సాధారణంగా కంపెనీల అధినేతలు తమ సొంత ప్రయోజనాల కోసమే ఆలోచిస్తారు. ఉద్యోగులను ప్రయోజనాలను పట్టించుకోరు. కానీ ఓ కంపెనీ ఫౌండర్ తీసుకున్న నిర్ణయం ఆ సంస్థలోని 400 మంది ఉద్యోగులను కోటీశ్వరులను చేసింది.
భారతీయ సంతతికి చెందిన జ్యోతి బన్సల్ తన మొదటి సాఫ్ట్‌వేర్ స్టార్టప్ యాప్‌డైనమిక్స్‌ను 2017లో విక్రయించినప్పుడు తన కెరీర్‌లో అత్యంత కఠినమైన నిర్ణయం తీసుకున్నారు. తన స్టార్టప్‌ను 3.7 బిలియన్ డాలర్లకు (ప్రస్తుత విలువ రూ. 31,090 కోట్లు) సిస్కోకు విక్రయించడం అప్పుడు సరైన నిర్ణయమేనని ఆయన భావించారు. కంపెనీలో 14 శాతానికి పైగా వాటా ఉన్న బన్సల్‌కు కూడా ఈ ఒప్పందం ఆర్థికంగా ముఖ్యమైనది.
సిస్కో ఆఫర్‌ను అంగీకరించిన తర్వాత 400 మంది యాప్‌డైనమిక్స్ ఉద్యోగుల షేర్స్ విలువ ఒక మిలియన్ డాలర్లకు ఎగబాకినట్లు బన్సల్ ప్రతినిధి తెలిపారు. దీంతో వీరందరూ కోటీశ్వరులయ్యారు.
అప్లికేషన్స్ అండ్ బిజినెస్ పెర్ఫార్మెన్స్ మానిటరింగ్ సాఫ్ట్‌వేర్ కంపెనీ అయిన యాప్‌డైనమిక్స్‌ను జ్యోతి బన్సల్ 2008లో స్థాపించారు. ఈ స్టార్టప్ సరిగ్గా ఐపీఓకి వచ్చే ఒక రోజు ముందు విక్రయించారు. ఐఐటీ ఢిల్లీ పూర్వ విద్యార్థి అయిన బన్సాల్ ప్రస్తుతం ట్రేసబుల్, హార్నెస్ అనే మరో రెండు సాఫ్ట్‌వేర్ స్టార్టప్‌లకు సీఈవో, కో ఫౌండర్.
ఎవరీ జ్యోతి బన్సల్?
జ్యోతి బన్సల్ రాజస్థాన్‌లోని ఒక చిన్న పట్టణంలో పుట్టి పెరిగారు. ఆయన తండ్రి నీటిపారుదల యంత్రాలను విక్రయించే వ్యాపారం చేసేవాడు. 1999లో ఢిల్లీ ఐఐటీ నుంచి కంప్యూటర్ సైన్స్‌లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేశారు. నెక్ట్స్ జనరేషన్ టెక్నాలజీ అభివృద్ధిలో మక్కువ ఉన్న జ్యోతి బన్సల్ 2017లో ఆయన బిగ్ ల్యాబ్స్‌ను ప్రారంభించారు. 2018లో జాన్ వ్రియోనిస్‌తో కలిసి అన్‌యూజవల్ వెంచర్స్‌ను సహ-స్థాపించారు. జ్యోతి బన్సల్ ప్రస్తుతం యూఎస్‌లోని శాన్ ఫ్రాన్సిస్కోలో ఉంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment