సాక్షి, న్యూఢిల్లీ: నూతన కేంద్ర మంత్రి వర్గంలో ఆస్తులే కాదు అప్పులు కూడా రూ.కోట్లలో ఉన్నవారు ఉన్నారని నేషనల్ ఎలక్షన్ వాచ్/ఏడీఆర్ సంస్థ పేర్కొంది. తాజా మంత్రివర్గంలోని ప్రధాని సహా 78 మంది మంత్రులకు సంబంధించి లోక్‌సభ, రాజ్యసభ, రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల అఫిడవిట్లలోని సమాచారం మేరకు ఈ వివరాలు వెల్లడించినట్లు సంస్థ తెలిపింది.
ఈ అంశాలపై దృష్టి..
తాజా మంత్రివర్గ విస్తరణలో 43 మంది కొత్త వారు చేరిన విషయం విదితమే. ఈ సందర్భంగా ఈ నివేదికలో మంత్రుల నేర, ఆర్థిక, విద్య తదితర అంశాలపై దృష్టి సారించినట్లు సంస్థ తెలిపింది. 33 మంది (42శాతం) మంత్రులపై క్రిమినల్ కేసులు ఉన్నాయని, అందులో 24 (31 శాతం) మందిపై తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉన్నాయని, హోంశాఖ సహాయ మంత్రి నిశిత్ ప్రమానిక్‌పై హత్య సంబంధిత కేసు కూడా ఉందని తెలిపింది. 70 మంది (90 శాతం) కోటీశ్వరులని, మంత్రుల సరాసరి ఆస్తుల విలువ రూ.16.24 కోట్లు అని నివేదికలో తెలిపింది. సర్బానంద సోనోవాల్, ఎల్. మురుగన్‌ల వివరాలు ఇటీవల అసెంబ్లీ ఎన్నికల అఫిడవిట్ల నుంచి సేకరించినట్లు సంస్థ పేర్కొంది.
విద్య:
12 మంది మంత్రులు తమ విద్యార్హతలు 8 నుంచి 12 మధ్యేనని పేర్కొనగా 64 మంది మంత్రులు గ్రాడ్యుయేషన్ అంతకన్నా ఎక్కువని, ఇద్దరు డిప్లొమా చదివినట్లు అఫిడవిట్‌లోపేర్కొన్నారు.
ఎనిమిది పాస్: జాన్ బర్లా, నిశిత్ ప్రమానిక్
10 పాస్: బిశ్వేశ్వర్ తుడు, రామేశ్వర్ తేలి, నారాయణరాణే
12 పాస్: అమిత్ షా, అర్జున్ ముండా , పంకజ్ చౌధరి, రేణుక సింగ్ సూరత, సాధ్వి నిరంజన్ జ్యోతి, స్మృతి ఇరానీ, రాందాస్ అథవాలే.
క్రిమినల్ కేసులు: నలుగురు కేంద్రమంత్రులపై హత్యాయత్నం కేసులు నమోదుకాగా నిశిత్ ప్రమానిక్‌పై హత్య సంబంధిత కేసునమోదైంది.
మతఘర్షణల కేసులు..
ఐదుగురు మంత్రులపై మత ఘర్షణల కేసులు నమోదు అయ్యాయి. మతం, జాతి, మతం, మత విశ్వాసాలను అవమానించడం ద్వారా మతపరమైన ఘర్షణలకు ఉద్దేశ పూర్వక చర్యలకు పాల్పడడం (ఐపీసీ సెక్షన్ 295ఏ)
రూ.10 కోట్లపైనే అప్పులు
16 మందిమంత్రులకు రూ.కోటికన్నా ఎక్కువ అప్పులు ఉండగా వీరిలో ముగ్గురుకి రూ.10 కోట్లకన్నా పైనే అప్పులున్నాయని వారి వారి అఫిడవిట్లు చెబుతున్నాయనిసంస్థ పేర్కొంది.
రూ.కోటి కన్నా తక్కువే
ఎనిమిది మంది మంత్రు ల ఆస్తి రూ.కోటికన్నా తక్కువేనని వారి అఫిడవిట్లు చెబుతున్నా యని సంస్థ పేర్కొంది.
ధన ‘మంత్రులు’
Comments
Please login to add a commentAdd a comment