సాక్షి, న్యూఢిల్లీ: రాజస్తాన్ అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగిన అభ్యర్థుల్లో ఏకంగా 35 శాతం మంది కోటీశ్వరులే! బరిలో నిలిచిన 1,875 మంది అభ్యర్థుల అఫిడవిట్లను విశ్షించి అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫారమ్స్ (ఏడీఆర్), రాజస్తాన్ ఎలక్షన్ వాచ్ ఈ మేరకు తేల్చాయి. వారి ఆస్తులు, క్రిమినల్ కేసుల వివరాలతో శనివారం నివేదిక విడుదల చేశాయి.
బీజేపీ, కాంగ్రెస్‌ల్లో కోటీశ్వరులదే హవా ఏడీఆర్ నివేదిక ప్రకారం రాజస్తాన్‌లో బరిలో నిలిచిన అభ్యర్థుల్లో 651 (35%) మంది కోటీశ్వరులున్నారు. ప్రధాన పారీ్టలు కాంగ్రెస్, బీజేపీ కూడా వారికే ఎక్కువగా టికెట్లిచ్చాయి. మొత్తం 200 అసెంబ్లీ స్థానాకలు గాను బీజేపీ నుంచి 176 మంది, కాంగ్రెస్ నుంచి 167 మంది రూ.కోటికి మించి ఆస్తులు ప్రకటించారు. ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి 29 మంది, బీఎస్పీ నుంచి 36 మంది కూడా కోటీశ్వరులే.
చురు కాంగ్రెస్ అభ్యర్థి రఫీక్ మండేలియా రూ.166 కోట్లతో అందర్లోనూ సంపన్నుడిగా నిలిచారు. రూ.123 కోట్లతో నీమ్ కా థానా బీజేపీ అభ్యర్థి ప్రేమ్ సింగ్ బజోర్ రెండో స్థానంలో ఉన్నారు. అయితే 8 అభ్యర్థులు తమకు ఒక్క రూపాయి ఆస్తి కూడా లేదని పేర్కొనడం విశేషం. 922 మంది తమకు అప్పులున్నట్టు వెల్లడించారు. ఇక 326 మంది అభ్యర్థులపై క్రిమినల్ కేసులున్నాయి. బీజేపీ 61 మందికి, కాంగ్రెస్ 47, ఆప్ 18, బీఎస్పీ 12 మంది నేర చరితులకు టికెట్లిచ్చాయి.
క్రిమినల్ కేసులున్న ముగ్గురు, అంతకంటే ఎక్కువ మంది బరిలో ఉన్న రెడ్ అలర్ట్ నియోజకవర్గాలు రాష్ట్రంలో 45 ఉన్నాయి. 643 మంది, 34 శాతం మంది అభ్యర్థులు 25–40 ఏళ్ల మధ్య వయస్కులు. 80 ఏళ్ల పై చిలుకు అభ్యర్థులు 8 మంది ఉన్నారు. 183 మంది, అంటే 10 శాతం మంది పోటీలో ఉన్నారు. 137 మంది అభ్యర్థులు కేవలం అక్షరాస్యులు కాగా 11 మంది నిరక్షరాస్యులమని ప్రకటించారు. కోటీశ్వరుల్లో చాలామంది కోట్లలో అప్పు కూడా చూపించారు.
Comments
Please login to add a commentAdd a comment