న్యూఢిల్లీ: ప్రాంతీయ పార్టీలకు విరాళాలకు సంబంధించి 2021-22 ఆర్థిక సంవత్సరంలో బీఆర్‌ఎస్ దేశంలోనే టాప్ ప్లేస్‌లో నిలిచింది. ఆ పార్టీకి మొత్తం రూ.40.9కోట్లు విరాళాలు అందాయి. ఆ తర్వాత రెండో స్థానంలో అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ ఉంది. ఆప్‌కు రూ.38.2 కోట్ల విరాళాలు అందాయి.
అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రీఫార్మ్స్(ఏడీఆర్) ఈ గణాంకాలను వెల్లడించింది. దేశంలోని ప్రాంతీయ పార్టీల్లో బీఆర్‌ఎస్, ఆప్ తర్వాత జేడీఎస్‌కు అత్యధిక విరాళాలు అందాయి. ఆ పార్టీకి రూ.33.2 కోట్లు డోనేషన్ల రూపంలో వచ్చాయి.
అలాగే సమాజ్‌వాదీ పార్టీకి రూ.29.7కోట్లు, వైఎస్సార్‌సీపీకి రూ.20 కోట్లు విరాళాలు అందినట్లు ఏడీఆర్ నివేదక తెలిపింది. ఆయా పార్టీలు ఎన్నికల సంఘానికి సమర్పించిన వివరాల ఆధారంగా ఈ గణాంకాలు వెల్లడించింది. దేశంలోని మొత్తం 26 ప్రాంతీయ పార్టీలకు రూ.189.8 కోట్లు అందినట్లు నివేదిక పేర్కొంది. వీటిలో రూ.162.21 కోట్ల విరాళాలు ఐదు పార్టీలే అందుకున్నట్లు తెలిపింది.
అయితే ఏఐఏడీఎంకే, బీజేడీ, ఎన్డీపీపీ, ఎస్‌డీఎఫ్, ఏఐఎఫ్‌బీ, పీఎంకే, జేకేఎన్‌సీ పార్టీలు తమకు అందిన విరాళాల వివరాలను వెల్లడించలేదు. కాగా.. ప్రాంతీయ పార్టీగా ఉన్న ఆప్‌కు ఎన్నికల సంఘం ఈ నెలలోనే జాతీయ పార్టీగా గుర్తింపు ఇచ్చిన విషయం తెలిసిందే.
చదవండి: కర్ణాటక ఎన్నికలు: 517 నామినేషన్ల ఉపసంహరణ.. 209 స్థానాల్లో ఆప్ పోటీ
Comments
Please login to add a commentAdd a comment