న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం అసెంబ్లీలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతానికి జరుగుతున్న ఎన్నికల్లో పోటీకి దిగిన అభ్యర్థుల్లో 18శాతం మంది నేరచరిత్ర ఉన్నవారేనని ఎన్నికల హక్కుల సంస్థ అసోసియేషన్ ఫర్ డెమొక్రాటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) తెలిపింది. బెంగాల్‌లో మూడో విడత ఎన్నికలు, మిగిలిన రాష్ట్రాల ఎన్నికల్లో ఇప్పటివరకు 6,792 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిస్తే వారిలో 6,318 మంది దాఖలు చేసిన అఫిడవిట్లను ఏడీఆర్ అధ్యయనం చేసింది. వారిలో 1,157 మంది (18%) నేర చరిత్ర ఉన్నట్టు నామినేషన్ సందర్భంగా దాఖలు చేసిన అఫిడవిట్లలో పేర్కొన్నారు. 632 మందిపై తీవ్రమైన నేరాలకు పాల్పడినట్టుగా అభియోగా లున్నాయి. బెంగాల్‌లో మూడో విడత వరకు దాఖలైన నామినేషన్ల పరిశీలనలో 25% మంది నేరచరితులుంటే, 21% మందిపై తీవ్రమైన నేరారోపణలున్నాయి. తమిళనాడు లో 13%, కేరళలో 38%, అస్సాంలో 15%, పుదుచ్చేరిలో 17% మంది నేరచరితులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment