criminal Leaders
-
Karnataka Assembly Election 2023: 581 మంది అభ్యర్థులపై నేరారోపణలు
సాక్షి బెంగళూరు: కర్ణాటక రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో నేరారోపణలు ఎదుర్కొంటున్న నేతలకూ ప్రధాన పార్టీలు టికెట్లిచ్చిమరీ ఎన్నికల బరిలో నిలిపాయి. ఈసారి పోటీ చేసే అభ్యర్థుల్లో 581 మంది (22 శాతం) నేరారోపణలు ఎదుర్కొంటున్న వారు ఉండటం తాజా పరిస్థితికి అద్దం పడుతోంది. ఈ 581 మంది నేతల్లో 404 మందిపై తీవ్రమైన నేరారోపణలు నమోదై ఉన్నాయి. ఈసారి శాసనసభ ఎన్నికల్లో నామినేషన్ దాఖలుచేసిన 2,613 మందిలో 2,586 మంది అభ్యర్థుల నామినేషన్లను అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫామ్స్ (ఏడీఆర్) అనే సంస్థ పరిశీలించి సంబంధిత గణాంకాలను విడుదలచేసింది. నివేదికలోని కొన్ని ముఖ్యాంశాలు.. ► బీజేపీ తరఫున 224 మంది నామినేషన్లు వేయగా అందులో 96 మందిపై కేసులున్నాయి. మొత్తం 223 మంది కాంగ్రెస్ అభ్యర్థుల్లో 122 మందిపై కేసులున్నాయి. మొత్తం 208 మంది జేడీఎస్ అభ్యర్థుల్లో 70 మందిపై, 208 ఆప్ అభ్యర్థుల్లో 48 మందిపై, 9 మంది ఎన్సీపీ అభ్యర్థుల్లో ఇద్దరిపై, ముగ్గురు సీపీఐ అభ్యర్థుల్లో ఒకరిపై, 901 స్వతంత్ర అభ్యర్థుల్లో 119 మందిపై కేసులున్నాయి. ► గతంలో పోలిస్తే బీజేపీ, జేడీఎస్‌లు ఎక్కువ మంది నేరచరితులకు టికెట్లు ఇచ్చాయి. 2018లో బీజేపీ అభ్యర్థుల్లో 37 శాతం మందిపై కేసులుంటే ఈసారి 43 శాతం మందిపై కేసులున్నాయి. జేడీఎస్‌లోనూ ఈ శాతం 21 నుంచి ఏకంగా 34 శాతానికి పెరగడం ఆందోళనకరం. కాంగ్రెస్ అభ్యర్థుల్లో 2018 ఏడాదిలోనూ, ఇప్పడూ 55 శాతం మంది నేరచరితులున్నారు. ళీ 111 నియోజకవర్గాల్లో ముగ్గురు కంటే ఎక్కువ మంది అభ్యర్థులు వివిధ రకాల క్రిమినల్ కేసులను ఎదుర్కొంటున్నారు. కుబేరులూ ఉన్నారు.. ► బీజేపీ నుంచి 216 మంది, కాంగ్రెస్ నుంచి 215 మంది, జేడీఎస్ నుంచి 170, ఆప్ నుంచి 197 మంది అభ్యర్థులు కోట్లకు పడగలెత్తారని వారి నామినేషన్ల పత్రాల ద్వారా తెలుస్తోంది. స్వతంత్ర అభ్యర్థుల్లో 215 మంది కోటీశ్వరులు ఉండటం విశేషం. కోటీశ్వరులైన అభ్యర్థులను మొత్తంగా పరిశీలిస్తే ప్రతి అభ్యర్థి సరాసరి ఆస్తి విలువ రూ. 12 కోట్లు. -
గుజరాత్ ఎన్నికలు: 100 మంది అభ్యర్థులపై హత్య, అత్యాచారం ఆరోపణలు..
అహ్మదాబాద్: గుజరాత్ అసెంబ్లీకి డిసెంబర్ ఒకటిన మొదటి విడత జరిగే ఎన్నికల్లో బరిలో ఉన్న అభ్యర్థుల్లో 21% మందిపై క్రిమినల్ కేసులున్నాయి. ఇందులో అత్యధికంగా ఆప్, ఆ తర్వాతి స్థానాల్లో కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులపై ఉన్నాయి. 89 స్థానాలకు గాను బరిలో ఉన్న 788 మందికి గాను 167 మందిపై క్రిమినల్ కేసులున్నాయి. వీరిలో 100 మంది హత్య, రేప్ వంటి తీవ్ర నేరారోపణలను సైతం ఎదుర్కొంటున్నారని అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్(ఏడీఆర్) గురువారం తెలిపింది. అదేవిధంగా, బరిలో ఉన్న 788 మందిలో 211 మంది కోట్లకు పడగలెత్తిన వారు కాగా వీరిలో అత్యధికంగా బీజేపీకి చెందిన 79 మంది ఉన్నారని ఏడీఆర్ తెలిపింది. రాజ్‌కోట్ సౌత్ అసెంబ్లీ స్థానానికి పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి రమేశ్ తిలాలా రూ.175 కోట్ల ప్రకటిత ఆస్తులతో అత్యంత ధనికుడు కాగా రాజ్‌కోట్ వెస్ట్ నుంచి స్వతంత్ర అభ్యర్థి భూపేంద్ర పటోలియా ఎటువంటి ఆస్తులు లేవంటూ ఎన్నికల అఫిడవిట్లో తెలిపారని పేర్కొంది. చదవండి: యువతరం.. ఎవరి పక్షం...! -
ఎస్పీ పెంచి పోషించిన నేరస్తులు, మాఫియాను... బీజేపీ తరిమికొట్టింది: అమిత్ షా
ముజఫర్‌నగర్: యూపీలో సమాజ్‌వాదీ పార్టీ పెంచి పోషించిన నేరస్తులు, మాఫియాను బీజేపీ ప్రభుత్వం తరిమికొట్టిందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతల గురించి ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ అబద్ధాలు మాట్లాడటం సిగ్గుచేటన్నారు. అఖిలేష్ యాదవ్, జయంత్ చౌదరి కలిసి ప్రచారంలో పాల్గొనడాన్ని ప్రస్తావిస్తూ ఆ రెండు పార్టీలది ఎన్నికల బంధమేనని, ఆ తరువాత ఎవరిదారి వారిదేనని ఎద్దేవా చేశారు. ఒకవేళ ప్రభుత్వం ఏర్పడినా ఆజంఖాన్, అతిఖ్ అహ్మద్ లాంటివాళ్లు వేదికపై ఉంటారే తప్ప... జయంత్ ఎక్కడా కనిపించరని జోస్యం చెప్పారు. బాధితులనే నిందితులుగా చేసిన 2013 ముజఫర్‌నగర్ అల్లర్లను ఎవరైనా మరచిపోగలరా? అని అమిత్ షా ప్రశ్నించారు. యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం హయాంలో నేరాలు తగ్గాయని, ఈ విషయంలో గణాంకాలతో సహా చర్చకు తాము సిద్ధమని, ఎస్పీ ప్రభుత్వంలోని గణాంకాలతో అఖిలేష్ ముుందుకొస్తారా అని సవాల్ విసిరారు. అఖిలేష్ ప్రభుత్వ పాలనకు ముజఫర్ నగర్ అల్లర్లు సజీవ సాక్షమన్నారు. అల్లర్ల సమయంలో పోలీసులు.. తప్పుడు కేసులు బనాయించారని, బాధితులనే నిందితులుగా చేసే ప్రయత్నం జరిగిందని తెలిపారు. కోర్టుల్లోనూ, రోడ్ల మీద న్యాయం కోసం పోరాడిన బీజేపీ నేత సంజీవ్ బలియాన్‌ని అమిత్ షా అభినందించారు. మళ్లీ అదే తప్పు చేయొద్దు... ఉత్తరప్రదేశ్‌ను ఎస్పీ చేతిలో పెట్టి ప్రజలు మళ్లీ తప్పు చేయొద్దని, అదే జరిగితే మరో ముజఫర్‌నగర్ ఆవిష్కృతమవుతుందని అభిప్రాయపడ్డారు. బీజేపీ పార్టీ గెలుపొందితే ఎలాంటి అల్లర్లు ఉండవని, 300 స్థానాల్లో బీజేపీని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. బీఎస్పీ అధికారంలోకి వస్తే ఒక పార్టీ గురించే మాట్లాడుతుందని, కాంగ్రెస్ ఒక కుటుంబం గురించే మాట్లాడుతుందని, ఇక ఎస్పీ అధికారంలోకి వస్తే గూండాలు, మాఫియా రాజ్యంగా మారిపోతుందని, ఒక్క బీజేపీ మాత్రమే భద్రత, అభివృద్ధి గురించి మాట్లాడుతుందని తెలిపారు. ప్రజాస్వామ్యంలో ఓటు అత్యంత శక్తివంతమైనది, దాన్ని యూపీ ప్రజలు తెలివిగా వినియోగించాలని ప్రజలకు సూచించారు. బీజేపీ అధికారంలోకి వస్తే ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వంలో దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా యూపీ నిలుస్తుందన్నారు. దేశభద్రత బీజేపీ ప్రథమ ప్రాధాన్యమని తెలిపారు. అఖిలేష్ యాదవ్ రైతులకు వరాలు కురిపిస్తున్నారని, కానీ ఎస్పీ, బీఎస్పీ ప్రభుత్వాల హయాంలోనే 21 చక్కెర కర్మాగారాలు మూసివేశారని ఎద్దేవా చేశారు. ముజఫర్‌నగర్ నియోజకవర్గం నుంచి రాష్ట్ర మంత్రి కపిల్ దేవ్ అగర్వాల్ పోటీ చేస్తుండగా, ఎస్పీ– ఆర్ఎల్డీ కూటమి నుంచి సౌరభ్ స్వరూప్ బరిలో ఉన్నారు. -
యోగి వచ్చాక గ్యాంగ్స్టర్ల ఆటలు బంద్
మీరట్: ఉత్తరప్రదేశ్‌లో గత ప్రభుత్వాల హయాంలో గ్యాంగ్స్టర్లు, నేరగాళ్ల ఆటలు సాగాయని, అయితే యోగి ఆదిత్యనాథ్ వచ్చాక వారి ఆటల కట్టించారని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ప్రస్తుతం గ్యాంగ్స్టర్లు, క్రిమినల్స్‌ను జైళ్లకు పంపుతూ వారిలో సీఎం యోగి ఆదిత్యనాథ్ ‘జైలు..జైలు’ ఆట (కబడ్డీ ఆటలోని కూతను తలపించేలా) ఆడుతున్నారని మోదీ.. యోగి సర్కార్‌ను ప్రశంసించారు. ఆదివారం మీరట్‌లో మేజర్ ధ్యాన్‌చంద్ క్రీడా విశ్వవిద్యాలయం శంకుస్థాపన కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొని సభలో ప్రసంగించారు. ‘గతంలో రాష్ట్రంలో నేరగాళ్లు, మాఫియా అక్రమాలు, ఆక్రమణల టోర్నీలు ఆడేవి. తమ కుమార్తెలపై అసభ్యంగా మాట్లాడిన వారు స్వేచ్ఛగా సమాజంలో తిరుగుతున్నా ప్రజలు నిస్సహాయంగా చూడాల్సిన పరిస్థితి. గత ప్రభుత్వాల వైఫల్యం కారణంగా అకృత్యాలు పెరిగి ఇళ్లు తగలబెట్టడంతో జనం సొంతింటిని వదిలి వలస వెళ్లాల్సిన దుస్థితి. కానీ, ప్రస్తుతం యోగి సర్కార్.. క్రిమినల్స్‌ను జైళ్లకు పంపుతూ వారితో జైలు ఆట ఆడుతోంది’ అని మోదీ అన్నారు. రూ. 700 కోట్లతో నిర్మించే స్పోర్ట్స్ వర్సిటీ 1,080 మంది బాల, బాలికలను మంచి క్రీడాకారులుగా తీర్చిదిద్దనుంది. -
363 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలపై అనర్హతకు వీలున్న క్రిమినల్ కేసులు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 363 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు అనర్హత వేటు పడే అవకాశమున్న నేరాభియోగాలు ఎదుర్కొంటున్నారని అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) సంస్థ వెల్లడించింది. ఈ కేసులు నిరూపణ అయితే రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ చట్టంలోని 8వ సెక్షన్ కింద వీరిపై అనర్హత వేటు పడుతుందని ఏడీఆర్ పేర్కొంది. నేరాభియోగాలు నమోదైన వారిలో 39 మంది కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు ఉన్నారు. 2019 నుంచి 2021 కాలానికి 542 మంది లోక్‌సభ సభ్యులు, 1,953 మంది ఎమ్మెల్యేల అఫిడవిట్లను విశ్లేషించి ఆయా వివరాలను ఏడీఆర్ బహిర్గతంచేసింది. బీజేపీకి చెందిన 83 మంది ఎంపీలు/ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. 47 మంది కాంగ్రెస్, 25 మంది తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు/ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. 111 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలపై మొత్తంగా 315 కేసులున్నాయి. బిహార్‌కు చెందిన 54 మంది ఎమ్మెల్యేలపై, కేరళలో 42 మంది ఎమ్మెల్యేలపై తీవ్రమైన కేసులు నమోదయ్యాయి. నలుగురు కేంద్ర మంత్రులు, 35 మంది రాష్ట్ర మంత్రులపై కేసులు ఉన్నాయి. -
ప్రజాప్రతినిధులపై కేసులు: సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు
న్యూఢిల్లీ: క్రిమినల్ కేసుల్ని ఎదుర్కొంటున్న ప్రజాప్రతినిధులపై ప్రభావం చూపించేలా సుప్రీంకోర్టు కీలకమైన ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాల పబ్లిక్ ప్రాసిక్యూటర్లకి ఉండే అధికారాలకు కత్తెర వేసింది. రాష్ట్ర హైకోర్టుల ముందస్తు అనుమతి లేకుండా ప్రాసిక్యూటర్లు ఎమ్మెల్యేలు, ఎంపీలపై కేసుల్ని వెనక్కి తీసుకోవడం కుదరదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి. రమణ నేతృత్వంలోని బెంచ్ మంగళవారం స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వం, సీబీఐ వంటి దర్యాప్తు సంస్థలు ప్రజాప్రతినిధుల కేసులపై అవసరమైన స్టేటస్ రిపోర్టులను కోర్టులకు సమర్పించకపోవడంపై అత్యున్నత న్యాయస్థానం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. కేంద్ర ప్రభుత్వం ఇదే వైఖరిని కొనసాగిస్తే రాజకీయ నాయకులపై నమోదైన క్రిమనల్ కేసుల్ని పర్యవేక్షించడానికి ప్రత్యేక బెంచ్‌ను ఏర్పాటు చేస్తామని సూచనప్రాయంగా వెల్లడించింది. ఈ మధ్యకాలంలో ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వాలు సీఆర్పీసీలోని సెక్షన్ 321 కింద సంక్రమించిన అధికారాన్ని వాడుతూ తమ రాష్ట్రాలకు చెందిన ఎమ్మెల్యేలపై కేసుల్ని వెనక్కి తీసుకున్నాయి. ప్రజాప్రతినిధులపై క్రిమినల్ కేసుల విచారణను వేగవంతం చేయడానికి సుప్రీంకోర్టు నియమించిన అమికస్ క్యూరీ, సీనియర్ అడ్వొకేట్ విజయ్ హన్సారియా కోర్టుకు ఒక నివేదిక సమర్పించారు. యూపీ ఎమ్మెల్యేలైన సంగీత్ శామ్, సురేష్ రాణా, కపిల్ దేవ్, సాధ్వి ప్రచిలపై కేసుల్ని ప్రభుత్వం వెనక్కి తీసుకుందంటూ వార్తా పత్రికల్లో వచ్చిన కథనాలను సుప్రీంకోర్టు దృష్టికి తీసుకువచ్చారు. అమికస్ క్యూరీ నివేదికపై విచారణ జరిపిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి. రమణ, జస్టిస్ వినీత్ శరణ్, జస్టిస్ సూర్యకాంత్‌లతో కూడిన డివిజన్ బెంచ్.. ఇలా చేయడం క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఇచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేయడమేనని వ్యాఖ్యానించింది. ఎంపీలు, ఎమ్మెల్యేలపై క్రిమినల్ విచారణను ఆయా రాష్ట్రాల హైకోర్టుల నుంచి ముందుగా అనుమతి లేకుండా వెనక్కి తీసుకోవడం ఇకపై కుదరదని తేల్చి చెప్పింది. ట్రయల్ కోర్టుల్లో ప్రజాప్రతినిధులపై ఉన్న కేసుల పురోగతిపై ఎప్పటికప్పుడు హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్స్ సమాచారం అందించాలని తన ఉత్తర్వుల్లో పేర్కొంది. కేంద్రం, దర్యాప్తు సంస్థలు ప్రజాప్రతినిధులపై నమోదైన కేసులు, వాటి విచారణ ఎంతవరకు వచ్చాయో పూర్తిస్థాయి నివేదిక సమర్పించడానికి ఆఖరి అవకాశం ఇస్తూ సుప్రీం బెంచ్ ఆగస్టు 25కి విచారణను వాయిదా వేసింది. రెండేళ్లలో పెరిగిపోయిన కేసులు నిరంతరం కఠిన పర్యవేక్షణ ఉన్నప్పటికీ ఎంపీలు, ఎమ్మెల్యేలపై పెండింగ్ కేసుల సంఖ్య గత రెండేళ్లలో బాగా పెరిగిపోయాయని అమికస్ క్యూరీ విజయ్ హన్సారియా సుప్రీంకు సమర్పించిన నివేదికలో వెల్లడించారు. 2018 డిసెంబర్ నాటికి పెండింగ్ కేసులు 4,122 ఉంటే, 2020, సెప్టెంబర్ నాటికి వాటి సంఖ్య 4,859కి చేరుకుందని తెలిపారు. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తమ రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజాప్రతినిధులపై కేసుల్ని వెనక్కి తీసుకుంటున్నాయని ఆరోపించారు. 48 గంటల్లో నేర చరిత్ర చెప్పాలి రాజకీయాల్లో నేరచరితులు లేకుండా ప్రక్షాళన చేయడానికి సుప్రీంకోర్టు కీలక ఆదేశం జారీ చేసింది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల్ని ప్రకటించిన 48 గంటల్లోగా వారిపై ఉన్న నేర చరిత్రను బహిర్గతపరచాలని రాజకీయ పార్టీలకు ఆదేశించింది. ఫిబ్రవరి 13, 2020నాడు ఇచ్చిన తమ ఉత్తర్వుల్ని సుప్రీంకోర్టు బెంచ్ సవరించింది. తమ పార్టీ అభ్యర్థుల నేరచరిత్రను విడుదల చేయడంలో రాజకీయ పార్టీలు విఫలమవడంపై దాఖలైన కోర్టు ధిక్కార పిటిషన్‌ను మంగళవారం విచారించింది. గత ఏడాది బిహార్ ఎన్నికల సందర్భంగా అభ్యర్థుల్ని ప్రకటించిన 48 గంటల్లోపు లేదంటే, నామినేషన్ వేయడానికి రెండు వారాలు ముందు అభ్యర్థుల నేరచరిత్రను వెల్లడించాలని సుప్రీం ఆదేశించింది. ఇప్పుడు ఆ ఆదేశాల్ని సవరిస్తూ 48 గంటల్లోనే తప్పనిసరిగా నేరచరిత్రను బయటపెట్టాలని అత్యున్నత న్యాయస్థానం సరికొత్తగా ఆదేశాలు జారీ చేసింది. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తమ ఆదేశాలను పాటించని ఎనిమిది రాజకీయ పార్టీలకు సుప్రీంకోర్టు జరిమానాలు విధించింది. సీపీఎం, ఎన్సీపీ రూ.5లక్షలు, బీజేపీ, జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్, లోక్ జనశక్తి, సీపీఐ లక్ష చొప్పున జరిమానా చెల్లించాలని ఆదేశించింది. దేశం సహనం కోల్పోతోంది రాజకీయాల్లోకి నేరచరితులు ప్రవేశించకుండా ప్రక్షాళన చేయడం శాసన వ్యవస్థ తక్షణ ప్రాధాన్యాల్లో ఒకటిగా కనిపించడం లేదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. దీనికోసం నిరీక్షిస్తూ దేశం సహనం కోల్పోతోందని వ్యాఖ్యానించింది. నేరచరితులు చట్టసభల్లోకి అడుగుపెట్టడానికి అనుమతించకూడదని, ఈ మేరకు చట్టాలకు అవసరమైన సవరణలు చేయాలని సర్వోన్నత న్యాయస్థానం పలుమార్లు కోరినా... రాజకీయపార్టీలు పెడచెవిన పెట్టాయని. గాఢనిద్రలో నుంచి మేల్కొనడానికి నిరాకరిస్తున్నాయని పేర్కొంది. ఈ విషయంలో తక్షణమే ఏమైనా చేద్దామనుకున్నా తమ (సుప్రీంకోర్టు) చేతులు కట్టిపడేసి ఉన్నాయని, శాసనవ్యవస్థ పరిధిలోకి వచ్చే అంశంలో తాము జోక్యం చేసుకోలేమని జస్టిస్ ఆర్.ఎఫ్.నారిమన్, బి.ఆర్.గవాయ్‌లతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. పెగసస్‌పై సోషల్ మీడియాలో చర్చలెందుకు? పిటిషన్‌దారులపై సుప్రీంకోర్టు అసహనం న్యూఢిల్లీ: పెగసస్ స్పైవేర్ ఆరోపణలపై స్వతంత్ర దర్యాప్తు కోరుతూ సుప్రీంకోర్టుకెక్కిన కొందరు పిటిషన్‌దారులు సోషల్ మీడియాలో ఈ అంశంపై చర్చించడాన్ని అత్యున్నత న్యాయస్థానం తప్పు పట్టింది. ఆ పిటిషన్ దారులు క్రమశిక్షణ కలిగి ఉండాలని, వ్యవస్థలపై కాస్తయినా నమ్మకం ఉండాలని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి. రమణ ఆధ్వర్యంలోని బెంచ్ హితవు చెప్పింది. ఒకవైపు సుప్రీంని ఆశ్రయిస్తూనే సమాంతరంగా సోషల్ మీడియాలో చర్చలు ఎందుకు చేస్తున్నారని అసహనం వ్యక్తం చేసింది. పెగసస్ వివాదంపై విచారణకు ఆదేశించాలంటూ దాఖలైన పిటిషన్లపై కేంద్రానికి నోటీసులు ఇవ్వాలో, అక్కర్లేదో ఈ నెల 16న సుప్రీంకోర్టు తేలుస్తుందని ప్రధాన న్యాయమూర్తితో పాటుగా జస్టిస్ వినీత్ శరణ్, జస్టిస్ సూర్యకాంత్‌లతో కూడిన సుప్రీం బెంచ్ తెలిపింది. తాము చర్చలకు వ్యతిరేకం కాదని, అయితే కోర్టులో విచారణ పెండింగ్‌లో ఉన్నప్పుడు బయట చర్చించాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించింది. ఈ విషయంపై ఆసక్తి ఉన్నవారు న్యాయస్థానం అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలిస్తూ కోర్టు హాల్లో చర్చించాలని, బయట కాదని పేర్కొంది. న్యాయవ్యవస్థకి సమాంతరంగా సామాజిక మాధ్యమాల్లో చర్చించడానికి బదులుగా ఆ అంశాలన్నీ అఫిడవిట్ రూ పంలో దాఖలు చేస్తే తాము ప్రతీ అంశాన్ని క్షు ణ్ణంగా పరిశీలిస్తామని సీజేఐ.. పిటిషన్‌దారులు, జర్నలిస్టులైన ఎన్.రామ్, శశికుమార్ తరఫున హాజరైన అడ్వొకేట్ కపిల్ సిబల్‌తో అన్నారు. -
అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థుల్లో 18% నేరచరితులే
న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం అసెంబ్లీలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతానికి జరుగుతున్న ఎన్నికల్లో పోటీకి దిగిన అభ్యర్థుల్లో 18శాతం మంది నేరచరిత్ర ఉన్నవారేనని ఎన్నికల హక్కుల సంస్థ అసోసియేషన్ ఫర్ డెమొక్రాటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) తెలిపింది. బెంగాల్లో మూడో విడత ఎన్నికలు, మిగిలిన రాష్ట్రాల ఎన్నికల్లో ఇప్పటివరకు 6,792 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిస్తే వారిలో 6,318 మంది దాఖలు చేసిన అఫిడవిట్లను ఏడీఆర్ అధ్యయనం చేసింది. వారిలో 1,157 మంది (18%) నేర చరిత్ర ఉన్నట్టు నామినేషన్ సందర్భంగా దాఖలు చేసిన అఫిడవిట్లలో పేర్కొన్నారు. 632 మందిపై తీవ్రమైన నేరాలకు పాల్పడినట్టుగా అభియోగా లున్నాయి. బెంగాల్లో మూడో విడత వరకు దాఖలైన నామినేషన్ల పరిశీలనలో 25% మంది నేరచరితులుంటే, 21% మందిపై తీవ్రమైన నేరారోపణలున్నాయి. తమిళనాడు లో 13%, కేరళలో 38%, అస్సాంలో 15%, పుదుచ్చేరిలో 17% మంది నేరచరితులు ఉన్నారు. -
గ్రేటర్ ఎన్నికలు: నేను.. నా నేర చరిత!
