appdynamics
-
400 మంది ఉద్యోగులను కోటీశ్వరులను చేశాడు!
సాధారణంగా కంపెనీల అధినేతలు తమ సొంత ప్రయోజనాల కోసమే ఆలోచిస్తారు. ఉద్యోగులను ప్రయోజనాలను పట్టించుకోరు. కానీ ఓ కంపెనీ ఫౌండర్ తీసుకున్న నిర్ణయం ఆ సంస్థలోని 400 మంది ఉద్యోగులను కోటీశ్వరులను చేసింది.భారతీయ సంతతికి చెందిన జ్యోతి బన్సల్ తన మొదటి సాఫ్ట్వేర్ స్టార్టప్ యాప్‌డైనమిక్స్‌ను 2017లో విక్రయించినప్పుడు తన కెరీర్లో అత్యంత కఠినమైన నిర్ణయం తీసుకున్నారు. తన స్టార్టప్‌ను 3.7 బిలియన్ డాలర్లకు (ప్రస్తుత విలువ రూ. 31,090 కోట్లు) సిస్కోకు విక్రయించడం అప్పుడు సరైన నిర్ణయమేనని ఆయన భావించారు. కంపెనీలో 14 శాతానికి పైగా వాటా ఉన్న బన్సల్‌కు కూడా ఈ ఒప్పందం ఆర్థికంగా ముఖ్యమైనది. సిస్కో ఆఫర్‌ను అంగీకరించిన తర్వాత 400 మంది యాప్‌డైనమిక్స్ ఉద్యోగుల షేర్స్ విలువ ఒక మిలియన్ డాలర్లకు ఎగబాకినట్లు బన్సల్ ప్రతినిధి తెలిపారు. దీంతో వీరందరూ కోటీశ్వరులయ్యారు.అప్లికేషన్స్ అండ్ బిజినెస్ పెర్ఫార్మెన్స్ మానిటరింగ్ సాఫ్ట్వేర్ కంపెనీ అయిన యాప్‌డైనమిక్స్‌ను జ్యోతి బన్సల్ 2008లో స్థాపించారు. ఈ స్టార్టప్ సరిగ్గా ఐపీఓకి వచ్చే ఒక రోజు ముందు విక్రయించారు. ఐఐటీ ఢిల్లీ పూర్వ విద్యార్థి అయిన బన్సాల్ ప్రస్తుతం ట్రేసబుల్, హార్నెస్ అనే మరో రెండు సాఫ్ట్వేర్ స్టార్టప్‌లకు సీఈవో, కో ఫౌండర్.ఎవరీ జ్యోతి బన్సల్?జ్యోతి బన్సల్ రాజస్థాన్‌లోని ఒక చిన్న పట్టణంలో పుట్టి పెరిగారు. ఆయన తండ్రి నీటిపారుదల యంత్రాలను విక్రయించే వ్యాపారం చేసేవాడు. 1999లో ఢిల్లీ ఐఐటీ నుంచి కంప్యూటర్ సైన్స్‌లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేశారు. నెక్ట్స్ జనరేషన్ టెక్నాలజీ అభివృద్ధిలో మక్కువ ఉన్న జ్యోతి బన్సల్ 2017లో ఆయన బిగ్ ల్యాబ్స్‌ను ప్రారంభించారు. 2018లో జాన్ వ్రియోనిస్తో కలిసి అన్‌యూజవల్ వెంచర్స్‌ను సహ-స్థాపించారు. జ్యోతి బన్సల్ ప్రస్తుతం యూఎస్‌లోని శాన్ ఫ్రాన్సిస్కోలో ఉంటున్నారు. -
కంపెనీ పెట్టి.. 25వేల కోట్లకు అమ్మేశాడు!
అతడు ఢిల్లీ ఐఐటీలో చదివాడు. తర్వాత అమెరికాలో యాప్ డైనమిక్స్ అనే సాఫ్ఘ్వేర్ కంపెనీ పెట్టాడు. దాని పనితీరు బాగుందని సిస్కో కంపెనీ దానిమీద కన్నేసింది. మంచి డీల్ ఆఫర్ చేసింది. ఇంకేముంది, బ్రహ్మాండంగా తన కంపెనీని అమ్మేశాడా యువకుడు. అతడిపేరు జ్యోతి బన్సల్. యాప్ డైనమిక్స్ వ్యవస్థాకుడు, చైర్మన్. అతడి కంపెనీని కొనేందుకు సిస్కో సిస్టమ్స్ ఆఫర్ చేసిన ధర.. అక్షరాలా రూ. 25 వేల కోట్లు!! ఈ మధ్య కాలంలో ఇంత పెద్ద మొత్తంలో డీల్ జరిగిన దాఖలాలు లేవు. ఇన్నాళ్లూ కేవలం టెక్నాలజీ డెవలప్మెంట్కు మాత్రమే పరిమితమవుతూ వచ్చిన సిస్కో లాంటి కంపెనీలు ఇప్పుడు క్లౌడ్ కంప్యూటింగ్ వైపు కూడా విస్తరిస్తున్నాయి. ఇంతకుముందు సరిగ్గా వారం క్రితం హ్యూలెట్ పాకార్డ్ (హెచ్‌పీ) కంపెనీ కూడా సింప్లివిటీ అనే మరో సాఫ్ట్వేర్ కంపెనీని రూ. 4418 కోట్లకు కొనుగోలు చేసింది. విదేశాల్లో ఉన్న డబ్బును తెప్పించుకునేలా అమెరికన్ కంపెనీలను ప్రోత్సహించాలన్న ట్రంప్ ఆలోచనలకు అనుగుణంగానే ఈ కంపెనీలు పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. అందుకే సిస్కో లాంటి పెద్దస్థాయి టెక్నాలజీ కంపెనీలు తమ వ్యాపారాన్ని విస్తరించుకుంటున్నాయి. తమ కంపెనీ దీర్ఘకాలిక వ్యూహాల కోసం ఈ టేకోవర్ బాగా ఉపయోగపడుతుందని సిస్కో కార్పొరేట్ డెవలప్మెంట్ వైస్ ప్రెసిడెంట్ రాబ్ సాల్వాంగో చెప్పారు. యాప్ డైనమిక్స్ సంస్థ అప్లికేషన్లను మేనేజ్ చేయడంతో పాటు వాటిని విశ్లేషిస్తుంది. దానికి 2వేల మందికి పైగా కస్టమర్లున్నారు. నాస్డాక్, నైక్, ఇప్పటివరకు సిస్కో కూడా ఈ కంపెనీ కస్టమర్లే. వాస్తవానికి ఎప్పటినుంచో యాప్ డైనమిక్స్ సంస్థ ఐపీఓకు వెళ్లాలని చూస్తోంది. సరిగ్గా ఇలాంటి తరుణంలోనే సిస్కో రంగంలోకి దిగింది. దాంతో ఒక్కసారిగా కంపెనీ ప్రాధాన్యాలు మారిపోయాయి. వాస్తవానికి యాప్ డైనమిక్స్ సంస్థకు 2015 నవంబర్ నెలలో వాల్యుయేషన్ చేయిస్తే, దాని విలువ సుమారు 12915 కోట్ల రూపాయలని తేలింది. కానీ, దాదాపు దానికి రెట్టింపు ధరను సిస్కో ఆఫర్ చేయడంతో ఇక కాదనలేకపోయారు.