ADR Report
-
అత్యంత ధనిక సీఎం చంద్రబాబు
సాక్షి, న్యూఢిల్లీ: పూర్వం రెండెకరాల భూమికి మాత్రమే యజమానిని అని చెప్పుకునే వ్యక్తి ఇప్పుడు ఏకంగా వందల కోట్లకు అధిపతి అని అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ సంస్థ(ఏడీఆర్) కుండబద్ధలు కొట్టింది. భారతదేశంలోని ఎన్నికల ప్రక్రియలో సమూల సంస్కరణ కోసం అవిశ్రాంతంగా పోరాడుతున్న ఏడీఆర్ సంస్థ సోమవారం పలు రాష్ట్రాల ముఖ్యమంత్రుల ఆస్తుల చిట్టాను విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చాలా సంవత్సరాలపాటు అధికారం చలాయించి, ప్రస్తుతం సైతం ఏపీ సీఎం కుర్చీపై కూర్చున్న చంద్రబాబు నాయుడు పేరిట ఏకంగా రూ.931 కోట్లకుపైగా ఆస్తులు ఉన్నాయని ఏడీఆర్ సోమవారం విడుదల చేసిన ఒక నివేదికలో ప్రకటించింది. ప్రస్తుతం భారతదేశంలో అత్యంత ధనిక ముఖ్యమంత్రి చంద్ర బాబేనని స్పష్టం చేసింది. 2023–24 ఆర్థిక సంవత్సరంలో దేశంలో వార్షిక తలసరి ఆదాయం కేవలం రూ.1,85,854 కాగా సగటున ముఖ్యమంత్రి తలసరి ఆదాయం ఏకంగా రూ.13,64,310కు పెరిగింది. అంటే దేశంలో వార్షిక తలసరి సగటు కంటే సీఎం ఆదాయం ఏకంగా 7.3 రెట్లు అధికంగా ఉంది. దేశంలోని మొత్తం 31 మంది ముఖ్యమంత్రుల ఆస్తుల విలువ రూ.1,630 కోట్లుగా ఉందని నివేదిక వెల్లడించింది. మోదీ సర్కార్ విధానాలను తీవ్రంగా తప్పుబట్టే తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ మమతా బెనర్జీ పేరిట కేవలం రూ.15 లక్షల ఆస్తులు ఉండటం విశేషం. చంద్రబాబు తర్వాత దేశంలో రెండో అత్యంత ధనిక ముఖ్యమంత్రిగా అరుణాచల్ ప్రదేశ్ సీఎం పేమా ఖండూ నిలిచారు. ఆయన పేరిట రూ.332 కోట్ల ఆస్తులు ఉన్నాయి. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఈ జాబితాలో మూడోస్థానంలో నిలిచారు. ఆయన పేరిట రూ.51.93 కోట్ల ఆస్తులు ఉన్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరిట రూ.30 కోట్లకుపైగా ఆస్తులున్నాయి. ఒక కోటి రూపాయల అప్పు ఉంది. జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా పేరిట రూ.55 లక్షల ఆస్తులున్నాయి. కేరళ ముఖ్యమంత్రి పినరయీ విజయన్ పేరిట రూ.1.18 కోట్ల ఆస్తులున్నాయి. ముఖ్యమంత్రుల సగటు ఆస్తి ఏకంగా రూ.52.59 కోట్లుకావడం గమనార్హం. 42 శాతం సీఎంలపై క్రిమినల్ కేసులు నివేదికల పేర్కొన్న ముఖ్యమంత్రుల్లో 42 శాతం మందిపై.. అంటే 13 మందిపై క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. వీరిలో 32 శాతం మందిపై.. అంటే పది మందిపై హత్య, అపహరణ, ముడుపులు వంటి అత్యంత తీవ్రమైన క్రిమినల్ కేసులున్నాయి. అత్యధిక క్రిమినల్ కేసులు ఉన్న ముఖ్యమంత్రిగా తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి నిలిచారు. ఆయనపై ఏకంగా 89 కేసులు పెండింగ్‌లో ఉండగా వాటిలో 72 కేసులు తీవ్రమైన నేరాలకు సంబంధించినవి ఉన్నాయి. రేవంత్‌రెడ్డి తర్వాత స్థానాల్లో 47 కేసులతో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, 19 కేసులతో చంద్రబాబు ఉన్నారు. అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి ఖండూకు అత్యధికంగా రూ.180 కోట్ల అప్పులు ఉన్నాయి. సిద్ధరామయ్య రూ. 23 కోట్లు, చంద్రబాబు నాయుడుకు రూ.10 కోట్లకు పైగా అప్పులు ఉన్నాయని ఏడీఆర్ తన నివేదికలో పేర్కొంది. 31 మంది సీఎంలలో 9 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్లు కాగా, ఇద్దరు డాక్టరేట్ పట్టా పొందారు. అఫిడవిట్లు దాఖలు చేసే సమయానికి ఆరుగురు ముఖ్యమంత్రులు 71 నుంచి 80 ఏళ్ల మధ్య వయసు్కలు కాగా, 12 మంది సీఎంలు 51 నుంచి 60 ఏళ్ల మధ్య వయసు్కలేనని ఏడీఆర్ నివేదిక పేర్కొంది. మొత్తం 31 మంది ముఖ్యమంత్రుల్లో కేవలం ఇద్దరే మహిళా సీఎంలు(మమతా బెనర్జీ, అతిశి మార్లేనా) ఉన్నట్టు తెలిపింది. -
538 నియోజకవర్గాల ఓట్లలో తేడా: ఏడీఆర్
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో ఏకంగా 538 నియోజకవర్గాల్లో పోలైన ఓట్లు, లెక్కించిన ఓట్ల మధ్య వ్యత్యాసం ఉందని ఆసోసియేషన్ ఫర్ డెమొక్రాటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) సోమవారం తెలిపింది. 362 నియోజకవర్గాల్లో పోలైన ఓట్ల కంటే.. లెక్కించిన ఓట్లు తక్కువగా ఉన్నాయని వెల్లడించింది. ఈ 362 నియోజకవర్గాల్లో పోలైన ఓట్ల కంటే.. లెక్కించిన ఓట్లు 5,54,596 తక్కువగా ఉన్నాయని వివరించింది. అలాగే 176 నియోజకవర్గాల్లో పొలైన ఓట్ల కంటే.. లెక్కించిన ఓట్లు 35,093 అదనంగా ఉన్నాయని తెలిపింది. దీనిపై ఎన్నికల కమిషన్ ఇంకా స్పందించలేదు. -
Association of Democratic Reforms: ఎంపీల్లో 46 శాతం నేర చరితులు
న్యూఢిల్లీ: లోక్‌సభకు తాజాగా ఎన్నికైన 543 మందిలో 46 శాతం అంటే 251 మంది నేరచరితులు ఉన్నారని అసోసియేషన్ ఆఫ్ డెమొక్రటిక్ రిఫామ్స్(ఏడీఆర్) నివేదించింది. ఈ 251 మందిలో 27 మంది దోషులుగా తేలారు. నేర చరితులు ఇంత భారీ సంఖ్యలో దిగువసభకు ఎన్నికవడం ఇదే మొదటిసారి అని ఏడీఆర్ పేర్కొంది. 2014 ఎన్నికల్లో 34 శాతం అంటే 185 మంది, 2009లో 30 శాతం అంటే 162 మంది, 2004లో 23 శాతం అంటే 125 మంది క్రిమినల్ కేసులున్న వారు లోక్‌సభకు ఎన్నికైనట్లు ఏడీఆర్ వెల్లడించింది. -
లోక్‌సభ అభ్యర్థుల్లో31% సంపన్నులు... 20% నేరచరితులు
సార్వత్రిక ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల్లో 30.8 శాతం మంది కోటీశ్వరులే. అలాగే 20 శాతం (1,643) మంది క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నారు. వారిలో 1,190 మందిపై అత్యాచారం, హత్య, హత్యాయత్నం, కిడ్నాప్, మహిళలపై నేరాల వంటి తీవ్రమైన కేసులున్నాయి. మొత్తం 8,360 మంది అభ్యర్థుల్లో 8,337 మంది అఫిడవిట్లను విశ్లేíÙంచిన మీదట అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫామ్స్ (ఏడీఆర్), నేషనల్ ఎలక్షన్ వాచ్ సంస్థలు బుధవారం నివేదిక విడుదల చేశాయి. మొత్తం అభ్యర్థుల్లో 1,333 మంది జాతీయ పారీ్టల తరఫున, 532 మంది రాష్ట్ర పారీ్టల నుంచి, 2,580 మంది రిజిస్టర్డ్ పారీ్టల నుంచి బరిలో ఉన్నారు. 3,915 మంది స్వతంత్ర అభ్యర్థులు. మొత్తం 751 పారీ్టలు పోటీలో ఉన్నాయి. 2019లో 677 పార్టీలు, 2014లో 464, 2009 ఎన్నికల్లో 368 పారీ్టలు పోటీ చేశాయి. 2009 నుంచి∙2024 వరకు ఎన్నికల బరిలో నిలిచిన రాజకీయ పారీ్టల సంఖ్య 104% పెరిగింది. కాగా మరోసారి సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసిన 324 మంది సిట్టింగ్ ఎంపీల సంపద గత ఐదేళ్లలో సగటున 43% పెరిగింది. పెరుగుతున్న మహిళాæ అభ్యర్థులు లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న మహిళల సంఖ్య ఈసారీ స్వల్పంగానే ఉంది. కేవలం 797 మంది మాత్రమే బరిలో ఉన్నారు. అయితే గత మూడు లోక్‌సభ ఎన్నికల నుంచి వారి సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తోంది. 2009లో 7 శాతం, 2014లో 8 శాతం, 2019లో 9 శాతం మహిళలు లోక్‌సభ బరిలో నిలవగా ఈసారి 10 శాతానికి చేరారు. ఈ ఎన్నికల్లో బీజేపీ 69 మంది మహిళలకు, కాంగ్రెస్ 41 మందికి టికెట్లిచ్చాయి.సగానికి పైగా రెడ్ అలర్ట్ స్థానాలే...క్రిమినల్ కేసులున్న అభ్యర్థుల సంఖ్య 2019 లోక్‌సభ ఎన్నికల్లో 1,500 కాగా ఈసారి 1,643కు పెరిగింది. మొత్తం 440 మంది అభ్యర్థులలో 191 మంది నేర చరితులతో ఈ జాబితాలో బీజేపీ టాప్‌లో ఉంది. తర్వాతి స్థానాల్లో కాంగ్రెస్ (327 మందిలో 143), బీఎస్పీ (487 మందిలో 63), సీపీఎం (52 మందిలో 33) ఉన్నాయి. 3903 మంది స్వతంత్ర అభ్యర్థులలో 550 (14%) మంది నేర చరితులు. ఈ జాబితాలో టాప్ 5లో కేరళ నుంచి ముగ్గురు, తెలంగాణ, పశి్చమ బెంగాల్ నుంచి ఒక్కొక్కరున్నారు. ముగ్గురు, అంతకంటే ఎక్కువ మంది నేర చరితులున్న (రెడ్ అలర్ట్) స్థానాలు 2019లో 36 శాతం కాగా ఈసారి ఏకంగా 53 శాతానికి పెరిగాయి. ఈ జాబితాలో 288 నియోజకవర్గాలు చేరాయి. అంటే దేశవ్యాప్తంగా ప్రతి రెండు లోక్‌సభ సీట్లలో ఒకటి రెడ్ అలర్ట్ స్థానమే!సంపన్నుల్లో తెలుగు అభ్యర్థులే టాప్–2అభ్యర్థుల్లో కోటీశ్వరులు 2019లో 16 శాతం కాగా ఈసారి 27 శాతానికి పెరిగారు. మొత్తం అభ్యర్థులలో 2,572 మంది కోటీశ్వరులే! ఈ జాబితాలో కూడా బీజేపీయే టాప్‌లో నిలిచింది. 440 మంది బీజేపీ అభ్యర్థుల్లో 403 కోటీశ్వరులే. అంటే 91.6 శాతం! 2019లో ఇది 41.8 శాతమే. 327 మంది కాంగ్రెస్ అభ్యర్థులలో 292 మంది (89%), 487 మంది బీఎస్పీ అభ్యర్థులలో 163 మంది (33%), 52 మంది సీపీఎం అభ్యర్థులలో 27 మంది (52%) ), 3,903 మంది ఇండిపెండెంట్లలో 673 మంది (17%) మంది కోటీశ్వరులు. ఈ జాబితాలో తొలి, రెండో స్థానంలో తెలుగు అభ్యర్థులే ఉండటం విశేషం. ఏపీలోని గుంటూరు టీడీపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ ఏకంగా రూ.5,705 కోట్లతో దేశంలోనే అగ్ర స్థానంలో నిలిచారు. తెలంగాణలోని చేవెళ్ల బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి రూ.4568.22 కోట్లతో రెండో స్థానంలో ఉన్నారు. – సాక్షి, న్యూఢిల్లీ -
Lok Sabha Election 2024: లోక్‌సభ అభ్యర్థుల్లో... 121 మంది నిరక్షరాస్యులు
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న వారిలో 121 మంది నిరక్షరాస్యులు. 359 మంది 5వ తరగతి దాకా, 647 మంది 8వ తరగతి వరకు చదువుకున్నారు. 1,303 మంది ట్వెల్త్ గ్రేడ్ పాసయ్యారు. 1,502 మంది డిగ్రీ చదవగా 198 మంది డాక్టరేట్ అందుకున్నారు. అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫామ్స్ (ఏడీఆర్) ఈ మేరకు వెల్లడించింది. ఏడు దశల్లో బరిలో ఉన్న మొత్తం 8,360 మంది అభ్యర్థుల్లో 8,337 మంది విద్యార్హతలను ఏడీఆర్ విశ్లేíÙంచింది. -
Lok Sabha Election 2024: మహిళలు 10 శాతమైనా లేరు!
ఈ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో మహిళల సంఖ్య 10 శాతం కంటే తక్కువే ఉంది! ఈసారి మహిళా అభ్యర్థులు కేవలం 797 మందేనని అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫామ్స్ (ఏడీఆర్) వెల్లడించింది. అంటే 9.5 శాతం! తొలి విడతలో 1,618 మంది అభ్యర్థుల్లో మహిళలు 135 మంది. రెండో విడతలో 1,192 మంది అభ్యర్థుల్లో 100 మంది, మూడో విడతలో 1,352 మందిలో 123, నాలుగో విడతలో 1,717 మందిలో 170, 5వ విడతలో 695 మందిలో 82 మంది మహిళలున్నారు. పోలింగ్ జరగాల్సిన ఆరో విడతలో 869 మంది అభ్యర్థుల్లో 92 మంది మహిళలున్నారు. ఏడో విడతలో కూడా 904 మంది అభ్యర్థుల్లో మహిళలు కేవలం 95 మందే. మహిళా రిజర్వేషన్ల అమలుపై పారీ్టల చిత్తశుద్ధి ఏపాటితో చెప్పేందుకు ఈ ఉదంతం ఒక్కటి చాలని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఈసారి మొత్తం 8,337 మంది అభ్యర్థులు లోక్‌సభ బరిలో నిలిచారు. ఇంతమంది పోటీలో ఉండటం 1996 తర్వాత ఇదే తొలిసారి. 1996లో రికార్డు స్థాయిలో 13,952 మంది పోటీ చేశారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Association for Democratic Reforms: ఆస్తుల్లో టాప్ జిందాల్
లోక్‌సభ ఎన్నికల ఆరో విడతలో పోటీ చేస్తున్న అభ్యర్థులందర్లో బీజేపీ నేత, ప్రముఖ వ్యాపారవేత్త నవీన్ జిందాల్ అత్యధిక ఆస్తులతో తొలి స్థానంలో ఉన్నారు. జిందాల్ స్టీల్ అండ్ పవర్ కంపెనీ చైర్మన్ అయిన నవీన్ హరియాణాలోని కురుక్షేత్ర నుంచి బీజేపీ అభ్యరి్థగా పోటీ చేస్తున్నారు. తనకు రూ.1,241 కోట్ల ఆస్తులున్నట్టు అఫిడవిట్లో వెల్లడించారు. మొత్తం 866 మంది అభ్యర్థుల్లో 39 శాతం మంది కోటీశ్వరులే. వీరికి సగటున రూ.6.21 కోట్ల ఆస్తి ఉన్నట్టు అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రీఫామ్స్ ప్రకటించింది. ఆశ్చర్యకరంగా కురుక్షేత్రలో జిందాల్‌పై ఆప్ కూడా సంపన్న నేతనే పోటీకి దించింది. ఆ పార్టీ అభ్యర్థి సుశీల్‌కుమార్ గుప్తా రూ.169 కోట్ల ఆస్తులతో టాప్–3లో ఉన్నారు. ఒడిశాలో కటక్ బీజేడీ అభ్యర్థి సంతృప్త్ మిశ్రా రూ.482 కోట్లతో రెండో స్థానంలో ఉన్నారు. తనవద్ద కేవలం రెండు రూపాయలే ఉన్నట్టు రోహ్తక్ లోక్‌సభ స్థానంలో స్వతంత్రుడిగా పోటీ చేస్తున్న రణ«దీర్ సింగ్ పేర్కొన్నారు! 180 మందిపై క్రిమినల్ కేసులు ఆరో విడతలో 180 మంది (21 శాతం) అభ్యర్థులపై క్రిమినల్ కేసులు ఉన్నట్టు ఏడీఆర్ వెల్లడించింది. వీరిలో 141 మందిపై సీరియస్ కేసులున్నాయి. 12 మంది తమను దోషులుగా కోర్టు ప్రకటించినట్టు పేర్కొనగా, పలువురు హత్య కేసుల్లోనూ అభియోగాలు ఎదుర్కొంటున్నట్టు వెల్లడించారు. 21 మందిపై హత్యాయత్నం కేసులున్నాయి. 24 మంది మహిళలకు సంబంధించిన కేసుల్లో నిందితులు. ముగ్గురిపై అత్యాచారం కేసులున్నాయి. ఆప్ తరఫున పోటీలో ఉన్న ఐదుగురు, ఆర్జేడీ అభ్యర్థులు నలుగురూ క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నారు. ఎస్పీ అభ్యర్థుల్లో 75 శాతం, బీజేపీ అభ్యర్థుల్లో 55 శాతం మందిపై క్రిమినల్ కేసులున్నాయి. ఆర్జేడీకి చెందిన నలుగురూ, ఆప్‌నకు చెందిన నలుగురు (80 శాతం), ఎస్పీ నుంచి 12 మంది (75 శాతం) బీజేడీ నుంచి 18 మంది (35 శాతం)పై సీరియస్ క్రిమినల్ కేసులున్నాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Lok sabha elections 2024: బరిలో కుబేరులు
లోక్‌సభ ఎన్నికల బరిలో దిగుతున్న వారిలో కోట్లకు పడగలెత్తిన వారి సంఖ్య అనూహ్యంగా పెరుగుతోంది. ప్రధాన పార్టీల టికెట్లు దక్కించుకునేందుకు ధనబలం కూడా ప్రాతిపదికగా మారుతోంది. లోక్‌సభ ఎన్నికల్లో తొలి విడతలో బరిలో ఉన్న 1,625 మంది అభ్యర్థుల్లో ప్రతి ముగ్గురిలో ఒకరు కోటీశ్వరులేనని అసోసియేషన్ ఆఫ్ డెమొక్రటిక్ రైట్స్ (ఏడీఆర్) వెల్లడించింది. దేశవ్యాప్తంగా 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలో 102 లోక్‌సభ స్థానాల్లో ఏప్రిల్ 19న తొలి విడత పోలింగ్ జరగనుంది. బీజేపీ నుంచే ఎక్కువ... తొలి విడతలో మొత్తం 1,625 మంది అభ్యర్థుల్లో 450 మందికి రూ.కోటి, అంతకంటే ఎక్కువ ఆస్తులున్నాయి. జాబితాలో బీజేపీ నుంచి అత్యధికంగా 69 మంది ఉన్నారు. తర్వాతి స్థానాల్లో కాంగ్రెస్ (49 మంది), అన్నాడీఎంకే (35), డీఎంకే (21), బీఎస్పీ (18), టీఎంసీ (4), ఆర్జేడీ (4 మంది) ఉన్నాయి. అభ్యర్థుల సగటు ఆస్తులపరంగా అన్నాడీఎంకే టాప్‌లో ఉంది. ఈ పార్టీ అభ్యర్థులు ఒక్కొక్కరికి సగటున రూ.35.61 కోట్ల ఆస్తులున్నాయి. తొలి దశ అభ్యర్థుల్లో అత్యంత సంపన్నుడిగా మధ్యప్రదేశ్ మాజీ సీఎం కమల్‌నాథ్ కుమారుడు నకుల్‌నాథ్ నిలిచారు. అఫిడవిట్లో వెల్లడించిన ఆయన ఆస్తుల విలువ రూ.717 కోట్లు. ఛింద్వారా సిటింగ్ ఎంపీ అయిన ఆయన ఈసారి కూడా అక్కడినుంచే కాంగ్రెస్ అభ్యరి్థగా పోటీ చేస్తున్నారు. రెండో స్థానంలో తమిళనాడులోని ఈరోడ్ అభ్యర్థి అశోక్ కుమార్ ఉన్నారు. ఈ అన్నాడీఎంకే నేత తనకు రూ.662 కోట్ల ఆస్తులున్నట్టు పేర్కొన్నారు. 10 మంది స్వతంత్ర అభ్యర్థులు తమకు ఎలాంటి ఆస్తులూ లేవని ప్రకటించడం విశేషం! 93 మంది నేరచరితులు తొలి విడతలో బరిలో ఉన్న అభ్యర్థుల్లో నేరచరిత్ర కలిగిన వారి సంఖ్య కూడా ఎక్కువే. జాబితాలో బీజేపీ నుంచి 28 మంది, కాంగ్రెస్ నుంచి 19 మంది ఉన్నారు. తర్వాతి స్థానాల్లో డీఎంకే (13), అన్నాడీఎంకే (13), బీఎస్పీ (11), ఆర్జేడీ (4), ఎస్పీ (3), టీఎంసీ (2) ఉన్నాయి. వీరిలో బీజేపీ నుంచి 14 మందిపై తీవ్ర నేరపూరిత కేసులున్నాయి. ఈ జాబితాలో తర్వాతి స్థానాల్లో కాంగ్రెస్ (8), బీఎస్పీ (8), డీఎంకే (6), అన్నాడీఎంకే (6), ఆర్జేడీ (2), ఎస్పీ (2), టీఎంసీ (1) ఉన్నాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ADR Report: 33% రాజ్యసభ సభ్యులపై క్రిమినల్ కేసులు
న్యూఢిల్లీ: రాజ్యసభలో మొత్తం సభ్యుల సంఖ్య 245. వీరిలో 225 మంది సిట్టింగ్ ఎంపీలపై నమోదైన క్రిమినల్ కేసులు, వారి ఆస్తులను ఎన్నికల హక్కుల సంస్థ అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫారమ్స్(ఏడీఆర్) విశ్లేషించింది. ఒక నివేదిక విడుదల చేసింది. 225 మంది రాజ్యసభ సభ్యుల్లో 33 శాతం మంది(75 మంది)పై క్రిమినల్ కేసులు ఉన్నట్లు గుర్తించింది. ఈ విషయాన్ని వారే స్వయంగా అఫిడవిట్లలో ప్రస్తావించారని వెల్లడించింది. 225 మంది సభ్యుల మొత్తం ఆస్తుల విలువ రూ.19,602 కోట్లు అని తేలి్చంది. అలాగే వీరిలో 14 శాతం మంది.. అంటే 31 మంది బిలియనీర్లు ఉన్నారని తెలియజేసింది. 18 శాతం మంది(40 మంది) ఎంపీలపై హత్య, హత్యాయత్నం వంటి తీవ్రమైన నేరాల్లో కేసులు నమోదయ్యాయని పేర్కొంది. -
Rajasthan Elections 2023: కోట్లకు పడగలెత్తారు
సాక్షి, న్యూఢిల్లీ: రాజస్తాన్ అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగిన అభ్యర్థుల్లో ఏకంగా 35 శాతం మంది కోటీశ్వరులే! బరిలో నిలిచిన 1,875 మంది అభ్యర్థుల అఫిడవిట్లను విశ్షించి అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫారమ్స్ (ఏడీఆర్), రాజస్తాన్ ఎలక్షన్ వాచ్ ఈ మేరకు తేల్చాయి. వారి ఆస్తులు, క్రిమినల్ కేసుల వివరాలతో శనివారం నివేదిక విడుదల చేశాయి. బీజేపీ, కాంగ్రెస్‌ల్లో కోటీశ్వరులదే హవా ఏడీఆర్ నివేదిక ప్రకారం రాజస్తాన్‌లో బరిలో నిలిచిన అభ్యర్థుల్లో 651 (35%) మంది కోటీశ్వరులున్నారు. ప్రధాన పారీ్టలు కాంగ్రెస్, బీజేపీ కూడా వారికే ఎక్కువగా టికెట్లిచ్చాయి. మొత్తం 200 అసెంబ్లీ స్థానాకలు గాను బీజేపీ నుంచి 176 మంది, కాంగ్రెస్ నుంచి 167 మంది రూ.కోటికి మించి ఆస్తులు ప్రకటించారు. ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి 29 మంది, బీఎస్పీ నుంచి 36 మంది కూడా కోటీశ్వరులే. చురు కాంగ్రెస్ అభ్యర్థి రఫీక్ మండేలియా రూ.166 కోట్లతో అందర్లోనూ సంపన్నుడిగా నిలిచారు. రూ.123 కోట్లతో నీమ్ కా థానా బీజేపీ అభ్యర్థి ప్రేమ్ సింగ్ బజోర్ రెండో స్థానంలో ఉన్నారు. అయితే 8 అభ్యర్థులు తమకు ఒక్క రూపాయి ఆస్తి కూడా లేదని పేర్కొనడం విశేషం. 922 మంది తమకు అప్పులున్నట్టు వెల్లడించారు. ఇక 326 మంది అభ్యర్థులపై క్రిమినల్ కేసులున్నాయి. బీజేపీ 61 మందికి, కాంగ్రెస్ 47, ఆప్ 18, బీఎస్పీ 12 మంది నేర చరితులకు టికెట్లిచ్చాయి. క్రిమినల్ కేసులున్న ముగ్గురు, అంతకంటే ఎక్కువ మంది బరిలో ఉన్న రెడ్ అలర్ట్ నియోజకవర్గాలు రాష్ట్రంలో 45 ఉన్నాయి. 643 మంది, 34 శాతం మంది అభ్యర్థులు 25–40 ఏళ్ల మధ్య వయస్కులు. 80 ఏళ్ల పై చిలుకు అభ్యర్థులు 8 మంది ఉన్నారు. 183 మంది, అంటే 10 శాతం మంది పోటీలో ఉన్నారు. 137 మంది అభ్యర్థులు కేవలం అక్షరాస్యులు కాగా 11 మంది నిరక్షరాస్యులమని ప్రకటించారు. కోటీశ్వరుల్లో చాలామంది కోట్లలో అప్పు కూడా చూపించారు. -
రాష్ట్ర ఎమ్మెల్యేల్లో 106 మంది కోటీశ్వరులే!
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలోని ఎమ్మెల్యేల్లో 90శాతం అంటే 106 మంది కోటీశ్వరులేనని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) సంస్థ వెల్లడించింది. అధికార బీఆర్ఎస్కు చెందిన 101 మంది ఎమ్మెల్యేలలో 93 మంది (92%), ఏడుగురు ఎంఐఎం ఎమ్మెల్యేలలో ఐదుగురు (71%), ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలలో నలుగురు (67%), బీజేపీకి ఉన్న ఇద్దరు ఎమ్మెల్యేలు (100%), ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేల ఆస్తులు రూ.కోటి కంటే ఎక్కువేనని తెలిపింది. మొత్తంగా సిట్టింగ్ ఎమ్మెల్యేల సగటు ఆస్తులు రూ.13.57 కోట్లు అని వెల్లడించింది. పార్టీల వారీగా చూస్తే.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సగటు ఆస్తి రూ.14.11 కోట్లు, ఎంఐఎం ఎమ్మెల్యేల సగటు ఆస్తి రూ.10.84 కోట్లు, కాంగ్రెస్ ఎమ్మెల్యేల సగటు ఆస్తి రూ.4.22 కోట్లు, బీజేపీ ఎమ్మెల్యేల సగటు ఆస్తి రూ.32.61 కోట్లు, ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేల సగటు ఆస్తి రూ.4.66 కోట్లుగా తేల్చింది. రాష్ట్రంలో మొత్తం 119 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. అందులో కంటోన్మెంట్ అసెంబ్లీ సెగ్మెంట్ ఖాళీగా ఉంది. ఈ క్రమంలో మిగతా 118 నియోజకవర్గాల సిట్టింగ్ ఎమ్మెల్యేల ఆస్తులు, నేర చరిత్ర తదితర అంశాలపై 2018 ఎన్నికల సమయంలో దాఖలు చేసిన అఫిడవిట్ల ఆధారంగా ఏడీఆర్ సంస్థ శనివారం తమ నివేదికను విడుదల చేసింది. బహిష్కరణకు గురైన, పార్టీని వీడి ఇతర పార్టీలో చేరిక ఖరారుకాని ఇద్దరు ఎమ్మెల్యేలను స్వతంత్రులుగా చూపింది. పార్టీలు మారినవారు 16 మంది ఏడీఆర్ నివేదిక ప్రకారం.. తెలంగాణలో 2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత మొత్తం 16 మంది ఎమ్మెల్యేలు పార్టీలు మారారు. అందులో 12 మంది కాంగ్రెస్ నుంచి గెలిచినవారుకాగా, ఇద్దరు టీడీపీ నుంచి, ఒకరు ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ నుంచి గెలిచారు. వీరంతా బీఆర్ఎస్లో చేరారు. ఇక బీఆర్ఎస్ నుంచి గెలిచిన మల్కాజ్గిరి ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో చేరారు. గ్రాడ్యుయేట్లు 58 శాతమే.. రాష్ట్రంలోని మొత్తం ఎమ్మెల్యేలలో.. 43 మంది (36%) విద్యార్హత 5వ తరగతి నుంచి 12వ తరగతి మధ్య ఉంది. మరో 69 మంది (58%) గ్రాడ్యుయేషన్/ఆపై విద్యార్హత కలిగి ఉన్నారు. ఐదుగురు ఎమ్మెల్యేలు డిప్లొమా చేశారు. ఒక ఎమ్మెల్యే తాను సాధారణ అక్షరాస్యుడినని ప్రకటించుకున్నారు. ఎమ్మెల్యేల వయసును పరిశీలిస్తే.. 43 మంది (36%) వయసు 30 నుంచి 50ఏళ్ల మధ్య ఉండగా, 75 మంది (64%) వయసు 51 నుంచి 80 ఏళ్ల మధ్య ఉంది. మొత్తం 118 మంది ఎమ్మెల్యేల్లో ఆరుగురు (5%) మాత్రమే మహిళా ఎమ్మెల్యేలు ఉన్నారు. రూ.161 కోట్లతో మర్రి జనార్దన్‌రెడ్డి టాప్ అత్యధిక ఆస్తులున్న సిట్టింగ్ ఎమ్మెల్యేల జాబితాలో.. రూ.161 కోట్లతో నాగర్‌కర్నూల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి టాప్‌లో ఉన్నారు. తర్వాతి స్థానాల్లో రూ.91 కోట్లతో కందాల ఉపేందర్‌రెడ్డి (పాలేరు–బీఆర్ఎస్), రూ.91 కోట్లతో పైళ్ల శేఖర్‌రెడ్డి (భువనగిరి–బీఆర్ఎస్) నిలిచారు. మంత్రి కేటీఆర్‌కు రూ.41 కోట్లు ఆస్తులు, రూ.27 కోట్లు అప్పులు ఉండగా.. సీఎం కేసీఆర్‌కు రూ.23 కోట్లు ఆస్తులు, రూ.8కోట్లు అప్పులు ఉన్నట్లు గత అఫిడవిట్లలో చూపారు. బీఆర్ఎస్ను వీడి బీజేపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే ఈటల రాజేందర్ హుజూరాబాద్ ఉప ఎన్నిక సమయంలో చూపిన అఫిడవిట్ ప్రకారం ఆయన ఆస్తులు రూ.56 కోట్లు, అప్పులు రూ.8 కోట్లు కావడం గమనార్హం. యాకుత్‌పురా ఎమ్మెల్యే సయ్యద్ అహ్మద్ పాషాఖాద్రీ రూ.19 లక్షల విలువైన ఆస్తులతో రాష్ట్రంలో తక్కువ ఆస్తులున్న ఎమ్మెల్యేగా ఉన్నారు. రూ.కోటికిపైగా అప్పులున్న ఎమ్మెల్యేల జాబితాలో రూ.94 కోట్లతో కందాల ఉపేందర్‌రెడ్డి టాప్‌లో ఉన్నారు. తర్వాతి స్థానాల్లో రూ.63 కోట్లతో మర్రి జనార్దన్‌రెడ్డి, రూ.40 కోట్లతో దానం నాగేందర్ ఉన్నారు. సగానికిపైగా ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు రాష్ట్రంలో అన్నిపార్టీలు కలిపి ప్రస్తుతమున్న 118 మంది ఎమ్మెల్యేలకుగాను.. 72 మంది (61%)పై క్రిమినల్ కేసులు ఉన్నాయని.. ఇందులో బీఆర్ఎస్ వారే 59 మంది అని ఏడీఆర్ నివేదిక వెల్లడించింది. బీఆర్ఎస్కు ఉన్న 101 మంది ఎమ్మెల్యేల్లో ఇది 58శాతమని తెలిపింది. ఎంఐఎంకు చెందిన ఏడుగురు ఎమ్మెల్యేల్లో ఆరుగురిపై (86%), ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో నలుగురిపై (67%), బీజేపీకి చెందిన ఇద్దరు (100%) ఎమ్మెల్యేలపై, ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేల్లో ఒకరిపై (50%) క్రిమినల్ కేసులు ఉన్నట్టు వారు గత ఎన్నికల అఫిడవిట్లలో తెలిపారని వివరించింది. మొత్తంగా 46 మంది (39%) సిట్టింగ్ ఎమ్మెల్యేలపై తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉన్నాయని పేర్కొంది. అందులో బీఆర్ఎస్ వారు 38 మంది అని తెలిపింది. ఏడుగురు ఎమ్మెల్యేలపై హత్యాయత్నం, నలుగురిపై మహిళలపై నేరాలకు సంబంధించిన కేసులు ఉన్నాయని.. ఒక ఎమ్మెల్యేపై అత్యాచారానికి సంబంధించిన కేసు ఉందని వివరించింది. -
ADR Report: ఎమ్మెల్యేల్లో 44% మంది నేరచరితులు
న్యూఢిల్లీ: దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన శాసనసభ్యుల్లో సుమారు 44 శాతం మంది నేరచరితులున్నారని అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫారŠమ్స్(ఏడీఆర్) తేలి్చంది. రాష్ట్రాల అసెంబ్లీలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఎన్నికైన ప్రస్తుత శాసనసభ్యులు ఎన్నికల సంఘానికి స్వయంగా అందజేసిన అఫిడవిట్లను పరిశీలించిన ఏడీఆర్, నేషనల్ ఎలక్షన్ వాచ్(ఎన్ఈడబ్ల్యూ)లు ఈ విషయాన్ని తేల్చాయి. దేశంలోని 28 రాష్ట్రాల అసెంబ్లీలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 4,033 ఎమ్మెల్యేలకు గాను 4,001 మంది ఎమ్మెల్యేల అఫిడవిట్లను పరిశీలించాయి. వీరిలో 1,136 మంది అంటే 28% మందిపై హత్య, హత్యాయత్నం, కిడ్నాప్ తదితర తీవ్రమైన క్రిమినల్ కేసులున్నాయని పేర్కొంది. -
Karnataka Assembly Election 2023: 581 మంది అభ్యర్థులపై నేరారోపణలు
సాక్షి బెంగళూరు: కర్ణాటక రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో నేరారోపణలు ఎదుర్కొంటున్న నేతలకూ ప్రధాన పార్టీలు టికెట్లిచ్చిమరీ ఎన్నికల బరిలో నిలిపాయి. ఈసారి పోటీ చేసే అభ్యర్థుల్లో 581 మంది (22 శాతం) నేరారోపణలు ఎదుర్కొంటున్న వారు ఉండటం తాజా పరిస్థితికి అద్దం పడుతోంది. ఈ 581 మంది నేతల్లో 404 మందిపై తీవ్రమైన నేరారోపణలు నమోదై ఉన్నాయి. ఈసారి శాసనసభ ఎన్నికల్లో నామినేషన్ దాఖలుచేసిన 2,613 మందిలో 2,586 మంది అభ్యర్థుల నామినేషన్లను అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫామ్స్ (ఏడీఆర్) అనే సంస్థ పరిశీలించి సంబంధిత గణాంకాలను విడుదలచేసింది. నివేదికలోని కొన్ని ముఖ్యాంశాలు.. ► బీజేపీ తరఫున 224 మంది నామినేషన్లు వేయగా అందులో 96 మందిపై కేసులున్నాయి. మొత్తం 223 మంది కాంగ్రెస్ అభ్యర్థుల్లో 122 మందిపై కేసులున్నాయి. మొత్తం 208 మంది జేడీఎస్ అభ్యర్థుల్లో 70 మందిపై, 208 ఆప్ అభ్యర్థుల్లో 48 మందిపై, 9 మంది ఎన్సీపీ అభ్యర్థుల్లో ఇద్దరిపై, ముగ్గురు సీపీఐ అభ్యర్థుల్లో ఒకరిపై, 901 స్వతంత్ర అభ్యర్థుల్లో 119 మందిపై కేసులున్నాయి. ► గతంలో పోలిస్తే బీజేపీ, జేడీఎస్‌లు ఎక్కువ మంది నేరచరితులకు టికెట్లు ఇచ్చాయి. 2018లో బీజేపీ అభ్యర్థుల్లో 37 శాతం మందిపై కేసులుంటే ఈసారి 43 శాతం మందిపై కేసులున్నాయి. జేడీఎస్‌లోనూ ఈ శాతం 21 నుంచి ఏకంగా 34 శాతానికి పెరగడం ఆందోళనకరం. కాంగ్రెస్ అభ్యర్థుల్లో 2018 ఏడాదిలోనూ, ఇప్పడూ 55 శాతం మంది నేరచరితులున్నారు. ళీ 111 నియోజకవర్గాల్లో ముగ్గురు కంటే ఎక్కువ మంది అభ్యర్థులు వివిధ రకాల క్రిమినల్ కేసులను ఎదుర్కొంటున్నారు. కుబేరులూ ఉన్నారు.. ► బీజేపీ నుంచి 216 మంది, కాంగ్రెస్ నుంచి 215 మంది, జేడీఎస్ నుంచి 170, ఆప్ నుంచి 197 మంది అభ్యర్థులు కోట్లకు పడగలెత్తారని వారి నామినేషన్ల పత్రాల ద్వారా తెలుస్తోంది. స్వతంత్ర అభ్యర్థుల్లో 215 మంది కోటీశ్వరులు ఉండటం విశేషం. కోటీశ్వరులైన అభ్యర్థులను మొత్తంగా పరిశీలిస్తే ప్రతి అభ్యర్థి సరాసరి ఆస్తి విలువ రూ. 12 కోట్లు. -
బీఆర్ఎస్ దేశంలోనే నంబర్-1.. సెకండ్ ప్లేస్‌లో ఆప్..!
న్యూఢిల్లీ: ప్రాంతీయ పార్టీలకు విరాళాలకు సంబంధించి 2021-22 ఆర్థిక సంవత్సరంలో బీఆర్ఎస్ దేశంలోనే టాప్ ప్లేస్‌లో నిలిచింది. ఆ పార్టీకి మొత్తం రూ.40.9కోట్లు విరాళాలు అందాయి. ఆ తర్వాత రెండో స్థానంలో అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ ఉంది. ఆప్‌కు రూ.38.2 కోట్ల విరాళాలు అందాయి. అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రీఫార్మ్స్(ఏడీఆర్) ఈ గణాంకాలను వెల్లడించింది. దేశంలోని ప్రాంతీయ పార్టీల్లో బీఆర్ఎస్, ఆప్ తర్వాత జేడీఎస్‌కు అత్యధిక విరాళాలు అందాయి. ఆ పార్టీకి రూ.33.2 కోట్లు డోనేషన్ల రూపంలో వచ్చాయి. అలాగే సమాజ్‌వాదీ పార్టీకి రూ.29.7కోట్లు, వైఎస్సార్సీపీకి రూ.20 కోట్లు విరాళాలు అందినట్లు ఏడీఆర్ నివేదక తెలిపింది. ఆయా పార్టీలు ఎన్నికల సంఘానికి సమర్పించిన వివరాల ఆధారంగా ఈ గణాంకాలు వెల్లడించింది. దేశంలోని మొత్తం 26 ప్రాంతీయ పార్టీలకు రూ.189.8 కోట్లు అందినట్లు నివేదిక పేర్కొంది. వీటిలో రూ.162.21 కోట్ల విరాళాలు ఐదు పార్టీలే అందుకున్నట్లు తెలిపింది. అయితే ఏఐఏడీఎంకే, బీజేడీ, ఎన్డీపీపీ, ఎస్డీఎఫ్, ఏఐఎఫ్బీ, పీఎంకే, జేకేఎన్సీ పార్టీలు తమకు అందిన విరాళాల వివరాలను వెల్లడించలేదు. కాగా.. ప్రాంతీయ పార్టీగా ఉన్న ఆప్‌కు ఎన్నికల సంఘం ఈ నెలలోనే జాతీయ పార్టీగా గుర్తింపు ఇచ్చిన విషయం తెలిసిందే. చదవండి: కర్ణాటక ఎన్నికలు: 517 నామినేషన్ల ఉపసంహరణ.. 209 స్థానాల్లో ఆప్ పోటీ -
రిచెస్ట్ పొలిటీషియన్ చంద్రబాబు
-
దేశంలోనే అత్యంత ధనవంతులైన ఎమ్మెల్యేల్లో మూడో స్థానంలో చంద్రబాబు
-
రిచెస్ట్ పొలిటీషియన్ చంద్రబాబు.. ఏడీఆర్ నివేదికలో అసలు వాస్తవం
సాక్షి, అమరావతి: రాష్ట్ర రాజకీయాల్లో అత్యధిక ధనవంతుడు చంద్రబాబుగా ఏడీఆర్ నివేదికలో అసలు వాస్తవం బయటపడింది. దేశంలోనే మూడో ధనిక ఎమ్మెల్యేగా చంద్రబాబును ఏడీఆర్ నివేదిక పేర్కొంది. చంద్రబాబు రిచెస్ట్ అనే వాస్తవాన్ని ఎల్లో మీడియా దాచిపెట్టింది. దేశంలో ధనిక ఎమ్మెల్యేల జాబితాలో మొదటి స్థానం ఎన్ నాగరాజు, రెండో స్థానం డీకే శివ కుమార్ ఉండగా, రూ.668 కోట్లతో ఏపీలో మొదటి స్థానం, దేశంలో 3వ స్థానంలో చంద్రబాబు ఉన్నట్లు ఏడీఆర్ రిపోర్ట్ వెల్లడించింది. చదవండి: చంద్రబాబుకు జూనియర్ ఎన్టీఆర్ సెగ.. ఈడ్చిపడేయాలంటూ ఆదేశాలు -
బీజేపీకి రూ.614 కోట్లు..కాంగ్రెస్‌కు రూ.94 కోట్లు
న్యూఢిల్లీ: 2021–22లో బీజేపీకి రూ.614 కోట్లు, కాంగ్రెస్‌కు రూ.95 కోట్లు విరాళాల రూపంలో అందాయి. అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫామ్స్ (ఏడీఆర్) నివేదిక ఈ మేరకు వెల్లడించింది. 2020–21తో పోలిస్తే పార్టీలు అందుకున్న విరాళాల మొత్తం 31.50% మేర పెరిగిందని వివరించింది. ఇదే సమయంలో బీజేపీ విరాళాల్లో రూ.28.71%, కాంగ్రెస్ విరాళాల్లో 28.09% పెరుగుదల కనిపించిందని నివేదిక పేర్కొంది. గతేడాది దేశంలోని అన్ని జాతీయ పార్టీలకు మొత్తం రూ.780కోట్లు విరాళాల రూపంలో అందినట్లు చెప్పింది. బీజేపీకి అందిన మొత్తం మిగతా అన్ని పార్టీలకంటే దాదాపు మూడు రెట్లు అధికం కావడం గమనార్హం. చదవండి: బీబీసీ కార్యాలయంపై ఐటీ దాడులు.. సిబ్బంది సెల్ఫోన్లు సీజ్! -
Tripura Assembly Election: 45 మంది కోటీశ్వరులు, 41 మందిపై క్రిమినల్ కేసులు
అగర్తాలా: త్రిపుర అసెంబ్లీకి ఈ నెల 16న జరగనున్న ఎన్నికల్లో పోటీ చేస్తున్న 259 మంది అభ్యర్థుల్లో 45 మంది కోటీశ్వరులని, 41 మంది క్రిమినల్ కేసులున్నాయని అసోసియేషన్ ఫర్ డెమొక్రాటిక్ రిఫార్మ్స్(ఏడీఆర్) నివేదిక వెల్లడించింది. కోటీశ్వరుల్లో అధికార బీజేపీకి చెందిన అభ్యర్థులు 17 మంది ఉంటే, టిప్రామోతాకి చెందిన వారు తొమ్మిది మంది, సీపీఐ(ఎం) అభ్యర్థులు ఏడుగురు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఆరుగురు కోట్లకు పడగలెత్తితే, తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన వారు నలుగురు ఉండగా, ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు కూడా కోటీశ్వరులేనని ఆ నివేదిక చెప్పింది. త్రిపుర ఉప ముఖ్యమంత్రి జిష్ణు దేవ్ వర్మ రూ.15.58 కోట్ల ఆస్తులతో అత్యంత ధనికుడిగా ఉంటే రూ.13.90 కోట్ల ఆస్తిపాస్తులతో రాష్ట్ర ముఖ్యమంత్రి , డాక్టర్ కూడా అయిన మాణిక్ సాహ నిలిచారు. ఇక 41 మంది అభ్యర్థులు తమపై క్రిమినల్ కేసులున్నాయని అఫిడివిట్లో దాఖలు చేశారు. ఇక కాంగ్రెస్ పార్టీకి చెందిన 13 మంది అభ్యర్థుల్లో ఏకంగా ఏడుగురిపై క్రిమినల్ కేసులున్నాయి. -
ఎలక్టరోల్ ట్రస్టుల విరాళాల్లో బీజేపీ టాప్.. రెండోస్థానంలో టీఆర్ఎస్!
న్యూఢిల్లీ: కార్పొరేట్ సంస్థల నుంచి బీజేపీకి విరాళాల వరద పారింది. ఎలక్టరోల్ ట్రస్టులకు(ఈటీ) వచ్చిన కార్పొరేట్, వ్యక్తిగత విరాళాల్లో 72 శాతానికిపైగా కాషాయ పార్టీ ఖాతాలోకే వెళ్లాయి. పోల్ రైట్స్ సంస్థ అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) 2021-22 ఆర్థిక ఏడాదికి గల ఎలక్టరోల్ ట్రస్టుల విరాళాల వివరాలను వెల్లడించింది. 2021-22 ఏడాదిలో బీజేపీకి అత్యధికంగా రూ.351.50 కోట్ల విరాళాలు ఈటీల ద్వారా అందాయి. మొత్తం పార్టీలు అందుకున్న విరాళాలతో పోలిస్తే బీజేపీకే 72.17 శాతం అందినట్లు ఏడీఆర్ నివేదిక వెల్లడించింది. ద ఫ్రుడెండ్ ఎలక్టరోల్ ట్రస్ట్ అత్యధికంగా రూ.336.50 కోట్లు బీజేపీకి విరాళంగా అందించింది. అంతకు ముందు ఏడాది 2020-21లో రూ.209 కోట్లు ఇవ్వగా ఈసారి ఆ సంఖ్య మరింత పెరిగింది. అలాగే.. 2021-22 ఏడాదిలో ఏపీ జనరల్ ఈటీ, సమాజ్ ఈటీ వరుసగా రూ.10కోట్లు, రూ.5 కోట్లు బీజేపీకి అందించాయి. రెండోస్థానంలో టీఆర్ఎస్.. బీజేపీ తర్వాత రెండోస్థానంలో తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) నిలిచింది. ఫ్రుడెంట్ ఎలక్టరోల్ ట్రస్టు ఒక్కదాని నుంచే రూ.40 కోట్లు అందాయి. మరోవైపు.. కాంగ్రెస్ పార్టీకి రూ.18.43 కోట్లు, ఆమ్ ఆద్మీ పార్టీకి రూ.21.12 కోట్లు ట్రస్టుల ద్వారా అందాయి. ఇండిపెండెంట్ ఈటీ నుంచి ఆప్ పార్టీకి రూ.4.81 కోట్లు అందిన నేపథ్యంలో కాంగ్రెస్‌ను వెనక్కి నెట్టింది చీపురు పార్టీ. అలాగే.. స్మాల్ డొనేషన్స్ ఈటీ నుంచి కాంగ్రెస్‌కు 1.9351 కోట్లు అందాయి. ఫ్రుడెంట్ ఎలక్టరోల్ ట్రస్టు 9 రాజకీయ పార్టీలకు విరాళాలు అందించింది. అందులో టీఆర్ఎస్, సమాజ్‌వాదీ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్, శిరోమణి అకాలీ దళ్, పంజాబ్ లోక్ కాంగ్రెస్ పార్టీ, గోవా ఫార్వర్డ్ పార్టీలు ఉన్నాయి. మరో ఆరు ఎలక్టరోల్ ట్రస్టులు 2021-22 ఏడాదికి గానూ రూ.487.0856 కోట్లు విరాళాలుగా అందాయని తెలిపాయి. అందులో రూ.487.0551 కోట్లు(99.994శాతం) వివిధ రాజకీయ పార్టీలకు అందించినట్లు పేర్కొన్నాయి. అయితే, ఏ పార్టీకి ఎంత ఇచ్చామనే వివరాలు వెల్లడించలేదు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఆర్థిక సంవత్సరంలో వచ్చిన మొత్తం విరాళాల్లో 95 శాతాన్ని అర్హతగల రాజకీయ పార్టీలకు ఎలక్టోరల్ ట్రస్టు పంపిణీ చేయాలి. రిజిస్టర్ అయిన 23 ఎలక్టోరల్ ట్రస్టుల్లో 16 ట్రస్టులు తమ విరాళాల కాపీలను ఎలక్షన కమిషన్‌కు ఎప్పటికప్పుడు సమర్పిస్తున్నాయి. మిగిలిన 7 ట్రస్టులు తమ విరాళాల నివేదికలను వెల్లడించలేదు. ఇదీ చదవండి: కోవిడ్ కొత్త వేరియంట్ల పుట్టుకకు కేంద్రంగా చైనా.. నిపుణుల ఆందోళన -
జాతీయ పార్టీలకు రూ.15,077 కోట్లు.. ఎవరిచ్చారో అస్సలు తెలియదు!
న్యూఢిల్లీ: జాతీయ పార్టీలు 2004 నుంచి 2021 వరకు వివరాలు వెల్లడించని వ్యక్తులు, సంస్థల నుంచి సుమారు రూ.15,077.97 కోట్లు విరాళాలు అందుకున్నట్లు అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫామ్స్-ఏడీఆర్ నివేదిక తెలిపింది. అయితే.. ఒక్క 2020-21 ఆర్థిక ఏడాదిలోనే జాతీయ, ప్రాంతీయ పార్టీలు గుర్తు తెలియని వారి నుంచి రూ.690.67 కోట్లు విరాళంగా స్వీకరించినట్లు పేర్కొంది. ఈ నివేదికలో.. బీజేపీ, కాంగ్రెస్, టీఎంసీ వంటి ఎనిమిది జాతీయ పార్టీలు, 27 ప్రాంతీయ పార్టీలను పరిగణనలోకి తీసుకుని వివరాలు వెల్లడించింది ఏడీఆర్. 2004-05 నుంచి 2020-21 వరకు ఎన్నికల సంఘానికి పార్టీలు సమర్పించిన విరాళాలు, ఆదాయపన్ను రిటర్న్‌ల ఆధారంగా ఈ నివేదికను రూపొందించింది ఏడీఆర్. ఎలాంటి వివరాలు వెల్లడించని వ్యక్తులు, సంస్థల నుంచి జాతీయ పార్టీలు సుమారు రూ.15,077.97 కోట్లు విరాళంగా అందుకున్నట్లు స్పష్టం చేసింది. ‘2020-21 ఆర్థిక ఏడాదిలో 8 జాతీయ పార్టీలు గుర్తుతెలియని వారి నుంచి రూ.426.74 కోట్లు అందుకోగా.. 27 ప్రాంతీయ పార్టీలు రూ.263.928 కోట్లు విరాళంగా పొందాయి.’అని తెలిపింది ఏడీఆర్. తొలిస్థానంలో కాంగ్రెస్.. 2020-21లో కాంగ్రెస్ పార్టీ రూ.178.782 కోట్లు వివరాలు వెల్లడించని వ్యక్తులు, సంస్థల నుంచి పొందిందని, అది మొత్తం జాతీయ పార్టీలు పొందిన దాంట్లో 41.89 శాతమని తెలిపింది ఏడీఆర్. ఇదే అత్యధికమని పేర్కొంది. మరోవైపు.. బీజేపీకి రూ.100.502 కోట్లు అందాయి. అది మొత్తం వివరాలు లేని వారి నుంచి అందిన దాంట్లో 23.55 శాతంగా తెలిపింది. మరోవైపు.. వివరాలు లేని సోర్స్‌ల నుంచి ఎక్కువ మొత్తంలో విరాళాలు అందుకున్న మొదటి ఐదు పార్టీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ రూ.96.2507 కోట్లు, డీఎంకే రూ.80.02 కోట్లు, బీజేడీ రూ.67 కోట్లు, ఎంఎన్ఎస్ రూ.5.773 కోట్లు, ఆప్ రూ.5.4కోట్లుగా నివేదిక తెలిపింది. ఇదీ చదవండి: Cartoon Today: రాజకీయ పార్టీలకు కోవిడ్ దెబ్బ.. 41 శాతం తగ్గిన విరాళాలు -
ఎమ్మెల్సీల ఆస్తుల్లో నారా లోకేశ్ టాప్.. ఏడీఆర్ రిపోర్టు వెల్లడి
సాక్షి, న్యూఢిల్లీ : శాసన మండలి సభ్యుల్లో 75 శాతం మంది కోటీశ్వరులు ఉన్నారని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్), ఏపీ ఎలక్షన్ వాచ్ తాజా అధ్యయనం పేర్కొంది. ఎప్పటికప్పుడు జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలకు ముందు.. అభ్యర్థులు అందించిన సమాచారం ఆధారంగా ఈ అధ్యయనం జరిగింది. మొత్తం 58 మంది సిట్టింగ్ ఎమ్మెల్సీలలో 48 మంది వివరాలను(10 మంది అఫిడవిట్లు వారికి అందుబాటులో లేవు) విశ్లేషించారు. వీరిలో 75 శాతం మంది అంటే 36 మంది కోటీశ్వరులేనని స్పష్టమైంది. ఇందులో అధికార వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు 22 మంది, ప్రతిపక్ష టీడీపీకి చెందిన ఎమ్మెల్సీలు 11 మంది ఉన్నారు. కాగా, రూ.369 కోట్లకు పైగా ఆస్తులు ఉన్న టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ అత్యంత ధనవంతుడు అని ఏడీఆర్ రిపోర్టు పేర్కొంది. రెండో స్థానంలో రూ.101 కోట్లతో ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి ఉండగా, మూడో స్థానంలో రూ.36 కోట్లతో ఎమ్మెల్సీ టి.మాధవరావు ఉన్నారు. ఇండిపెండెంట్ ఎమ్మెల్సీ పి.రఘువర్మ అత్యల్పంగా రూ.1,84,527 ఆస్తులు కలిగి ఉన్నారు. కాగా, 20 మంది ఎమ్మెల్సీలపై క్రిమినల్ కేసులున్నట్లు ఏడీఆర్ రిపోర్ట్ పేర్కొంది. ఎనిమిది మంది 5–12వ తరగతి మధ్య, 40 మంది గ్రాడ్యుయేట్ లేదా అంతకంటే ఎక్కువ విద్యార్హత కలిగి ఉన్నారని తెలిపింది. -
కోవిడ్ ఎఫెక్ట్.. బీజేపీకి భారీగా తగ్గిన విరాళాలు.. కాంగ్రెస్‌కు ఎంతంటే?
ఢిల్లీ: కరోనా మహమ్మారి కట్టడి కోసమంటూ విధించిన లాక్‌డౌన్‌తో దేశంలోని అనేక రంగాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ఆ ప్రభావం రాజకీయ పార్టీలపైనా పడింది. కోవిడ్ సమయంలో జాతీయ పార్టీలకు అందిన విరాళాలు దాదాపుగా సగం మేర తగ్గిపోయాయి. 2020-21 ఆర్థిక సంవత్సరంలో దేశంలోని గుర్తింపు పొందిన జాతీయ పార్టీల విరాళాలు రూ.420 కోట్ల మేర తగ్గిపోయినట్లు అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫామ్స్ వెల్లడించింది. అంతకు ముందు ఏడాదితో పోలిస్తే ఆ విలువ 41.49 శాతం తక్కువగా పేర్కొంది. బీజేపీకి 2019-20 ఆర్థిక సంవత్సరంలో రూ.785.77 కోట్లు విరాళాలు రాగా.. 2020-21లో 39.23 శాతం తగ్గి రూ.477.54కోట్లు మాత్రమే వచ్చాయి. కాంగ్రెస్ పార్టీకి 2019-20లో రూ.139.01 కోట్లు విరాళాలు రాగా.. 2020-21లో 46.39శాతం తగ్గి రూ.74.52 కోట్లు మాత్రమే అందాయి. అత్యధికంగా ఢిల్లీ నుంచి జాతీయ పార్టీలకు రూ.246 కోట్లు విరాళంగా వచ్చాయి. ఆ తర్వాత మహారాష్ట్ర నుంచి రూ.71.68 కోట్లు, గుజరాత్ నుంచి రూ.47 కోట్లు అందాయి. బీజేపీ, బీఎస్పీ, కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, టీఎంసీ, ఎన్సీపీ, నేషనల్ పీపుల్స్ పార్టీలు.. విరాళాల్లో 80 శాతాన్ని ఆక్రమించగా.. మిగిలిన 20 శాతం చిన్న పార్టీలకు అందాయి. ఏడీఆర్ నివేదిక ప్రకారం రూ.480 కోట్లు కార్పొరేట్, బిజినెస్ రంగాల నుంచి వచ్చాయి. మరోవైపు.. రూ.111 కోట్లు విరాళాలు 2,258 మంది వ్యక్తులు అందించారు. సుమారు రూ.37 కోట్ల విరాళాలకు సరైన ఆధారాలు లేకపోవటం వల్ల ఏ రాష్ట్రం నుంచి వచ్చాయనే వివరాలు వెల్లడికాలేదు. బీజేపీకి మొత్తం 1,100 విరాళాలు కార్పొరేట్, బిజినెస్ సెక్టార్ల నుంచి వచ్చాయి. కాంగ్రెస్‌కు 146 విరాళాలు వచ్చాయి. ఇదీ చూడండి: ఓపీఎస్‌కు మరో షాకిచ్చిన ఈపీఎస్.. 18 మంది బహిష్కరణ -
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు; విస్తుగొలిపే నిజాలు
న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికలు ముగింపు దశకు వచ్చాయి. ఉత్తరప్రదేశ్ చివరి దశ పోలింగ్ మార్చి 7న జరగనుంది. మార్చి 10న ఓట్లను లెక్కిస్తారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో పోటీ చేస్తున్న వారిలో 25 శాతం మంది నేరచరితులు, 41 శాతం మంది కోటీశ్వరులు ఉన్నారు. వీరిలో 18 శాతం మంది తీవ్రమైన క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నారని అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్(ఏడీఆర్) వెల్లడించింది. నేర చరితులకు పెద్దపీట ఉత్తరప్రదేశ్, పంజాబ్, గోవా, ఉత్తరాఖండ్, మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 6,944 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 6,874 మంది అఫిడవిట్లను పరిశీలించామని, మిగతా 70 మంది అఫిడవిట్లను విశ్లేషించాల్సి ఉందని ఏడీఆర్ తెలిపింది. ఈ 6,874 మందిలో 1,916 మంది జాతీయ పార్టీలకు, 1,421 మంది ప్రాంతీయ పార్టీలకు, 1,829 మంది గుర్తింపులేని పార్టీలకు చెందిన వారు. 1,708 మంది స్వతంత్రులుగా పోటీ చేస్తున్నారు. 6,874 అభ్యర్థుల్లో 1,694 మంది(25 శాతం) తమపై క్రిమినల్ కేసులు ఉన్నట్టు స్వయంగా వెల్లడించారు. తీవ్రమైన క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నట్టు 1,262 మంది (18 శాతం) మంది అఫిడవిట్లలో పేర్కొన్నారు. హత్య, హత్యాయత్నం, మహిళలపై నేరాలకు పాల్పడిన కేసులున్నవారు.. వీరిలో ఉండటం గమనార్హం. ఈ గణాంకాలను బట్టి చూస్తే అన్ని పార్టీలకు నేరచరితులకు పెద్దపీట వేసినట్టు స్పష్టమవుతోంది. పోటీలో కోటీశ్వరులు ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో 41 శాతం మంది(2,836) కోటీశ్వరులు పోటీలో ఉన్నారు. ఈ జాబితాలో ఉత్తరప్రదేశ్(1,733), పంజాబ్(521), ఉత్తరాఖండ్(252), గోవా(187), మణిపూర్(143) వరుస స్థానాల్లో నిలిచాయి. రాష్ట్రాల వారీగా అభ్యర్థుల సగటు ఆస్తులను పరిగణనలోకి తీసుకుంటే గోవా ముందజలో నిలిచింది. పంజాబ్, యూపీ, ఉత్తరాఖండ్, మణిపూర్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. పార్టీల పరంగా చూస్తే 93 శాతంతో అకాలీదళ్ అగ్రస్థానంలో ఉంది. బీజేపీ(87 శాతం), ఆర్ఎల్డీ(66), ఎన్పీఎఫ్(80), ఎస్పీ(75), బీఎస్పీ(74), ఏఐటీసీ(65), కాంగ్రెస్(63), ఆప్(44), యూకేడీ(29 శాతం) వరుసగా తర్వాతి స్థానాల్లో నిలిచాయి. స్వతంత్ర అభ్యర్థుల్లో 347 మంది కోటీశ్వరులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. బీజేపీ, కాంగ్రెస్ టాప్.. బీజేపీ 534 మంది కుబేరులకు టిక్కెట్లు కట్టబెట్టగా, కాంగ్రెస్ 423 మంది ధనవంతులకు సీట్లు ఇచ్చాయి. సమాజ్‌వాదీ పార్టీ(349), బహుజన సమాజ్‌వాదీ పార్టీ(312), ఆమ్ ఆద్మీ పార్టీ(248) కూడా కోటీశ్వరులకు పెద్దపీటే వేశాయి. అకాలీదళ్(89), ఆర్ఎల్డీ(32), ఎన్పీపీ(27), తృణమూల్ కాంగ్రెస్(17), పంజాబ్ లోక్ కాంగ్రెస్ పార్టీ(16), యూకేడీ(12) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. సుహెల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ 13, అప్నా దళ్ (సోనీలాల్) 12, మహారాష్ట్రవాది గోమంతక్ 9, ఎన్‌పిఎఫ్ 8, గోవా ఫార్వర్డ్ పార్టీ ఇద్దరు కోటీశ్వరులను పోటీకి నిలబెట్టాయి. మహిళలకు దక్కని ప్రాధాన్యం ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో మహిళలకు తగిన ప్రాధాన్యం దక్కలేదు. 6,874 అభ్యర్థుల్లో కేవలం 11 శాతం(755) మాత్రమే మహిళలు ఉన్నారు. 6,116 మంది పురుషులు, ముగ్గురు ట్రాన్స్జెండర్లు పోటీలో ఉన్నారు. (క్లిక్: తమిళ రాజకీయాల్లో నవ శకం.. డీఎంకే నయా పంథా) కుర్రాళ్ల నుంచి కురువృద్ధుల వరకు.. వయసు పరంగా చూస్తే 41 నుంచి 60 ఏళ్ల లోపు ఉన్నవారు అత్యధికంగా 54 శాతం(3,694) మంది ఎన్నికల బరిలో నిలిచారు. 25 నుంచి 40 ఏళ్లలోపు 32 శాతం(2,195) మంది ఉన్నారు. 61 నుంచి 80 ఏళ్లలోపు వయసున్న వారు 14 శాతం మంది ఉన్నారు. 80 ఏళ్లకు పైబడిన కురువృద్ధులు 10 మంది పోటీ చేస్తున్నారు. వీరిలో ఎవరెవరు విజయం సాధిస్తారనేది మార్చి 10న వెల్లడవుతుంది. (క్లిక్: యూపీలో కీలకంగా మారిన ఓటింగ్ శాతం.. అధికార పార్టీపై ఎఫెక్ట్..?) -
ఆదాయం కంటే టీడీపీకి ఖర్చే ఎక్కువ
సాక్షి, న్యూఢిల్లీ: ప్రాంతీయ పార్టీల ఆదాయంపై అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్), నేషనల్ ఎలక్షన్ వాచ్ సంస్థల తాజా నివేదిక విడుదల చేసింది. ఆ నివేదికలో తెలుగుదేశం పార్టీకి ఆదాయం కంటే వ్యయం ఎక్కువని తేలింది. 2021 అక్టోబరు 11 నాటికి దేశవ్యాప్తంగా 42 ప్రాంతీయ పార్టీల ఆదాయ వ్యయాలను ఏడీఆర్ నివేదిక వెల్లడించింది. 42 ప్రాంతీయ పార్టీలకు వచ్చిన ఆదాయం రూ.877.35 కోట్లుగా తెలిపింది. ఇందులో కేవలం ఐదు పార్టీలకే రూ.516.48 కోట్లు విరాళాల రూపంలో వచ్చాయి. వీటిలో టీఆర్ఎస్కు రూ.130.46 కోట్లు (14.86 శాతం), శివసేనకు రూ.111.40 కోట్లు (12.69 శాతం), వైఎస్సార్సీపీకి రూ.92.739 కోట్లు (10.56 శాతం), టీడీపీకి రూ.91.53 కోట్లు (10.43 శాతం), బిజూ జనతాదళ్‌కు రూ.90.35 కోట్లు (10.29 శాతం) వచ్చాయి. వ్యయాల విషయానికొస్తే తెలంగాణలోని అధికార పార్టీ టీఆర్ఎస్ రూ.21.18 కోట్లు మాత్రమే వ్యయం చేసింది. అత్యధికంగా రూ.109.27 కోట్లు (83.76 శాతం) మిగులుతో ప్రాంతీయ పార్టీల్లో తొలి స్థానంలో నిలిచింది. శివసేన తనకు వచ్చిన ఆదాయంలో రూ.99.37 కోట్లు వ్యయం చేసింది. వైఎస్సార్సీపీ రూ.37.83 కోట్లు వ్యయం చేసి రూ.54.90 కోట్ల మిగులుతో ఉంది. టీడీపీ రూ.108.84 కోట్లు వ్యయం చేసి, ఆదాయం కన్నా రూ.17.31 కోట్లు ఎక్కువ వినియోగించింది. ఎంఐఎంకు రూ.1.68 కోట్లు ఆదాయం రాగా.. రూ.65 లక్షలు మాత్రమే ఖర్చు చేసింది. తమిళనాడులోని ప్రతిపక్ష పార్టీ అన్నాడీఎంకేకు రూ.89.06 కోట్లు ఆదాయం రాగా.. రూ.28.82 కోట్లు ఖర్చు చేసింది. ఢిల్లీలో అధికార ఆమ్ ఆద్మీ పార్టీకి రూ.49.95 కోట్లు ఆదాయం రాగా.. రూ.38.87 కోట్లు ఖర్చు చేసింది. ఆదాయానికి మించి వ్యయం చేసిన పార్టీల్లో బిజూ జనతాదళ్, డీఎంకే, సమాజ్‌వాదీ, జేడీ(ఎస్) ఉన్నాయి. ఈ నివేదిక ప్రకారం వైఎస్సార్సీపీ, టీడీపీ, టీఆర్ఎస్ ఆదాయాలు గతంలో కంటే ప్రస్తుతం తగ్గాయని నివేదిక పేర్కొంది. -
ఆస్తులే కాదు.. అప్పులూ ఉన్నాయి
సాక్షి, న్యూఢిల్లీ: నూతన కేంద్ర మంత్రి వర్గంలో ఆస్తులే కాదు అప్పులు కూడా రూ.కోట్లలో ఉన్నవారు ఉన్నారని నేషనల్ ఎలక్షన్ వాచ్/ఏడీఆర్ సంస్థ పేర్కొంది. తాజా మంత్రివర్గంలోని ప్రధాని సహా 78 మంది మంత్రులకు సంబంధించి లోక్‌సభ, రాజ్యసభ, రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల అఫిడవిట్లలోని సమాచారం మేరకు ఈ వివరాలు వెల్లడించినట్లు సంస్థ తెలిపింది. ఈ అంశాలపై దృష్టి.. తాజా మంత్రివర్గ విస్తరణలో 43 మంది కొత్త వారు చేరిన విషయం విదితమే. ఈ సందర్భంగా ఈ నివేదికలో మంత్రుల నేర, ఆర్థిక, విద్య తదితర అంశాలపై దృష్టి సారించినట్లు సంస్థ తెలిపింది. 33 మంది (42శాతం) మంత్రులపై క్రిమినల్ కేసులు ఉన్నాయని, అందులో 24 (31 శాతం) మందిపై తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉన్నాయని, హోంశాఖ సహాయ మంత్రి నిశిత్ ప్రమానిక్‌పై హత్య సంబంధిత కేసు కూడా ఉందని తెలిపింది. 70 మంది (90 శాతం) కోటీశ్వరులని, మంత్రుల సరాసరి ఆస్తుల విలువ రూ.16.24 కోట్లు అని నివేదికలో తెలిపింది. సర్బానంద సోనోవాల్, ఎల్. మురుగన్ల వివరాలు ఇటీవల అసెంబ్లీ ఎన్నికల అఫిడవిట్ల నుంచి సేకరించినట్లు సంస్థ పేర్కొంది. విద్య: 12 మంది మంత్రులు తమ విద్యార్హతలు 8 నుంచి 12 మధ్యేనని పేర్కొనగా 64 మంది మంత్రులు గ్రాడ్యుయేషన్ అంతకన్నా ఎక్కువని, ఇద్దరు డిప్లొమా చదివినట్లు అఫిడవిట్‌లోపేర్కొన్నారు. ఎనిమిది పాస్: జాన్ బర్లా, నిశిత్ ప్రమానిక్ 10 పాస్: బిశ్వేశ్వర్ తుడు, రామేశ్వర్ తేలి, నారాయణరాణే 12 పాస్: అమిత్ షా, అర్జున్ ముండా , పంకజ్ చౌధరి, రేణుక సింగ్ సూరత, సాధ్వి నిరంజన్ జ్యోతి, స్మృతి ఇరానీ, రాందాస్ అథవాలే. క్రిమినల్ కేసులు: నలుగురు కేంద్రమంత్రులపై హత్యాయత్నం కేసులు నమోదుకాగా నిశిత్ ప్రమానిక్‌పై హత్య సంబంధిత కేసునమోదైంది. మతఘర్షణల కేసులు.. ఐదుగురు మంత్రులపై మత ఘర్షణల కేసులు నమోదు అయ్యాయి. మతం, జాతి, మతం, మత విశ్వాసాలను అవమానించడం ద్వారా మతపరమైన ఘర్షణలకు ఉద్దేశ పూర్వక చర్యలకు పాల్పడడం (ఐపీసీ సెక్షన్ 295ఏ) రూ.10 కోట్లపైనే అప్పులు 16 మందిమంత్రులకు రూ.కోటికన్నా ఎక్కువ అప్పులు ఉండగా వీరిలో ముగ్గురుకి రూ.10 కోట్లకన్నా పైనే అప్పులున్నాయని వారి వారి అఫిడవిట్లు చెబుతున్నాయనిసంస్థ పేర్కొంది. రూ.కోటి కన్నా తక్కువే ఎనిమిది మంది మంత్రు ల ఆస్తి రూ.కోటికన్నా తక్కువేనని వారి అఫిడవిట్లు చెబుతున్నా యని సంస్థ పేర్కొంది. ధన ‘మంత్రులు’ -
అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థుల్లో 18% నేరచరితులే
న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం అసెంబ్లీలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతానికి జరుగుతున్న ఎన్నికల్లో పోటీకి దిగిన అభ్యర్థుల్లో 18శాతం మంది నేరచరిత్ర ఉన్నవారేనని ఎన్నికల హక్కుల సంస్థ అసోసియేషన్ ఫర్ డెమొక్రాటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) తెలిపింది. బెంగాల్లో మూడో విడత ఎన్నికలు, మిగిలిన రాష్ట్రాల ఎన్నికల్లో ఇప్పటివరకు 6,792 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిస్తే వారిలో 6,318 మంది దాఖలు చేసిన అఫిడవిట్లను ఏడీఆర్ అధ్యయనం చేసింది. వారిలో 1,157 మంది (18%) నేర చరిత్ర ఉన్నట్టు నామినేషన్ సందర్భంగా దాఖలు చేసిన అఫిడవిట్లలో పేర్కొన్నారు. 632 మందిపై తీవ్రమైన నేరాలకు పాల్పడినట్టుగా అభియోగా లున్నాయి. బెంగాల్లో మూడో విడత వరకు దాఖలైన నామినేషన్ల పరిశీలనలో 25% మంది నేరచరితులుంటే, 21% మందిపై తీవ్రమైన నేరారోపణలున్నాయి. తమిళనాడు లో 13%, కేరళలో 38%, అస్సాంలో 15%, పుదుచ్చేరిలో 17% మంది నేరచరితులు ఉన్నారు. -
ఆయనే సంపన్న అభ్యర్థి.. ఆస్తి ఎంతంటే!
పట్నా: బిహార్‌లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య విమర్శలు, ప్రతివిమర్శలతో పరస్పరం మాటల యుద్ధానికి దిగుతున్నాయి. కాగా ఈనెల 28న రాష్ట్రంలో తొలి విడత పోలింగ్ జరుగనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో నామినేషన్ల దాఖలు, ఉపసంహరణ ప్రక్రియ ముగిసిన నేపథ్యంలో 1064 మంది ఎన్నికల బరిలో నిలిచారు. 16 జిల్లాల్లోని 71 శాసన సభ స్థానాలకు జరుగుతున్న మొదటి దశ పోలింగ్‌లో అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఈ నేపథ్యంలో అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రీఫార్మ్స్(ఏడీఆర్) సంపన్న అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఈ 1064 మందిలో 375 మంది కోటీశ్వరులు ఉన్నట్లు వెల్లడించింది. మూడింట ఒక వంతు అభ్యర్థులు రూ. కోటికి పైగా ఆస్తులు కలిగి ఉన్నట్లు పేర్కొంది. (చదవండి: బిహార్ 2020: ప్రధాన మహిళా అభ్యర్థులు) అత్యధికంగా ఆర్జేడీ నుంచి ఏడీఆర్ నివేదిక ప్రకారం, ఆర్జేడీ నుంచి పోటీపడుతున్న 41 మంది అభ్యర్థులో 39 మంది, జేడీయూ నుంచి బరిలో దిగిన 35 మందిలో 31 మంది, బీజేపీకి చెందిన 29 మందిలో 24 మంది, ఎల్జేపీ 30(41), బీఎస్పీ 12(26), 14(21) మంది అభ్యర్థులు కోటి రూపాయల కంటే ఎక్కువ సంపద కలిగి ఉన్నారు. అదే విధంగా, బిహార్ అసెంబ్లీ ఎన్నికలు తొలి విడత పోలింగ్‌లో బరిలోకి దిగిన ఒక్కో అభ్యర్థి సగటున 1.99 కోట్ల ఆస్తి కలిగి ఉన్నారని ఏడీఆర్ వెల్లడించింది. (తొలిసారి నాన్న లేకుండానే: చిరాగ్) ఆయనే సంపన్న అభ్యర్థి ఇక వీరందరితో పోలిస్తే ఆర్జేడీ నుంచి ఎన్నికల బరిలో నిలిచిన అనంత్ కుమార్ 68 కోట్ల రూపాయల సంపదతో సంపన్న అభ్యర్థిగా నిలిచినట్లు ఏడీఆర్ పేర్కొంది. కాగా 2015 అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీపడిన ఆయన, ప్రస్తుతం మొకామా నియోజకవర్గం నుంచి ఆర్జేడీ గుర్తు మీద రంగంలోకి దిగారు. ఇక కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికల బరిలో దిగిన గజానంద్ షాహి(షేక్‌పురా) రూ. 61 కోట్ల ఆస్తి కలిగి ఉండి రెండోస్థానాన్ని ఆక్రమించారు. వీరిద్దరి తర్వాత మనోరమా దేవి(జేడీయూ) రూ. 50 కోట్ల ఆస్తితో మూడో స్థానంలో నిలిచారు. ఇక ఐదుగురు అభ్యర్థులు మాత్రం తమకు ఎలాంటి ఆస్తులు లేవని అఫిడవిట్లో పేర్కొనడం గమనార్హం. -
ఆ పార్టీలకు రూ 11,234 కోట్ల అజ్ఞాత విరాళాలు
సాక్షి, న్యూఢిల్లీ : జాతీయ పార్టీలు 2004-05 నుంచి 2018-19 వరకూ అజ్ఞాత వ్యక్తులు, సంస్ధల నుంచి రూ 11,234 కోట్ల విరాళాలను అందుకున్నాయని ఎన్నికల నిఘా సంస్థ అసోసియేషన్ ఆఫ్ డెమొక్రటిక్ రిఫామ్స్ (ఏడీఆర్) నివేదిక వెల్లడించింది. ఏడు జాతీయ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, సీపీఐ(ఎం), సీపీఐ, ఎన్సీపీ, బీఎస్పీలు ఈసీకి సమర్పించిన వివరాలను పరిశీలించిన మీదట ఏడీఏ ఈ నివేదికను రూపొందించింది. రూ 20000 కంటే తక్కువ విలువైన విరాళాలను పార్టీలు అజ్ఞాత వ్యక్తులు, సంస్థల నుంచి వచ్చిన నిధులుగా ఆయా పార్టీలు ఐటీ రిటన్స్‌లో పేర్కొంటాయి.ఎలక్టోరల్ బాండ్ల ద్వారా విరాళాలు, కూపన్ల అమ్మకాలు, రిలీఫ్ ఫండ్, ఇతర ఆదాయం, స్వచ్ఛంద విరాళాలు, సమావేశాలు, మోర్చాల్లో వసూలైన మొత్తాలు వంటి రాబడిని అజ్ఞాత మార్గాల ద్వారా వచ్చిన ఆదాయంగా పరిగణిస్తారు. 2004-05 నుంచి 2018-19 వరకూ జాతీయ రాజకీయ పార్టీలు రూ 11,234 కోట్లు ఈ మార్గాల ద్వారా సమీకరించినట్టు ఏడీఆర్ వెల్లడించింది. ఇక 2018-19లో రూ 1612 కోట్లు ఈ మార్గం ద్వారా వచ్చినట్టు బీజేపీ వెల్లడించింది. ఆ ఏడాది రాజకీయ పార్టీలకు వచ్చిన అజ్ఞాత నిధుల్లో (రూ 2512 కోట్లు) ఇవి 64 శాతం కావడం గమనార్హం. ఇక కాంగ్రెస్ పార్టీ రూ 728.88 కోట్లు అజ్ఞాత వ్యక్తులు, సంస్ధల నుంచి నిధులను సమీకరించినట్టు పేర్కొంది. ఇక 2004-05 నుంచి 2018-19 వరకూ కాంగ్రెస్, ఎన్సీపీలు కూపన్ల అమ్మకం ద్వారా ఉమ్మడిగా ఆర్జించిన మొత్తం రూ 3902.63 కోట్లని ఏడీఆర్ పేర్కొంది. చదవండి : ఆ మంత్రులంతా కోటీశ్వరులే.. -
ఆ మంత్రులంతా కోటీశ్వరులే..
సాక్షి, న్యూఢిల్లీ : హరియాణాలో కొలువుతీరిన బీజేపీ-జేజేపీ సంకీర్ణ సర్కార్‌లోని 12 మంది మంత్రులు కరోడ్‌పతిలే. వీరిలో వ్యవసాయ, కుటుంబ సంక్షేమ మంత్రి జై ప్రకాష్ దలాల్ రూ 76 కోట్లతో అత్యంత సంపన్న మంత్రి కాగా, ఉప ముఖ్యమంత్రి దుష్యంత్ చౌతాలా రూ 74 కోట్ల ఆస్తులతో తర్వాతి స్ధానంలో నిలిచారని అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫామ్స్ (ఏడీఆర్) నివేదిక వెల్లడించింది. 2014లో హరియాణా సర్కార్‌లో 10 మంది మంత్రులకు గాను 7గురు మంత్రులు కోటీశ్వరులుగా ఈ నివేదిక విశ్లేషించింది. ఇక 12 మంది కరోడ్‌పతి మంత్రుల్లో ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ఒకరు కావడం గమనార్హం. మంత్రుల సగటు ఆస్తుల విలువ రూ 17.41 కోట్లని నివేదిక పేర్కొంది. -
మూడు టెల్కోలకు ప్రభుత్వ ప్రోత్సాహకం
ముంబై: దేశంలోని టెలికం రంగాన్ని కేంద్ర ప్రభుత్వం ఆదుకుంటుందని వొడాఫోన్ ఐడియా సీఈఓ రవీందర్ తక్కర్ ఆశాభావం వ్యక్తం చేశారు. శుక్రవారం తక్కర్ మీడియాతో మాట్లాడుతూ మూడు టెల్కోలను ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని అన్నారు. ఏజీఆర్‌పై(సవరించిన స్థూల ఆదాయం) సుప్రీంకోర్టు తీర్పు టెలికం కంపెనీలకు పెనుభారంగా మారిందని అన్నారు. టెలికం పరిశ్రమ తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్న దృష్ట్యా ప్రభుత్వం ఏజీఆర్ పై సానుకూల నిర్ణయం తీసుకోవాలన్నారు. ఏజీఆర్ విషయమై కోర్టులో రివ్యూ పిటిషన్‌ను దాఖలు చేయాలని వొడాఫోన్ ఐడియా సన్నాహాలు చేస్తోందని అన్నారు. కాగా టెలికం రంగానికి సెల్యులార్ ఆపరేషన్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సిఫార్సులు చేసిందని ఆయన గుర్తు చేశారు. అయితే తాము ఏ బ్యాంక్‌లకు బకాయిలు లేమని తక్కర్ స్పష్టం చేశారు. ఫోర్ ప్రైసింగ్‌కు సంబంధించి ప్రభుత్వం సమీక్షించి, టెలికం రంగాన్ని ఆదుకోవాలని కోరారు. ఏజీఆర్ ప్రభావంతో వొడాఫోన్ ఐడియా ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ క్వార్టర్లో 50,921 కోట్ల నికర నష్టాలు వచ్చాయని వొడాఫోన్ ఐడియా పేర్కొంది. కాగా ఇంత వరకు ఏ భారత కంపెనీ కూడా ఈ స్థాయిలో నష్టాలను ప్రకటించకపోవడం గమనార్హం. నిబంధనల ప్రకారం ఏజీఆర్‌లో నిర్దిష్ట మొత్తాన్ని లైసెన్సు ఫీజు, స్పెక్ట్రం వినియోగ చార్జీల కింద ప్రభుత్వానికి టెల్కోలు చెల్లించాల్సిన విషయం తెలిసిందే. -
టెల్కోలపై ‘ఏజీఆర్’ పిడుగు
న్యూఢిల్లీ: ఏజీఆర్‌పై (సవరించిన స్థూల ఆదాయం) సుప్రీంకోర్టు తీర్పు టెలికం కంపెనీలకు పెనుభారంగా మారింది. ఈ తీర్పు కారణంగా ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ క్వార్టర్లో వొడాఫోన్ ఐడియా రూ.50,921 కోట్లు, ఎయిర్టెల్ కంపెనీ రూ.23,045 కోట్ల నికర నష్టాల్ని ప్రకటించాయి. ఈ రెండు కంపెనీల నష్టాల మొత్తం సుమారుగా రూ.74,000 కోట్లకు చేరింది. టెలికం వ్యాపారేతర ఆదాయాలూ టెల్కోల స్థూల ఆదాయం (ఏజీఆర్) కిందే పరిగణించాలన్న ప్రభుత్వ వాదనలకు అనుకూలంగా సుప్రీంకోర్టు ఇటీవల తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. నిబంధనల ప్రకారం ఏజీఆర్‌లో నిర్దిష్ట మొత్తాన్ని లైసెన్సు ఫీజు, స్పెక్ట్రం వినియోగ చార్జీల కింద ప్రభుత్వానికి టెల్కోలు చెల్లించాల్సి ఉంటుంది. క్యూ2లో ఎయిర్‌టెల్‌పై భారం 28,450 కోట్లు టెలికం దిగ్గజం ఎయిర్‌టెల్‌కు ఈ ఆర్థిక సంవత్సరం (2019–20) సెప్టెంబర్ త్రైమాసిక కాలానికి భారీగా నష్టాలు వచ్చాయి. ఏజీఆర్ (సవరించిన స్థూల ఆదాయం) విషయమై సుప్రీం కోర్ట్ ఇటీవల ఇచ్చిన తీర్పుతో కంపెనీకి ఈ క్యూ2లో అత్యధిక స్థాయిలో త్రైమాసిక నష్టాలు తప్పలేదు. గత క్యూ2లో రూ.119 కోట్ల నికర లాభం రాగా, ఈ క్యూ2లో రూ.23,045 కోట్ల నష్టాలు(కన్సాలిడేటెడ్) వచ్చాయని ఎయిర్టెల్ తెలిపింది. ఈ క్యూ2లో ఆదాయం 5 శాతం వృద్ధితో రూ.21,199 కోట్లకు పెరిగిందని పేర్కొంది. కొత్త అకౌంటింగ్ విధానాలను అనుసరించినందువల్ల గత క్యూ2, ఈ క్యూ2 ఆర్థిక ఫలితాలను పోల్చడానికి లేదని వివరించింది. సుప్రీంకోర్టు ఏజీఆర్ విషయమై తాజాగా ఇచ్చిన తీర్పు కారణంగా స్పెక్ట్రమ్ యూసేజ్ చార్జీలు(ఎస్‌యూసీ), లైసెన్స్ ఫీజు తదితర అంశాలకు సంబంధించి ఈ క్యూ2లో ఈ కంపెనీపై రూ.28,450 కోట్ల భారం పడిం ది. దీంతో కంపెనీ నికర నష్టాలు రూ.23,045 కోట్లకు పెరిగాయి. కంపెనీ చరిత్రలో ఇదే అత్యధిక త్రైమాసిక నష్టం. ఏజీఆర్ భారం లేకుంటే కంపెనీ నికర నష్టాలు రూ.1,123 కోట్లుగా ఉండేవి. నిర్వహణ లాభం రూ. 6,343 కోట్ల నుంచి రూ.8,936 కోట్లకు పెరిగింది. భారత విభాగం ఆదాయం 3% పెరిగి రూ.15,361 కోట్లకు చేరింది. ఆఫ్రికా విభాగం ఆదాయం 13% ఎగసింది. వొడాఫోన్ ఐడియాపై పెనుభారం... ఏజీఆర్ ప్రభావంతో వొడాఫోన్ ఐడియా ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ క్వార్టర్లో భారీ నష్టాలను ప్రకటించింది. ఈ క్యూ2లో రూ.50,921 కోట్ల నికర నష్టాలు వచ్చాయని వొడాఫోన్ ఐడియా పేర్కొంది. ఇంత వరకూ ఏ భారత కంపెనీ కూడా ఈ స్థాయిలో నష్టాలను ప్రకటించలేదు. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో తమ నష్టాలు రూ.4,874 కోట్లని కంపెనీ వెల్లడించింది. ఇక ఆదాయం 42 శాతం ఎగసి రూ.11,146 కోట్లకు పెరిగిందని వివరించింది. సుప్రీం తాజా తీర్పు కారణంగా తాము చెల్లించాల్సిన ఏజీఆర్ బకాయిలు రూ.44,150 కోట్లుగా ఉంటాయని అంచనా వేసిన వొడాఫోన్ ఐడియా, ఈ క్యూ2లో రూ.25,680 కోట్ల మేర కేటాయింపులు జరిపింది. మార్కెట్ ముగిసిన తర్వాత ఇరు కంపెనీల ఫలితాలు వెలువడ్డాయి. ఫలితాలపై ప్రతికూల అంచనాలతోనే ఈ రెండు షేర్లు నష్టాల్లో ట్రేడయ్యాయి. ఎయిర్టెల్ షేర్ బీఎస్ఈలో 1.5% నష్టంతో రూ.363 వద్ద ముగిసింది. వొడాఫోన్ ఐడియా షేర్ 20% క్షీణించి రూ.2.95 వద్దకు చేరింది. మొత్తం బకాయిలు రూ.1.4 లక్షల కోట్లు... టెలికం విభాగం తాజా అంచనాల ప్రకారం... ఏజీఆర్‌కు సంబంధించి ఎయిర్టెల్ రూ.62,187 కోట్లు, (టాటా గ్రూప్ టెలికం కంపెనీలను, టెలినార్‌ను కూడా విలీనం చేసుకున్నందు వల్ల వాటి భారం ఎయిర్టెల్ మీదనే పడింది) వొడాఫోన్ ఐడియాలు రూ.54,184 కోట్ల చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. ఈ బకాయిలను 3 నెలల్లోగా చెల్లించాలని సుప్రీం తన తీర్పులో పేర్కొంది. తాజాగా సుప్రీంకోర్టు నిర్దేశించిన గడువులోగానే ఈ బకాయిలను చెల్లించాలని టెలికం విభాగం నోటీసులు జారీ చేసింది. మొత్తం టెలికం కంపెనీలు ప్రభుత్వానికి రూ.1.4 లక్షల కోట్లు చెల్లించాల్సి ఉంటుందని అంచనా. ఐడియా రివ్యూ పిటిషన్...!: ఏజీఆర్‌కు సంబంధించి స్పష్టత లేదంటూ గత నెలలోనే వెల్లడించాల్సిన ఆర్థిక ఫలితాలను ఎయిర్టెల్ వాయిదా వేసింది. కాగా టెలికం పరిశ్రమ తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటోందని, ఈ దృష్ట్యా ప్రభుత్వం ఏజీఆర్‌పై సానుకూల నిర్ణయం తీసుకోగలదన్న ఆశాభావాన్ని క్యూ2 ఫలితాల వెల్లడి సందర్భంగా ఎయిర్టెల్ వ్యక్తం చేసింది. మరోవైపు ఏజీఆర్ విషయమై ఒక రివ్యూ పిటిషన్‌ను దాఖలు చేయాలని వొడాఫోన్ ఐడియా సన్నాహాలు చేస్తోంది. ఏజీఆర్‌కు సంబంధించి సానుకూల నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకుంటేనే తమ కంపెనీ కొనసాగగలదని వొడాఫోన్ ఐడియా పేర్కొంది. ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపైననే తమ కంపెనీ మనుగడ ఆధారపడి ఉందని వివరించింది. -
ఇన్ఫీలో మరో దుమారం!