మహావేగంగా దూసుకొచ్చిన గ్రేటర్ ఎన్నికల్లో సత్తా చాటుకొనేందుకు అన్ని ప్రధాన పార్టీలు సమరానికి సన్నద్ధమవుతున్నాయి. అధికార టీఆర్ఎస్తో పాటు, కాంగ్రెస్, బీజేపీ, ఎంఐఎం తదితర పార్టీలన్నీ బరిలోకి దింపేందుకు కార్పొరేట్ అభ్యర్థుల ఖరారుపై కసరత్తు చేపట్టాయి. టీఆర్ఎస్ ఇప్పటికే రెండు జాబితాలను ప్రకటించింది. అన్ని పార్టీల్లోనూ ఆశావహుల సందడి నెలకొంది. ఎన్నికలకు గడువు లేకపోవడంతో ఎలాంటి జాప్యానికి తావులేకుండా అభ్యర్థులను ప్రకటించి ప్రచారపర్వంలోకి దిగేందుకు రాజకీయ పార్టీలు కార్యాచరణ రూపొందించుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ నేర చరితులను పోటీకి దూరంగా ఉంచాలని, గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధి కోసం కష్టపడే వారిని మాత్రమే బరిలో నిలపాలని పౌరసంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్లు డిమాండ్ చేస్తున్నాయి. – సాక్షి, సిటీబ్యూరో సుప్రీం కోర్టు ఆదేశాలు పాటించాలి: అధికార టీఆర్ఎస్ నుంచి 16 మంది కార్పొరేటర్లు, ఎంఐఎం నుంచి 13 మంది, బీజేపీ నుంచి ఒక్కరు చొప్పున నేరచరిత్ర కలిగిన వాళ్లు ఉన్నట్లు ఫోరమ్ ఫర్ గుడ్‌గవర్నెన్స్ ఆందోళన వ్యక్తం చేసింది. ఎన్నికల్లో నేరచరిత్ర కలిగిన వాళ్లు పోటీ చేయడం వల్ల ఓటర్లలో విముఖత ఏర్పడుతుంది. అలాంటి వ్యక్తులకు ఓటు వేసేందుకు వెనకడుగు వేస్తారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల నేరచరిత్రను పత్రికల్లో తప్పనిసరిగా ప్రచురించాలన్న సుప్రీం కోర్టు ఆదేశాలను జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అమలు చేయాలి. సచ్ఛీలురను పక్కనపెట్టి నేరచరిత కలిగిన వాళ్లకు ఎందుకు టికెట్లు ఇవ్వాల్సి వచ్చిందో కూడా పార్టీలు 48 గంటల్లో స్పష్టం చేయాలి. అలాగే నేరచరిత కలిగిన వ్యక్తుల గొప్పతనం, వారిని నిలబెట్టేందుకు దోహదం చేసిన సద్గుణాలు, అర్హతలను కూడా వివరించాలి. సుప్రీం కోర్టు ఆదేశాలను అన్ని రాజకీయ పార్టీలు అమలు చేయాలి. చదవండి: ఈ ఎన్నికల్లో వారికే ఓటు వేద్దాం.. గత ఎన్నికల్లో .. గత గ్రేటర్ ఎన్నికల్లో ప్రధాన పార్టీల నుంచి పోటీ చేసిన వారిలో 72 మందికిపైగా వివిధ పోలీస్స్టేషన్లలో క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. వారిలో 30 మంది గెలిచారు. అంటే 20 శాతం మంది కార్పొరేటర్లు నేరచరిత కలిగిన వారే కావడం గమనార్హం. మార్పు అవసరం... ప్రస్తుత ఎన్నికల్లోనైనా నేరచరిత కలిగిన వారిని పక్కనపెట్టాలని ప్రజాస్వా మ్య సంస్థలు కోరుతున్నాయి. ఒకవేళ నేరచరిత కలిగిన వాళ్లు పోటీ చేస్తే వారు సమర్పించే అఫిడవిట్లో 6ఏ నిబంధన ప్రకారం తప్పనిసరిగా వారిపై నమోదైన కేసుల వివరాలను కూడా స్పష్టంగా పేర్కొనాల్సిఉంటుంది. గెలుపు గుర్రాల పేరిట నేరస్తులను బరిలో నిలపడం వల్ల హైదరాబాద్ నగర అభివృద్ధికి అంకితభావంతో పనిచేసే వాళ్లకు, ఉత్తమ రాజకీయ చరిత్ర కలిగిన వాళ్లకు అవకాశం లేకుండాపోతోందని వివిధ సంస్థలు అభిప్రాయపడుతున్నాయి. ఈసీకి ఎఫ్‌జీజీ వినతి.. నేరచరిత లేని వ్యక్తులకే ప్రాధాన్యమిచ్చేలా రాజకీయ పార్టీలపైన ఒత్తిడి తేవాలని ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ కోరుతోంది. మరోవైపు సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన ఆదేశాలు కచ్చితంగా అమలయ్యేలా చూడాలని కోరుతూ ఎఫ్‌జీజీ కార్యదర్శి పద్మనాభరెడ్డి గురువారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. -
నితీశ్ కేబినెట్లో 57% మంది నేరచరితులే
పట్నా: బిహార్‌లో నితీశ్‌కుమార్ సర్కార్ ప్రమాణ స్వీకారం చేసిందో లేదో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నేరచరిత కలిగిన వారికి నితీశ్ కేబినెట్లో చోటు దక్కడంతో విపక్షాలు దాడికి దిగాయి. విద్యాశాఖ మంత్రిగా జేడీ(యూ)కి చెందిన మేవాలాల్ చౌధురిని నియమించడంతో రగడ మొదలైంది. గతంలో వ్యవసాయ యూనివ ర్సిటీ వైస్ చాన్స్‌లర్‌గా మేవాలాల్ అవినీతి ఆరోపణలు ఎదుర్కోవడంతో పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఇప్పుడు ఆయనకు విద్యాశాఖ మంత్రి పదవి కట్టబెట్టడంతో విపక్ష ఆర్జేడీ కూటమికి ఒక ఆయుధం దొరికింది. కేబినెట్లో మరో ఏడుగురు నేర చరిత కలిగిన వారు ఉన్నారని అసోసియేషన్ ఫర్ డెమొక్రాటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) తాజా నివేదిక వెల్లడించింది. నితీశ్ కేబినెట్లో బెర్త్ సంపాదించిన 14 మంది ఎన్నికల అఫిడవిట్లో సమర్పించిన వివరాలను విశ్లేషించిన ఆ సంస్థ ఎనిమిది మంది (57%) నేరచరిత్ర కలిగినవారని పేర్కొంది. వారిలో ఆరుగురు (43%)అత్యంత తీవ్రమైన క్రిమినల్ కేసుల్ని ఎదుర్కొంటున్నారు. ఎనిమిది మంది కళంకిత మంత్రుల్లో బీజేపీ నుంచి నలుగురు, జేడీ(యూ) నుంచి ఇద్దరు కాగా మిగతా ఇద్దరు కూటమి పార్టీలకు చెందినవారు. -
టీఆర్ఎస్లో 16, ఎంఐఎంలో 13 మంది నేరచరితులు
సాక్షి, హైదరాబాద్: త్వరలో జరగబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో నేరచరిత్ర కలిగిన అభ్యర్థులకు టికెట్లు ఇవ్వవద్దని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ (ఎఫ్‌జీజీ) రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేసింది. గతంలో అన్ని పార్టీల నుంచి కలిపి 72 మంది నేరచరిత్ర ఉన్నవాళ్లు టికెట్లు దక్కించుకుని పోటీ చేశారని తెలిపింది. అందులో 30 మంది అభ్యర్థులు గెలిచారని, ఈ లెక్కన పాలకమండలిలో 20 శాతం మంది కార్పొరేటర్లు నేరచరిత్ర కలిగి ఉన్నారని వివరించింది. పార్టీలవారీగా చూసుకుంటే టీఆర్ఎస్లో 16 మంది, ఎంఐఎంలో 13 మంది, బీజేపీలో ఒక్కరి చొప్పున ఉన్నారని వెల్లడించింది. నేరచరితులు బరిలో నిల్చుంటే విద్యావంతులు ఓటింగ్‌పై విముఖత చూపుతారని, ఫలితంగా ఓటింగ్ శాతం పడిపోతుందని ఆందోళన వ్యక్తం చేసింది. వచ్చే ఎన్నికల్లోనైనా నేరచరిత్ర కలిగిన అభ్యర్థులకు టికెట్లు ఇవ్వకూడదని అన్ని పార్టీలను ఎఫ్‌జీజీ కార్యదర్శి పద్మనాభరెడ్డి సోమవారం ఓ ప్రకటనలో కోరారు. (చదవండి: ఎన్నికలపై స్టే కోరుతూ వ్యాజ్యం.. హైకోర్టు ఆగ్రహం) -
