సాక్షి, న్యూఢిల్లీ : భారత్‌లో మిలీనియర్లు, వారి సంపద చాలా వేగవంతంగా పెరుగుతోంది. ప్రస్తుతం భారత్ 2,45,000 మంది మిలీనియర్లకు నివాసంగా మారిందని, వీరి మొత్తం సంపద 5 ట్రిలియన్ డాలర్లకు ఎగిసినట్టు క్రెడిట్ స్యూజ్ వెల్లడించింది. వచ్చే ఏళ్లలో మిలీనియర్ల సంఖ్య 3,72,000కు పెరుగుతుందని, వీరి ఆదాయం కూడా వార్షికంగా 7.5 శాతం పైకి ఎగిసి, 2022 నాటికి 7.1 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుందని తెలిపింది. క్రెడిట్ స్యూజ్ గ్లోబల్ హెల్త్ రిపోర్టు ప్రకారం భారత సంపద వార్షికంగా 9.9 శాతం పెరిగింది.
ప్రపంచవ్యాప్తంగా పెరిగిన దానికంటే వేగంగా భారత్‌లోనే పెరుగుతుందని క్రెడిట్ స్యూజ్ తెలిపింది. అంతేకాక 451 బిలియన్ డాలర్ల సంపద వృద్ధితో గ్లోబల్‌గా అతిపెద్ద సంపద ఆర్జిస్తున్న 8వ దేశంగా భారత్ నిలుస్తుందని పేర్కొంది. '' భారత్‌లో సంపద చాలా వేగంగా పెరుగుతుంది. కానీ అందరూ ఈ వృద్ధిలో పాలు పంచుకోవడం లేదు. 92 శాతం మంది వయోజన జనాభా సంపద ఇంకా 10వేల డాలర్ల కంటే తక్కువగానే ఉంది'' అని రిపోర్టు వివరించింది.
చాలా తక్కువ మొత్తంలో జనాభా నికర సంపద మాత్రమే లక్ష డాలర్లకు పైన ఉందని తెలిపింది. క్రెడిట్ స్యూజ్ విడుదల చేసిన రిపోర్టులో వ్యక్తిగత సంపద ఎక్కువగా ఆస్తులు, రియల్ అసెట్స్ ఆధిపత్య స్థానంలో ఉన్నాయి. ఇవి గృహాదాయంలో 86 శాతాన్ని ఆక్రమించుకున్నాయని వెల్లడైంది. స్థూల ఆస్తుల్లో వ్యక్తిగత రుణాలు కేవలం 9 శాతమేనని రిపోర్టులో తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment