Credit Suisse report
-
Global Wealth Report 2023: భారత్ తప్ప పలు అగ్రదేశాల్లో సంపద కరిగిపోతోంది
అగ్రరాజ్యం అమెరికా సహా ప్రపంచ దేశాలు ఆర్థిక సంక్షోభ పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నాయి. ప్రపంచ దేశాల్లో సంపద హరించుకుపోతూ ఉంటే భారత్‌లో సంపద పెరుగుతోంది. భారత్‌లో తప్ప ► అగ్రరాజ్యం అమెరికా సహా ప్రపంచ దేశాలు ఆర్థిక సంక్షోభ పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నాయి. అధిక ధరలు, డాలర్‌తో పోల్చి చూస్తే వివిధ దేశాల కరెన్సీలు పడిపోవడం, భౌగోళిక రాజకీయాలు, వాతావరణ మార్పులు వంటివెన్నో దేశాల ఆర్థిక వ్యవస్థని కుంగదీస్తున్నాయి. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా సంపద క్షీణించడం ప్రారంభమైంది. 2008 ఆర్థిక మాంద్యం తర్వాత మళ్లీ 2022లో ఆర్థిక సంక్షోభాన్ని ప్రపంచ దేశాలు ఎదుర్కొన్నట్టుగా యూనియన్ బ్యాంక్ ఆఫ్ స్విట్జర్లాండ్ (యూబీఎస్) రూపొందించిన గ్లోబల్ వెల్త్ రిపోర్ట్ 2023లో వెల్లడైంది. ప్రపంచ దేశాల్లో అమెరికా అత్యధికంగా సంపదని కోల్పోతే ఆ తర్వాత స్థానంలో జపాన్ ఉంది. 2021లో ప్రపంచ దేశాల సంపద 466.2 ట్రిలియన్ డాలర్లు ఉండగా 2022 నాటికి 2.4% తగ్గి 454.5 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది. ఇక సంపద తగ్గిపోవడంలో అమెరికా ముందుంది. ఏడాదిలో 5.9 ట్రిలియన్ డాలర్ల సంపదను అగ్రరాజ్యం కోల్పోయింది. ఆ తర్వాత స్థానంలో జపాన్ నిలిచింది. 2021తో పోల్చి చూస్తే ఆ దేశం 2.5 ట్రిలియన్ డాలర్ల సంపదను కోల్పోయింది. ప్రాంతాల వారీగా ఇలా.. ► అత్యంత సంపన్న దేశాలున్న ఉత్తర అమెరికా, యూరప్‌లు భారీగా నష్టపోయాయి. 2022లో ఈ దేశాల్లో 10.9 ట్రిలి యన్ డాలర్ల నష్టం జరిగింది. ► ఆసియా ఫసిఫిక్ దేశాల్లో 2.1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక నష్టం జరిగింది. ► లాటిన్ అమెరికాలో 2.4 ట్రిలియన్ డాలర్ల సంపద పెరిగింది. ► 2022లో భారీగా సంపద హరించుకుపోయిన దేశాల్లో అమెరికా మొదటి స్థానంలో ఉంటే ఆ తర్వాత జపాన్, చైనా, కెనడా, ఆ్రస్టేలియా ఉన్నాయి. ► సంపద భారీగా పెరిగిన దేశాల్లో భారత్, బ్రెజిల్, మెక్సికో, రష్యా నిలిచాయి. ► తలసరి ఆదాయంలో స్విట్జర్లాండ్ మొదటి స్థానంలో ఉంటే, అమెరికా, ఆస్ట్రేలియా, డెన్మార్క్ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. భారత్‌లో పెరుగుతున్న సంపద ► ప్రపంచ దేశాల్లో సంపద హరించుకుపోతూ ఉంటే భారత్‌లో మాత్రం సంపద పెరుగుతోంది. 2021తో పోల్చి చూస్తే మన దేశ సంపద 675 బిలియన్ డాలర్లు అంటే 4.6% పెరిగింది. 2022 నాటికి 15.4 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది. చైనా వంటి దేశాల్లో కూడా సంపద హరించుకుపోతూ ఉంటే భారత్‌లో మాత్రం పెరగడం విశేషం. దేశంలో కొంతమంది ప్రైవేటు వ్యక్తులు అపర కుబేరులుగా మారారు. 2000 నుంచి 2022 వరకు ఏడాదికి 15% మిలియనీర్లు పెరుగుతూ వస్తున్నారు. ఉక్రెయిన్‌తో ఏడాదిన్నరగా యుద్ధం చేస్తున్నప్పటికీ రష్యా సంపద కూడా పెరగడం గమనార్హం. స్థిరంగా సంపద పెరుగుదల.. ► భారత్‌లో సంపద పెరుగుదల 20 ఏళ్లుగా స్థిరంగా కొనసాగుతోంది. మధ్య తరగతికి చెందిన వ్యక్తుల సంపద ఏడాదికి 5.9% చొప్పున పెరుగుతోంది. ఒకప్పుడు చైనాలో మధ్యతరగతి సంపద అధికంగా పెరుగుతూ ఉండేది. ఇప్పుడు భారత్ చైనా స్థానాన్ని ఆక్రమించింది. మిలియనీర్లు మన దేశంలో ఏకంగా 15% పెరుగుతూ వస్తున్నారు. మొత్తమ్మీద మిలియనీర్లు అమెరికాలోనే ఎక్కువ. ప్రపంచవ్యాప్తంగా కోట్లకు పడగలెత్తిన వారు 5.9 కోట్ల మంది ఉంటే వారిలో 2.3 కోట్ల మంది అంటే 40% అమెరికాలోనే ఉన్నారు. 2027 నాటికి భారత్, చైనా, బ్రెజిల్, యూకే, దక్షిణ కొరియాలో కూడా కోటీశ్వరుల సంఖ్య పెరుగుతుందని గ్లోబల్ వెల్త్ రిపోర్ట్ అంచనా. 2022–27 మధ్య చైనాలో కోటీశ్వరులు 26%,భారత్‌లో 11% పెరుగుతారు. – నేషనల్ డెస్క్, సాక్షి -
గ్లోబల్ వెల్త్ రిపోర్ట్–2022: ‘సంపాదన’లో సగం వారిదే
లేచింది మొదలు పడుకొనే వరకు ప్రపంచంలో ప్రతి మనిషీ జపించే కామన్ జపం ‘డబ్బు’. గుండె కూడా లబ్ ‘డబ్బు’.. లబ్ ‘డబ్బు’ అని కొట్టుకుంటుందని కొందరు చమత్కరిస్తుంటారు. ఏ పని చేసినా దాని వెనుక ఉండేది ‘సంపాదన’. ‘ఎంత సంపాదించావన్నది కాదు.. ఎలా బతికావన్నది ముఖ్యం’ అన్న సూత్రం రివర్సయింది. సంపాదనే ముఖ్యమైంది. ఇందులో అమెరికా, చైనా పౌరులు ఆరితేరారు. వ్యక్తిగత సంపాదనలో వారిదే సగం. మిగతా ప్రపంచానిది సగం. క్రెడిట్ సూయిస్ నివేదిక గణాంకాలతో ప్రత్యేక కథనం.. (ఎం.విశ్వనాథరెడ్డి, సాక్షి ప్రతినిధి): ఒక దేశం ఆర్థిక స్థితిగతులను తెలుసుకోవడానికి జీడీపీ (జాతీయ స్థూల ఉత్పత్తి) గణాంకాలు చూస్తాం. ఆర్థిక పరిస్థితులను అంచనా వేయడంలో మరో కొలమానం వ్యక్తిగత సంపద విలువ. ప్రపంచవ్యాప్తంగా వ్యక్తిగత సంపదను లెక్కగట్టి ఏ దేశ పౌరులు ఎక్కువ సంపాదిస్తున్నారో, ఎవరు విలువైన ఆస్తులు కూడగడుతున్నారో తెలుసుకోవచ్చు. ‘క్రెడిట్ సూయిస్’ సంస్థ ఏటా గ్లోబల్ వెల్త్ రిపోర్ట్ విడుదల చేస్తుంది. ఇటీవల ‘గ్లోబల్ వెల్త్ రిపోర్ట్–2022’ విడుదల చేసింది. ఇందులో 2021 సంవత్సరం గణాంకాలను పేర్కొంది. 2021 ఆఖరునాటికి ప్రపంచంలోని మొత్తం వ్యక్తిగత సంపద 463.6 లక్షల కోట్ల డాలర్లుగా అంచనా వేశారు. అందులో సగం అమెరికా, చైనా పౌరుల సొంతమని, మిగతా సగం అన్ని దేశాల పౌరుల వ్యక్తిగత సంపదగా నివేదిక పేర్కొంది. మొత్తం వ్యక్తిగత సంపదలో అమెరికా పౌరులకు 31.5 శాతం వాటా కాగా, తర్వాత స్థానంలో ఉన్న చైనా పౌరుల వాటా 18.4 శాతం. 3.1 శాతం వాటాతో మనదేశం ఏడో స్థానంలో నిలిచింది. టాప్–10లో అమెరికా, చైనా, జపాన్, జర్మనీ, యూకే, ఫ్రాన్స్, ఇండియా, కెనడా, ఇటలీ, ఆస్ట్రేలియా ఉన్నాయి. సంపద పంచాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే క్రెడిట్ సూయిస్ గ్లోబల్ వెల్త్ రిపోర్ట్‌ను పరిశీలిస్తే.. ప్రపంచంలోని 40 శాతం సంపద ఒక శాతం వ్యక్తుల చేతుల్లో కేంద్రీకృతమైంది. 10 శాతం ధనికుల వద్ద 82 శాతం సంపద పోగుబడి ఉంది. ఎవరి దగ్గర సంపద ఉందని చెప్పడంకంటే.. ఎవరి దగ్గర లేదో చెప్పడం కూడా ముఖ్యమని నివేదిక రూపకర్త ‘ఆంతోనీ షోరాక్’ అభిప్రాయపడ్డారు. ప్రపంచంలోని 50 శాతం వ్యక్తులకు 1 శాతం సందప మాత్రమే ఉందనే విషయాన్ని నొక్కి చెప్పారు. సంపద అందరికీ సమానంగా ఉండటం ఊహకు అందని విషయం. కానీ నిరుపేదలకు వేగంగా సందప పంపిణీ జరిగితేనే అసలు సంపదకు అర్థం చేకూరుతుంది. అభివృద్ధి దిశగా సమాజం వేగంగా అడుగులు వేస్తుందని ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ప్రజా ప్రభుత్వాలకు నిజమైన అర్థం ఏదో రూపంలో సంపదను నిరుపేద వర్గాలకు అందించడమేననే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. నివేదికలో