బెంగళూరు: ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ మరోసారి ‘అనైతిక విధానాల’ ఆరోపణల్లో చిక్కుకుంది. సీఈవో సలీల్ పరేఖ్, సీఎఫ్‌వో నీలాంజన్ రాయ్ స్వల్పకాలికంగా ఆదాయాలు, లాభాలను పెంచి చూపించేందుకు అనైతిక విధానాలు పాటిస్తున్నట్లు పేరు వెల్లడించని కొందరు ఉద్యోగులు ఇన్ఫీ బోర్డుకు ఫిర్యాదు చేశారు. ‘ఇటీవలి కొన్ని త్రైమాసికాలుగా సీఈవో పాటిస్తున్న అనైతిక విధానాలను మీ దృష్టికి తేగోరుచున్నాము. స్వల్పకాలికంగా ఆదాయాలు, లాభాలు పెంచి చూపేందుకు ప్రస్తుత త్రైమాసికంలో కూడా అలాంటి విధానాలే పాటిస్తున్నారు. బోర్డు తక్షణమే విచారణ జరిపి, చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నాం‘ అంటూ సెప్టెంబర్ 20న డైరెక్టర్స్ బోర్డుకు వారు లేఖ రాశారు. ఇందుకు సంబంధించిన ఈ–మెయిల్స్, వాయిస్ రికార్డింగ్స్ కూడా తమ దగ్గర ఉన్నట్లు తెలిపారు. అందులో తమను తాము ’నైతికత గల ఉద్యోగులుగా’ ఫిర్యాదుదారులు పేర్కొన్నారు. మరోవైపు, ప్రజావేగుల ఫిర్యాదును కంపెనీ పాలసీ ప్రకారం ఆడిట్ కమిటీ ముందు ఉంచినట్లు ఇన్ఫోసిస్ ఒక ప్రకటనలో తెలిపింది. అమెరికాలోనూ ఫిర్యాదు.. గడిచిన రెండు త్రైమా సికాలుగా ఇన్ఫీ ఖాతాలు, ఆర్థిక ఫలితాల్లో అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ అమెరికాలోని ‘విజిల్‌బ్లోయర్ ప్రొటెక్షన్ ప్రోగ్రాం’కు కూడా ప్రజావేగులు ఫిర్యాదు చేశారు. లాభాలను పెంచి చూపడం కోసం వీసా ఖర్చుల్లాంటి వ్యయాలను పూర్తిగా చూపించొద్దంటూ తమకు ఆదేశాలు వచ్చినట్లు పేర్కొన్నారు. ‘ఈ సంభాషణకు సంబంధించిన వాయిస్ రికార్డింగ్స్ మా దగ్గర ఉన్నాయి. ఆడిటరు వ్యతిరేకించడంతో దీన్ని వాయిదా వేశారు‘ అని తెలిపారు. ఈ క్వార్టర్లోనూ లాభాలు తగ్గిపోయి, స్టాక్ ధరపై ప్రతికూల ప్రభావం చూపుతుందనే ఉద్దేశంతో ఓ కాంట్రాక్టుకు సంబంధించి 50 మిలియన్ డాలర్ల చెల్లింపులను ఖాతాల్లో చూపొద్దంటూ చాలా ఒత్తిడి తెస్తున్నారని ఫిర్యాదుదారులు తెలిపారు. కీలకమైన సమాచారాన్ని ఆడిటర్లు, బోర్డుకు తెలియకుండా తొక్కిపెట్టి ఉంచడం జరుగుతోందని తెలిపారు. సీఈవోనే నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు.. ‘భారీ డీల్స్ కుదుర్చుకోవడంలో బోలెడు అవకతవకలు జరుగుతున్నాయి. సీఈవో అన్ని నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు. భారీ మార్జిన్లు వస్తున్నాయని తప్పుదోవ పట్టించేలా నివేదికలు తయారు చేయాలంటూ సేల్స్ టీమ్‌ను ఆదేశిస్తున్నారు. సీఎఫ్‌వో కూడా ఆయన చెప్పినట్లే చేస్తున్నారు. భారీ డీల్స్‌లో లొసుగులు బోర్డు సమావేశాల్లో ప్రస్తావనకు తేనివ్వకుండా మమ్మల్ని ఆపేస్తున్నారు. బోర్డు సభ్యులకివేవీ పట్టవని.. షేరు ధర బాగుంటే వాళ్లకు సరిపోతుందని సీఈవో మాతో చెప్పారు‘ అని ఫిర్యాదుదారులు తీవ్ర ఆరోపణలు చేశారు. గత కొన్ని త్రైమాసికాలుగా కుదుర్చుకున్న బిలియన్ల డాలర్ల డీల్స్‌లో పైసా మార్జిన్ లేదని పేర్కొన్నారు. చాలా మటుకు స మాచారాన్ని ఆడిటర్లకు చెప్పకుండా దాచిపెట్టేస్తు న్నారని, కేవలం లాభాలు, సానుకూల అంశాలే ఆర్థిక ఫలితాల్లో చూపాలని సీఈవో, సీఎఫ్‌వో ఒత్తిడి తెస్తున్నారని ఫిర్యాదుదారులు ఆరోపించా రు. దీన్ని వ్యతిరేకించే ఉద్యోగులను పక్కన పెడుతున్నారని, ఫలితంగా వారిలో చాలా మంది సం స్థ నుంచి నిష్క్రమించాల్సి వచ్చిందని తెలిపారు. గతంలో కూడా ఇన్ఫీ.. కార్పొరేట్ గవర్నెన్స్ లోపాల ఆరోపణలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఇజ్రాయెలీ టెక్నాలజీ సంస్థ పనయా కొనుగోలులో అవకతవకలు జరిగాయంటూ ప్రజావేగుల ఆరోపణలు వచ్చిన దరిమిలా అప్పటి సీఈవో విశాల్ సిక్కా, ఎన్ఆర్ నారాయణ మూర్తి తదితర వ్యవస్థాపకుల మధ్య వివాదం తలెత్తింది. చివరికి 2017 ఆగస్టులో సిక్కా వైదొలిగారు. ఆయన స్థానంలో గతేడాది జనవరిలో పగ్గాలు చేపట్టిన సలిల్ పరేఖ్ కూడా తాజాగా గవర్నెన్స్ లోపాల ఆరోపణల్లో చిక్కుకోవడం గమనార్హం. ఇన్ఫీ ఏడీఆర్ క్రాష్... తాజా పరిణామాలతో అమెరికా నాస్డాక్లో లిస్టయిన ఇన్ఫోసిస్ ఏడీఆర్ (అమెరికన్ డిపాజిటరీ రిసీట్) సోమవారం కుప్పకూలింది. ఒక దశలో ఏకంగా 16 శాతం క్షీణించింది. -
కాషాయ పార్టీకి కాసుల గలగల..
సాక్షి, న్యూఢిల్లీ : 2017-18 ఆర్థిక సంవత్సరంలో బీజేపీ ఆస్తులు 22.27 శాతం పెరిగాయి. 2016-17లో రూ 1213.13 కోట్లుగా నమోదైన కాషాయ పార్టీ ఆస్తులు 2017-18లో రూ.1483.35 కోట్లకు ఎగబాకాయి. ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ మొత్తం ఆస్తులు 15.26 శాతం మేర క్షీణించి రూ 854 కోట్ల నుంచి రూ 724 కోట్లకు పడిపోయాయి. ఎన్నికల నిఘా సంస్థ ఏడీఆర్ ఈ వివరాలు వెల్లడించింది. ఇక ఇదే సమయంలో ఎన్సీపీ ఆస్తులు రూ 11.41 కోట్ల నుంచి రూ 9.54 కోట్లకు తగ్గుముఖం పట్టాయి. బీజేపీ, కాంగ్రెస్, ఎన్సీపీ, బీఎస్పీ, సీపీఐ, సీపీఎం, ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ వంటి ఏడు జాతీయ పార్టీలు ప్రకటించిన ఆస్తులను ఏడీఆర్ విశ్లేషించింది. ఏడు పార్టీలు ఈ రెండేళ్ల కాలానికి ప్రకటించిన ఆస్తుల్లో ఆరు శాతం వృద్ధి నమోదైంది. మరోవైపు తృణమూల్ కాంగ్రెస్ ఆస్తులు రూ 26.25 కోట్ల నుంచి రూ 29.10 కోట్లకు ఎగిశాయి. కాగా ఇదే కాలానికి ఏడు రాజకీయ పార్టీల మొత్తం అప్పులు రూ 514 కోట్ల నుంచి రూ 374 కోట్లకు తగ్గడం గమనార్హం. 2017-18 సంవత్సరానికి కాంగ్రెస్ పార్టీ అత్యధికంగా రూ 324.2 కోట్ల రుణాలున్నట్టు ప్రకటించగా, బీజేపీ రూ 21.38 కోట్లు, తృణమూల్ రూ 10.65 కోట్లు అప్పులుగా చూపాయి. రాజకీయ పార్టీలు వాణిజ్యేతర, పరిశ్రమేతర క్యాటగిరీలో ఉండటంతో ఇతర సంస్థలకు వర్తించే సాధారణ అకౌంటింగ్ ప్రక్రియలు పార్టీలకు వర్తించవని ఏడీఆర్ పేర్కొంది. -
233 మంది ఎంపీలపై క్రిమినల్ కేసులు
సాక్షి, న్యూఢిల్లీ : లోక్‌సభ ఎన్నికల్లో గెలిచిన 539 మంది అభ్యర్ధుల్లో 43 శాతం అంటే 233 మంది ఎంపీలపై నేరాభియోగాలు ఉన్నాయని అసోసియేషన్ ఆఫ్ డెమొక్రటిక్ రిఫామ్స్ (ఏడీఆర్) తెలిపింది. గత లోక్‌సభతో పోలిస్తే నేరారోపణలు ఉన్నవారి సంఖ్య 26 శాతం అధికం కావడం గమనార్హం. లోక్‌సభ ఎన్నికల్లో విజేతలైన 539 మంది అభ్యర్ధుల అఫిడవిట్లను విశ్లేషించిన ఏడీఆర్ బీజేపీ నుంచి ఎన్నికైన వారిలో 116 మంది ఎంపీలపై (39 శాతం) క్రిమినల్ కేసులు ఉన్నాయని తెలిపింది. కాంగ్రెస్ నుంచి ఎన్నికైన వారిలో 29 మంది ఎంపీలపై (57 శాతం) క్రిమినల్ కేసులున్నాయి. ఇక 13 మంది జేడీ(యూ) ఎంపీలపై, 10 మంది డీఎంకే ఎంపీలపై. తొమ్మిది మంది తృణమూల్ ఎంపీలపై క్రిమనల్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొంది. నూతన లోక్‌సభలో 29 శాతం కేసులు లైంగిక దాడి, హత్య, హత్యాయత్నం, మహిళలపై నేరాల వంటి కేసులు ఉన్నాయని వెల్లడించింది. 2009 నుంచి తీవ్ర నేరాలు నమోదయ్యాయని వెల్లడించిన ఎంపీల సంఖ్య రెట్టింపైందని ఏడీఆర్ తెలిపింది. -
రెండో అత్యంత ధనికుడు కొండా
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికలకు పోటీ చేసిన అభ్యర్థుల్లో అత్యంత ధనికుడిగా బిహార్‌కు చెందిన స్వతంత్ర అభ్యర్థి ఆర్.కె.శర్మ నిలవగా.. రెండో అత్యంత ధనికుడిగా చేవెళ్ల కాంగ్రెస్ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి నిలిచారు. కొండా విశ్వేశ్వరరెడ్డి ప్రత్యర్థి రంజిత్‌రెడ్డి దేశంలో అత్యధిక వార్షిక ఆదాయం పొందుతున్న వారిలో మూడో వ్యక్తిగా నిలవడం విశేషం. దేశవ్యాప్తంగా లోక్‌సభ బరిలో నిలిచిన 8,049 అభ్యర్థుల నుంచి 7,928 మంది అభ్యర్థుల అఫిడవిట్లను విశ్లేషించి నేషనల్ ఎలక్షన్ వాచ్, అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రీఫారŠమ్స్ (ఏడీఆర్) సంస్థలు ఈమేరకు సోమవారం ఒక నివేదిక వెల్లడించాయి. నేరచరితలోనూ తక్కువేంకాదు.. - 19 శాతం (1,500) మంది అభ్యర్థులు నేర చరిత్రను కలిగి ఉన్నారు. 2014లో ఈ సంఖ్య 1,404 (17 శాతం)గా ఉంది. 2009లో ఇది 1,158 (15 శాతం). - 13 శాతం (1,070) మంది అభ్యర్థులు తీవ్రమైన నేరాభియోగాలు కలిగి ఉన్నారు. రేప్, హత్య, హత్యాయత్నం, కిడ్నాపింగ్, మహిళలపై నేరాలు తదితర తీవ్రమైన కేసులు ఉన్నవారి సంఖ్య 2014లో 11 శాతంగా, 2009లో 8 శాతంగా ఉంది. - 56 మంది అభ్యర్థులు తమకు కేసుల్లో శిక్షపడినట్టుగా వెల్లడించారు. - 55 మంది అభ్యర్థులపై హత్య సంబంధిత కేసులు నమోదై ఉన్నాయి. 184 మందిపై హత్యాయత్నం కేసులు నమోదై ఉన్నాయి. - 126 మంది అభ్యర్థులపై మహిళలపై నేరాలకు పాల్పడిన కేసులున్నాయి. - 47 మందిపై కిడ్నాప్ కేసులున్నాయి. - 95 మంది విద్వేష ప్రసంగాలతో (హేట్ స్పీచ్) కేసులు నమోదైన వారు ఉన్నారు. - బీజేపీ అభ్యర్థుల్లో 40 శాతం (175 మంది), కాంగ్రెస్ అభ్యర్థుల్లో 39 శాతం (164), బీఎస్పీ అభ్యర్థుల్లో 22 శాతం (85), సీపీఐ(ఎం) అభ్యర్థుల్లో 58 శాతం (40 మంది), స్వతంత్రుల్లో 12 శాతం అభ్యర్థులపై కేసులు నమోదై ఉన్నాయి. - రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల వారీగా చూస్తే డామన్ అండ్ డయ్యూలో అత్యధికంగా 50 శాతం మంది అభ్యర్థులపై క్రిమినల్ కేసులు నమోదవగా.. అత్యల్పంగా అండమాన్ నికోబార్ దీవుల్లో 7 శాతం అభ్యర్థులపై కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా కేసులు నమోదైన అభ్యర్థులు ఉన్న రాష్ట్రాల్లో తదుపరి స్థానాల్లో దాద్రానగేర్ హవేలీ (36 శాతం), లక్షద్వీప్ (33 శా తం), కేరళ (32శాతం), బిహార్ (26 శాతం), మహారాష్ట్ర (26 శాతం), గోవా (25 శాతం), యూపీ (23 శాతం), జార్ఖండ్ (23 శాతం), ఆంధ్రప్రదేశ్ (21 శాతం) నిలిచాయి. తెలంగాణ 26వ స్థానంలో నిలిచింది. ఇక్కడ 12 శాతం అభ్యర్థులపై కేసులు నమోదయ్యాయి. ఆర్థిక స్థితిగతులు ఇలా... - లోక్‌సభకు పోటీచేస్తున్న అభ్యర్థుల్లో కోటీశ్వరుల సంఖ్య పెరుగుతూ పోతోంది. 2009లో 16 శాతం కోటీశ్వరులు ఉండగా, 2014లో ఆ సంఖ్య 27 శాతానికి పెరిగింది. 2019లో ఆ సంఖ్య 29 శాతానికి పెరిగింది. - రాష్ట్రాల వారీగా చూస్తే అరుణాచల్‌ప్రదేశ్‌లో 83 శాతం అభ్యర్థులు కోటీశ్వరులే. మేఘాలయ (78 శాతం), మిజోరం (67 శాతం), నాగాలాండ్, డామన్ అండ్ డయ్యూ, లక్షద్వీప్, గోవాల్లో 50 శాతం అభ్యర్థులు కోటీశ్వరులే. జమ్మూకశ్మీర్‌లో 48 శాతం, హిమాచల్‌లో 47 శాతం, ఆంధ్రప్రదేశ్‌లో 42 శాతం అభ్యర్థులు కోటీశ్వరులే. చివరి స్థానంలో తెలంగాణ నిలిచింది. ఇక్కడ 18 శాతం మంది మాత్రమే కోటీశ్వరులు. - 2019 లోక్‌సభ అభ్యర్థుల సగటు ఆస్తులు రూ. 4.14 కోట్లు. - పార్టీలవారీగా అభ్యర్థుల ఆస్తులు చూస్తే బీజేపీ అభ్యర్థు ల సగటు ఆస్తి రూ. 13.37 కోట్లు గా ఉంది. కాం గ్రెస్ అభ్యర్థుల సగటు రూ. 19.92 కోట్లుగా, బీఎస్పీ సగటు రూ. 3.86 కోట్లుగా ఉంది. సీపీఎం రూ. 1.28 కోట్లుగా, స్వతంత్రుల సగటు రూ. 1.25 కోట్లుగా ఉంది. - 2019 అభ్యర్థుల్లో అత్యధిక ఆస్తులు కలిగిన తొలి మూడు స్థానాల్లో బిహార్‌లోని పాటలీపుత్ర స్థానం నుంచి స్వతంత్రుడిగా పోటీ చేస్తున్న రమేష్‌కుమార్ శర్మ రూ. 1,107 కోట్ల ఆస్తులతో తొలిస్థానంలో నిలిచారు. చేవెళ్ల కాంగ్రెస్ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి lokరూ.895 కోట్ల ఆస్తులతో ద్వితీయ స్థానంలో నిలిచారు. మధ్యప్రదేశ్‌లోని చింద్వాడ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి నకుల్‌నాథ్ రూ. 660 కోట్లతో మూడోస్థానంలో నిలిచారు. - 60 మంది అభ్యర్థులు తమకు ఆస్తులేమీ లేవని ప్రకటించారు. - 756 మంది అభ్యర్థుల ఆస్తులు రూ. లక్ష లోపు ఉన్నాయి. అత్యంత తక్కువ ఆస్తులు కలిగిన వారిలో కింది నుంచి తమిళనాడులోని మాయిలాదుతురై నుంచి స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసిన రాజేశ్, రాజా తమ ఆస్తులను రూ. 100లుగా చూపగా, కేరళలోని వయనాడ్ నుంచి స్వతంత్రుడిగా పోటీ చేసిన శ్రీజిత్ రూ. 120గా చూపారు. - మొత్తం అభ్యర్థుల్లో 10 శాతం మంది తమ పాన్ కార్డు వివరాలు వెల్లడించలేదు. విద్యార్హతలు.. 44 శాతం అభ్యర్థుల విద్యార్హత ఐదో తరగతి నుంచి 12వ తరగతి మధ్య ఉండగా.. 48 శాతం మంది అభ్యర్థులు పట్టుభద్రులు, ఆపై అర్హతగా కలిగి ఉన్నారు. 253 మంది అభ్యర్థులు తాము అక్షరాస్యులమని ప్రకటించగా, 163 మంది అభ్యర్థులు నిరక్షరాస్యులమని ప్రకటించారు. టాప్–3 తెలుగువారే అత్యధిక వార్షిక ఆదాయం (ఇన్‌కంటాక్స్ రిటర్న్‌ల్లో చూపిన మేరకు) ప్రకటించిన వారిలో తొలి ముగ్గురు తెలుగువారే. టీడీపీకి చెందిన గల్లా జయదేవ్, బీద మస్తాన్‌రావు వరుసగా ఒకటి, రెండో స్థానాల్లో నిలవగా, టీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ గడ్డం రంజిత్‌రెడ్డి మూడో స్థానంలో నిలిచారు. భార్య, పిల్లల వార్షికాదాయంతో కలిపి గల్లా జయదేవ్ రూ.43 కోట్లు, బీద మస్తాన్‌రావు రూ. 34 కోట్లు, రంజిత్‌రెడ్డి రూ. 33 కోట్లుగా చూపారు. -
ఐదో దశ పోలింగ్ : సంపన్న అభ్యర్ధి ఆమే..
సాక్షి, న్యూఢిల్లీ : లోక్‌సభ ఎన్నికల ఐదో విడత పోలింగ్‌కు సంబంధించి రూ 193 కోట్ల ఆస్తులు ప్రకటించిన పూనం సిన్హా అత్యంత సంపన్న అభ్యర్ధిగా నిలిచారు. సినీ నటుడు, కాంగ్రెస్ నేత శత్రుఘ్న సిన్హా భార్య పూనం ఎస్పీ అభ్యర్ధిగా లక్నో నుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక రూ 177 కోట్ల ఆస్తులతో ప్రగతిశీల్ సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్ధి విజయ్ కుమార్ మిశ్రా తర్వాతి స్ధానంలో ఉన్నారు. మిశ్రా సీతాపూర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి బరిలో దిగారు. అత్యంత సంపన్న అభ్యర్ధుల జాబితాలో హజారిబాగ్ బీజేపీ అభ్యర్ధి జయంత్ సిన్హా రూ 77 కోట్ల ఆస్తులతో మూడో స్ధానంలో ఉన్నారు. ఐదో విడత పోలింగ్‌లో బరిలో నిలిచిన 668 మంది అభ్యర్ధుల్లో 184 మంది అభ్యర్ధుల ఆస్తులు రూ కోటికి మించాయి. వీరిలో అత్యధికులు బీజేపీ అభ్యర్ధులు కావడం గమనార్హం. అభ్యర్ధుల అఫిడవిట్లను విశ్లేషించిన అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫామ్స్ (ఏడీఆర్) సంస్ధ ఈ వివరాలు వెల్లడించింది. ఇక ఐదో విడత పోలింగ్‌లో పోటీ చేస్తున్న అభ్యర్ధుల సగటటు ఆస్తి రూ 2.57 కోట్లుగా నమోదైంది. మరోవైపు 264 మంది అభ్యర్ధుల విద్యార్హత ఐదో తరగతి నుంచి ఇంటర్ లోపు ఉండటం గమనార్హం. 348 మంది అభ్యర్ధులు గ్రాడ్యుయేట్లు, పోస్ట్‌గ్రాడ్యుయేట్లుగా ప్రకటించుకున్నారు. మరో 43 మంది తాము అక్షరాస్యులమని పేర్కొనగా, ఆరుగురు అభ్యర్ధులు తాము నిరక్షరాస్యులమని స్పష్టం చేశారు. -
213 మంది అభ్యర్థులపై కేసులు..!
సాక్షి, న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి నాయకులు నానాపాట్లు పడుతున్నారు. తొలిదశ ఎన్నికలకు సరిగ్గా ఐదు రోజుల సమయమే మిగిలి ఉంది. ఈలోపు బరిలో ఉన్న అభ్యర్థులకు సంబంధించి ఆసక్తికర అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. తొలిదశ బరిలో ఉన్న అభ్యర్థుల్లో దాదాపు 213 మంది అభ్యర్థులు వివిధ కేసులను ఎదుర్కొంటున్నారు. నేషనల్ ఎలక్షన్ వాచ్ అండ్ అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) అనే సంస్థ చేసిన సర్వేతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దేశంలో మొదటి దశ పోలింగ్ జరిగే 96 లోక్‌సభ నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న సుమారు 213 అభ్యర్థులపై పలు కేసులున్నాయని ఏడీఆర్ తెలిపింది. వీటిలో హత్య, మహిళలపై దాడులు, కిడ్నాప్ కేసులు ఎదుర్కొంటున్న వారి సంఖ్య అధికంగా ఉంది. 1,266 మంది అభ్యర్థులకు సంబంధించిన అఫిడవిట్లను పరిశీలించిన ఏడీఆర్ సంస్థ, వీరిలో 12 శాతం మందిపై క్రిమినల్ కేసులున్నాయని పేర్కొంది. 10 శాతం అభ్యర్థులు తమ మీద పలు హత్య కేసులున్నాయని అఫిడవిట్లో తెలుపగా.. హత్యాయత్నం కేసులున్నట్టు 25 శాతం మంది, కిడ్నాప్ కేసులు ఉన్నట్టు నలుగురు, మహిళలకు సంబంధించిన కేసులు ఎదుర్కొంటున్నట్టు 16 మంది అఫిడవిట్లలో పేర్కొన్నారు. విద్వేశపూరిత ప్రసంగాల కేసులు తమపై ఉన్నట్టు మరో 12 శాతం మంది, తమ మీద రెడ్ అలర్ట్ కేసులు ఉన్నట్టు 37 మంది తెలిపారు. ప్రధాన పార్టీలైన బీజేపీ నుంచి పోటీ చేస్తున్న 83 మంది అభ్యర్థుల్లో 30 మందిపై కేసులు ఉండగా.. కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్న 32లో ఎనిమిది మంది, బీఎస్పీ పోటీ చేస్తున్న 32లో ఎనిమిది మంది నేరచరితులు ఉన్నట్టు తెలిపింది. -
పదేళ్లలో సోనియా, రాహుల్ ఆస్తి ఎంత పెరిగింది?
లక్నో: ఉత్తరప్రదేశ్ లోక్‌సభ, విధాన సభ నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న పలువురి రాజకీయ వేత్తలు ఆస్తులు 13ఏళ్లలో 10 రెట్లు పుంజుకున్నాయి. 2019 సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో యూపీ రాజకీయాల్లో ధన(బాహు)బలుల వివరాలను అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్ (ఎడిఆర్) శనివారం ప్రకటించింది. వీటితోపాటు 2004, 2019 నాటికి ఆస్తులు బాగా వృద్ధి చెందిన పలువురు ఎంపీలు, ఎంఎల్ఏల వివరాలను కూడా వెల్లడించింది. ముఖ్యంగా కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు, సోనియా గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖా మంత్రి మేనకా గాంధీ, సమాజ్‌వాది పార్టీ అధినేత ములాయం సింగ్, మరికొంత ఎంపీలు ఈ జాబితాలో ఉన్నారు. 2004-14 మధ్య కాలంలో యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆస్తులు రూ. 7కోట్లు వృద్ది చెందాయి. అలాగే కేంద్ర మంత్రి మేనకా గాంధీ ఆస్తుల విలువ రూ. రూ.30కోట్లు పెరిగింది. ఎస్పీ నేత ములాయం సింగ్ యాదవ్ ఆస్తులు రూ.14కోట్లు పెరిగాయి. 2004 నుంచి 2014 మధ్యకాలంలో ఎస్పీ ఎంఎల్ఏ దుర్గా ప్రసాద్ యాదవ్ , ముక్తార్ అన్సారీ (ఇండిపెండెంట్) రూ. 8 కోట్లు పెరిగాయి. శాసనసభ్యుల సగటు ఆదాయం 2007లో 1.2 కోట్లుగాను, 2012 రూ .3.87 కోట్లుగాను ఉంది. అదే 2017నాటికి వచ్చేసరికి రూ. 7.74 కోట్లకు అసాధారణంగా పెరిగిందని ఎడిఆర్ తెలిపింది. మొత్తం19,971 మంది అభ్యర్థులను కమిటీ పరిగణనలోకి తీసుకుంది. ఇందులో 1,443 మంది ఎంపీలు, 38 శాతం మంది శాసనసభ్యులు తమపై క్రిమినల్ కేసులు నమోదైనట్టుఅంగీకరించారు. వీటిలో 328మంది శాసనసభ్యులు, ఎంపీలు తీవ్ర నేరారోపణలు ఎదుర్కొంటున్నారని ఎడీఆర్ నివేదించడం గమనార్హం. -
ఆ మంత్రులంతా కోటీశ్వరులే!
రాయ్‌పూర్ : ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్ ఇటీవలే తన మంత్రివర్గాన్ని విస్తరించిన విషయం తెలిసిందే. తొలిసారి సీఎంగా పగ్గాలు చేపట్టిన ఆయన మొత్తం 12 మంది ఎమ్మెల్యేలకు మంత్రులుగా అవకాశం కల్పించారు. వీరిలో ఓ మహిళ కూడా ఉండటం గమనార్హం. కాగా ఆయన కేబినెట్లోని మంత్రులంతా కోటీశ్వరులేనని అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రీఫార్మ్స్(ఏడీఆర్), ఛత్తీస్‌గఢ్ ఎలక్షన్ వాచ్ తాజాగా నివేదిక విడుదల చేశాయి. వీరందరి సగటు ఆస్తి విలువ రూ. 47.13 కోట్లని వెల్లడించాయి. ఆయన ఆస్తి విలువ రూ. 500 కోట్లు! భూపేశ్ బఘేల్ మంత్రివర్గంలో చోటు దక్కించుకున్న ఎమ్మెల్యేలందరిలో అంబికాపూర్ ఎమ్మెల్యే టీఎస్ బాబా రూ. 500.01 కోట్ల సంపాదనతో అగ్రస్థానంలో నిలవగా.... కోంటా నియోజకవర్గానికి చెందిన గిరిజన నేత కవాసి లక్ష్మా రూ. 1.9 కోట్ల ఆస్తి కలిగి ఉండి చివరి స్థానం పొందారని ఏడీఆర్ నివేదిక పేర్కొంది. ఇక సీఎం భూపేశ్ బఘేల్ ఆస్తి రూ. 21.5 కోట్లుగా పేర్కొన్న ఏడీఆర్... మిగిలిన 9 మంది మంత్రుల ఆస్తుల విలువ రూ. 8 కోట్లలోపే అని పేర్కొంది. -
కమలంపై కనక వర్షం.. కాంగ్రెస్‌కు మాత్రం రూ.11 కోట్లే!!
సాక్షి, న్యూఢిల్లీ : ఓవైపు... వివిధ రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరుగుతుండగా.. మరోవైపు లోక్‌సభ ఎన్నికలు కూడా సమీపిస్తున్న నేపథ్యంలో పలు రాజకీయ పార్టీలకు ‘ఆర్థిక భారాన్ని’ తగ్గించేందుకు కార్పోరేట్ సంస్థలు విరాళాల రూపంలో సాయం చేసేందుకు ముందుకు వస్తున్నాయి. ఎలక్ట్రోరల్ ట్రస్టుల ద్వారా చందాలు అందించి తమ వంతు సాయం చేస్తున్నాయి. అయితే ఏయే పార్టీకి ఎన్నెన్ని విరాళాలను అందాయనే విషయంపై అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రీఫార్మ్స్(ఏడీఆర్) నివేదిక వెల్లడించింది. ఏడీఆర్ నివేదిక ప్రకారం... 2017-18గాను వివిధ పార్టీలన్నింటికీ కలిపి సంయుక్తంగా 194 కోట్ల రూపాయల విరాళాలు అందాయి. ఇందులో అత్యధిక వాటా అధికార బీజేపీకి దక్కిందని నివేదిక పేర్కొంది. మొత్తం విరాళాల్లో 86.59 శాతం అంటే సుమారు 167.80 కోట్ల రూపాయలు కాషాయ పార్టీకి అందాయని తెలిపింది. ఇక ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీతో సహా నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, నేషనల్ కాన్ఫరెన్స్, బిజు జనతాదళ్ వంటి పలు ప్రాంతీయ పార్టీలన్నింటికీ కలిపి 25.98 కోట్ల రూపాయలు చందాల రూపేణా అందాయని వెల్లడించింది. ఇందులో కాంగ్రెస్ వాటా 11 కోట్ల రూపాయలని ఏడీఆర్ తెలిపింది. ఇది బిజు జనతా దళ్ పార్టీ(రూ.14 కోట్లు)కి దక్కిన మొత్తం కంటే తక్కువ కావడం గమనార్హం. భారతీ ఎయిర్టెల్ పెద్ద మనసు.. ఎలక్ట్రోరల్ ట్రస్టులకు అందిన విరాళాలతో పాటు టాప్-10 దాతల వివరాలను కూడా ఏడీఆర్ తన నివేదికలో పొందుపరిచింది. టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్టెల్ అత్యధికంగా 25.005 కోట్ల రూపాయలు అందించగా, రియల్ ఎస్టేట్ దిగ్గజం డీఎల్ఎఫ్ రూ. 25 కోట్లు, యూపీఎల్ లిమిటెడ్ రూ. 20 కోట్లు అందజేసాయి. -
అత్యంత సంపన్న పార్టీగా సేన..
సాక్షి, న్యూఢిల్లీ : 2016-17 ఆర్థిక సంవత్సరంలో అన్ని ప్రాంతీయ పార్టీల కంటే శివసేనకు అత్యధిక విరాళాలు సమకూరాయని అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్(ఏడీఆర్) నివేదిక వెల్లడించింది. ఎన్నికల కమిషన్‌కు రాజకీయ పార్టీలు సమర్పించిన రికార్డులను విశ్లేషించిన మీదట ఈ నివేదికను ఏడీఆర్ రూపొందించింది. మహారాష్ట్రకు చెందిన శివసేన 297 విరాళాల నుంచి రూ 25.65 కోట్లు స్వీకరించింది. ఇక రూ24.73 కోట్ల విరాళాలతో ఆప్ తదుపరి స్ధానంలో నిలించింది. పంజాబ్‌కు చెందిన శిరోమణి అకాలీ దళ్ రూ 15.45 కోట్ల విరాళాలు రాబట్టి మూడో స్థానంలో నిలిచిందని ఏడీఆర్ నివేదిక తెలిపింది. ఇక ప్రాంతీయ పార్టీలు 6,339 విరాళాల నుంచి మొత్తం రూ 91.37 కోట్ల మొత్తం సమీకరించాయి. ఇందులో రూ 65.83 కోట్లు శివసేన, ఆప్, శిరోమణి అకాలీదళ్‌లకే దక్కాయి. నగదు విరాళాల్లో రూ 72.7 లక్షలతో అసోం ప్రధమ స్ధానంలో నిలవగా,రూ 65 లక్షలతో పుదుచ్చేరి తదుపరి స్ధానంలో ఉంది. అత్యధిక విరాళాలు రూ 20.86 కోట్లు ఢిల్లీ నుంచి సమకూరగా, 19.7 కోట్లు మహారాష్ట్ర నుంచి రూ 9.42 కోట్లు పంజాబ్ నుంచి సమకూరాయని ఏడీఆర్ నివేదిక తెలిపింది. రాజకీయ పార్టీలు రూ 20,000 మించిన విరాళాల వివరాలను వెల్లడించాలని, ఫామ్ 24ఏని పూర్తిగా నింపాలని సుప్రీం కోర్టు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. -
‘కాంగ్రెస్ పార్టీలో ఆర్థిక సంక్షోభం నిజమే’
సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోందటూ వచ్చిన వార్తలపై ఆ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి శశి థరూర్ స్పందించారు. ‘ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు మీ సహకారం కావాలి. విరాళాలు అందించి మాకు సహాయం చేయండి అంటూ’ కాంగ్రెస్ పార్టీ చేసిన ట్వీట్‌ను ఆయన సమర్థించారు. జాతీయ మీడియాతో మాట్లాడిన థరూర్.. ‘ప్రస్తుతం అత్యధిక విరాళాలు అందుకుంటున్న పార్టీ బీజేపీ అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఎందుకంటే అధికారం ఉన్న వారి దగ్గరికే డబ్బు కూడా వెళ్తుంది. ఆ కారణంగానే ప్రస్తుతం ప్రతిపక్ష పార్టీలన్నీ చిన్నపాటి ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ వంటి జాతీయ పార్టీ’ అంటూ వ్యాఖ్యానించారు. అంతేకాకుండా ‘కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో మా పార్టీ అభ్యర్థులు చాలా మంది సొంత డబ్బే ఖర్చు చేశారు. ఒకవేళ మేము పెద్ద మొత్తంలో విరాళాలు సేకరించడంలో విజయం సాధించినట్లైతే.. వచ్చే సాధారణ ఎన్నికల్లో ఇదే ఫలితం పునరావృతమవుతుందంటూ’ శశి థరూర్ ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా నివేదిక ప్రకారం బీజేపీ రూ.1034.27 కోట్ల ఆదాయం కలిగి ఉన్నట్లు ఎన్నికల సంఘానికి తెలిపినట్లు అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్(ఏడీఆర్) తన నివేదికలో పేర్కొంది. గతంలో పోలిస్తే ఈసారి బీజేపీ ఆదాయం రూ. 463.41 కోట్లమేర పెరిగిందని తెలిపింది. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ ఆదాయం 14 శాతానికి పడిపోయినట్లు పేర్కొంది. ఇక ప్రాంతీయ పార్టీల్లో సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) అత్యంత ధనిక పార్టీ అని, ఎస్పీ తర్వాత తమిళ పార్టీ ద్రవిడ మున్నేట్ర కళగం(డీఎంకే) రెండో స్థానంలో ఉందని ఏడీఆర్ తెలిపింది. The Congress needs your support and help. Help us restore the democracy which India has proudly embraced since 70 years by making a small contribution here: https://t.co/PElu5R0mR6 #IContributeForIndia pic.twitter.com/XQ75Iaf7A6 — Congress (@INCIndia) May 24, 2018 No doubt that BJP is soaking up most of the political funding,partly because money goes to those who are in power. As a result most of the oppn parties are facing a bit of a crisis particularly the Congress which has a nationwide presence: Shashi Tharoor,Congress pic.twitter.com/im7MqRDx6x — ANI (@ANI) May 25, 2018 -
అత్యంత సంపన్న పార్టీ ఏదంటే..
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలోని 32 ప్రాంతీయ పార్టీల్లో రూ 82.72 కోట్ల ఆదాయంతో సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అత్యంత సంపన్న పార్టీగా అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) నివేదిక వెల్లడించింది. ఎస్పీ తర్వాత రూ 72.92 కోట్లతో టీడీపీ రెండో అత్యంత సంపన్న ప్రాంతీయ పార్టీగా నిలిచింది. ఇక ఏఐఏడీఎంకే రూ 48.88 కోట్లతో తర్వాతి స్ధానంలో ఉంది. మొత్తం 32 ప్రాంతీయ పార్టీల ఆదాయం 2016-17లో రూ 321.03 కోట్లుగా నమోదైంది. వీటిలో 14 పార్టీలు తమ ఆదాయం తగ్గిపోయిందని ప్రకటించగా 13 పార్టీలు రాబడి పెరిగిందని పేర్కొన్నాయి. ఐదు ప్రాంతీయ పార్టీలు ఎన్నికల కమిషన్‌కు తమ ఆదాయ పన్ను రిటన్స్‌ను సమర్పించలేదు. ఇండియన్ నేషనల్ లోక్‌దళ్, మహరాష్ట్రవాది గోమంతక్ పార్టీ, జమ్మూ కశ్మీర్ పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ, ఆల్ ఇండియా యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్, కేరళ కాంగ్రెస్-మణి పార్టీలు ఆదాయ పన్ను రిటన్స్‌ను దాఖలు చేయలేదు. ఇక తమ ఆదాయంలో 87 శాతం పైగా ఇంకా ఖర్చు చేయలేదని ఎంఐఎం, జేడీఎస్‌లు పేర్కొనగా, తమ ఆదాయంలో 67 శాతం ఇంకా ఖర్చు చేయలేదని టీడీపీ స్పష్టం చేసింది. మరోవైపు తమ ఆదాయం కన్నా అధికంగా రూ 81,88 కోట్లు ఖర్చు చేసినట్టు డీఎంకే వెల్లడించింది. ఎస్పీ, ఏఐఏడీఎంకేలు వరుసగా రూ 64 కోట్లు, రూ 37 కోట్లు వెచ్చించాయి. -
ఆ ఎమ్మెల్యేలంతా కోటీశ్వరులే..
సాక్షి, న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా ఆసక్తి రేకెత్తించిన కర్ణాటక ఎన్నికల ఫలితాలు వెలువడిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అధికార, ప్రతిపక్ష పార్టీలు భారీగా బ్లాక్‌మనీ వెదజల్లాయంటూ పరస్పరం ఆరోపణలు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో కర్ణాటక ఎలక్షన్ వాచ్, అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రీఫార్మ్స్(ఏడీఆర్) కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల ఆస్తుల వివరాల గురించి నివేదిక విడుదల చేశాయి. ప్రస్తుత ఎన్నికల్లో గెలుపొందిన 221 మంది ఎమ్మెల్యేలలో 215 మంది కోటీశ్వరులేనని ఏడీఆర్ నివేదికలో పేర్కొంది. సగటున ఒక్కో ఎమ్మెల్యే 35 కోట్ల రూపాయల సంపద కలిగి ఉన్నారని, 2013 ఎన్నికల్లో గెలుపొందిన వారి కంటే ఇది 11 కోట్లు ఎక్కువని వెల్లడించింది. ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్ ఆధారంగా ఈ నివేదికను విడుదల చేసినట్లు ఏడీఆర్ తెలిపింది. టాప్ 10లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలే.. ధనవంతులైన ఎమ్మెల్యేల జాబితాలోని టాప్ 10 మందిలో ఏడుగురు కాంగ్రెస్ పార్టీకి చెందిన వారే. హోసకోటె ఎమ్మెల్యే ఎన్ నాగరాజు 1015 కోట్ల రూపాయల సంపదతో ప్రథమ స్థానంలో ఉండగా.. డీకే శివకుమార్ 840 కోట్ల రూపాయలతో రెండో స్థానంలో నిలిచారు. సురేశ్ బీఎస్ 416 కోట్ల రూపాయల ఆస్తి కలిగి ఉన్నారు. కాంగ్రెస్‌కే మొదటి స్థానం... కొత్తగా ఎన్నికైన చట్టసభ ప్రతినిధుల్లో అత్యధిక మంది కోటీశ్వరులైన ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ పార్టీ మొదటి స్థానంలో నిలిచింది. కాంగ్రెస్ పార్టీలోని 99 శాతం మంది ఎమ్మెల్యేలని కోటీశ్వరులుగా పేర్కొన్న ఏడీఆర్.. సగటున ఒక్కో ఎమ్మెల్యే 60 కోట్ల రూపాయల ఆస్తులు కలిగి ఉన్నట్లు తెలిపింది. ఇక 98 శాతం మంది కోటీశ్వరులైన ఎమ్మెల్యేలతో బీజేపీ రెండో స్థానంలో నిలిచింది. అయితే వీరి సగటు ఆస్తుల విలువ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల కంటే చాలా తక్కువ(రూ. 17 కోట్లు)ని పేర్కొంది. జేడీఎస్.. 95 శాతం.. 24 కోట్లు.. ఊహించిన దాని కంటే ఎక్కువ మంది ఎమ్మెల్యేలను గెలుపించుకున్న జేడీఎస్.. సగటున 24 కోట్ల రూపాయల సంపద కలిగి ఉన్న 95 శాతం ఎమ్మెల్యేలతో మూడో స్థానంలో నిలిచింది. క్రిమినల్ కేసుల్లో కూడా... ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్ ఆధారంగా.. 221 మంది ఎమ్మెల్యేలలో 35 శాతం మందిపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు ఏడీఆర్ పేర్కొంది. కాగా ఈ విషయంలో బీజేపీ 41 శాతం మంది ఎమ్మెల్యేలతో ప్రథమ స్థానంలో ఉండగా.. జేడీఎస్- కాంగ్రెస్‌లు 30 శాతం మంది ఉన్నారు. -
నోరుజారిన చట్టసభ సభ్యులు ఎందరంటే..
సాక్షి, న్యూఢిల్లీ : ప్రస్తుత పార్లమెంట్ సభ్యులు, ఎంఎల్ఏల్లో 58 మంది తమపై విద్వేషపూరిత ప్రసంగాలు చేసినందుకు కేసులు నమోదయ్యాయని వెల్లడించారు. వీరిలో బీజేపీ నుంచే ఎక్కువ మంది ఉన్నట్టు అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) సంస్థ పేర్కొంది. పదిమంది సిట్టింగ్ బీజేపీ’ఎంపీలు (లోక్‌సభ), ఏఐయూడీఎఫ్, టీఆర్ఎస్, పీఎంకే, ఏఐఎంఐఎం, శివసేనల నుంచి ఒక్కరేసి ఎంపీపై విద్వేషపూరిత ప్రసంగం చేశారనే అభియోగాలు నమోదైనట్టు ఏడీఆర్ వెల్లడించింది. ఇక పార్టీల వారీగా బీజేపీ నుంచి 27 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఏఐఎంఐఎంకు చెందిన ఆరుగురు చట్టసభ సభ్యులు, టీఆర్‌ఆఎస్ (6) టీడీపీ (3), శివసేన (3), ఏఐటీసీ (2), ఐఎన్‌సీ (2), ఐఎన్డీ (2), జేడీ (యూ) (2), ఏఐయూడీఎఫ్ (1), బీఎస్పీ (1), డీఎంకే, పీఎంకే, ఎస్పీల నుంచి ఒక్కో సభ్యుడిపై ఈ తరహా కేసులున్నాయని ఏడీఆర్ నివేదిక పేర్కొంది. కేంద్ర మంత్రి ఉమాభారతితో పాటు పలు రాష్ట్రాలకు చెందిన ఎనిమిది మంది మంత్రులు తమపై ఇలాంటి కేసులున్నాయని వెల్లడించారని తెలిపింది. ఇక విద్వేషపూరిత ప్రసంగాల కేసులు నమోదయ్యాయని పలు రాష్ట్రాలకు చెందిన 43 మంది సిట్టింగ్ ఎంఎల్ఏలు వెల్లడించారని పేర్కొంది. వీరిలో బీజేపీ నుంచి అత్యధికంగా 17 మంది ఎమ్మెల్యేలు, టీఆర్ఎస్, ఏఐఎంఐఎంల నుంచి ఐదుగురు ఎమ్మెల్యేలున్నారు. టీడీపీ నుంచి ముగ్గురు, ఐఎన్‌సీ, ఏఐటీసీ, జేడీ(యూ), శివసేనల నుంచి ముగ్గురేసి ఎమ్మెల్యేలపై విద్వేష ప్రసంగాల కేసులు నమోదయ్యాయి. కాగా డీఎంకే, బీఎస్పీ, ఎస్పీ సహా ఇద్దరు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలపైనా ఈ తరహా కేసులు నమోదయ్యాయని నివేదిక వెల్లడించింది. సిట్టింగ్ ఎంపీలు, ఎంఎల్ఏలు సమర్పించిన డిక్లరేషన్లను విశ్లేషిస్తూ ఏడీఆర్ ఈ నివేదికను రూపొందించింది. ఇక రాష్ట్రాలవారీగా చూస్తే యూపీలో అత్యధికంగా15 మంది ఎంపీలు, ఎంఎల్ఏలు నోరుజారారు. ఇక తెలంగాణా నుంచి 13 మంది సిట్టింగ్ ఎంఎల్ఏలు, కర్ణాటక నుంచి ఐదుగురు, మహారాష్ట్ర నుంచి ఐదుగురు చట్టసభల సభ్యులు తమపై ఇలాంటి కేసులున్నాయని వెల్లడించారు. ఇక తెలంగాణాలో ఈ తరహా కేసులు 11 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలపై ఉన్నాయని, బిహార్ నుంచి నలుగురు, యూపీ నుంచి 9 మంది, మహారాష్ట్ర నుంచి నలుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలపై విద్వేషపూరిత ప్రసంగం చేశారనే కేసులు నమోదయ్యాయి. ఇక ఏపీ, కర్ణాటక నుంచి ముగ్గురేసి ఎమ్మెల్యేలపై హేట్ స్పీచ్ కేసులు నమోదయ్యాయి. ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్ నుంచి ఇద్దరేసి, గుజరాత్, ఎంపీ, తమిళనాడు, రాజస్ధాన్, జార్ఖండ్‌ల నుంచి ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలపై ఈ తరహా కేసులు నమోదయ్యాయి. ఎన్నికలకు ముందు, ఎన్నికల సందర్భంగా విద్వేష ప్రసంగాలు చేసిన అభ్యర్థులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏడీఆర్ పేర్కొంది. -
ఆడబిడ్డలపై పచ్చ నేతల కీచక పర్వం
-
పచ్చ కీచకులు..
ఆంధ్రప్రదేశ్‌లో ఆడబిడ్డలపై నానాటికీ పెచ్చుమీరుతున్న పచ్చ నేతల కీచక పర్వాన్ని జాతీయ స్థాయిలో నివేదికలు బట్టబయలు చేస్తున్నాయి. తెలుగుదేశం పార్టీకి చెందిన శాసనసభ్యులు, అమాత్యులు మహిళలపై అంతులేని దౌర్జన్యాలు, అత్యాచారాలు, బెదిరింపులకు పాల్పడుతున్న వైనాన్ని స్వచ్ఛంద సంస్థలు, నివేదికలు తేటతెల్లం చేస్తున్నాయి. ‘మహిళలపై నేరాల కేసుల్లో చట్టసభ్యులు’ అంశంపై అసోసియేషన్ ఫర్ డెమొక్రాటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్), జాతీయ ఎన్నికల పరిశీలన స్వచ్ఛంద సంస్థలు ఓ నివేదికను ఇటీవల (ఈనెల 19న) విడుదల చేశాయి. ఐదుగురు టీడీపీ చట్టసభ్యులు మహిళలపై పాల్పడ్డ నేరాలకుగానూ నమోదైన కేసులను నివేదికలో బహిర్గతం చేశాయి. సాక్షి, న్యూఢిల్లీ/అమరావతి: దేశవ్యాప్తంగా ప్రస్తుత ఎమ్మెల్యేలు, ఎంపీలు మహిళలపై నేరాలకు సంబంధించిన కేసులను వారి ఎన్నికల అఫిడవిట్ల ఆధారంగా విశ్లేషించి ఆ సంస్థలు ఈ నివేదిక రూపొందించాయి. 4,077 మంది ఎమ్మెల్యేలు, 768 మంది ఎంపీల అఫిడవిట్లను పరిశీలించగా వీరిలో 33 శాతం (1,580 మంది ఎమ్మెల్యేలు/ఎంపీలు) సభ్యులపై క్రిమినల్ కేసులు నమోదై ఉన్నాయని, 48 మంది సభ్యులు మహిళలపై నేరాలకు పాల్పడిన కేసులను కలిగి ఉన్నట్టు వెల్లడించింది. వీరిలో ముగ్గురు ఎంపీలు కాగా 45 మంది ఎమ్మెల్యేలు. 45 మంది ఎమ్మెల్యేల్లో ఐదుగురు టీడీపీకి చెందిన వారే కావడం గమనార్హం. మహిళలపై నేరాలకు పాల్పడినట్టు కేసులు ఎదుర్కొంటున్న వారిలో అత్యధికంగా మహారాష్ట్రకు చెందిన వారు 12 మంది ఉండగా, రెండోస్థానంలో పశ్చిమబెంగాల్ ఉంది. అక్కడ 11 మంది సభ్యులు ఈ కేసులు ఎదుర్కొంటున్నారు. మూడో స్థానంలో ఆంధ్రప్రదేశ్, ఒడిశా నిలిచాయి. ఐదేసి మందితో ఒడిషా, ఆంధ్రప్రదేశ్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. మొత్తం 48 మందిలో 12 మంది బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు కాగా, ఏడుగురు శివసేన, ఆరుగురు తృణమూల్ కాంగ్రెస్, ఐదుగురు తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులు ఉన్నారు. రాష్ట్రంలో చింతమనేని టాప్ అత్యంత వివాదాస్పదుడిగా పేరొందిన పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌పై రికార్డు స్థాయిలో కేసులు నమోదయ్యాయి. ఆయనపై ఏకంగా 23 కేసులు నమోదైనట్టు ఏడీఆర్ నివేదిక పేర్కొంది. వాటిలో తీవ్రమైన ఐపీసీ సెక్షన్లు ఉన్నవి 13 కేసులు ఉన్నాయి. ఆయా కేసుల్లో మొత్తం 75 సెక్షన్ల కింద అభియోగాలున్నాయి. రాష్ట్ర మంత్రి, కృష్ణా జిల్లా మైలవరం ఎమ్మెల్యే దేవినేని ఉమామహేశ్వరరావుపై 13 కేసులు నమోదు కాగా, అందులో ఒకటి తీవ్రమైన కేసు. మొత్తం 42 సెక్షన్ల కింద అభియోగాలు నమోదయ్యాయి. మరో మంత్రి, శ్రీకాకుళం జిల్లా టెక్కలి ఎమ్మెల్యే కింజరపు అచ్చెన్నాయుడుపై మూడు అభియోగాల కింద ఒక కేసు నమోదైంది. విశాఖపట్నం పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తిపై నాలుగు కేసులున్నాయి. వీటిల్లో ఐపీసీకి సంబంధించి మొత్తం 21 సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. అనంతపురం జిల్లా ధర్మవరం ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యానారయణ (వరదాపురం సూరి)పై ఈయనపై మొత్తం 10 కేసులుండగా 8 తీవ్రమైన కేసులు. దేశవ్యాప్తంగా రేప్ సంబంధిత కేసులు ఎదుర్కొంటున్న వారు ముగ్గురు సభ్యులు ఉండగా, అందులో ధర్మవరం ఎమ్మెల్యే ఒకరు. వీరిపై మహిళా వేధింపుల కేసులే కాకుండా మరిన్ని పోలీసు కేసులు కూడా ఉన్నాయని ఏడీఆర్ నివేదిక స్పష్టం చేసింది. కేసులు ఎత్తివేస్తూ జీవోలిచ్చిన సర్కార్.. తమ పార్టీ ప్రజాప్రతినిధులపై కేసులు ఎత్తివేస్తూ ఇటీవల తెలుగుదేశం ప్రభుత్వం అనేక జీవోలు జారీ చేసింది. హత్యలు, దోపిడీలు, మహిళలపై వేధింపులు, ప్రభుత్వ అధికారులపై దాడులు, దౌర్జన్యాలు, బెదిరింపులపై నమోదైన అనేక కేసులను ప్రభుత్వం ఇటీవల ఎత్తివేయడం విమర్శలకు దారితీసింది. ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన ప్రజాప్రతినిధులే మహిళలపై వేధింపులకు పాల్పడిన కేసులను ఎత్తివేయడం సరికాదని న్యాయ నిపుణులు తప్పుబడుతున్నారు. -
మహిళలపై దాడుల్లో టీడీపీ నేతలు...
సాక్షి, అమరావతి : మహిళలపై వేధింపుల కేసుల్లో తెలుగుదేశం పార్టీ దేశంలోనే నాలుగో స్థానంలో నిలిచింది. అధికార పార్టీకి చెందిన ఐదుగురు నేతలు మహిళలపై వేధింపులు, అత్యాచారయత్నం కేసుల్లో నిందితులుగా ఉన్నారు. వారిలో ఇద్దరు మంత్రులతో పాటు ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. ఇందులో నలుగురు ఎమ్మెల్యేలు మహిళలపై వేధింపులకు పాల్పడినట్లుగా, మరో ఎమ్మెల్యే అత్యాచార యత్నం చేసినట్లుగా కేసులున్నాయని ఢిల్లీకి చెందిన ఏడీఆర్ (అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రీఫార్మ్స్) అనే స్వచ్ఛంద సంస్థ వెల్లడించింది. దేశవ్యాప్తంగా అందరు ఎమ్మెల్యేలు, ఎంపీల ఎన్నికల అఫిడవిట్లను పరిశీలించి.. వారిలో మహిళలపై వేధింపులు, అత్యాచారయత్నం కేసులున్న వారి జాబితాను ఈ నెల 19న విడుదల చేసింది. ఏడీఆర్ వెల్లడించిన జాబితా ప్రకారం.. మహిళలను వేధించిన కేసుల్లో ఏపీ సీనియర్ మంత్రి, కృష్ణా జిల్లా మైలవరం ఎమ్మెల్యే దేవినేని ఉమామహేశ్వర్రావు, మరో సీనియర్ మంత్రి, శ్రీకాకుళం జిల్లా టెక్కలి ఎమ్మెల్యే కింజారపు అచ్చెన్నాయుడు, పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు ఎమ్మెల్యే, విప్ చింతమనేని ప్రభాకర్, విశాఖ జిల్లా పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి ఉన్నారు. ఇక ధర్మవరం ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణపై అత్యాచారయత్నం కేసు ఉంది. ఆయనపై 376 ఐపీసీతో పాటు 506, 511, 379, 366, 324 సెక్షన్ల కింద మహిళలపై వేధింపుల ఆరోపణలు ఉన్నట్లు ఏడీఆర్ నివేదికలో పేర్కొంది. ఈ ఎమ్మెల్యేలపై మహిళా వేధింపుల కేసులే కాకుండా మరిన్ని పోలీసు కేసులు కూడా ఉన్నాయని తెలిపింది. అత్యంత వివాదాస్పదుడిగా పేరు ఉన్న ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌పై మహిళలపై నేరాలకు సంబంధించి మొత్తం 23 కేసులున్నాయి. ఇందులో తీవ్రమైన సెక్షన్ల కింద ఉన్న కేసులు 13 ఉన్నాయి. ధర్మవరం ఎమ్మెల్యే సూర్యనారాయణపై 10 కేసులు, పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తిపై 4 కేసులున్నట్టు ఏడీఆర్ సంస్థ నిర్థారించింది. మహిళలకు సంబంధించిన కేసుల్లో మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, అచ్చెన్నాయుడు పేర్లు కూడా ఉన్నాయి. మంత్రి దేవినేని ఉమాపై 13 కేసులు, అచ్చెన్నాయుడిపై రెండు కేసులున్నట్టు ఆ సంస్థ తన నివేదిక తేల్చింది. కాగా ఇటీవలే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తమ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు తదితర ప్రజాప్రతినిధులపై నమోదైన కేసులను ఉపసంహరించుకుంటూ జీవోలు జారీచేసింది. హత్యలు, దోపిడీ కేసులు, మహిళలపై వేధింపులకు పాల్పడ్డ కేసులు, ప్రభుత్వ అధికారులపై దాడులు, దౌర్జన్యాలు, బెదిరింపులకు పాల్పడిన ఘటనలకు సంబంధించిన అనేక కేసులు ఈ ఉపసంహరణ జాబితాలో ఉన్నాయి. వాటిల్లో ఎమ్మెల్యేలపై కేసులు కూడా ఉన్నాయా అన్న సందేహం తలెత్తుతోంది. ప్రజాప్రతినిధులై ఉండి.. తప్పుడు చేష్టలకు పాల్పడినవారిపై కేసులను ఎత్తివేయడం దారుణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
ఏపీలో మహిళలపై దౌర్జన్యాలు,దాష్టీకాలు
-
అత్యాచార కేసుల్లో 48 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు..!
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో తరచూ మహిళలు, చిన్న పిల్లలపై చోటుచేసుకుంటున్న అత్యాచార, హత్యా ఘటనలు ఓవైపు కలవరపెడుతుండగా.. వాటన్నింటిపై తక్షణ చర్యలు తీసుకుని బాధితుల పక్షాన నిలవాల్సిన శాసన కర్తలే నిందితులైతే వారి గోడు వినే వారెవ్వరు... చట్టాలు చేసి మృగాళ్ల పీచమణిచే దిక్కెవ్వరు..! దేశవ్యాప్తంగా గత అయిదేళ్లలో 45 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలు మహిళలపై అత్యాచార, హత్యా ఘటనల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్నారని అసోషియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) తన నివేదికలో పేర్కొంది. అత్యాచార ఘటనల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న12 మంది ఎమ్మెల్యేలు, ఎంపీలతో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉండగా, 11 మందితో పశ్చిమ బెంగాల్ రెండో స్థానంలో, ఒడిషా, ఆంధ్రప్రదేశ్ చెరో 5 మందితో తరువాతి స్థానాల్లో ఉన్నాయని ఏడీఆర్ నివేదిక పేర్కొంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ 48 మందిలో 12 మంది బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు కాగా, 7గురు శివసేన , 6గురు తృణమూల్ కాంగ్రెస్ పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలుగా ప్రాతినిథ్యం వహిస్తున్నారని ఏడీఆర్ వెల్లడించింది. దేశ వ్యాప్తంగా గత అయిదేళ్ల కాలంలో అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న 327 మందికి ప్రముఖ రాజకీయ పార్టీలు ఎన్నికల్లో పోటీచేయడానికి టికెట్లు ఇచ్చాయని ఏడీఆర్ తెలిపింది. ఈ మొత్తం సభ్యుల్లో 40 మంది లోక్‌సభ, రాజ్యసభలకు, మిగతా 287 మంది రాష్ట్రాల అసెంబ్లీల ఎన్నికల్లో పోటీచేయడానికి టికెట్ పొందారని పేర్కొంది. మరో 118 మంది స్వతంత్రంగా ఎన్నికల్లో పోటీ చేశారని తన రిపోర్టులో వెల్లడించింది. వీరిలో 18 మంది పార్లమెంటుకు, మిగతా 100 మంది అసెంబ్లీలకు పోటీ పడ్డారని బయటపెట్టింది. ఎన్నికల్లో టికెట్లు పొందిన ఈ మొత్తం నేతల్లో అత్యధికంగా 65 మంది మహారాష్ట్ర నుంచి ఎన్నికల్లో పోటీ చేయగా.. బిహార్ నుంచి 62 మంది, పశ్చిమ బెంగాల్ నుంచి 52 మంది పోటీ చేశారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న మొత్తం 327 మందిలో బీజేపీ 47 మంది అభ్యర్థులకి టికెట్ ఇచ్చి మొదటి స్థానంలో నిలవగా, బీఎస్పీ 35 మందికి, కాంగ్రెస్ 24 మందికి టికెట్లు కేటాయించి తరువాతి స్థానాల్లో ఉన్నాయని ఏడీఆర్ పేర్కొంది. -
‘నోట్ల రద్దు’తో బీజేపీకి కాసులపంట
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో పెద్ద నోట్లను రద్దు చేస్తూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తీసుకున్న నిర్ణయం ‘తుగ్లక్ పని’ అని దానివల్ల నల్లడబ్బు వెలికి రాకపోగా, దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయిందని విపక్షాలు అనవసరంగా విమర్శిస్తున్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థకు లాభం లేకపోవచ్చుగానీ దేశాన్ని పాలిస్తున్న భారతీయ జనతా పార్టీకి మాత్రం బాగా లాభం చేకూరింది. 2015–16 సంవత్సరానికి బీజేపీ వద్ద 570. 86 కోట్ల రూపాయల ఆదాయం ఉండగా, పెద్ద నోట్లను రద్దు చేసిన సంవత్సరంలో, అంటే 2016–17 సంవత్సరానికి ఏకంగా ఆ ఆదాయం 1,034.27 కోట్ల రూపాయలకు పెరిగింది. ఏకంగా 81.18 శాతం పెరుగుదల నమోదయింది. కాంగ్రెస్ పార్టీ ఆదాయం అంతకుముందు సంవత్సరం కన్నా 14 శాతం తగ్గింది. మొత్తం జాతీయ పార్టీలకు వచ్చిన ఆదాయంలో ఒక్క బీజేపీకే 66.4 శాతం ఆదాయం రాగా, కాంగ్రెస్ పార్టీకి కేవలం 14 శాతం ఆదాయం వచ్చింది. దేశంలోని రాజకీయ పార్టీలు దాఖలు చేసిన ఆదాయం పన్ను రిటర్న్‌ల ఆధారంగా ఢిల్లీలోని ‘అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిపోర్ట్ (ఏడీఆర్)’ అనే సంస్థ ఈ డేటాను సేకరించింది. కేంద్రంలో అధికారంలో ఉండడమే కాకుండా వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధిస్తూ వస్తోన్న బీజేపీకి ఇతర పార్టీలకన్నా ఎక్కువ నిధులు విరాళంగా రావడం సహజమేగానీ, ఏకంగా 81 శాతం పెరగడం అనూహ్యమని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. విరాళాలు ఇచ్చిన వారి పేర్లను వెల్లడించాల్సిన అవసరం లేదుకనుక, ఎక్కువ వరకు నల్లడబ్బే బీజేపీకి తరలి వచ్చి ఉంటుందని వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పైగా ఇదే 2016–17 సంవత్సరం కోసమే బీజేపీ ఎన్నికల కోసం ఏకంగా 606 కోట్లను ఖర్చు పెట్టింది. కాంగ్రెస్ పార్టీ 149 కోట్ల రూపాయలనే ఖర్చు పెట్టింది. బీజేపీ మొత్తం ఆదాయం 1034 కోట్ల రూపాయల్లో 997.12 కోట్ల రూపాయలు, అంటే 96 శాతం నిధులు విరాళాలు, ఆర్థిక సాయం రూపంలోనే వచ్చాయి. కాంగ్రెస్ పార్టీకి మాత్రం 116 కోట్ల రూపాయలు కూపన్ల రూపంలో వచ్చాయి. బీజేపీకి వచ్చిన విరాళాల్లో 96 శాతం నిధులు అజ్ఞాత వ్యక్తుల నుంచే వచ్చాయి. వారి పేర్లు, ఊర్ల వివరాలు లేవు. కనీసం పాన్ నెంబర్లు లేవు. ఆదాయం పన్ను మినహాయింపుల కోసం ఎన్నికల కమిషన్‌కు బీజేపీ ఆదాయం పన్ను రిటర్నులు సమర్పిస్తున్నప్పటికీ డొనేషన్లు ఎవరిచ్చారో మాత్రం 2012 నుంచి ఇంతవరకు బీజేపీ వెల్లడించలేదు. పైగా ఈ పార్టీ విదేశాల నుంచి నల్లడబ్బును తీసుకొస్తానని, నల్ల కుబేరుల పేర్లు వెల్లడిస్తానంటూ అప్పుడప్పుడు తాటాకు చప్పుళ్లు చేస్తూ ఉంటోంది. ఒక్క రాజకీయ పార్టీలకే సమాచార హక్కు పరిధి నుంచి మినహాయింపు ఇవ్వడమంటే ప్రభుత్వాల నక్కజిత్తులను అర్థం చేసుకోవచ్చు. ఇందులో ఏ పార్టీకి మినహాయింపులేదు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం నల్లకుబేరుల నుంచి పార్టీ విరాళాలను తీసుకుంటూ ఎలా వారిని క్షమిస్తూ వచ్చిందో ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం అంతకన్నా ఎక్కువగానే నల్ల కుభేరులను కాపుకాస్తోంది. పార్టీలకిచ్చే విరాళాల్లో మరింత పారదర్శకత్వాన్ని తీసుకొస్తానంటూ బీజేపీ ప్రభుత్వం ఎన్నికల బాండుల విధానాన్ని ప్రవేశపెట్టింది. అధికార పార్టీకి మాత్రమే ఎక్కువ విరాళాలకు ఆస్కారమిచ్చే ఈ కొత్త విధానంలో ఎన్ని చిల్లులున్నాయో సాక్షి వెబ్సైట్ ఇదివరకే వెల్లడించింది. -
రాజ్యసభ అభ్యర్ధుల సగటు ఆస్తి ఎంతంటే..
సాక్షి, న్యూఢిల్లీ : త్వరలో జరగనున్న రాజ్యసభ ఎన్నికల్లో బరిలో నిలిచిన 63 మంది అభ్యర్ధుల్లో రూ 122 కోట్ల సగటు ఆస్తులతో 87 శాతం మంది కోటీశ్వరులే. 63 మంది అభ్యర్థుల్లో 55 మంది కోటీశ్వరులే (రూ కోటికి పైగా ఆస్తులు) అయినా కొద్దిమంది అత్యంత సంపన్నుల ఆస్తుల కారణంగా సగటు ఆస్తుల్లో భారీ పెరుగుదల చోటుచేసుకుందని అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) విశ్లేషించింది. రాజ్యసభ అభ్యర్ధుల్లో జేడీ(యూ)కు చెందిన మహేంద్ర ప్రసాద్ రూ 4,078 కోట్ల ఆస్తులతో అత్యంత సంపన్నుడిగా నిలిచారు. ఇక సమాజ్‌వాదీ పార్టీ తరపున రాజ్యసభ బరిలో ఉన్న జయాబచ్చన్ రూ 1001 కోట్ల ఆస్తులు ప్రకటించి తర్వాతి స్ధానంలో ఉన్నారు. కాగా కేవలం రూ 4 లక్షల ఆస్తులతో బిజూ జనతాదళ్‌కు చెదిన అచ్యుతానంద సమనంతా నిరుపేద అభ్యర్థి కావడం గమనార్హం. బీజేపీ అభ్యర్థి సమీర్ ఓరాన్ రూ 18 లక్షల ఆస్తులతో ఆయన తర్వాత తక్కువ ఆస్తులు కలిగిన అభ్యర్థిగా నిలిచారు. ప్రధాన పార్టీల్లో బీజేపీ తరపున పోటీలో ఉన్న 29 మందిలో 26, కాంగ్రెస్ నుంచి 11 మంది అభ్యర్ధుల్లో 10, తృణమూల్ అభ్యర్ధుల్లో నలుగురికి గాను ముగ్గురు, టీఆర్ఎస్కు చెందిన ముగ్గురు అభ్యర్థులూ , జేడీ(యూ)కు చెందిన ఇద్దరు అభ్యర్ధులూ రూ కోటికి పైగా ఆస్తులను ప్రకటించారు. ఇక పార్టీలవారీగా చూస్తూ ప్రతి అభ్యర్థి సగటు నికర ఆస్తులు బీజేపీ 29 మంది అభ్యర్ధుల సగటు ఆస్తి రూ 16 కోట్లు కాగా, 11 మంది కాంగ్రెస్ అభ్యర్థుల సగటు ఆస్తులు రూ 66 కోట్లు, నలుగురు తృణమూల్ అభ్యర్ధుల సగటు ఆస్తులు అతి తక్కువగా రూ కోటి కావడం గమనార్హం. -
దేశంలోనే ధనిక సీఎం చంద్రబాబు
-
దేశంలోనే ధనిక సీఎం చంద్రబాబు
న్యూఢిల్లీ: దేశంలోని మొత్తం 31 మంది ముఖ్యమంత్రుల్లో 24 మంది (81 శాతం) కోటీశ్వరులేనని ఎన్నికల సంస్కరణల కోసం కృషి చేస్తున్న అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్(ఏడీఆర్) ఓ నివేదిక విడుదల చేసింది. వీరిలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు రూ.177 కోట్లకు పైగా ఆస్తులతో దేశంలోనే అత్యంత ధనిక సీఎంగా నిలిచినట్లు ఏడీఆర్ తెలిపింది. అరుణాచల్‌ప్రదేశ్ సీఎం పెమా ఖండూ రూ.129 కోట్లకుపైగా ఆస్తులతో రెండోస్థానంలో, పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ రూ.48 కోట్లతో మూడోస్థానంలో నిలిచినట్లు వెల్లడించింది. దేశంలో ముఖ్యమంత్రుల సగటు ఆస్తి రూ.16.18 కోట్లుగా ఉందంది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన సీఎంల అఫిడవిట్లను పరిశీలించిన ఏడీఆర్, నేషనల్ ఎలక్షన్ వాచ్(ఎన్ఎల్డబ్ల్యూ)లు ఈ నివేదికను రూపొందించాయి. దేశంలోని అతిపేద ముఖ్యమంత్రుల్లో త్రిపుర సీఎం మాణిక్ సర్కార్ రూ.27 లక్షల ఆస్తులతో తొలిస్థానంలో నిలవగా, పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ(రూ.30 లక్షలుపైగా), జమ్మూకశ్మీర్ సీఎం మెహబూబా ముఫ్తీ(రూ.56 లక్షలు) తర్వాతి స్థానాలో నిలిచారు. మొత్తం 31 మంది ముఖ్యమంత్రుల్లో 11 మంది(35శాతం)పై క్రిమినల్ కేసులు ఉన్నట్లు ఏడీఆర్ నివేదికలో తెలిపింది. దాదాపు 26 శాతం సీఎంలపై హత్య, హత్యాయత్నం, మోసం, బెదిరింపులు వంటి తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉన్నట్లు వెల్లడించింది. ఇక విద్యార్హతల విషయానికి వస్తే..మొత్తం ముఖ్యమంత్రుల్లో 10 శాతం మంది పన్నెండో తరగతి ఉత్తీర్ణులు కాగా, 39 శాతం మంది డిగ్రీ, 32 శాతం మంది వృత్తివిద్యా డిగ్రీ, 16 శాతం మంది పీజీ, 3 శాతం మంది డాక్టరేట్ సాధించినట్లు పేర్కొంది. -
కోటీశ్వరులతో కాంగ్రెస్.. నేరచరితులతో బీజేపీ!
న్యూఢిల్లీ: త్వరలో జరగనున్న హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు ఈసీకి సమర్పించిన అఫిడవిట్లను పరిశీలిస్తే పలు ఆసక్తికర విషయాలు బయటికొచ్చాయి. ఈసారి కాంగ్రెస్ తరఫున ఎక్కువ మంది కోటీశ్వరులు బరిలో నిలవగా, నేర చరితులు ఎక్కువ మంది బీజేపీ తరఫున ఎన్నికల్లో నిలబడ్డారు. అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫామ్స్ (ఏడీఆర్) విశ్లేషణ ప్రకారం.. మొత్తం 338 మంది అభ్యర్థులు అఫిడవిట్లు సమర్పించారు. ఇందులో అధికార కాంగ్రెస్ నుంచి 68 మంది బరిలో నిలవగా.. వీరిలో 59 మంది (87%) అభ్యర్థులు కోటీశ్వరులే. అలాగే బీజేపీ తరఫున పోటీలో నిలిచిన 68 మంది అభ్యర్థుల్లో 47 మంది (69%) కోట్లకు పడగలెత్తిన వారున్నారు. ఇక క్రిమినల్ రికార్డుల ప్రకారం.. బీజేపీ అభ్యర్థుల్లో 23 మంది (34%), కాంగ్రెస్ నుంచి ఆరుగురు (9%) నేరచరితులు పోటీలో నిలిచారు. చొపల్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతున్న బల్వీర్ సింగ్ వర్మ (బీజేపీ) రూ.90 కోట్ల ఆస్తులతో సంపన్న అభ్యర్థుల జాబితాలో మొదటి స్థానంలో నిలవగా, 84 కోట్లతో రెండోస్థానంలో విక్రమాదిత్యసింగ్ (కాంగ్రెస్) నిలిచారు. వడ్డీలేని రుణాలు, ఉచిత ల్యాప్‌టాప్‌లు సిమ్లా:హిమాచల్ ప్రదేశ్‌లో రైతులకు వడ్డీ లేని రుణాలు, కాలేజీ విద్యార్థులకు ఉచిత ల్యాప్‌టాప్‌లను కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఈ మేరకు బుధవారం ఎన్నికల మేనిఫెస్టోను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ విడుదల చేశారు. రైతులకు వడ్డీలేని రుణాలిచ్చి వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేస్తామని, వచ్చే ఐదేళ్లలో నిరుద్యోగులకు 1.50 లక్షల ప్రభుత్వోద్యాగాలను కల్పిస్తామని మేనిఫెస్టోలో తెలిపారు. పింఛను పథకాన్ని పునరుద్ధరించటంతో పాటు రెండేళ్లు దాటిన కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దీక రిస్తామన్నారు. దినసరి వేతన కూలీని రూ. 350 పెంచటంతో పాటు, సామాజిక భద్రత పింఛన్లు పెంచుతామన్నారు. యువ తకు స్వయం ఉపాధిలో భాగంగా ప్రైవేటు బస్సు పర్మిట్లను అందజేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి సుశీల్ కుమార్ షిండే కూడా పాల్గొన్నారు. -
బీజేపీకి తొలిస్థానం
నిధుల వ్యయం, సేకరణలో కమలం పార్టీ ఫస్ట్ ఐదు రాష్ట్రాల ఎన్నికల వ్యయం రూ.573 కోట్లు! పార్టీలు సేకరించింది రూ.355 కోట్లే ఏడీఆర్ నివేదికలో వెల్లడి న్యూఢిల్లీ: గతేడాది జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో రాజకీయ పార్టీలు రూ.573 కోట్లు ఖర్చు చేశాయి. అయితే అవి సేకరించిన మొత్తం రూ. 355 కోట్లేనని అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫారమ్స్(ఏడీఆర్) నివేదిక స్పష్టం చేసింది. అస్సాం, కేరళ, పుదుచ్చేరి, తమిళనాడు, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల అసెంబ్లీల ఎన్నికల్లో అన్ని ప్రాంతీయ, జాతీయ పార్టీల నిధుల వ్యయం, సేకరణకు సంబంధించిన గణాంకాలను పొందుపరచి ఈ నివేదికను విడుదల చేశారు. ముఖ్యాంశాలు: జాతీయ పార్టీలు సేకరించిన నిధులు రూ.287.89 కోట్లు కాగా, వ్యయం చేసినది రూ.188.12 కోట్లు. ప్రాంతీయ పార్టీలు 67.22 కోట్లు వసూలు చేసి 213.97 కోట్లు ఖర్చు చేశాయి. జాతీయ, ప్రాంతీయ పార్టీలన్నీ కలసి రూ.573.24 కోట్లు ఖర్చు చేశాయి. వీటిలో ప్రచార, ప్రయాణ, ఇతర ఖర్చులు, అభ్యుర్థులకు ఇచ్చే మొత్తం తదితరాలున్నాయి. జాతీయ పార్టీల్లో బీజేపీ అత్యధికంగా సేకరించిన రూ.131.72 కోట్లు... జాతీయ, ప్రాంతీయ స్థాయిలో ఆరు జాతీయ పార్టీలు సేకరించిన దానిలో 45.75 శాతానికి సమానం. జాతీయ స్థాయిలో అయిన 112.14 కోట్ల వ్యయంలో బీజేపీ అత్యధికంగా రూ.84.36 కోట్లను ఖర్చు చేసింది. రాష్ట్రస్థాయిలో కేరళ బీజేపీ యూనిట్ అత్యధికంగా 14.11 కోట్లు, తరువాత పశ్చిమ బెంగాల్ యూనిట్ రూ.5.70 కోట్లు, అస్సాం యూనిట్ రూ. 4.03 కోట్లు ఖర్చు చేశాయి. రెండో స్థానంలో నిలిచిన కాంగ్రెస్ రూ.41.49 కోట్లు ఖర్చు చేసింది. అందులో రూ.14.57 కోట్లు(లేదా 35.12 శాతం) జాతీయ స్థాయిలోనే వ్యయమయ్యాయి. ఇక ప్రాంతీయ పార్టీల విషయానికొస్తే...ఎస్పీ అత్యధికంగా రూ.35.66 కోట్లు సేకరించింది. డీఎంకే అత్యధికంగా రూ.97.34 కోట్లు ఖర్చు చేసింది. బీజేపీ సేకరించిన మొత్తం నిధుల్లో 65.53 శాతం ఆ పార్టీ కేంద్ర కార్యాలయం నుంచే వచ్చాయి. రూ.94.23 కోట్లు సేకరించి కాంగ్రెస్ రెండో స్థానంలో నిలిచింది. రాష్ట్ర స్థాయిలో గానీ, కేంద్ర స్థాయిలో గానీ ఎలాంటి నిధులు సేకరించలేదని బీఎస్పీ ప్రకటించింది. జాతీయ పార్టీలు తమ అభ్యర్థులకు రూ.151.65 కోట్లు ఇవ్వగా, ప్రాంతీయ పార్టీలు అభ్యర్థులపై రూ.60.89 కోట్లు ఖర్చు చేశాయి. మీడియాలో ప్రకటనలకు జాతీయ పార్టీలు రూ.82.08 కోట్లు, ప్రాంతీయ పార్టీలు రూ.95.49 కోట్లు ఖర్చు చేశాయి. -
16 మంది నేరస్తులు.. 81% కోటీశ్వరులు
చండీగఢ్: పంజాబ్ అసెంబ్లీకి కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలలో 16 మంది నేరస్తులు ఉండగా.. మొత్తం ఎమ్మెల్యేలలో 81 శాతం మందికి పైగా కోటీశ్వరులే ఉన్నారు. ఈ వివరాలను అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్(ఏడీఆర్) సంస్థ తెలియచేసింది. నామినేషన్ల దాఖలు సందర్భంగా వారు సమర్పించిన అఫిడవిట్ల ఆధారంగా ఎమ్మెల్యేల నేరచరిత్ర, ఆస్తులు, విద్య, వయసు వివరాలపై విశ్లేషించి ఒక సమగ్ర నివేదికను ఆ సంస్థ విడుదల చేసింది. మొత్తం 117 స్థానాలున్న పంజాబ్ అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ 77, ఆమ్ ఆద్మీ పార్టీ 20, శిరోమణి అకాలీదళ్ 15, బీజేపీ 3, ఇతరులు 2 స్థానాలు గెలుచుకున్నారు. 16 మంది ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులున్నాయి. ఇది మొత్తం సభ్యులలో 14%. వీరిలో 11 మందిపై సీరియస్ క్రిమినల్ కేసులు (దోపిడీ, దొంగతనం), హత్యానేరం, హత్యాయత్నం ఆరోపణలు ఉన్నవారు ముగ్గురు. ఇందులో ఇద్దరు కాంగ్రెస్‌కు చెందిన వారు కాగా, మరొకరు లోక్ ఇన్సాఫ్ పార్టీకి చెందినవారు. రాజా సాన్సీ నియోజక వర్గం నుంచి గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యే సుఖ్ బిందర్ సింగ్‌పై మహిళల మీద నేరం చేసిన కేసు నమోదై ఉంది. 2012లో నేర చరిత్ర ఉన్నవారు 16% కాగా తాజా ఎన్నికల్లో వారి సంఖ్య తగ్గింది. పార్టీల పరంగా చూస్తే 77 మంది ఎమ్మెల్యేలు ఉన్న కాంగ్రెస్‌లో సీరియస్ క్రిమినల్ కేసులు ఏడుగురిపై, క్రిమినల్ కేసులు 9 మంది పైన ఉన్నాయి. 20 మంది ఎమ్మెల్యేలు ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీలో సీరియస్ క్రిమినల్ కేసులు మరో ఒకరిపై , క్రిమినల్ కేసలు నలుగురిపై ఉన్నాయి. శిరోమణి అకాలీదళ్ పార్టీలో సీరియస్ క్రిమినల్ కేసులు ఒకరిపై, క్రిమినల్ కేసులు మరో ఒకరిపై ఉన్నాయని తెలిపింది. కోటీశ్వరులు ఎక్కువే..: 117మంది ఎమ్మెల్యేలలో 95(81%) మంది కోటీశ్వరులు ఉన్నారు. 2012లో వీరి సంఖ్య 103(88%)గా ఉంది. అప్పటి ఎన్నికలతో పోలిస్తే రెండు శాతం తగ్గారు. పార్టీ పరంగా చూస్తే కాంగ్రెస్ నుంచి 67 (87%)మంది, అకాలీదళ్ నుంచి 15(100%) మంది, బీజీపీ నుంచి ఇద్దరు, ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి 8మంది కోటీశ్వరులు ఉన్నారు. గత 2012 ఎన్నికల్లో సగటు ఎమ్మెల్యే ఆస్తి రూ.10.10 కోట్లు కాగా 2017లో రూ.11.78 కోట్లకు చేరింది. పార్టీల పరంగా చూస్తే కాంగ్రెస్ సభ్యుల సగటు ఆస్తి రూ.12.43 కోట్లు. ఆమ్ ఆద్మీ పార్టీ సభ్యులు రూ.8.33 కోట్లు, అకాలిదళ్ సభ్యులు రూ.14.54 కోట్లు, బీజేపీ సభ్యులు రూ.5.20 కోట్లు, లోక్ ఇన్సాఫ్ పార్టీ సభ్యులు రూ.10.14 కోట్లు సగటు ఆస్తులు కలిగి ఉన్నారు. కాంగ్రెస్‌కు చెందిన రానా గుర్జీత్ సింగ్ రూ. 169 కోట్లతో ప్రథమ స్థానంలో ఉండగా, అకాలీదళ్‌కు చెందిన సుఖ్బీర్ సింగ్ రూ.102 కోట్లతో రెండోస్థానంలో, ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన అమన్ అరోరా రూ.65 కోట్లతో మూడో స్థానంలో ఉన్నారు. ఏడాదికి తమకు కోటికి పైగా ఆదాయం ఉందని చెప్పిన వాళ్లు ఆరుగురు ఉన్నారు. వారిలో నవజ్యోత్ సింగ్ (కాంగ్రెస్) రూ.9కోట్లు, అమన్ ఆరోరా (ఆప్) రూ.4కోట్లు, రాణా గుర్జీత్ సింగ్ రూ.2కోట్లు వార్షిక ఆదాయం వస్తున్నట్లు ప్రకటించారు. రూ.కోటి పైగా ఆదాయం ఉన్న జగదేవ్ సింగ్(ఆప్), సుఖ్జిత్ సింగ్(కాంగ్రెస్), దర్శన్ సింగ్‌లు తమ ఆదాయ వివరాలు తెలపలేదు. మొత్తం 117 మంది ఎమ్మెల్యేలలో 45మంది 5- 12 తరగతి మధ్య చదివినవారు ఉండగా, 70 మంది డిగ్రీ, ఆపై చదువులు చదివారు. 25-50 ఏళ్ల వయస్సు ఉన్నవారు 51 మంది ఉన్నారు. 65 మంది 51-80 మధ్య వయస్సు వాళ్లు ఉన్నారు. 2012లో 14 మంది మహిళలు ఎమ్మెల్యేలు ఉండగా 2017లో ఆరుగురు మహిళా ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. -
నేరస్థులు నలుగురు.. కోటీశ్వరులు 32 మంది
ఇంఫాల్: నేర చరిత్ర లేని ప్రజాప్రతినిధులను ఆశిస్తుంటే.. రోజురోజుకి వీరి సంఖ్య పెరుగుతుంది తప్ప తగ్గడం లేదు. తాజాగా మణిపూర్ శాసనసభకు కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల్లో 32 మంది కోటీశ్వరులు, నలుగురు నేరస్థులు ఉన్నారని ఏడీఆర్ (అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిపోర్మ్స్) తెలిపింది. నేరచరిత్ర, ఆస్తులు, విద్య, వయసు వివరాలపై విశ్లేషించి మంగళవారం ఒక రిపోర్ట్‌ను విడుదల చేసింది. 60 స్థానాలున్న మణిపూర్ అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ 28 , బీజేపీ 21, ఇతరులు 11 స్థానాలు గెలుచుకున్నారు. కొత్తగా గెలుపొందిన ఎమ్మెల్యేల్లో క్రిమినల్ కేసులున్నవారు ఇద్దరని, సీరియస్ క్రిమినల్ కేసులు (హత్యానేర ఆరోపణలు) మరో ఇద్దరిపై ఉన్నాయని పేర్కొంది. బీజేపీలో ఇద్దరు ఎమ్మెల్యేలపై, కాంగ్రెస్ నేతల్లో ఇద్దరిపై క్రిమినల్ కేసులున్నాయి. 2012 ఎన్నికల్లో గెలుపొందిన వారిలో ఏ ఒక్కరికి నేరచరిత్ర లేదు. గత ఎన్నికల్లో సగటు ఎమ్మెల్యే ఆస్తి రూ.95.551లక్షలు కాగా 2017 లో రూ.2.196 కోట్లకు చేరింది. గత ఎన్నికల్లో కోటీశ్వరులు 27 శాతం ఉండగా ఈ ఎన్నికల్లో 53 శాతం మంది ఉన్నారు. ఆస్తుల వివరాల్లో మొత్తం 60 మంది ఎమ్మెల్యేల్లో రూ.5 కోట్ల కన్నా ఎక్కవ ఆస్తులన్న అభ్యర్థులు ఇద్దరు, రూ.2- 5 కోట్ల ఆస్తులు ఉన్నవారు 17 మంది, రూ. 50 లక్షల - రూ.2కోట్లు ఉన్న వారు 27 మంది ఉన్నట్లు ఎమ్మెల్యేలు తమ ఎన్నికల అఫిడవిట్లో తెలిపారని రిపోర్ట్‌లో పేర్కొన్నారు. ఇక 13 మందికి రూ.10 - 50 లక్షల ఆస్తులు మాత్రమే ఉన్నాయి. అత్యధిక ఆస్తులున్న ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి చెందినవారే ఉన్నారు. 28 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో 18 మంది కోటీశ్వరులు, బీజేపీలో 21 ఎమ్మెల్యేలలో 10 మంది ఉన్నారు. ఇతరుల్లో నలుగురు ఎమ్మెల్యేలు కోటీశ్వరులు. అత్యధికంగా రూ.36 కోట్ల ఆస్తి ఉన్నట్లు కాంగ్రెస్ ఉక్రుల్ ఎమ్మెల్యే ఎస్. అర్థుర్ ఎన్నికల అఫిడవిట్లో తెలిపారు. ఇక అతి తక్కువగా రూ. 9.28లక్షల ఆస్తి ఉన్నట్లు బీజేపీ ఇంఫాల్ వెస్ట్ ఎమ్మెల్యే సెక్మాల్ ప్రకటించారు. ఆదాయపు పన్ను దాఖలు చేసిన అభ్యర్థులు ముగ్గురు. వీరు కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు కావడం విశేషం. 60 మంది ఎమ్మెల్యేల్లో 18 మంది ఆదాయపుపన్ను వివరాలు వెల్లడించారు. 2017 ఎన్నికల్లో 28 మంది అభ్యర్థులు రెండోసారి ఎన్నికయ్యారు. 2012లో వీరి సగటు ఆస్తి రూ.1.39 కోట్లు ఉండగా 2017లో రూ.1.96 కోట్లకు చేరింది. వీరి ఆస్తులు 41 శాతం పెరిగాయి. కాంగ్రెస్ నుంచి 22 మంది రెండో సారి ఎన్నిక కాగా, బీజేపీ నుంచి నలుగురు, ఇతరపార్టీల నుంచి ఇద్దరు గెలుపొందారు. విద్యార్హతల పరంగా 14 మంది 5 నుంచి 12వ తరగతి చదివిన వారు ఉండగా, 42 మంది ఎమ్మెల్యేలు డిగ్రీ పూర్తిచేశారు. వీరిలో 13 మంది పీజీ చదివారు. ఒక ఎమ్మెల్యే నిరక్షరాస్యుడని తెలిపారు. వయసు రీత్యా 27 మంది ఎమ్మెల్యేలు 50 ఏళ్ల లోపు, 33 మంది 50 ఏళ్ల పై బడిన వారున్నారు. 8 మంది యువకులు ఎమ్మెల్యేలుగా ఎంపికయ్యారు. మహిళా ఎమ్మెల్యేలు మాత్రం ముగ్గురే. 2012 లో ఇద్దరు మహిళలు మాత్రమే గెలిచారు. ఈ సారి అదనంగా ఒక మహిళా ఎమ్మెల్యే శాసనసభలో అడుగు పెట్టనున్నారు.