ప్రజాప్రతినిధులపై భారీగా క్రిమినల్ కేసులు
న్యూఢిల్లీ: ప్రస్తుత, మాజీ ప్రజా ప్రతినిధులపై గత రెండేళ్లుగా క్రిమినల్ కేసులు భారీగా పెరిగాయని ఒక నివేదిక తెలిపింది. ఈ ఏడాది మార్చి నాటికి సిట్టింగ్, మాజీ ప్రజా ప్రతినిధులపై 4,442 క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉండగా ప్రస్తుతం 4,859కు చేరుకున్నట్లు వివరించింది. ప్రస్తుత, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలపై నమోదైన కేసుల విచారణ రెండేళ్లుగా వేగవంతమైనప్పటికీ పెండింగ్ కేసులు పెరిగిపోతున్నాయని న్యాయవాదులు విజయ్ హన్సారియా, స్నేహ కలిట సోమవారం సుప్రీంకోర్టు సమర్పించిన నివేదికలో పేర్కొన్నారు. ‘హైకోర్టులు సూక్ష్మస్థాయిలో పర్యవేక్షణ చేపట్టి, ఇలాంటి కేసులను సత్వరమే పరిష్కరించాలి. ఇందుకోసం ప్రతి జిల్లాలోనూ సెషన్స్, మెజిస్టీరియల్ స్థాయి ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయాలని కొన్ని హైకోర్టులు కోరుతున్నాయి. ప్రతి కోర్టుకు నోడల్ ప్రాసిక్యూషన్ అధికారి, స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లను నియమించాలంటూ రాష్ట్ర ప్రభుత్వాలకు ఆయా హైకోర్టులు లేఖలు కూడా రాశాయి. సాక్షులకు రక్షణ, భద్రత కల్పించేందుకు అవసరమైన ఏర్పాట్ల కల్పనలో నిధుల కొరత సమస్యగా మారిందని హైకోర్టులు చెప్పాయి’ అని ఆ నివేదికలో పేర్కొన్నారు. ఇప్పటికే పనిచేస్తున్న బెంగళూరు, అలహాబాద్ ప్రత్యేక కోర్టుల్లో విచారణ కేసుల సంఖ్య ఎక్కువగా ఉందనీ, ఇలాంటి చోట్ల అదనంగా కోర్టులు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. -
నేరస్తుల చెరలో ‘న్యాయ’ శాస్త్రం
లా కళాశాలల్లో క్రిమినల్ లా, ప్రొసీజర్ గురించి పాఠాలు చెబుతూ ఉంటాం. తరగతి గదిలో చెప్పేదానికి, కోర్టుల్లో జరిగేదానికి తేడాలు ఉంటా యని నవ్వుకుంటూ ఉంటారు. తీవ్ర నేరం జరిగితే ప్రథమ సమాచార నివేదిక నమోదు చేయడం అనేది మొదటి దశ. ఇదే లేకపోతే అసలు దర్యాప్తులు నేర విచారణలు ఉండవు. శిక్ష సంగతి తలెత్తదు. బీజేపీ నాయకుల మీద ఎఫ్ఐఆర్ చేసే విధిని ధైర్యంగా నిర్వర్తించే పోలీసు అధికారులు ఈ దేశంలో లేరా? అది జరగాలనే న్యాయవాదులు, న్యాయమూర్తులన్నా ఉన్నారా? ఈ అన్యాయం భరించలేక హర్షమందర్ అనే మానవహక్కులవాది డిల్లీ హైకోర్టులో రిట్ పిటిషన్ వేశారు. ఎఫ్ ఐ ఆర్ నమోదు చేయాలని హైకోర్టు మెట్లెక్కవలసి రావడమే పెద్ద విషాదం. ముఖ్యమైన మూడు కొత్త పాఠాలు ఇవి. 1. నేరం జరిగితే మొదటి సమాచార నివేదిక పేరుతో కేసు నమోదు చేయాలని తరగతి గదిలో చెబుతాం. సోలిసిటర్ జనరల్ గారి కొత్తపాఠం: తగిన వాతావరణం ఏర్పడి పరి స్థితులు అనుకూలంగా ఉంటే తప్ప నేరం జరి గినా ఎఫ్ ఐ ఆర్ నమోదు చేయడానికి వీల్లేదని సోలిసిటర్ జనరల్ వాదించారు. 2. ఒకవేళ ఎక్స్ అనే వ్యక్తిపై నేరారోపణ వస్తే అతని మీద ఫిర్యాదు రూపంలో ఎఫ్ ఐ ఆర్ నమోదు చేయాలన్నది క్రిమినల్ లా పాఠం. సోలిసిటర్ జనరల్ గారి కొత్తపాఠం: ఎక్స్ మీద ఎఫ్ ఐ ఆర్ నమోదు చేయాలంటే ఏబీసీడీ నుంచి జడ్ దాకా అందరిమీదా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి. లేకపోతే లేదు. 3. న్యాయం కోరే వ్యక్తి ఎవరైనా సరే అతని దరఖాస్తులో నిజం ఉంటే న్యాయస్థానం విచారణకు స్వీకరిస్తుందని తరగతి గదిలో చెప్పే పాఠం. కొత్తగా ప్రధాన న్యాయమూర్తి గారి ప్రవచనం: న్యాయం చేయాలని కోరే వ్యక్తికి న్యాయవ్యవస్థమీద విశ్వాసం ఉందని రుజువు అయితేనే ఆయన దరఖాస్తు విచారణ చేయాలి. హింసాద్వేషాలు వెదజల్లే ప్రసంగాలు నినాదాలు చేసిన మంత్రిగారు అనురాగ్ థాకూర్, కపిల్ మిశ్రా, పర్వేశ్ వర్మ, అభయ్ వర్మలపైన ఎఫ్ఐఆర్ నమోదుచేస్తారో లేదో ఒకరోజులో తెలియజేయండి అని డిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మురళీధర్ బెంచ్ హర్షమందర్ కేసు విచారణలో సూచించారు. ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆదేశించడం కుదరదు. ఎందుకంటే ప్రాథమికంగా నేరం జరిగిన ఆధారాలుంటే నిర్ణయం తీసుకునే విచక్షణాధికారం పోలీసులకే ఉంది. కనుక ఆలోచించి రేపు సాయంత్రంలోగా చెప్పండి అని మాత్రమే జస్టిస్ మురళీధర్ అన్నారు. అంతే, న్యాయశాఖ ఆగమేఘాలమీద అర్థరాత్రి బదిలీ ఉత్తర్వులు తయారు చేసింది. జస్టిస్ మురళీధర్‌ను పంజాబ్ హర్యానా హైకోర్టుకు బదిలీ చేస్తూ రాష్ట్రపతితో సంతకం చేయించి మరీ ప్రకటించింది ఫిబ్రవరి 12నే సుప్రీంకోర్టు కొలీజియం మురళీధర్ బదిలీ ప్రతిపాదనను ఆమోదించింది కనుక అని చెప్పింది. మురళీధర్ బదిలీకి కొలీజియం ఇంతవరకు కారణాలు తెలియజేయలేదు. మరునాడు ఢిల్లీ హైకోర్టు చీఫ్ జడ్జిగారి ధర్మాసనం ఆ కేసును నెల వాయిదా వేసింది. బీజేపీ నాయకుల హింసాద్వేష ప్రసంగాలమీద కేసులు త్వరగా వినాలని, ఢిల్లీ హైకోర్టు అంత సుదీర్ఘ వాయిదా వేయడం తగదని సుప్రీంకోర్టు మార్చి 4న మరో కేసులో చెప్పడం కారు చీకటిలో చిరు కాంతిరేఖ. కానీ, ఇందులో కూడా తిరకాసు ఉంది. అదేమంటే ఒక ప్రసంగం చేస్తూ హర్షమందర్ తనకు న్యాయవ్యవస్థ పట్ల విశ్వాసం లేదన్నారని పోలీసుశాఖ ఒక అఫిడవిట్ వేసింది. కోపిం చిన సుప్రీంకోర్టు ప్రధానన్యాయమూర్తిగారు ముందీ సంగతి తేల్చండి తరువాతే అసలు కేసు వింటాం అన్నారు. కానీ, పిటిషనర్‌కు విశ్వాసం ఉన్నా లేకపోయినా న్యాయవ్యవస్థ మీద రాజ్యాంగం మీద న్యాయమూర్తులకు విశ్వాసం ఉంది గనుక కేసు వినవలసి ఉంటుంది కదా? మాడభూషి శ్రీధర్ వ్యాసకర్త బెన్నెట్ యూనివర్సిటీ ప్రొఫెసర్, కేంద్ర సమాచార మాజీ కమిషనర్ madabhushi.sridhar@gmail.com -
నాయక్ నహీ..ఓ చోర్ హై..
సాక్షి, గుంటూరు : టీడీపీ అభ్యర్థుల్లో నేరారోపణలు ఎదుర్కొంటున్న వారే ఎక్కువ మంది ఉన్నారు. నరసరావు పేట పార్లమెంట్ అభ్యర్థితోపాటు ముగ్గురు అసెంబ్లీ టిక్కెట్లు పొందినవారికీ నేర చరిత్ర ఉంది. ఎంపీ అభ్యర్థి రాయపాటిపై పొగాకు బేళ్లలో చెత్త నింపి విదేశాలకు ఎగుమతి చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. సత్తెనపల్లి, గురజాల, వినుకొండ, చిలకలూరిపేట, పొన్నూరు, పెదకూరపాడు, బాపట్ల అభ్యర్థులు కోడెల, యరపతినేని, జీవీ, ప్రత్తిపాటి, ధూళిపాళ్ల, కొమ్మాలపాటి, అన్నం సతీష్‌పై ఆరోపణలు ఉన్నాయి. ‘ప్రజలే దేవుళ్లు.. సమాజమే దేవాలయం’ అన్న నినాదంతో మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించారు. అయితే ఆ పార్టీ ప్రస్తుత అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో పార్టీ నాయకులు ప్రజలను, ప్రభుత్వ ఆస్తులను అడ్డగోలుగా దోచుకుం టున్నారు. ఎంతటి నేరచరిత్ర ఉన్నా, ఎన్ని అక్రమాలకు తెగబడినా రూ.కోట్లకు పడగలెత్తి, పార్టీకి సూట్‌కేసుల్లో రూ.కోట్లు ముట్టజెబితేచాలు టిక్కెట్లు ఖాయమన్న తీరులో ఆ పార్టీ రాజకీయాలు సాగుతున్నాయన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. నరసరావుపేట పార్లమెంట్ పరిధిలోని ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులే ఇందుకు నిదర్శనమన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. హత్య కేసులో జైలుకెళ్లిన యరపతినేని గురజాల సిట్టింగ్ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు 1992లో ఆంధ్రప్రదేశ్ స్టేట్ సీడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్‌కు సంబంధించి గుంటూరు, నల్గొండ జిల్లాల డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నారు. అయితే డిపాజిట్ డబ్బు చెల్లించకుండా భూములు తాకట్టుపెట్టి అప్పు తెచ్చుకున్నారు. రూ.60 లక్షలు వారికి చెల్లించకుండా ఎగనామం పెట్టారు. దీంతో వారు హైదరాబాద్ సిటీ సివిల్‌కోర్టులో దావా వేయగా రూ.1.70 కోట్లకు కోర్టు డిక్రీ ఇచ్చింది. అనంతరం 1999లో యరపతి నేని టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందడంతో ఆయన భూములను జప్తు చేయకుండా తప్పించుకున్నారు. ఇప్పటికీ ఏపీఎస్ఎస్డీసీ ఆ భూములను జప్తు చేసుకోలేకపోయింది. గుంటూరులో స్నేహ చరిత చిట్‌ఫండ్ కంపెనీ స్థాపించి, కస్టమర్లకు కుచ్చు టోపీపెట్టి ఐపీ దాఖలు చేయడంతో అప్పట్లో బాధితులు నరసరావుపేట కోర్టును ఆశ్రయించారు. 2012లో పిడుగురాళ్లలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఉన్నం నరేంద్ర హత్యకు గురయ్యారు. ఆ కేసులో యరపతినేని మూడో నిందితుడు. కేసు నుంచి తప్పించుకునేందుకు ఆయన అప్పట్లో అజ్ఞాతంలోకి వెళ్లగా రూరల్ ఎస్పీ మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. యరపతినేని హైదరాబాద్‌లో ఉన్నట్టు గుర్తించిన పోలీసులు ఆయన్ను అరెస్టు చేసి 14 రోజులు రిమాండ్‌కు సైతం పంపారు. 2014 సంవత్సరంలో టీడీపీ అధికారంలోకి వచ్చాక యరపతినేని అక్రమాలకు లైసెన్స్ ఇచ్చినట్లయింది. నియోజకవర్గంలో అక్రమ మైనింగ్ తెరలేపి అడ్డగోలుగా రూ.వేల కోట్ల విలువజేసే సహజ సంపదను దోచుకున్నారు. పిడుగురాళ్ల మండలం సీతారాంపురం, దాచేపల్లి మండలం కేశానుపల్లి, నడికుడి ప్రాంతాల్లో ఎమ్మెల్యే కనుసన్నల్లో నడిచిన మైనింగ్ మాఫియా నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (ఎన్ఆర్ఎస్సీ) రిపోర్ట్ ప్రకారం 2017 జనవరి నాటికి 68.53 లక్షల టన్నుల తెల్లరాయిని అమ్ముకుంది. 2017 జనవరి నుంచి 2018 జూలై 25వ తేదీ హైకోర్టు అక్రమ మైనింగ్ నిలిపివేసే నాటి వరకూ మరో 30 లక్షల టన్నుల సున్నపు రాయిని దోచేశారని నిపుణులు లెక్కతేల్చారు. డెయిరీ ఆస్తులు కబ్జా చేసిన ధూళిపాళ్ల పొన్నూరు నుంచి టీడీపీ తరఫున బరిలో నిలుస్తున్న ధూళిపాళ్ల నరేంద్ర రూ.వేల కోట్ల విలువ చేసే సంఘం డెయిరీ ఆస్తులను హస్తగతం చేసుకుని, ఏకంగా డెయిరీ స్థలంలో తన తండ్రి ధూళిపాళ్ల వీరయ్య చౌదరి పేరున ఆసుపత్రి నిర్మించారనే ఆరోపణలున్నాయి. పెదకాకాని, ఇతర ప్రాంతాల్లో పోరంబోకు భూములను కాజేసిన చరిత్ర ఆయన సొంతం. నియోజకవర్గంలో అక్రమ మైనింగ్ నిర్వహిస్తూ, రాజధాని ప్రాంతంలో ఇసుక తవ్వకాలు చేపట్టి రూ.కోట్లతో జేబులు నింపుకొన్నారని, భూకబ్జాలకు సైతం పాల్పడ్డారనే విమర్శలున్నాయి ఆయన అవినీతి అక్రమాలను ప్రశ్నించినవారిపై అక్రమంగా ఎస్సీ, ఎస్టీల్లో పెట్టించి నరేంద్ర వేధింపులకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఉన్నాయి. కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలో నివసిస్తున్న చేబ్రోలుకు చెందిన పెమ్మసాని శ్రీధర్‌కు స్వగ్రామంలో 2014లో వాసిరెడ్డి రాజశేఖర్ నుంచి 803 గజాల స్థలం కొన్నారు. వాసిరెడ్డి రాజశేఖర్ బాబాయ్ వాసిరెడ్డి శంకర్రావు, అతని కుమారుడు వాసిరెడ్డి వంశీ ఆ స్థలంలోకి వెళ్లకుండా శ్రీధర్‌ను అడ్డుకుంటున్నారు. ఈ విషయమై శ్రీధర్ చేబ్రోలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదు. ఇటీవల శ్రీధర్‌పై శంకర్రావు కుటుంబ సభ్యులు కత్తితో దాడి చేసి గాయపరిచారు. అయినా కేసు నమోదు చేసి శంకర్రావు కుటుంబ సభ్యులపై చర్యలు తీసుకోలేదు. ఇందుకు కారణం శంకర్రావు సమీప బంధువు ధూళిపాళ్ల నరేంద్ర వద్ద న్యాయవాదిగా పనిచేయడమే. ఆయనకు తన స్థలాన్ని కట్టబెట్టాలని ఎమ్మెల్యే ప్రయత్నిస్తున్నారని శ్రీధర్ ఆరోపిస్తున్నారు. న్యాయం చేయమని పోలీస్ స్టేషన్‌కు వెళ్లగా చేబ్రోలు సీఐ తనపైనే దాడికి పాల్పడ్డాని శ్రీధర్ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఈ విషయమై బాధితుడు ఎస్పీకి సైతం ఫిర్యాదు చేశాడు. రాయపాటిపై ఎన్ని ఆరోపణలో.. తాజామాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావుపై ఆరోపణలు అన్నీ ఇన్నికావు. గతంలో పొగాకు రైతులకు డబ్బు ఎగ్గొ ట్టారని, పొగాకు బేళ్లలో చెత్తను కుక్కి ఇతరదేశాలకు ఎగుమతి చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఆ కేసులో ఇరుక్కున్న రాయపాటిని అప్పట్లో ఇందిరాగాంధీ కాపాడారనే పుకార్లు ఇప్పటికీ షికార్లు చేస్తున్నాయి. చెల్లని చెక్కులు ఇచ్చి మోసం చేశారంటూ ఓ బాధితుడు నాంపల్లి కోర్టును ఆశ్రయించగా కోర్టు రాయపాటికి మొట్టికాయలు వేసిన విషయం తెలిసిందే. 2014లో రాష్ట్ర విభజన అనంతరం కాంగ్రెస్‌పార్టీ పూర్తిగా దెబ్బతిన్నదని గ్రహించి టీడీపీలో చేరారు. టీడీపీ అధినేత చంద్రబాబు సైతం ఆ ఎన్నికల్లో సిట్టింగ్ ఎంపీగా ఉన్న మోదుగుల వేణుగోపాలరెడ్డిని పక్కనపెట్టి రాయపాటికి నరసరావుపేట పార్లమెంట్ టిక్కెట్ ఇచ్చేశారు. ఆ ఎన్నికల్లో గెలిచిన రాయపాటి నియోజకవర్గంలోని ప్రజలకు ఎన్నడూ అందుబాటులో ఉన్న దాఖలాలు లేవు. నాగార్జున సాగర్‌కు పక్కనే ఉన్న భూములకు సైతం చుక్క నీరందక రైతులు విలవిల్లాడుతున్నా రాయపాటి అటువైపు తొంగి చూడలేదు. ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేసిన రాయపాటికి రెండో సారి టీడీపీ టిక్కెట్ కేటాయించడంపై ప్రజలు విస్మయం వ్యక్తంచేస్తున్నారు. కోడెల హయాంలో అరాచకాలు సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కోడెల శివప్రసాదరావు హోంమంత్రిగా ఉన్న సమయంలో దివంగత కాపు నాయకుడు వంగవీటి మోహనరంగ హత్య జరిగింది. ఆ హత్యలో మంత్రి కోడెల హస్తం ఉందని అప్పట్లో తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ఆయన్ను మంత్రి పదవి నుంచి తప్పించారు. 1999 ఎన్నికల సమయంలో కోడెల ఇంటిలో బాంబులు పేలి అతని అనుచరులు నలుగురు మృతి చెందిన విషయం తెలిసిందే. మంత్రి పదవి కోసం తాను వెళ్తున్న దారిలో తానే బాంబులు పెట్టించుని, వాటిని దూరంగా పేల్చడం వంటివి కూడా చేశారనే విమర్శలూ ఉన్నాయి. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చాక నరసరావుపేట, సత్తెనపల్లి నియోజకవర్గాల్లో కోడెల కుటుంబ సభ్యులు చెలరేగిపోయారు. భూ కబ్జాలు, కే ట్యాక్స్ పేరుతో కాంట్రాక్టర్లు నుంచి సామాన్యుడి వరకూ ప్రతి ఒక్కరి రక్తాన్ని జలగాల్లా తాగారు. మరో సారి సత్తెనపల్లి సీటు కోడెలకు ప్రకటించడంతో ఆయన గెలుపొందితే మా మనుగడ కష్టాంగా మారుతుందని ఆ పార్టీ నాయకులే రోడ్లపైకి వచ్చి ఆందోళన చేపడుతున్నారంటే అక్కడ పరిస్థితి ఎంటో అర్థం చేసుకోవచ్చు. బ్యాంకులను బురిడీ కొట్టించిన అన్నం సతీష్ బాపట్ల టీడీపీ అభ్యర్థి అన్నం సతీష్ ప్రభాకర్‌పై ప్రభుత్వ భూములు తనఖా పెట్టి లోన్లు తీసుకుని బ్యాంకులను బురిడీ కొట్టించారన్న ఆరోపణలు ఉన్నాయి. బాపట్ల నియోజకవర్గం కర్లపాలెం మండలం యాజిలి గ్రామంలోని ప్రభుత్వ భూములను తనఖా పెట్టి ఎస్బీఐ నుంచి సతీష్‌ప్రభాకర్ తన కంపెనీ అయిన సతీష్ మెరైన్ ఎగ్గిమ్ ప్రైవేటు లిమిటెడ్ పేరున లోను తీసుకున్నారు. యాజిలి గ్రామంలో 11.66 ఎకరాల ప్రభుత్వ భూమికి 1బీ భూ యాజమాన్య హక్కు నిర్ధారించే పత్రం తయారు చేసుకుని ఆయన బ్యాంకులను బురిడీ కొట్టించారు. హత్య కేసులో ముందస్తు బెయిల్ పొందిన జీవీ ఆంజనేయులు వినుకొండ తాజామాజీ ఎమ్మెల్యే జి.వి.ఆంజనేయులు సైతం 2004లో ఓ హత్య కేసులో నిందితునిగా ఉండి అరెస్ట్ కాకుండా ముందస్తు బెయిల్ పొందారు. ఆ తరువాత రాజీ కుదుర్చుకుని కేసు కొట్టివేయించుకున్నారని చెబుతుంటారు. ఈ హత్య కేసులో మరో నిందితుడు కామేశ్వరరావును ఆ తరువాత పోలీసులు ఎన్కౌంటర్ కూడా చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఐదేళ్ల టీడీపీ పాలనలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని రేషన్ మాఫియాను పెంచి పోషించారనే విమర్శలు ఆయనపై ఉన్నాయి. నకిలీ బయో ఉత్పత్తుల్లో జీవీ కంపెనీలపై రెండు తెలుగురాష్ట్రాలు సహా, ఇతర రాష్ట్రాల్లో సైతం కేసులు నమోదయ్యాయి. అమాయకులైన గుమాస్తాలు కేసుల్లో ఇరుక్కున్ని నేటికీ అవస్థలు పడుతున్నారు. దోచుకోవడంలో ఘనాపాటి.. ప్రత్తిపాటి అడ్డోగోలుగా దోచుకోవడంలో తాజా మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఘనాపాటి అన్న ఆరోపణలు ఉన్నాయి. 2014–15 కాలంలో ప్రత్తిపాటి పుల్లారావు రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల మంత్రిగా ఉన్న సమయంలో మార్కెట్ యార్డుల ద్వారా చిలకలూరిపేట మండలంలోని యడవల్లి భూ కుంభకోణానికి పాల్పడి భారీగా దోచుకున్నారనే ఆరోపణలున్నాయి. పత్తి కుంభకోణంలో దాదాపు రూ.450 కోట్లు వెనకేసుకున్నారనే విమర్శలు విచారణలో వెలుగుచూశాయి. నియోజకవర్గంలో గ్రావెల్ అక్రమ తవ్వకాలు, అగ్రిగోల్డ్ భూముల కొనుగోలు, రేషన్ బియ్యం అక్రమ రవాణా వంటి అనేక కార్యకలాపాలు ప్రత్తిపాటి కనుసన్నల్లో కొనసాగి రూ.వేల కోట్లు దోచుకున్నారని విమర్శలున్నాయి. చిలకలూరిపేట పట్టణానికి చెందిన విలేకరి ఎం.వి.ఎన్.శంకర్ పై 2014 నవంబర్ 25వ తేదీన ప్రత్తిపాటి అనుచరుడైన వెంగళరాయుడు, తెలుగుయువత పట్టణ మాజీ అధ్యక్షుడు మరో ఇద్దరు దాడి చేసి తీవ్రంగా గాయపరి చారు. గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ అదే రోజు అర్ధరాత్రి శంకర్ మృతి చెందాడు. యడ్లపాడుకు చెందిన మానుకొండ సురేంద్రనాథ్ ఆత్మహత్య వెనుక ప్రత్తిపాటి హస్తం ఉందనే ఆరోపణలున్నాయి. -
ప్రజలకో న్యాయం.. నేతలకో న్యాయమా?