ముఖ్యాంశాలు.. ► భారీ ఆర్థిక శక్తుల వద్దే వ్యక్తిగత సంపద కూడా కూడుతోంది. అమెరికా, చైనా కలిసి ప్రపంచంలోని వ్యక్తిగత సంపదలో సగం ఉండగా, ఆయా దేశాల జీడీపీ ప్రపంచ దేశాల జీడీపీతో పోలిస్తే కొంత వ్యత్యాసం కనిపిస్తుంది. ప్రపంచంలోని అన్ని దేశాల జీడీపీలో అమెరికా వాటా 24 శాతం కాగా, వ్యక్తిగత సంపదలో 31.5 శాతం ఉండటం గమనార్హం. చైనా అలా లేదు. ప్రపంచ జీడీపీలో చైనా వాటా 19 శాతం, వ్యక్తిగత సంపదలో ఆ దేశం వాటా 18.4 శాతం. అంటే.. అమెరికాలో జీడీపీకంటే వ్యక్తిగత సంపాదన వాటా ఎక్కువ ఉంటే.., చైనాలో ఇది తక్కువ. ► ప్రపంచంలోని వ్యక్తిగత సంపదలో 75 శాతం కేవలం 10 దేశాల్లోనే ఉంది. ► దశాబ్దం క్రితం ప్రపంచ వ్యక్తిగత సంపదలో చైనా వాటా 9 శాతం ఉండగా, ఇప్పుడు రెట్టింపు అయింది. ► 10 లక్షల డాలర్లు, అంతకంటే ఎక్కువ సంపద ఉన్న వ్యక్తుల (మిలయనీర్ల) సంఖ్య 2021లో 7.9 లక్షలు. 2026 నాటికి ఈ సంఖ్య రెట్టింపై 16.23 లక్షలకు చేరుతుందని అంచనా. ► ప్రపంచ వ్యక్తిగత సంపద వాటాలో మన దేశం వాటా అంతగా పెరగలేదు. అయితే దేశంలో వ్యక్తిగత సంపదలో వృద్ధి నమోదవుతోంది. 2020తో పోలిస్తే 2021లో 12 శాతం వృద్ధి నమోదు చేసి 14.2 లక్షల కోట్ల డాలర్లకు చేరింది. మన దేశంలో ఒక్కో వ్యక్తికి ఉన్న సరాసరి సంపద విలువ 2000 సంవత్సరం నుంచి ఏటా 8.8 శాతం పెరుగుతోంది. 2021 ఆఖరుకు అది 15,535 డాలర్లకు చేరింది. అది ప్రపంచ సరాసరి వ్యక్తిగత సంపద (87,489 డాలర్లు)తో పోలిస్తే బాగా తక్కువ. ► ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం 6.2 కోట్ల మంది మిలియనీర్లు ఉండగా, 2026 నాటికి వీరి సంఖ్య 8.75 కోట్లకు చేరుతుందని అంచనా. ► ప్రపంచంలోని డాలర్ మిలియనీర్లు మన దేశంలో ఒక శాతం ఉండగా, అమెరికాలో 39 శాతం మంది ఉన్నారు. చైనాలో 10 శాతం మంది, జపాన్, యూకే, ఫ్రాన్స్‌లో 5 శాతం చొప్పున, జర్మనీ, కెనడా, ఆస్ట్రేలియాలో 4 శాతం చొప్పున, ఇటలీ, దక్షిణ కొరియా, స్విట్జర్లాండ్, నెదర్లాండ్స్, స్పెయిన్‌లో 2 శాతం చొప్పున ఉన్నారు. తైవాన్, హాంకాంగ్, స్వీడన్లో ఒక శాతం చొప్పున ఉన్నారు. మిగతా 10 శాతం మంది ప్రపంచంలోని మిగిలిన దేశాల్లో ఉన్నారు. -
డేటాకు ‘మెటావర్స్’ దన్ను..
