారి వ్యాపారాలు, జీఎస్టీ రిజిస్ట్రేషన్, ఇతర లెక్కలు తేల్చారు. 65 మంది అసలు జీఎస్టీ రిజిస్ట్రేషన్ కూడా చేసుకోలేదని గుర్తించారు. ఏటా లక్షలు, కోట్లు సంపాదిస్తున్నా బయటపడకుండా వివిధ మార్గాలు అనుసరిస్తున్నట్టు అధికారులు గుర్తించారు. చాలా మంది తమ కుటుంబ సభ్యులు, బంధువుల పేరిట ఆస్తులు కొన్నారు. జాతీయ, ప్రైవేటు బ్యాంకుల్లో కాకుండా సహకార బ్యాంకుల్లో, ఆర్థిక పథకాల్లో, ప్రైవేటు చిట్టీలు, ఫైనాన్స్ సంస్థల్లో డిపాజిట్లు చేశారు. ఎలా బయటపడ్డారు? సొమ్ము ట్రాన్స్ఫర్ల సమయంలో, కొన్ని ప్రభుత్వ పత్రాలకు సంబంధించి కొందరు వ్యాపారులు పాన్‌కార్డు వివరాలను ఇచ్చారు. వీటితోపాటు ఆస్తుల కొనుగోళ్ల సమయంలో ఆధార్ వినియోగించారు. పాన్ కార్డు, ఆధార్ రెండింటినీ లింక్‌చేసి ఉండటంతో భారీ కొనుగోళ్లు, అమ్మకాల వివరాలు అధికారులకు అందాయి. దీనిపైవారు కూపీ లాగడంతో లక్షలు, కోట్లలో వ్యాపారం,సంపాదన బయటపడ్డాయి. ఇదే మొదటిసారేం కాదు.. మన దేశంలో ఇలా చిన్న దుకాణాలు, వీధి వ్యాపారం చేసే ‘రహస్య కోటీశ్వరుల’ను గుర్తించడం ఇదే మొదటిసారేం కాదు. 2016లో కాన్పూర్‌లోనే సుమారు 12 మంది వీధి వ్యాపారుల దగ్గర రూ.60 కోట్ల లెక్కలు చూపని ఆస్తులను గుర్తించారు. 2019లో అలీగఢ్‌లో ఓ చిన్న స్నాక్స్ బండి యజమాని ఏటా 60 లక్షలకుపైగా టర్నోవర్ చేస్తున్నట్టు తేల్చారు. – సాక్షి సెంట్రల్ డెస్క్ -
మిలియనీర్లుగా యూట్యూబ్ స్టార్లు!
ఇప్పుడంతా డిజిటల్ హవా నడుస్తోంది. మరీ ముఖ్యంగా లాక్‌డౌన్‌తో చాలామంది యూట్యూబ్‌లో సత్తా చాటుతున్నారు. ఓ నివేదిక ప్రకారం యువత రోజుకు సగటున 25% సమయాన్ని ఆన్లైన్లో కంటెంట్ కోసం వెచ్చిస్తున్నారట. ఇది వరకు అయితే యూట్యూబ్‌లో పాపులారిటీ తెచ్చుకొని స్టార్లు అయ్యేవారు. ఇప్పుడు స్టార్లు సైతం యూట్యూబ్ బాట పట్టారు. లక్షల్లో వ్యూస్, వేలల్లో సబ్స్రైబర్లతో కంటెంట్ క్రియేటర్స్‌గా మారి యూట్యూబ్‌లోనూ హవా చాటుతున్నారు. కాలానికి తగ్గట్లు మనమూ మారాలి. టెక్నాలజిని అందిపుచ్చుకొని ప్రస్తుత పరిస్థితుల్లో ఏది అవసరమో ఆ కంటెంట్‌ను రెడీ చేసుకోవాలి. లేదంటే అవుట్‌డేట్ అయిపోతాం. సరిగ్గా ఈ సూత్రాలనే పాటిస్తూ ప్రముఖులను సైతం సబ్‌స్రైబర్లుగా మలుచుకుంటున్నారు కొందరు యూట్యూబ్ స్టార్స్. అంతేకాకుండా క్రియేవిటీతో లక్షల్లో సంపాదిస్తూ మిలియనీర్లుగానూ చలామణి అవుతున్న ఇండియన్ టాప్ యూట్యూబ్ స్టార్ల గురించి సాక్షి ప్రత్యేక కథనం అజే నాగర్ అనే 21 ఏళ్ల కంటెంట్ క్రియేటర్ టిక్‌టాక్ వర్సస్ యూట్యూబ్ అనే ఒక్క వీడియో రూపొందించి అప్పటివరకు ఉన్న రికార్డులను బ్రేక్ చేశాడు. క్యారీమినాటి పేరుతో ఛానెల్ నడుపుతూ అత్యధికంగా 24 మిలియన్ సబ్స్రైబర్లను సొంతం చేసుకొని యూట్యూబ్‌లో అగ్రగామిగా నిలిచాడు. పాఠశాల విద్యను మధ్యలో వదిలేసినా ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యధిక యూట్యూబ్ సబ్స్రైబర్లు ఉన్న స్వీడిష్ యూట్యూబర్ ప్యూడీపీతో సరిసమానంగా సత్తా చాటుతున్నాడు. 5 ఏళ్ల క్రితమే ఛానల్‌ను ప్రారంభించి అతి తక్కువ టైంలోనే వరల్డ్ రికార్డులతో పోటీపడుతున్నాడు. View this post on Instagram 🙋🏼♂️ A post shared by 𝑨𝒋𝒆𝒚 𝑵𝒂𝒈𝒂𝒓 (@carryminati) on Feb 3, 2020 at 10:58pm PST 2018 గ్లోబల్ టాప్ 10 వీడియో లిస్ట్‌లో అమిత్ భదానా క్రియేట్ చేసిన కంటెంట్ కూడా ఒకటి. 20 మిలియన్ సబ్స్రైబర్లతో యూట్యూబ్‌లో ప్రస్తుతం రెండో స్థానంలో చెలామణి అవుతున్నాడు ఈ 21 సంవత్సరాల కుర్రాడు. మూడేళ్ల క్రితం కామెడీ స్కెచ్ వీడియోలతో ప్రస్తానం మొదలుపెట్టి ఇప్పడు స్టార్స్‌తోనూ వీడియోలు చేస్తూ బోలెడంత ఫ్యాన్ ఫాలోయింగ్‌ను పోగేసుకున్నాడు. వీళ్లతో పాటు ఆశిష్ చంచలాని, భువన్ బామ్ లాంటి కంటెంట్ క్రియేటర్లు కూడా తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. వెబ్‌సిరీస్‌లోనూ ఆశిష్ నటించాడు. టెక్నాలజీ గురూజీ పేరుతో ఛానల్ ప్రారంభించిన గౌరవ్ చౌదరి ఫోర్బ్స్అండర్ 30 జాబితాలో చోటు దక్కించుకొని ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందాడు. View this post on Instagram Kaise ho dosto? Waise gaming ka alag hi maja hai🔥... #Binod ko bhi #ROGPhone3 ki gaming pasand hai🤣... Guess karo main kaunsa game khel raha hu??? A post shared by Gaurav Chaudhary (@technicalguruji) on Aug 19, 2020 at 8:57pm PDT -
ఒకరి ఆస్తి 660కోట్లు మరొకరి ఆస్తి రూ.1,823
ఎన్నికలంటేనే కోట్ల రూపాయల వ్యవహారంగా మారిన ఈ రోజుల్లో పట్టుమని పదివేలు కూడా లేకుండా ఎన్నికల బరిలో దిగడం సాహసమే అనాలి. లేదా తెలివి తక్కువతనమనాలి. మధ్య ప్రదేశ్ నుంచి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న వారిలో ఇలాంటి నిరుపేదలు ఉన్నారని ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం(ఏడీఆర్) విశ్లేషణలో తేలింది.ఈ ఎన్నికల్లో కోటీశ్వరులతో పాటు పేదలు, నిరక్షరాస్యులు కూడా పోటీ చేస్తున్నారు. సిద్ధి లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంటుగా పోటీ చేస్తున్న లలన్ కుమార్ ఆస్తి కేవలం 1,823 రూపాయలు. రాష్ట్రం నుంచి పోటీ చేస్తున్న 104 మందిలో ఈయనే కడు పేదవాడని ఏడీఆర్ పేర్కొంది. అలాగే,ఇక్కడ నుంచే బరిలో దిగిన మరో ఇండిపెండెంట్ అభ్యర్థి రాం సహాయ్ ఆస్తి 6,134 రూపాయలు. కాగా జబల్పూర్ అభ్యర్థి ధనుక్ పరిస్థితి వీరిద్దరికంటే కొంచెం మెరుగు.ఆయన ఆస్తి విలువ 10,300 రూపాయలు. ఇక కోటీశ్వరుల విషయానికి వస్తే, చింద్వారా కాంగ్రెస్ అభ్యర్థి నకుల్ నాథ్(సీఎం కమల్‌నాథ్ కుమారుడు) ఆస్తి 660 కోట్లు. జబల్పూర్ నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ తన్ఖా 66 కోట్ల ఆస్తిపరుడు. సిద్ధి కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ సింగ్‌కు 37కోట్ల విలువైన ఆస్తిపాస్తులున్నాయని ఏడీఆర్ తెలిపింది.వివేక్ తన వార్షికాదాయం 11 కోట్ల రూపాయలని ఇన్‌కంట్యాక్స్ రిటర్న్స్‌లో పేర్కొంటే, నకుల్ 2 కోట్లుగా పేర్కొన్నారు. మొత్తం 104 మంది అభ్యర్థుల్లో 14శాతం మందిపై క్రిమినల్ కేసులున్నాయి. కాంగ్రెస్ అభ్యర్థుల్లో 17శాతం మంది తమపై క్రిమినల్ కేసులున్నాయని అఫిడవిట్లలో తెలిపారు. అభ్యర్థుల్లో 41 మంది డిగ్రీ ఆపై చదువులు చదివారు. 55 మంది 5 నుంచి 12వ తరగతి వరకు చదువుకున్నారు. ఇద్దరు అసలు చదువుకోలేదు. మరో నలుగురికి చదవడం, రాయడం వచ్చు. ఈసారి ఎన్నికల్లో అన్ని పార్టీలు ఎక్కువగా యువకులనే బరిలో దింపాయని ఏడీఆర్ తెలిపింది. మొత్తం అభ్యర్థుల్లో 60శాతం పాతిక నుంచి 50 ఏళ్ల లోపు వారే ఉన్నారు. మధ్యప్రదేశ్‌లోని ఆరు లోక్‌సభ స్థానాలకు(షాదోల్, సిద్ధి, జబల్పూర్, మాండ్లా, బాలాఘాట్, చింద్వారా)కు ఏప్రిల్ 29న పోలింగు జరుగుతుంది. -
బరిలో కోటీశ్వరులు
లోక్‌సభ 2019 ఎన్నికలకు తొలి దశ పోలింగ్ మొదలైంది. మొత్తం ఏడు దశల్లో 545 సీట్లకు ఎన్నికలు జరగనున్నాయి. వివిధ దశల్లో జరగబోయే పోలింగ్‌కు సంబంధించి ఇప్పటికే అనేక మంది అభ్యర్థులు తమ నామినేషన్లు దాఖలు చేశారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ రెండుచోట్ల నామినేషన్ దాఖలు చేశారు. ఇప్పటి వరకు నామినేషన్లు దాఖలు చేసిన ప్రముఖుల అఫిడవిట్లలో.. ఆస్తులు, అప్పులు, స్థిర చరాస్తులు, భూముల వివరాలు ఇలా ఉన్నాయి. ములాయంసింగ్ యాదవ్ (సమాజ్‌వాదీ పార్టీ) పోటీ చేస్తున్న స్థానం: మణిపురి ప్రకటించిన ఆస్తులు: రూ.20.54 కోట్లు 2014లో ఆస్తులు: రూ.15.95 కోట్లు స్థిరాస్తులు: రూ.16.21 కోట్లు (2014: రూ.12.54 కోట్లు) చరాస్తులు: రూ.4.33 కోట్లు (2014: రూ.3.41 కోట్లు) పెట్టుబడులు: రూ.50.09 లక్షలు బ్యాంక్ బ్యాలెన్స్: రూ.40.13 లక్షలు (ములాయంసింగ్ యాదవ్: రూ.11.25 లక్షలు, భార్య పేరిట: 28.88 లక్షలు) అప్పులు: రూ.2.2 కోట్లు క్రిమినల్ కేసులు: లక్నోలో ఒక కేసు అధీనంలోని భూమి: రూ.7.89 కోట్ల విలువైన 10.77 ఎకరాలు, 5,000, 5,974 చ.అ. ప్లాట్లు, 16,010, 3,230 చ.అ. వైశాల్యం గల రెండు ఇళ్లు. అమిత్ షా (బీజేపీ జాతీయ అధ్యక్షుడు) పోటీ చేస్తున్న స్థానం: గాంధీనగర్ ప్రకటించిన ఆస్తులు: రూ.30.81 కోట్లు స్థిరాస్తులు: రూ.15.29 కోట్లు చరాస్తులు: రూ.23.51 కోట్లు పెట్టుబడులు: రూ.21.95 కోట్లు బ్యాంక్ బ్యాలెన్స్: రూ.37.61 లక్షలు అప్పులు: రూ.47.69 లక్షలు క్రిమినల్ కేసులు: పశ్చిమ బెంగాల్, బిహార్‌లో రెండు చొప్పున మొత్తం నాలుగు అధీనంలోని భూమి: 22 ఎకరాల పొలం, 3,511, 59,890 చ.అ. వ్యవసాయేతర ప్లాట్లు రెండు. సుప్రియా సూలే (నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ) పోటీ చేస్తున్న స్థానం: బారామతి ప్రకటించిన ఆస్తులు: రూ.140.88 కోట్లు 2014లో ఆస్తులు: రూ.116.46 కోట్లు స్థిరాస్తులు: రూ.22.55 కోట్లు (2014: రూ.17.47 కోట్లు) చరాస్తులు: రూ.118.33 కోట్లు (2014: రూ.98.99 కోట్లు) పెట్టుబడులు: రూ.97.86 కోట్లు (రూ.16.74 సుప్రియా సూలే పేరిట, రూ. 81.12 కోట్లు భర్త సదానంద సూలే పేరిట) చేతిలో ఉన్న నగదు: రూ. 94,320 (సుప్రియ పేరిట: రూ.28,770, భర్త సదానంద్: పేరిట రూ.23,050, కుమార్తె రేవతి పేరిట రూ.28,900, కొడుకు విజయ్ పేరిట రూ.13,600) అప్పులు: రూ.55 లక్షలు క్రిమినల్ కేసులు: లేవు అధీనంలోని భూమి: రూ.2.7 కోట్ల విలువైన 16.7 ఎకరాలు. రూ.1.03 కోట్ల విలువైన వ్యవసాయేతర భూమి 1.77 ఎకరాలు. 2765, 2541 చ.అ. విస్తీర్ణంలో ఉన్న రెండు ఇళ్లు. భర్త సదానంద్ పేరుతో 4,442 చ.అ. ఇల్లు మరొకటి). నితిన్ గడ్కరీ (బీజేపీ) పోటీ చేస్తున్న స్థానం: నాగ్‌పూర్ ప్రకటించిన ఆస్తులు: రూ.25.12 కోట్లు 2014లో ఆస్తులు: రూ.28.04 కోట్లు స్థిరాస్తులు: రూ.69.38 లక్షలు చరాస్తులు: రూ.91.99 లక్షలు పెట్టుబడులు: రూ.3.55 లక్షలు బ్యాంక్ బ్యాలెన్స్: రూ.8.99 లక్షలు, భార్య పేరిట రూ.11 లక్షలు) ∙అప్పులు: రూ.1.57 కోట్లు ∙క్రిమినల్ కేసులు: లేవు ∙అధీనంలోని భూమి: నాగ్‌పూర్‌లోని ధపేవాడలో 29 ఎకరాలు. ఇందులో 15 ఎకరాలు భార్య పేరుతో, 14.60 ఎకరాలు కుటుంబ ఉమ్మడి ఆస్తిగా నమోదైంది. నాగ్‌పూర్‌లోని మహల్ ప్రాంతంలో పూర్వీకుల ఇల్లు, ముంబైలోని ఎమ్మెల్యే సొసైటీలో ఒక ఫ్లాట్. ఊర్మిళ మటోండ్కర్ (కాంగ్రెస్ పార్టీ) పోటీ చేస్తున్న స్థానం: ముంబై నార్త్ ప్రకటించిన ఆస్తులు: రూ.68.88 కోట్లు స్థిరాస్తులు: రూ.41.24 కోట్లు చరాస్తులు: రూ.27.64 కోట్లు క్రిమినల్ కేసులు: లేవు ప్రియా దత్ (కాంగ్రెస్ పార్టీ) పోటీ చేస్తున్న స్థానం: ముంబై నార్త్ సెంట్రల్ స్థిరాస్తులు: రూ.72 కోట్లు (2014: రూ.60.30 కోట్లు) చరాస్తులు: రూ.24.20 కోట్లు (2014: రూ.6 కోట్లు) పెట్టుబడులు: రూ.55.50 లక్షలు బ్యాంక్ బ్యాలెన్స్:రూ.8.05 కోట్లు అప్పులు: రూ.3.5 కోట్లు క్రిమినల్ కేసులు: లేవు డింపుల్‌యాదవ్ (సమాజ్‌వాదీ పార్టీ) పోటీ చేస్తున్న స్థానం: కనౌజ్ ప్రకటించిన ఆస్తులు: రూ.37.78 కోట్లు 2014లో ఆస్తులు: రూ.28.04 కోట్లు స్థిరాస్తులు: రూ..26.20 కోట్లు (2014: రూ.21.71 కోట్లు) చరాస్తులు: రూ.11.58 కోట్లు (2014: రూ.6.33 కోట్లు) పెట్టుబడులు: రూ.55.50 లక్షలు బ్యాంక్ బ్యాలెన్స్: రూ.8.05 కోట్లు అప్పులు: రూ.14.26 లక్షలు క్రిమినల్ కేసులు: లేవు అధీనంలోని భూమి: రూ.8.39 కోట్ల విలువైన 18.74 ఎకరాలు, 925.36 చదరపు అడుగుల ప్లాట్. రెండు ఇళ్లు. రాహుల్ గాంధీ (కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు) పోటీ చేస్తున్న స్థానం: వయనాడ్ (కేరళ) ప్రకటించిన ఆస్తులు: రూ.15.88 కోట్లు 2014లో ఆస్తులు: రూ.9.4 కోట్లు స్థిరాస్తులు: రూ.10.08 కోట్లు (2014: రూ.1.32 కోట్లు) చరాస్తులు: రూ.5.80 కోట్లు (2014: రూ.8.07 కోట్లు) ∙అప్పులు:రూ.72 లక్షలు క్రిమినల్ కేసులు: 5 (పరువు నష్టం దావాలు నాలుగు ఉన్నాయి. నేషనల్ హెరాల్డ్‌కు సంబంధించిన కేసు మరొకటి నమోదై ఉంది) -
మిలియనీర్ల వలస బాట..
సాక్షి, న్యూఢిల్లీ : నల్లధనంపై నియంత్రణలతో 2014 నుంచి పెద్దసంఖ్యలో డాలర్ మిలియనీర్లు భారత్‌ను విడిచివెళ్లారు. చైనా, ఫ్రాన్స్ కంటే భారత్ నుంచే డాలర్ మిలియనీర్లు అత్యధికంగా విదేశాలకు తరలివెళ్లారు. 2014 నుంచి 23,000 మంది మిలియనీర్లు దేశం వీడివెళ్లగా వీరిలో కేవలం 2017లోనే 7000 మంది విదేశాలకు చెక్కేశారని మోర్గాన్ స్టాన్లీలో చీఫ్ గ్లోబల్ స్ట్రేటజిస్ట్ రుచిర్ శర్మ విశ్లేషించారు. భారత సంపన్నుల్లో 2.1 శాతం మంది దేశాన్ని వీడగా, ఫ్రాన్స్ సంపన్నుల్లో 1.3 శాతం, చైనా సంపన్నుల్లో 1.1 శాతం ఆయా దేశాలను విడిచివెళ్లారని చెప్పుకొచ్చారు. 1,50,000 మంది మిలియనీర్లపై ఎన్‌డబ్ల్యూ వరల్డ్ వెల్లడించిన గణాంకాలను బట్టి ఈ వివరాలు వెల్లడయ్యాయి.కారణమేదైనా సంపన్నులు ఇంత పెద్ద సంఖ్యలో దేశం వీడటం ఆర్థిక వ్యవస్థకు మేలు చేకూర్చబోదని రుచిర్ శర్మ పేర్కొన్నారు. ప్రపంచ సంపన్నులంతా అక్లాండ్, మోంట్రీల్, టెల్అవీవ్, టొరంటో వంటి నగరాలను ఎంచుకుంటున్నారని ఆయన విశ్లేషించారు.ఇక భారత్ నుంచి సంపన్నులు అధికంగా బ్రిటన్, దుబాయ్, సింగపూర్ల వైపు మొగ్గుచూపుతున్నారు. దేశం వెలుపల ఆరు నెలలుపైగా గడిపిన వారిని ఈ జాబితాలో చేర్చారు. మరోవైపు ఫ్రాన్స్ నుంచీ కూడా మిలియనీర్లు పెద్దసంఖ్యలోనే వేరే దేశాలకు తరలివెళ్లారు. ఐరోపా యూనియన్ విచ్ఛిన్నమైన అనంతరం బ్రిటన్ నుంచి సైతం పలువురు సంపన్నులు ప్రపంచంలోని ఇతర నగరాలకు వలసవెళ్లారు. భారత్‌లో పన్ను చట్టాలను కఠినతరం చేయడం, బ్లాక్ మనీపై నియంత్రణలు, ఎన్పీఏల ఒత్తిడితో కొందరు సంపన్నులు ఇతర దేశాలకు తరలివెళ్లినట్టు ఈ గణాంకాలు స్పష్టం చేశాయి. -
పేటీఎం ఆఫీసు బాయ్‌కి ఒక్కసారిగా రూ.20 లక్షలు
ముంబై : డిజిటల్ లావాదేవీల్లో శరవేగంగా దూసుకెళ్తున్న పేటీఎం ఇటీవల ప్రకటించిన రెండో స్టాక్ విక్రయంతో, 100కు పైగా ఆ కంపెనీ ఉద్యోగులు మిలీనియర్లుగా మారిన సంగతి తెలిసిందే. దాదాపు రూ.500 కోట్ల విలువైన స్టాక్ సేల్‌ను ఈ కంపెనీ చేపట్టింది. ఈ విక్రయంలో కంపెనీలో పనిచేసే, పనిచేసిన ఉద్యోగులు వారికున్న వాటాను(ఈసాప్స్) విక్రయించుకున్నారని పేటీఎం తెలిపింది. అయితే ఈ విక్రయం ద్వారా పేటీఎం చీఫ్ ఎగ్జిక్యూటివ్ హరిందర్ థాకర్ దాదాపు రూ.40 కోట్లను ఆర్జించారు. పెద్ద పెద్ద స్థాయిల్లో ఉన్నవారు మాత్రమే కాక, ఆ కంపెనీలో పనిచేసే ఆఫీసు బాయ్ కూడా లక్షాధికారి అయిపోయాడు. ఈ స్టాక్ విక్రయంతో తమ కంపెనీకి చెందిన ఆఫీసు బాయ్, రూ.20 లక్షలకు పైగా ఆర్జించినట్టు వన్97 కమ్యూనికేషన్ లిమిటెడ్ సోమవారం రిపోర్టు చేసింది. ఇతర ఉద్యోగుల వివరాలను బహిర్గతం చేయనప్పటికీ, కెనడా చీఫ్ ఎగ్జిక్యూటివ్, ఆఫీసు బాయ్ వివరాలను మాత్రం బయటికి వెల్లడించింది. 2017 మార్చిలో లెక్కించిన విలువ కంటే పేటీఎం ప్రస్తుత విలువ 3 బిలియన్ డాలర్లు అధికంగా ఉంది. కంపెనీ ప్రస్తుత ఇన్వెస్టర్లుగా సాఫ్ట్‌బ్యాంకు, ఎస్ఏఐఎఫ్ పార్టనర్స్, అలీబాబా గ్రూప్ హోల్డింగ్ లిమిటెడ్, యాంట్ ఫైనాన్సియల్ సర్వీసెస్ గ్రూప్‌లు ఉన్నాయి. కంపెనీ ఈసాప్స్ కేవలం టాప్, మిడ్ లెవల్ ఎగ్జిక్యూటివ్‌లకు మాత్రమే కాకుండా.. ముందు నుంచి కంపెనీ పనిచేసిన ఉద్యోగులకు, ఆఫీసు స్టాఫ్‌కు కూడా కంపెనీ అందించింది. ఉద్యోగులు సొంతంగా షేర్లను కలిగి ఉండటానికి అనుమతించే ఆర్థిక సాధనమే ఈసాప్స్. కొంత కాలం తర్వాత ఈ షేర్లను అమ్మి, నగదుగా మార్చుకోవచ్చు. -
భారత్‌లో మిలియనీర్లు.. 2,45,000 మంది
న్యూఢిల్లీ: భారత్‌లో మిలియనీర్ల సంఖ్య 2,45,000 దాటేసింది. దేశంలోని మొత్తం కుటుంబాల సంపద విలువ 5 ట్రిలియన్ డాలర్లుగా ఉన్నట్లు అంతర్జాతీయ ఆర్థిక సేవల సంస్థ క్రెడిట్ సూసీ తన నివేదికలో పేర్కొంది. ఇక 2022 నాటికి మిలియనీర్ల సంఖ్య 3,72,000కి, మొత్తం కుటుంబాల సంపద విలువ 7.1 ట్రిలియన్ డాలర్లకు చేరొచ్చని అంచనా వేసింది. క్రెడిట్ సూసీ గ్లోబల్ వెల్త్ రిపోర్ట్ ప్రకారం.. 2000 నుంచి చూస్తే భారత్‌లో సంపద విలువ వార్షికంగా 9.9 శాతం చొప్పున పెరుగుతూ వస్తోంది. అంతర్జాతీయంగా ఈ వృద్ధి సగటున 6 శాతమే కావడం గమనార్హం. అలాగే భారత్ 451 బిలియన్ డాలర్ల సంపద పెరుగుదలతో గ్లోబల్‌గా 8వ అతిపెద్ద దేశంగా ఉంది. ‘భారత్‌లో సంపద పెరుగుదల ఉంది. కానీ ఇందులో అందరి భాగస్వామ్యం లేదు. 92% మంది వయోజనుల సంపద 10,000 డాలర్లకు లోపే ఉంటే.. కేవలం 0.5 శాతం మంది వయోజనుల సంపద 1,00,000 డాలర్లుగా ఉంది’ అని నివేదిక పేర్కొంది. ఇక మొత్తం ప్రపంచ సంపద 6.4 శాతం వృద్ధితో 280 ట్రిలియన్ డాలర్లకు ఎగిసింది. వయోజన సంపద పరంగా చూస్తే 5,37,600 డాలర్లతో స్విట్జర్లాండ్ అత్యంత ధనిక దేశంగా ఉంది. దీని తర్వాతి స్థానంలో వరుసగా ఆస్ట్రేలియా (4,02,600 డాలర్లు), అమెరికా (3,88,000 డాలర్లు) ఉన్నాయి. -
భారత్‌లో మిలీనియర్లు ఎంతమందో తెలుసా?
సాక్షి, న్యూఢిల్లీ : భారత్‌లో మిలీనియర్లు, వారి సంపద చాలా వేగవంతంగా పెరుగుతోంది. ప్రస్తుతం భారత్ 2,45,000 మంది మిలీనియర్లకు నివాసంగా మారిందని, వీరి మొత్తం సంపద 5 ట్రిలియన్ డాలర్లకు ఎగిసినట్టు క్రెడిట్ స్యూజ్ వెల్లడించింది. వచ్చే ఏళ్లలో మిలీనియర్ల సంఖ్య 3,72,000కు పెరుగుతుందని, వీరి ఆదాయం కూడా వార్షికంగా 7.5 శాతం పైకి ఎగిసి, 2022 నాటికి 7.1 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుందని తెలిపింది. క్రెడిట్ స్యూజ్ గ్లోబల్ హెల్త్ రిపోర్టు ప్రకారం భారత సంపద వార్షికంగా 9.9 శాతం పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా పెరిగిన దానికంటే వేగంగా భారత్‌లోనే పెరుగుతుందని క్రెడిట్ స్యూజ్ తెలిపింది. అంతేకాక 451 బిలియన్ డాలర్ల సంపద వృద్ధితో గ్లోబల్‌గా అతిపెద్ద సంపద ఆర్జిస్తున్న 8వ దేశంగా భారత్ నిలుస్తుందని పేర్కొంది. '' భారత్‌లో సంపద చాలా వేగంగా పెరుగుతుంది. కానీ అందరూ ఈ వృద్ధిలో పాలు పంచుకోవడం లేదు. 92 శాతం మంది వయోజన జనాభా సంపద ఇంకా 10వేల డాలర్ల కంటే తక్కువగానే ఉంది'' అని రిపోర్టు వివరించింది. చాలా తక్కువ మొత్తంలో జనాభా నికర సంపద మాత్రమే లక్ష డాలర్లకు పైన ఉందని తెలిపింది. క్రెడిట్ స్యూజ్ విడుదల చేసిన రిపోర్టులో వ్యక్తిగత సంపద ఎక్కువగా ఆస్తులు, రియల్ అసెట్స్ ఆధిపత్య స్థానంలో ఉన్నాయి. ఇవి గృహాదాయంలో 86 శాతాన్ని ఆక్రమించుకున్నాయని వెల్లడైంది. స్థూల ఆస్తుల్లో వ్యక్తిగత రుణాలు కేవలం 9 శాతమేనని రిపోర్టులో తెలిసింది.