సాక్షి, న్యూఢిల్లీ : హరియాణాలో కొలువుతీరిన బీజేపీ-జేజేపీ సంకీర్ణ సర్కార్‌లోని 12 మంది మంత్రులు కరోడ్‌పతిలే. వీరిలో వ్యవసాయ, కుటుంబ సంక్షేమ మంత్రి జై ప్రకాష్ దలాల్ రూ 76 కోట్లతో అత్యంత సంపన్న మంత్రి కాగా, ఉప ముఖ్యమంత్రి దుష్యంత్ చౌతాలా రూ 74 కోట్ల ఆస్తులతో తర్వాతి స్ధానంలో నిలిచారని అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫామ్స్ (ఏడీఆర్) నివేదిక వెల్లడించింది. 2014లో హరియాణా సర్కార్‌లో 10 మంది మంత్రులకు గాను 7గురు మంత్రులు కోటీశ్వరులుగా ఈ నివేదిక విశ్లేషించింది. ఇక 12 మంది కరోడ్‌పతి మంత్రుల్లో ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ఒకరు కావడం గమనార్హం. మంత్రుల సగటు ఆస్తుల విలువ రూ 17.41 కోట్లని నివేదిక పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment