
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న వారిలో 121 మంది నిరక్షరాస్యులు. 359 మంది 5వ తరగతి దాకా, 647 మంది 8వ తరగతి వరకు చదువుకున్నారు. 1,303 మంది ట్వెల్త్ గ్రేడ్ పాసయ్యారు.
1,502 మంది డిగ్రీ చదవగా 198 మంది డాక్టరేట్ అందుకున్నారు. అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫామ్స్ (ఏడీఆర్) ఈ మేరకు వెల్లడించింది. ఏడు దశల్లో బరిలో ఉన్న మొత్తం 8,360 మంది అభ్యర్థుల్లో 8,337 మంది విద్యార్హతలను ఏడీఆర్ విశ్లేíÙంచింది.