illiterates
-
Lok Sabha Election 2024: లోక్‌సభ అభ్యర్థుల్లో... 121 మంది నిరక్షరాస్యులు
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న వారిలో 121 మంది నిరక్షరాస్యులు. 359 మంది 5వ తరగతి దాకా, 647 మంది 8వ తరగతి వరకు చదువుకున్నారు. 1,303 మంది ట్వెల్త్ గ్రేడ్ పాసయ్యారు. 1,502 మంది డిగ్రీ చదవగా 198 మంది డాక్టరేట్ అందుకున్నారు. అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫామ్స్ (ఏడీఆర్) ఈ మేరకు వెల్లడించింది. ఏడు దశల్లో బరిలో ఉన్న మొత్తం 8,360 మంది అభ్యర్థుల్లో 8,337 మంది విద్యార్హతలను ఏడీఆర్ విశ్లేíÙంచింది. -
బీజేపీ నిరక్షరాస్యుల పార్టీ.. మనీశ్ సిసోడియా ఫైర్
సాక్షి,న్యూఢిల్లీ: బీజేపీ నిరక్షరాస్యుల పార్టీ అని మండిపడ్డారు ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా. ఢిల్లీలో ప్రభుత్వ పాఠశాలలు కొన్ని ప్రైవేటు స్కూళ్ల కంటే చాలా మెరుగ్గా ఉన్నాయని చెప్పారు. బీజేపీ దేశంలో నిరక్షరాస్యతనే కోరుకుంటోందని ధ్వజమెత్తారు. ఆ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ప్రభుత్వ పాఠశాలలు ఎందుకు మూతపడ్డాయని ప్రశ్నించారు. ప్రభుత్వ పాఠశాలల్లో అదనపు గదుల నిర్మాణానికి సంబంధించి ఓ నివేదికపై చర్యలు తీసుకునేందుకు రెండేళ్లకుపైగా ఆలస్యం ఎందుకు చేశారని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సెనా.. చీఫ్ సెక్రెటరీని వివరణ కోరినట్లు వార్తలు వచ్చాయి. దీనిపై స్పందిస్తూ బీజేపీపై తీవ్ర విమర్శలు గుప్పించారు ఢిల్లీ విద్యాశాఖ మంత్రి సిసోడియా. తనపై తప్పుడు అభియోగాలు మోపిన ఎక్సైజ్ పాలసీలో ఎలాంటి అవినీతి జరగలేదని తెలిశాక ప్రభుత్వ పాఠశాల వ్యవహారాన్ని బీజేపీ తెరపైకి తెస్తోందని మండిపడ్డారు. 'వాళ్లు నాలుగేళ్ల క్రితం ఢిల్లీ సీఎం కార్యాలయం, నా కార్యాలయంలో సోదాలు నిర్వహించారు. 40 మంది ఆప్ ఎమ్మెల్యేలపై కేసులు పెట్టారు. కానీ ఏమీ దొరకలేదు. తప్పుడు ఎక్సైజ్ పాలసీ కేసులో సీబీఐని నా ఇంటికి పంపారు. కానీ ఏమీ కనిపెట్టలేకపోయారు. దీంతో ఈసారి కొత్తగా ప్రయతిస్తున్నారు. మేం నిర్మించిన స్కూళ్లపై పడ్డారు.' అని సిసోడియా బీజేపీపై ధ్వజమెత్తారు. చదవండి: రాహుల్ పాన్ ఇండియా స్టార్.. అంత ఆదరణ కాంగ్రెస్‌లో ఎవరికీ లేదు -
‘ఈచ్ వన్.. టీచ్ వన్’కు కార్యాచరణ
సాక్షి, హైదరాబాద్: సంపూర్ణ అక్షరాస్యత సాధన కోసం సీఎం కేసీఆర్ పిలుపునిచ్చిన ఈచ్ వన్ – టీచ్ వన్ కార్యక్రమానికి వయోజన విద్య విభాగం సిద్ధం అవుతోంది. ప్రస్తుత లెక్కల ప్రకారం రాష్ట్రంలో 53.39 లక్షల మంది నిరక్షరాస్యులు ఉండగా, మరింత తాజా సమాచారం కోసం గ్రామాలవారీగా నిరక్షరాస్యుల వివరాలను సేకరిస్తోంది. అందులో గుర్తించిన నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు చేపట్టాల్సిన కార్యాచరణపైనా దృష్టి పెట్టింది. దీనికోసం ప్రత్యేకంగా ఓ వర్క్‌బుక్‌ను రూపొందించేందుకు చర్యలు చేపట్టింది. ఇందులో నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా చేసేందుకు ప్రత్యేక పాఠాలు పొందుపరుస్తోంది. మరోవైపు తెలుగు వర్ణమాల, గుణింతాలు మొత్తం వచ్చిన వారి కోసం 1 నుంచి ఐదో తరగతి వరకు ఉన్న పాఠ్యాంశాలను కుదించి అన్ని సబ్జెక్టులు ఒకే పుస్తకంలో ఉండేలా దానిని రూపొందిస్తోంది. తెలుగు వర్ణమాలలోని అక్షరాలు నేర్పించేందుకు, అవి వచ్చిన వారికి వర్క్‌బుక్‌లోని పాఠ్యాంశాలు బోధించేందుకు నిర్ణీత గడువు విధించి పని చేసేందుకు చర్యలు చేపట్టింది. ఇందులో అక్షరాలు నేర్చుకున్నవారికి పరీక్షలు నిర్వహించి మంచి మార్కులు సాధించిన వారిని అభినందించడం, బోధకులను సన్మానించడం వంటి కార్యక్రమాలను చేపట్టేందుకు వయోజన విద్యావిభాగం కసరత్తు చేస్తోంది. చదువుకునేందుకు ముందుకొచ్చిన వారి వివరాలను రిజిస్టర్ చేయడానికి ఒక వెబ్సైట్, వీలైతే ప్రత్యేక యాప్ ను రూపొందించాలని భావిస్తోంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా అక్షరాస్యత కార్యక్రమంలో ఎంత మంది పాల్గొంటారు.. కార్యక్రమం ఎలా సాగుతోందన్న వివరాలు అందుబాటులోకి రానున్నాయి. -
నాలుగు నెలలు... 68 దశలు
2019 లోక్‌సభ ఎన్నికలు రెండు నెలల పాటు ఏడు దశల్లో జరుగుతున్నాయంటేనే ..అబ్బో..అంత టైమా...అనుకుంటున్నాం. అయితే, మన దేశంలో మొట్టమొదటి ఎన్నికలు ఏకంగా 68 దశల్లో నాలుగు నెలల పాటు జరిగాయి. 1951 అక్టోబరు నుంచి 1952,ఫిబ్రవరి వరకు ఆ ఎన్నికలు జరిగాయి. అప్పట్లో ఎన్నికల గురించి ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం ఎన్నికల సంఘం దేశ వ్యాప్తంగా 3000 సినిమా హాళ్లలో డాక్యుమెంటరీలు ప్రదర్శించారు. రాజకీయ పార్టీలతో పాటు ఎన్నికల సంఘం ప్రతినిధులు కూడా ఇంటింటికీ తిరిగి ఓటు వేయమని ప్రజలకు చెప్పారు. మొదటి సార్వత్రిక ఎన్నికలు జరిగే నాటికి దేశంలో 85శాతం ప్రజలు నిరక్షరాస్యులు. అప్పుడున్న 40కోట్ల జనాభాలో కేవలం 15శాతం మందికి మాత్రమే ఏదో ఒక భాషలో చదవడం, రాయడం వచ్చు. దాంతో ఓటర్లు రాజకీయ పార్టీల పేర్లను, అభ్యర్థ్ధుల పేర్లను చదవడం, గుర్తు పెట్టుకోవడం కష్టమని భావించిన ఎన్నికల కమిషనర్ సుకుమార్ సేన్ రాజకీయ పార్టీలకు గుర్తులు కేటాయించాలని నిర్ణయించారు. అప్పట్లో కాంగ్రెస్ పార్టీకి నాగలి దున్నుతున్న జోడెద్దుల గుర్తు వచ్చింది. ప్రస్తుతం కాంగ్రెస్ చిహ్నమైన హస్తం మొదటి ఎన్నికల్లో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్( నేతాజీ సుభాష్ చంద్రబోస్‌పార్టీ) పార్టీకి దక్కింది. ఈ ఎన్నికల కోసం ఓటర్ల జాబితా తయారు చేయడానికి 16వేల మందికిపైగా సిబ్బంది ఆరు నెలల పాటు ఇల్లిల్లూ తిరిగారు. తీరా ఓటర్ల జాబితా తయారయ్యాక పేరు లేని కారణంగా 28 లక్షల ఓటర్ల పేర్లను తొలగించాల్సి వచ్చింది. అప్పట్లో మహిళలు బయటివారికి తమ పేరు చెప్పేవారు కాదు. ఫలానా వారి భార్యననో, కూతురిననో, చెల్లెలిననో చెప్పడంతో సిబ్బంది అలాగే రాసుకోక తప్పలేదు. అలాంటి పేర్లను జాబితా నుంచి తొలగించారు. ఆ ఎన్నికల్లో పోటీ చేసిన పార్టీలు,అభ్యర్థులకు ప్రచారం ఎలా చేసుకోవాలో కూడా తెలిసేది కాదు. నెహ్రూ వంటి నేతలు బహిరంగ సభలు పెట్టి ఓట్లు అడిగేవారు.కొందరు ఇళ్లకు వెళ్లి అభ్యర్థించేవారు. బెంగాల్లో కాంగ్రెస్ పార్టీ రోడ్లమీద తిరిగే ఆవుల ఒంటిపై ‘కాంగ్రెస్‌కు ఓటెయ్యండి’అని రాసేవారు. ఆ ఆవుల్ని ప్రజలు ఆసక్తిగా ఉత్సుకతతో చూసేవారు. మొదటి సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోయిన ప్రముఖుల్లో అంబేడ్కర్ ఒకరు. ఎస్సిలకు కేటాయించిన ఉత్తర మధ్య బొంబాయి నియోజకవర్గం నుంచి అంబేడ్కర్ పోటీ చేసి ఓడిపోయారు. -
ఉద్యోగాల పేరుతో నిరుద్యోకులకు టోకరా
-
మహిళలకు సరస్వతీ కటాక్షం!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని 19 జిల్లాల్లో ఇప్పటికీ మహిళల అక్షరాస్యతలో వెనుకబడిన మండలాలు 470కి పైగా ఉన్నాయి.. వాటిల్లోని 9,505 గ్రామాల్లో 5,70,000 మంది మహిళలు ఇంకా నిరక్షరాస్యులే. అక్షరాస్యత కోసం గతంలో వయోజన విద్య, మూడేళ్లుగా సాక్షర భారత్ వంటి కార్యక్రమం అమలు చేస్తున్నా.. ఇంకా మహిళలు అక్షరాస్యతలో వెనుకబడే ఉన్నారు.అందుకే 15 నుంచి 55 ఏళ్లలోపు మహిళలను అక్షరాస్యులుగా తీర్చిదిద్దడం పట్ల విద్యాశాఖ ప్రత్యేక దృష్టి సారించింది. అందుకోసం ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రాథమిక విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య వెల్లడించారు. 9,505 గ్రామాల్లో ఇప్పటికే ఉన్న వయోజన విద్యా కేంద్రాలు కాకుండా మహిళల కోసం ప్రత్యేకంగా కేంద్రాలను ఏర్పాటు చేస్తామని, నవంబర్ 15 నుంచి ఆరు నెలలపాటు ఈ కార్యక్రమాన్ని చేపడతామని వెల్లడించారు. వీటిల్లో చదువుకున్న మిహ ళల్లో ఆసక్తి కలిగిన వారు ఓపెన్ స్కూల్ విధానంలో ఇంటర్ వరకు చదువుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటీతో అనుసంధానం చేస్తున్నట్టు ఆమె తెలిపారు. ఇదీ ప్రత్యేక కార్యక్రమం... ఒక్కొక్క గ్రామంలో రెండు కేంద్రాల వరకు ఏర్పాటు చేస్తారు. ఇద్దరు ఇన్స్ట్రక్టర్లను నియమిస్తారు. ఒక్కో కేంద్రంలో 30 మందిని చేర్పించాలి. రోజుకు 2 గంటలు నిర్వహించే కేంద్రంలో 30 మందిలో కనీసం 25 మందిని పూర్తి స్థాయిలో అక్షరాస్యులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఇన్స్ట్రక్టర్దే. ఆరు నెలల తరువాత వారికి జాతీయ ఓపెన్ స్కూల్ సంస్థ(ఎన్ఐఓఎస్) పరీక్ష నిర్వహించి అక్షరాస్యులుగా సర్టిఫికెట్లు ఇస్తుంది. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ప్రాంతాల్లో ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేస్తారు. కుటుంబ బాధ్యతల్లో పడి చదువుకు దూరమైన మహిళలు ఐదేళ్లలోనే ఇంటర్మీడియెట్ వరకు చదువుకునేలా చూస్తామని పూనం మాల కొండయ్య వివరించారు. నిరక్షరాస్యుల్లో అధిక శాతం మహిళలు ఎస్సీ, ఎస్టీ, బీసీలే అయినందున వారి పట్ల ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. అక్షరాస్యత కార్యక్రమంలో చదువుకున్న తర్వాత ఆసక్తి ఉంటే, మొదటి ఏడాది ఓపెన్ స్కూల్లో 3, 5 తరగతులు ఒకే ఏడాదిలో చదుకోవచ్చు. తరువాత ఏడాది 8వ తరగతి చదువుకునేందుకు అవకాశం కల్పిస్తారు. ఆ మరుసటి సంవత్సరంలో పదవ తరగతి చదువుకొని పరీక్షలు రాసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. చివరి రెండేళ్లలో ఇంటర్మీడియెట్ చదువుకునేలా అవకాశం కల్పిస్తున్నారు.