సాక్షి, న్యూఢిల్లీ : ఎన్నికల్లో నేర చరిత కలిగిన రాజకీయ నాయకులు పోటీ చేయకుండా నిరోధించే అధికారం తమకు లేదని, ఈ విషయంలో తాము పార్లమెంట్ పాత్రను నిర్వహించలేమని సుప్రీంకోర్టు ఇటీవల స్పష్టం చేసిన విషయం తెల్సిందే. హత్యలు, కిడ్నాప్‌లు, రేప్‌లు లాంటి కీలక కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజకీయ నాయకులు కూడా ఎన్నికల్లో పోటీ చేస్తుండడం పట్ల ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా నాయకత్వంలోని ఐదుగురు సభ్యుల సుప్రీంకోర్టు ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది. నేర చరితులను ప్రజలు ఎన్నుకోకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి కేంద్రానికి, ఎన్నికల కమిషన్‌కు కొన్ని సూచనలు చేసింది. తాము ఎదుర్కొంటున్న ప్రతి కేసు వివరాలను అభ్యర్థులు తమ అఫిడవిట్లో విధిగా నమోదు చేసేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి, ఎన్నికల కమిషన్‌కు కోర్టు సూచించింది. అలాగే రాజకీయ పార్టీలు పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నేర చరితుల వివరాలను వెబ్సైట్లలో పొందుపర్చాలని సూచించింది. అలాగే నేర చరితులు ఎన్నికల్లో పోటీ చేయడాకుండా పార్లమెంట్లో చట్టం తీసుకరావాలని కూడా కోర్టు సూచించింది. ఇంతవరకు సుప్రీం కోర్టు సూచనలు బాగానే ఉన్నాయిగానీ వీటిని అమలు చేసేది ఎవరు? ఏ పార్టీ అధికారంలో ఉన్న ఈ దిశగా చర్యలు తీసుకున్న పాపాన పోలేదు. ఎందుకంటే ప్రతి పార్టీ తరఫున ఎన్నికల్లో నేర చరితులే పోటీలు పడుతున్నారు. కేసుల్లో శిక్ష పడిన రాజకీయ నాయకులను ఎన్నికల్లో పోటీ చేయకుండా నివారించేందుకు 1951–ప్రజా ప్రాతినిథ్య చట్టంలోని 8వ సెక్షన్ అడ్డుపడుతోంది. పెండింగ్ కేసులున్న వారిని నిరోధించలేక పోతోంది. దాంతో వివిధ రాజకీయ పార్టీల తరఫున నేర చరితులు పోటీ చేస్తూనే ఉన్నారు. 2004లో పార్లమెంట్ ఎన్నికల్లో 124 మంది, 2009లో 162 మంది, 2014లో 184 మంది పోటీ చేశారు. కేసులు నమోదయిన వారు ఎన్నికల్లో పోటీ చేయకుండా చట్టం తీసుకొచ్చినట్లయితే రాజకీయ నాయకులను పోటీ చేయకుండా అడ్డుకునేందుకు ఎవరైన అనవసరమైన కేసులు పెట్టవచ్చన్నది రాజకీయ పార్టీల భావం. అన్ని కేసుల్లో కాకుండా హత్య, కిడ్నాప్, రేప్ లాంటి కేసుల్లో అభియోగాలు ఎదుర్కొంటున్న వారిని పోటీ చేయకుండా నివారించవచ్చు. కానీ శిక్ష పడనంత వరకు ప్రతి ఒక్కరు నిర్దోషులేనని ఎన్నికల కమిషన్ ఎప్పటి నుంచో వాదిస్తోంది. ఈ లెక్కన దేశంలో నేడు వివిధ కేసుల్లో విచారణ ఎదుర్కొంటున్న 2.7 లక్షల మంది అండర్ ట్రయల్స్ కూడా నిర్దోషులే. వారంతా అన్యాయంగా జైల్లో మగ్గుతున్నారు. వారందరికి వ్యక్తిగత ఇష్టత. స్వేచ్ఛా కదలికలు, వత్తి స్వేచ్ఛ, ప్రతిష్టకు సంబంధించిన ప్రాథమిక హక్కులు లేకుండా చట్ట ప్రకారమే హరిస్తున్నారు. అదే రాజకీయ నాయకులకేమో పోటీచేసే హక్కు ఉందంటున్నారు. ప్రజల ప్రాథమిక హక్కులను కాలరాస్తూ నేతల చట్టపరమైన హక్కుకు రక్షణ కల్పించడం ఎంత అన్యాయం? రాజకీయ నాయకులు కేసులను ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా విచారించడం ఒక్కటే ఇందుకు సరైన పరిష్కారం అని అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ సుప్రీం కోర్టుకు సూచించారు. అయితే ఈ విషయాన్ని పరిగణలోకి కోర్టు తీసుకోక పోవడం ఆశ్చర్యం. కేసుల త్వరితగతి పరిష్కారం కోసం ప్రత్యేక సీబీఐ కోర్టులు, ప్రత్యేక వినియోగదారుల కోర్టులు, రేప్ కేసులకు ఫాస్ట్‌ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తున్నప్పుడు నేతల కేసుల విచారణకు ఎందుకు ప్రత్యేక లేదా ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయకూడదు? ఎన్నికల పిటిషన్లను హైకోర్టులు ఆరు నెలల్లోగా పరిష్కరించాలనే మార్గదర్శకాలు ఇప్పటికే ఉన్నాయి. శాసన సభ్యులపై నమోదయ్యే కేసులను ఏడాదిలోగా విచారించి తీర్పు చెప్పాలని, అలా కుదరనప్పుడు అందుకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులకు వివరణ ఇవ్వాలని పబార్గినేట్ కోర్టులకు 2014లో సుప్రీం కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అందుకు పూర్తిగా సహకరిస్తామని కేంద్ర ప్రభుత్వం కూడా హామీ ఇచ్చింది. మరి నేరచరితులు అడ్డుకునేందుకు దొరికిన అవకాశాన్ని సుప్రీం కోర్టు ఇప్పుడు ఎందుకు వదులుకుందో అర్థం కాదు. కొన్ని విషయాల్లో తన పరిధి దాటి క్రియాశీలతను ప్రదర్శించే సుప్రీం కోర్టు ఆ క్రియాశీలతను రాజకీయ ప్రక్షాళనలో చూపకపోవడం అధర్మమే!