బీజేపీకి రూ.614 కోట్లు..కాంగ్రెస్‌కు రూ.94 కోట్లు | ADR Report BJP Rs 614 Crore Congress Rs 94 Crore Donation | Sakshi
Sakshi News home page

బీజేపీకి రూ.614 కోట్లు..కాంగ్రెస్‌కు రూ.94 కోట్లు

Published Wed, Feb 15 2023 8:27 AM | Last Updated on Wed, Feb 15 2023 9:36 AM

ADR Report BJP Rs 614 Crore Congress Rs 94 Crore Donation - Sakshi

న్యూఢిల్లీ: 2021–22లో బీజేపీకి రూ.614 కోట్లు, కాంగ్రెస్‌కు రూ.95 కోట్లు విరాళాల రూపంలో అందాయి. అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రాటిక్‌ రిఫామ్స్‌ (ఏడీఆర్‌) నివేదిక ఈ మేరకు వెల్లడించింది. 2020–21తో పోలిస్తే పార్టీలు అందుకున్న విరాళాల మొత్తం 31.50% మేర పెరిగిందని వివరించింది.

ఇదే సమయంలో బీజేపీ విరాళాల్లో రూ.28.71%, కాంగ్రెస్‌ విరాళాల్లో 28.09% పెరుగుదల కనిపించిందని నివేదిక పేర్కొంది. గతేడాది దేశంలోని అన్ని జాతీయ పార్టీలకు మొత్తం రూ.780కోట్లు విరాళాల రూపంలో అందినట్లు చెప్పింది. బీజేపీకి అందిన మొత్తం మిగతా అన్ని పార్టీలకంటే దాదాపు మూడు రెట్లు అధికం కావడం గమనార్హం.
చదవండి: బీబీసీ కార్యాలయంపై ఐటీ దాడులు.. సిబ్బంది సెల్‌ఫోన్లు సీజ్‌!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement