doctorates
-
Lok Sabha Election 2024: లోక్‌సభ అభ్యర్థుల్లో... 121 మంది నిరక్షరాస్యులు
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న వారిలో 121 మంది నిరక్షరాస్యులు. 359 మంది 5వ తరగతి దాకా, 647 మంది 8వ తరగతి వరకు చదువుకున్నారు. 1,303 మంది ట్వెల్త్ గ్రేడ్ పాసయ్యారు. 1,502 మంది డిగ్రీ చదవగా 198 మంది డాక్టరేట్ అందుకున్నారు. అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫామ్స్ (ఏడీఆర్) ఈ మేరకు వెల్లడించింది. ఏడు దశల్లో బరిలో ఉన్న మొత్తం 8,360 మంది అభ్యర్థుల్లో 8,337 మంది విద్యార్హతలను ఏడీఆర్ విశ్లేíÙంచింది. -
చిత్తూరు జిల్లాలో నకిలీ డాక్ట‘రేట్ల’ బాగోతం
వివిధ విభాగాల్లో ప్రముఖులు, పలు రంగాల్లో అత్యున్నత సేవలు అందించిన వారికి గౌరవ డాక్టరేట్ అందిస్తారు. అలాంటి ఉన్నత పురస్కారానికి కొందరు మకిలీ అంటిస్తున్నారు. కాసుల కోసం కక్కుర్తి పడి అంగట్లో సరుకులా అమ్మేస్తున్నారు. విశిష్ట పట్టాకు విలువ లేకుండా చేస్తున్నారు. నకిలీ యూనివర్సిటీలను సృష్టించి దందా సాగిస్తున్నారు. కేవలం రూ.పదివేలు ఇస్తే చాలు అర్హత లేకున్నా డాక్టరేట్ డిగ్రీ ప్రదానం చేసేస్తున్నారు. ఏజెంట్లు, సామాజిక మాధ్యమాలను వినియోగించుకుని ఫేక్ డాక్టరేట్‌ను యథేచ్ఛగా విక్రయిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా ఇలాంటి నకిలీ బిరుదాంకితులు వందమంది వరకు ఉండవచ్చని సమాచారం. పలమనేరు: జిల్లాలో నకిలీ డాక్ట‘రేట్ల’ బాగోతం కలకలం రేపుతోంది. సుమారు వంద మంది వరకు కొన్ని ఫేక్ యూనివర్సిటీల నుంచి గౌరవ డాక్టరేట్లు పొందినట్టు తెలుస్తోంది. ఈ మేరకు కర్ణాటక పోలీసులు రంగంలోకి దిగారు. ఎవరెవరు పొందారు.. ఎక్కడి నుంచి పొందారు..? అనే దానిపై లోతుగా అధ్యయనం చేస్తున్నట్టు సమాచారం. వెలుగులోకి ఇలా.. మూడు రాష్ట్రాల్లో కార్యకలాపాలు నిర్వర్తిస్తున్న ఇంటర్నేషనల్ పీస్ యూనివర్సిటీ తాజాగా కర్ణాటకలోని మైసూరులో వంద మందికి గౌరవ డాక్టరేట్ల ప్రదాన కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించింది. డబ్బులు తీసుకుని డాక్టరేట్లను ప్రదానం చేస్తున్నారని ఫిర్యాదులు అందడంతో అక్కడి డీసీపీ ప్రకాగౌడ అవాక్కయ్యారు. వెంటనే తమ సిబ్బందితో అక్కడికి చేరుకున్నారు. ఆ కార్యక్రమాన్ని అడ్డుకుని కొందరు నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు. డాక్టరేట్ల డొంక కదిలించారు. ఇందులో పలు ఆసక్తికర విషయాలు వెలుగుచూసినట్టు తెలిసింది. చిత్తూరు జిల్లాకు చెందిన వంద మంది వరకూ ఇప్పటికే ఫేక్ డాక్టరేట్లను పొందినట్టు నిర్ధారణయ్యింది. తాజాగా మరో 50 మంది డాక్టరేట్లకు డబ్బులు చెల్లించినట్టు సమాచారం. పదుల సంఖ్యలో నకిలీ యూనివర్సిటీలు పాండిచేరి, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన పలు ఫేక్ యూనివర్సిటీలు డబ్బులకు డాక్టరేట్లను ప్రదానం చేస్తున్నాయి. కోయంబత్తూరు, చెన్నై, బెంగళూరు, మైసూ రు, పాండిచ్చేరి కేంద్రాలుగా యూనివర్సల్ పీస్ యూనివర్సిటీ (అమెరికా), మలేషియా లింకోక్వింగ్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ గ్లోబల్ ఆక్స్ఫర్డ్ తదితర యూనివర్సిటీలు ఐదేళ్లుగా నకిలీ డాక్టరేట్ల ప్రదానంతో లక్షలాది రూపాయలు వసూలు చేసినట్టు సమాచారం. కొందరు ఏజెంట్లు పట్టణాల్లోని వీఐపీలకు గాలం వేస్తున్నట్టు తెలుస్తోంది. జిల్లాలో ఎవరెవరో? డాక్టరేట్ల కోసం ఇప్పటికే రూ.10 వేల నుంచి రూ.50 వేల దాకా డబ్బులు చెల్లించిన వీఐపీలు జిల్లాలో వంద మంది దాకా ఉన్నట్టు తెలుస్తోంది. వీరిలో రాజకీయ నాయకులు, రిటైర్ట్ అధికారులు, అధ్యాపకులు, ఉపాధ్యాయులు, సంఘ సేవకులు, రియల్టర్లు, బిల్టర్లు, స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు, శాస్త్రవేత్తలు ఉన్నట్టు సమాచారం. ఇప్పటిదాకా డాక్టరేట్లు పొందిన వారి జాబితా మైసూరు పోలీసుల చేతికి చిక్కినట్టు తెలిసింది. వీరిలో చాలామంది ఇప్పటికే ‘గౌరవ డాక్టర్లు’గా సమాజంలో గుర్తింపు పొందుతుండడం గమనార్హం!. పోలీసులు కేసు నమోదు చేసి నకిలీ వర్సిటీల బాగోతం తేల్చే పనిలో పడ్డారు. -
సత్యభామ యూనివర్శిటీలో డాక్టరేట్ల ప్రధానం
-
సంచలనాలకు పోకూడదు...
-
కఠోర శ్రమతోనే విజయతీరాలు
చేబ్రోలు: కఠోర శ్రమతోనే విజయతీరాలు చేరువవుతాయని సినీ నటి, మాజీ పార్లమెంట్ సభ్యురాలు జయప్రద పేర్కొన్నారు. చేబ్రోలు మండలంలోని విజ్ఞాన్ యూనివర్సిటీలో శనివారం స్నాతకోత్సవం జరిగింది. ఈ సందర్భంగా ఫ్రాన్స్‌కు చెందిన ఇకోల్ సెంట్రల్ డి నాన్‌టెస్ సంస్థ డైరెక్టర్ ఫర్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఆచార్య ఫౌడ్ బెన్నిస్, పంచ సహస్ర అవధాని మేడసాని మోహన్, మాజీ పార్లమెంట్ సభ్యురాలు, సినీ నటి జయప్రదకు విజ్ఞాన్స్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్లు ప్రదానం చేసింది. ఈ కార్యక్రమంలో సినీనటి జయప్రద మాట్లాడుతూ రాజకీయ రంగమైనా, సినీ రంగమైనా క్రమశిక్షణ, నిజాయతీతో కూడిన శ్రమతోనే మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. ఫ్రొఫెసర్ ఫౌడ్ బెన్నిస్ మాట్లాడుతూ యువతకు లక్ష్యముండాలన్నారు. మేడసాని మోహన్ మాట్లాడుతూ నైతిక విలువలతో కూడిన విద్య జీవితాన్ని ఉన్నత స్థానంలో నిలబెడుతుందని చెప్పారు. దేశ, విదేశాల్లో ఎన్నో అవార్డులు తీసుకున్నానని, సొంత గడ్డపై తీసుకున్న డాక్టరేట్ గొప్పదని ఆనందం వ్యక్తం చేశారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని సమాజ ఉన్నతికి మాత్రమే వినియోగించాలని సంస్కృతి విచ్ఛిన్నతికి కాదని ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ఘనిస్తాన్ భారత రాయబారి, కార్యక్రమ ముఖ్యఅతిథి డాక్టర్ షహీద్ మహమ్మద్ అబ్దాలి అన్నారు. 1,279 మందికి డిగ్రీలు.. వర్సిటీ కులపతి డాక్టర్ కే రామ్మూర్తినాయుడు, ఉప కులపతి డాక్టర్ సీ తంగరాజ్ మాట్లాడుతూ స్నాతకోత్సవం సందర్భంగా మొత్తం 1279 మందికి డిగ్రీలు అందజేసినట్లు తెలిపారు. -
ముగ్గురూ ముగ్గురే.. సూపర్ రికార్డు
ఆడపిల్లలకు రక్షణ అందించడంతో పాటు, వారికి విద్యావశ్యకతను చాటిచెప్పుటకు ప్రధాని నరేంద్ర మోదీ తీసుకొచ్చిన పథకం బేటీ బచావో, బేటీ పడావో. ఈ పథకానికి మధ్యప్రదేశ్‌లోని రేవా జిల్లాలో ఓ కుటుంబం బ్రాండ్ అంబాసిడర్‌గా నిలుస్తోంది. నలుగురు కూతుర్లలో ముగ్గురు కూతుర్లు ఒకేసారి డాక్టరేట్ పట్టా తీసుకొని వారి తల్లిదండ్రులకు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డుల్లో చోటును కానుకగా ఇచ్చారు. రెవా జిల్లాలో అడ్వకేట్ విజయ్ శంకర్ మిశ్రా, గిరిజా మిశ్రాలకు నలుగురు కూతుళ్లు. వారిలో ముగ్గురు కూతుర్లు ఒకేసారి 2014లో అవదేష్ ప్రతాప్ సింగ్(ఏపీఎస్) యూనివర్సిటీ నుంచి పీహెచ్డీ పట్టాలు తీసుకున్నారు. బేటీ బచావో, బేటీ పడావోకు ఈ అక్కాచెల్లెళ్లు ఆదర్శంగా నిలుస్తున్నట్టు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డు పేర్కొంది. వారితో పాటు వారి తల్లిదండ్రుల ఫోటోలను లిమ్కా బుక్ ఆఫ్ రికార్డుల 2017 ఎడిషన్‌లో ప్రముఖంగా ప్రచురించనున్నట్టు.. లిమ్కా బుక్ ఆఫ్ రికార్డుల కార్యక్రమానికి హాజరుకావాల్సిందిగా లేఖను అందుకున్నారు. పెద్ద కూతురు అర్చనా(36).. భారతీయ సాంప్రదాయాల్లో అమ్మాయిల పాత్రపై పరిశోధన నిర్వహించి చరిత్రలో పీహెచ్డీ తీసుకోగా.. అంజనా(33), అన్షు(30) ఇద్దరూ పర్యావరణ శాస్త్రంలో డాక్టరేట్ పొందినట్టు తండ్రి మిశ్రా పేర్కొన్నారు. ఈ ముగ్గురూ ఒకేసారి పీహెచ్డీ పట్టాలు పొందడం విశేషం. ఆడపిల్లల్ని చదివించడానికే వెనుకాడుతున్న వారికి ఈ తల్లిదండ్రులు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారని, బేటీ బచావో, బేటీ పడావో స్లోగన్‌కు నిలువెత్తు నిదర్శంగా అభివర్ణిస్తూ పొగడ్తలు వెల్లువెత్తుతున్నాయి. అయితే రిజర్వేషన్ల కారణంగా ప్రభుత్వ ఉద్యోగాలు పొందలేకపోవడంతో కాలేజీ లెక్చరర్స్‌గా చేరినట్టు తండ్రి తెలిపారు. ప్రస్తుతం న్యాయ శాస్త్రంలో గ్రాడ్యుయేట్లు పొందిన అర్చనా, అన్షు జ్యుడిషియల్ సర్వీసు ఎగ్జామ్‌కు సన్నద్ధమవుతున్నారని, అదేవిధంగా అంజనా న్యూఢిల్లీలో సివిల్ సర్వీసు ఎగ్జామ్‌కు ప్రిపేర్ అవుతుందని తండ్రి పేర్కొన్నారు. -
తెలుగు ప్రముఖులకు గౌరవ డాక్టరేట్లు
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : వివిధ రంగాలకు విశేష సేవలందించిన ముగ్గురు తెలుగు ప్రముఖులకు ఇక్కడి న్యూ ఇంటర్నేషనల్ క్రిస్టియన్ యూనివర్శిటీ గౌరవ డాక్టరేట్లను ప్రదానం చేసి సత్కరించింది. శనివారం సాయంత్రం ఇక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో యూనివ ర్శిటీ చాన్సలర్ ఆర్కే. శ్యామ్సన్ నుంచి డాక్టరేట్లను అందుకున్న వారిలో కోట శంకరరావు, గున్నా రాజేందర్ రెడ్డి, అంద్శై ఉన్నారు. సినిమాల్లో సైతం నటించిన శంకరరావుకు, బుల్లి తెరకు అందించిన సేవలకు గుర్తింపుగా డాక్టరేట్‌ను ఇచ్చారు. ఇదివరకు ఆయన నాలుగు నంది అవార్డులను కూడా అందుకున్నారు. మరో గ్రహీత రాజేందర్ రెడ్డి 1987 నుంచి సమాజ సేవా కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్నారు. భూదాన్ బోర్డు ట్రస్టు కార్యదర్శిగా వ్యవహరిస్తున్న ఆయన అనాథ పిల్లలను బడి బాట పట్టించడంలో విశేష కృషి చేశారు. ఆ విధంగా విద్యా బుద్ధులు నేర్చుకున్న వారిలో వందల మంది ప్రస్తుతం ఉపాధ్యాయులుగా పని చేస్తున్నారు. ఇక సాహితీ రంగంలోని అంద్శైసహజ కవిగా పేరు గడించారు. 2008లో కాకతీయ యూనివర్శిటీ ఆయనకు గౌరవ డాక్టరేట్నిచ్చి సత్కరించింది. కాగా ఈ ప్రదానోత్సవంలో మాజీ ఎమ్మెల్యే ఎన్ఎల్. నరేంద్ర బాబు ప్రభృతులు పాల్గొన్నారు.