న్యూఢిల్లీ: డిజిటల్ వ్యవస్థ క్రమంగా మెటావర్స్ వైపు మళ్లుతున్న నేపథ్యంలో డేటా వినియోగం గణనీయంగా పెరగనుంది. 2032 నాటికి ప్రపంచవ్యాప్తంగా ఇది 20 రెట్లు వృద్ధి చెందనుంది. దేశీయంగా కూడా ఇదే ధోరణి కారణంగా.. టెలికం దిగ్గజాలు రిలయన్స్ జియో, భారతి ఎయిర్‌టెల్‌కు గణనీయంగా వ్యాపార అవకాశాలు లభించనున్నాయి. క్రెడిట్ సూసీ ఒక నివేదికలో ఈ అంశాలు వెల్లడించింది. వర్చువల్ ప్రపంచంలో ఉన్న అనుభూతి కలిగించే మెటావర్స్ వల్ల యూజర్లు స్క్రీన్ చూడటంపై వెచ్చించే సమయం పెరగనుండటంతో.. డేటా వినియోగానికి గణనీయంగా ఊతం లభిస్తుందని పేర్కొంది. ‘ఇంటర్నెట్ వినియోగంలో 80 శాతం భాగం వీడియోలదే ఉంటోంది. ఇది వార్షికంగా 30 శాతం మేర వృద్ధి చెందుతోంది. మెటావర్స్‌ను ఒక మోస్తరుగా వినియోగించినా .. దీనివల్ల డేటా యూసేజీ, వచ్చే దశాబ్దకాలంలో ఏటా 37 శాతం చొప్పున వృద్ధి చెంది, ప్రస్తుత స్థాయి కన్నా 20 రెట్లు పెరుగుతుందని అంచనా వేస్తున్నాం‘ అని నివేదిక తెలిపింది. మెటావర్స్‌కి సంబంధించిన ఆగ్మెంటెడ్ రియాలిటీ, వర్చువల్ రియాలిటీ వంటి టెక్నాలజీల వినియోగం భారీగా పెరగనుందని వివరించింది. బ్రాడ్‌బ్యాండ్ లభ్యత కీలకం.. మెటావర్స్ పూర్తి సామర్థ్యాలను వినియోగించుకోవడానికి ఫిక్స్డ్ బ్రాడ్‌బ్యాండ్ లభ్యత కీలకమని క్రెడిట్ సూసీ తెలిపింది. ప్రజలు రోజూ అత్యధిక సమయం మొబైల్‌ను వినియోగించే టాప్ దేశాల్లో భారత్ కూడా ఉన్నప్పటికీ.. మిగతా దేశాలతో పోలిస్తే ఫిక్స్డ్ బ్రాడ్‌బ్యాండ్ ఇక్కడ తక్కువగానే ఉందని వివరించింది. భారత్‌లో దీని విస్తృతి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తొమ్మిది శాతానికి పెరగవచ్చని పేర్కొంది. 2020 ఆర్థిక సంవత్సరంలో ఇది 6.8 శాతంగా ఉంది. ‘భారతీయ టెల్కోల ఆదాయాలపై మెటావర్స్ ప్రభావాన్ని అంచనా వేసేందుకు ఇంకా సమయం ఉన్నప్పటికీ .. మెటావర్స్ ప్రేరిత డేటా వినియోగం దన్నుతో ఈ దశాబ్దం ద్వితీయార్ధంలో భారతి ఎయిర్టెల్ (ఆదాయాల్లో బ్రాడ్‌బ్యాండ్ వాటా 17 శాతం), జియో గణనీయంగా ప్రయోజనం పొందగలవని భావిస్తున్నాం‘ అని క్రెడిట్ సూసీ తెలిపింది. 6జీతో మరింత ఊతం .. మెటావర్స్ వ్యవస్థకు 5జీ టెలికం సర్వీసులు తోడ్పడనున్నప్పటికీ దీన్ని మరిన్ని అవసరాల కోసం వినియోగంలోకి తెచ్చేందుకు 6జీ మరింత ఉపయోగకరంగా ఉంటుందని నివేదిక తెలిపింది. మిగతా విభాగాలతో పోలిస్తే ఎక్కువగా గేమింగ్ సెగ్మెంట్లో మెటావర్స్ వినియోగం ఉండవచ్చని పేర్కొంది. దేశీయంగా గేమింగ్ ఇంకా ప్రాథమిక స్థాయిలోనే ఉందని తెలిపింది. అందుబాటు ధరల్లోని స్మార్ట్ఫోన్లు, 4జీ డేటా సర్వీసుల కారణంగా అధిక స్థాయిలో గేమింగ్.. మొబైల్ ఫోన్ల ద్వారానే ఉంటోందని వివరించింది. ‘స్థిరమైన బ్రాడ్‌బ్యాండ్ లభ్యత తక్కువగా ఉన్నందు వల్ల ఆన్లైన్ వినియోగానికి భారత యూజర్లు.. మొబైల్ ఇంటర్నెట్‌పైనే ఎక్కువగా ఆధారపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆన్లైన్ గేమ్స్‌కు సంబంధించి మొబైల్ గేమింగ్ వాటా భవిష్యత్‌లో పెరిగే అవకాశాలు ఉన్నాయి‘ అని క్రెడిట్ సూసీ పేర్కొంది. -
భారత్ ఎకానమీకి ఢోకాలేదు.. క్రెడిట్ సూసీ నివేదిక
India Economy Likely to Grow 9% Next Fiscal: భారత్ ఆర్థిక వ్యవస్థ పటిష్ట రికవరీకి ఢోకా ఉండబోదని అంతర్జాతీయ ఆర్థిక సేవల దిగ్గజ సంస్థ– క్రెడిట్ సూసీ అంచనావేసింది. మార్చితో ముగిసే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021–22) వృద్ధి రేటు 10.5 శాతం వరకూ ఉండే వీలుందని పేర్కొంది. వృద్ధి అంచనా 8.4–9.5 శాతం శ్రేణిలో ఉంటుందన్న వివిధ అభిప్రాయాలు, అంచనాలకు భిన్నంగా క్రెడిట్ సూసీ విశ్లేషణ ఉండడం గమనార్హం. 2021–22లో 9.5 శాతం వృద్ధి నమోదవుతుందని ఆర్బీఐ అంచనాకాగా, అంతర్జాతీయ రే టింగ్ దిగ్గజ సంస్థ– ఫిచ్ విషయంలో ఈ అంచనా 8.4 శాతంగా ఉంది. ఇక వచ్చే ఆర్థిక సంవత్సరం వృద్ధి రేటు 9 శాతంగా నమోదవుతుందని స్విస్ బ్రో కరేజ్ దిగ్గజ సంస్థ పేర్కొంది. క్రెడిట్ సూసీలో ఆసియా పసిఫిక్, ఇండియా ఈక్విటీ స్ట్రాటజిస్ట్ నీల కంత్ మిశ్రా విశ్లేషణల్లో ముఖ్యాంశాలు పరిశీలిస్తే... * ఆర్థిక వ్యవస్థ సానుకూలతలోనే కొనసాగుతుంది. వచ్చే మూడు నుంచి ఆరు నెలల కాలంలో దిగువ ఆదాయ ఉద్యోగాల్లో సైతం రికవరీ కొనసాగే అవకాశం ఉంది. * ఇంధన, ముడి పదార్థాల ధరలు భారత్ ఎకానమీకి ప్రస్తుతం ఉన్న ప్రధాన సవాలు. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్, గ్యాస్, బొగ్గు, ఎరువులు, పామ్ ఆయిల్ ధరలు ఇలానే పెరుగుతూ పోతే వృద్ధి వేగం మందగించే అవకాశం ఉంటుంది. * విద్య, రవాణా, నిర్మాణ రంగం, ఆటో వంటి కొన్ని రంగాల్లో ఉపాధి కల్పన ఇంకా తక్కువగా ఉండడం ఆందోళన కలిగిస్తున్న మరో అంశం. ఆయా రంగాలు ఇంకా కోవిడ్ ముందస్తు స్థితికి చేరుకోలేదు. అయితే ఎకానమీ పూర్తిగా తెరుచుకునే క్రమంలో ఈ రంగాలూ పురోగమించే వీలుంది. * మహమ్మారి సమయంలో మూలధన కల్పనా సమస్యలు తీవ్రంగా ఉన్నాయి. వినియోగదారు వ్యయాలు పెరగడం, పటిష్ట స్థాయిలో ఈక్విటీ ఫండ్ పెరుగుదల