అహ్మదాబాద్: గుజరాత్ అసెంబ్లీకి డిసెంబర్ ఒకటిన మొదటి విడత జరిగే ఎన్నికల్లో బరిలో ఉన్న అభ్యర్థుల్లో 21% మందిపై క్రిమినల్ కేసులున్నాయి. ఇందులో అత్యధికంగా ఆప్, ఆ తర్వాతి స్థానాల్లో కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులపై ఉన్నాయి. 89 స్థానాలకు గాను బరిలో ఉన్న 788 మందికి గాను 167 మందిపై క్రిమినల్ కేసులున్నాయి. వీరిలో 100 మంది హత్య, రేప్ వంటి తీవ్ర నేరారోపణలను సైతం ఎదుర్కొంటున్నారని అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్(ఏడీఆర్) గురువారం తెలిపింది.
అదేవిధంగా, బరిలో ఉన్న 788 మందిలో 211 మంది కోట్లకు పడగలెత్తిన వారు కాగా వీరిలో అత్యధికంగా బీజేపీకి చెందిన 79 మంది ఉన్నారని ఏడీఆర్ తెలిపింది. రాజ్‌కోట్ సౌత్ అసెంబ్లీ స్థానానికి పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి రమేశ్ తిలాలా రూ.175 కోట్ల ప్రకటిత ఆస్తులతో అత్యంత ధనికుడు కాగా రాజ్‌కోట్ వెస్ట్ నుంచి స్వతంత్ర అభ్యర్థి భూపేంద్ర పటోలియా ఎటువంటి ఆస్తులు లేవంటూ ఎన్నికల అఫిడవిట్‌లో తెలిపారని పేర్కొంది.
చదవండి: యువతరం.. ఎవరి పక్షం...!
Comments
Please login to add a commentAdd a comment