ఈ సవాళ్ల పరిష్కారానికి దోహదపడతాయి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ రంగం), నిర్మాణ రంగాల్లో డిమాండ్ క్రమంగా మెరుగుపడుతుండడం సానుకూలాంశాలు. * ఇక మార్కెట్ల విషయానికి వస్తే, గ్లోబల్ ఈక్విటీల కంటే దేశంలో ప్రైస్–టూ–ఎర్నింగ్స్ (పీఈ) రేషియో ప్రీమియం 21 శాతంగా ఉంది. అభివృద్ధి చెందుతున్న మార్కెట్లతో పోల్చితే 72 శాతం ఇప్పటికే అధికంగా ఉంది. ఆయా అంశాలు పరిశీలిస్తే, ఈక్విటీ మార్కెట్లలో మరింత అప్‌ట్రెండ్ మరింత ఉండకపోవచ్చు. అయితే మహమ్మారి నేపథ్యంలో తీవ్రంగా పడిపోయిన మార్కెట్లకు ‘2021–22, 2022–23 ఆర్థిక సంవత్సరాల్లో సానుకూల అంచనాలు’ తిరిగి బలాన్ని ఇచ్చాయి. 2023–24లో కూడా ఇదే అంచనాల వల్ల మార్కెట్లు భారీగా పడిపోయే అవకాశాలు తక్కువే. * దేశ స్థూల ఆర్థిక అంశాలను పరిశీలిస్తే వృద్ధికి సానుకూలంగానే ఉన్నాయి. ద్రవ్యలోటు పరిస్థితి అదుపులో ఉంది. ప్రభుత్వ ఆదాయాలు మెరుగ్గా ఉండడం ఎకానమీకి కలిసి వచ్చే అంశం. విదేశీ మారకద్రవ్య నిల్వల పటిష్టత అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితిని ఎదుర్కొనగలుగుతుంది. * కొత్త కోవిడ్ వేరియంట్ ఒమిక్రాన్ లేదా డెల్టా వేరియంట్ యొక్క అవశేష ప్రభావం భారతదేశం కంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఎక్కువ ప్రభావం చూపే అవకాశం ఉంది. చదవండి: వడ్డీరేట్లపై ఆర్బీఐ ప్రకటన.. సర్దుబాటుకే మొగ్గు! -
భారత్‌లో మిలీనియర్లు ఎంతమందో తెలుసా?
సాక్షి, న్యూఢిల్లీ : భారత్‌లో మిలీనియర్లు, వారి సంపద చాలా వేగవంతంగా పెరుగుతోంది. ప్రస్తుతం భారత్ 2,45,000 మంది మిలీనియర్లకు నివాసంగా మారిందని, వీరి మొత్తం సంపద 5 ట్రిలియన్ డాలర్లకు ఎగిసినట్టు క్రెడిట్ స్యూజ్ వెల్లడించింది. వచ్చే ఏళ్లలో మిలీనియర్ల సంఖ్య 3,72,000కు పెరుగుతుందని, వీరి ఆదాయం కూడా వార్షికంగా 7.5 శాతం పైకి ఎగిసి, 2022 నాటికి 7.1 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుందని తెలిపింది. క్రెడిట్ స్యూజ్ గ్లోబల్ హెల్త్ రిపోర్టు ప్రకారం భారత సంపద వార్షికంగా 9.9 శాతం పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా పెరిగిన దానికంటే వేగంగా భారత్‌లోనే పెరుగుతుందని క్రెడిట్ స్యూజ్ తెలిపింది. అంతేకాక 451 బిలియన్ డాలర్ల సంపద వృద్ధితో గ్లోబల్‌గా అతిపెద్ద సంపద ఆర్జిస్తున్న 8వ దేశంగా భారత్ నిలుస్తుందని పేర్కొంది. '' భారత్‌లో సంపద చాలా వేగంగా పెరుగుతుంది. కానీ అందరూ ఈ వృద్ధిలో పాలు పంచుకోవడం లేదు. 92 శాతం మంది వయోజన జనాభా సంపద ఇంకా 10వేల డాలర్ల కంటే తక్కువగానే ఉంది'' అని రిపోర్టు వివరించింది. చాలా తక్కువ మొత్తంలో జనాభా నికర సంపద మాత్రమే లక్ష డాలర్లకు పైన ఉందని తెలిపింది. క్రెడిట్ స్యూజ్ విడుదల చేసిన రిపోర్టులో వ్యక్తిగత సంపద ఎక్కువగా ఆస్తులు, రియల్ అసెట్స్ ఆధిపత్య స్థానంలో ఉన్నాయి. ఇవి గృహాదాయంలో 86 శాతాన్ని ఆక్రమించుకున్నాయని వెల్లడైంది. స్థూల ఆస్తుల్లో వ్యక్తిగత రుణాలు కేవలం 9 శాతమేనని రిపోర్టులో తెలిసింది. -
చైనాలో తగ్గి... జపాన్ లో పెరుగుతున్నారు
హైదరాబాద్ : ప్రపంచ దేశాలతో పోల్చితే అమెరికాలో అత్యధికంగా మిలియనీర్లు ఉండటం పెద్దగా ఆశ్చర్యపడాల్సిన విషయమేమీ కాదు. అయితే ఆశ్చర్యకరంగా ఆ జాబితాలోకి చిన్న దేశం అందునా భూకంపాలతో సతమతమయ్యే జపాన్ మిలియనేర్ల జాబితాలను పెంచుకుంటూ దూసుకురావడం విశేషం. ఆయా దేశాల్లో ఉన్న మిలియనీర్ల గణాంకాలతో పోల్చితే ఈ ఏడాది జపాన్ దేశంలో ఎవరూ ఊహించని విధంగా ఆ జాబితా విపరీతంగా పెరిగింది. క్రెడిట్ స్యూజ్ తాజా నివేదిక మిలియనీర్ల క్లబ్ లో జపాన్ దూసుకొస్తున్న విషయం వెల్లడైంది. మిలినీయర్ క్లబ్లో (అత్యధికంగా మిలియనీర్లు ఉన్న దేశాలు) అగ్రరాజ్యం అమెరికా మొదటిస్థానంలో ఉన్నప్పటికీ, మిలియనీర్ల జనాభా వృద్ధి రేటును మిగతా అన్ని దేశాలకన్నా జపాన్ ముందంజలో ఉండటం గమనార్హం. ప్రస్తుతం జపాన్ దేశంలో 2.8 మిలియన్ మిలియనీర్లు ఉన్నారు. అయితే గత ఏడాదితో (2015) పోల్చితే ఆ సంఖ్య 7,80,000 ఎక్కువని క్రెడిట్ స్యూజ్ నివేదిక తేల్చింది. మిలియనేర్ల జాబితా పెరుగుదల రేటు పరిశీలిస్తే... జపాన్ కంటే అమెరికా మిలీనియర్ల జాబితా చాలా తక్కువగా పెరిగింది. మిలియనేర్ల సంఖ్య పెరిగిన దేశాల్లో జపాన్ తర్వాత జర్మని (+44,000), తైవాన్ (+27,000), ఇటలీ (+11,000) లు నిలిచాయి. 2015 సంవత్సరంతో పోల్చితే చాలా పెద్ద పెద్ద దేశాల్లో సైతం మిలీనియర్ల జాబితా అంతగా పెరక్కపోగా తక్కడం గమనార్హం. గతేడాదితో పోల్చితే యునైటెడ్ కింగ్ డమ్ (యూకే) మిలియనీర్ల జాబితా గణనీయంగా 4,06,000 పడగొట్టుకుని 2.2 మిలియన్ల మిలీనియర్లగా నమోదైంది. మిలీనియర్ల సంఖ్యను పడిపోవడంలో యూకే తర్వాత స్థానాల్లో స్విట్జర్లాండ్ (-58,000), చైనా (-43,000) లు ఉన్నాయని క్రెడిట్ స్యూజ్ రిపోర్టు తెలిపింది. అలా మిలియనీర్ల సంఖ్య పెరక్కపోగా ఆస్ట్రేలియా, బ్రెజిల్, రష్యా లాంటి దేశాల్లో కూడా తగ్గారని నివేదిక వెల్లడించింది.