ప్రపంచంలోనే అత్యధిక మిలియర్లు ఉన్న నగరాల జాబితాను ఏటా ఇమ్మిగ్రేషన్ కన్సల్టెన్సీ అయిన హెన్లీ & పార్ట్‌నర్స్ ఇస్తుంది. సంపన్న నగరాల జాబితాలో న్యూయార్క్ దాదాపు మూడు లక్షల మిలియనీర్లతో రెండో స్థానంలో ఉంది. ఇక్కడ నివాసితులు ప్రపంచంలోని ఇతర మెట్రో నగరాల కంటే దాదాపు మూడు డాలర్ల ట్రిలయన్లకు పైగా సంపదను కలిగి ఉన్నట్లు పేర్కొంది. ఇక్కడ మిలియనీర్ల సంఖ్య సుమారు 4% పెరిగినట్లు తెలిపింది. న్యూయార్క్‌లో 2013 నుంచి ఇప్పటి వరకు అంత్యంత సంపన్నుల సంఖ్యలో పెద్ద వాటాను కలిగి ఉంది. ఇక్కడ సుమారు 60 బిలియనీర్లు ఉన్నారని, వారిలో చాలామంది దాదాపు రూ. 800 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టగలరని వెల్లడించింది.
ఇక శాన్ జోస్, శాన్ ఫ్రాన్సిస్కో బేఏరియా, పాలో ఆల్టోల వంటి నగరాల్లో శాన్ ఫ్రాన్సిస్కో బేఏరియాలో మాత్రం మూడు లక్షల మంది కోట్లల్లో నికర విలువ కలిగి ఉండటంతో రెండో స్థానంలో ఉందని తెలిపింది. ఇక ఈ అత్యధిక మిలియనీర్స్ జాబితాలో టోక్యో మూడో స్థానంలో ఉండగా, సింగపూర్ నాల్గో స్థానంలో ఉంది. కాగా హెన్లీ & పార్ట్‌నర్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జుర్గ్ స్టెఫెన్ ప్రకారం గత కొన్ని ఏళ్లలో ఆర్థిక మార్కెట్‌లలో విజృంభణ ఒక్కసారిగా ప్రపంచంలోని కొన్ని అత్యంత సంపన్న నగరాల వృద్దిని పెంచింది.
పైగా వాటి గ్లోబల్ ఈక్విటీలు 2023లోనే సుమారు 20% పెరగగా, ఈ ఏడాది ఏకంగా 7% పెరిగాయి. దీంతో కొన్ని ప్రపంచ నగరాల అదృష్టం తారుమారయ్యిందని చెబుతోంది హెన్లీ & పార్ట్‌నర్స్ సర్వే. గత దశాబ్దంలో లండన్ తన మిలియనీర్ జనాభాలో 10% కోల్పోయింది. దీనికి యూరోపియన్ యూనియన్ నుంచి నిష్క్రమించాలని యూకే తీసుకున్న నిర్ణయమని చెబుతోంది. అలాగే చైనా మహమ్మారి టైంలో విధించిన ఆంక్షలు కారణంతో సంపన్న ప్రవాసులు సింగపూర్‌కు తరలిరావడంతో హాంకాంగ్ దాని మిలియనీర్ ర్యాంక్‌లలో 4% క్షీణతను చవి చూసింది.
ఇదే సమయంలో కొన్ని నగరాల్లో మిలియనీర్ల వృద్ది అనూహ్యంగా పెరిగింది వాటిలో షెన్‌జెన్ కూడా ఉంది, ఇక్కడ గత దశాబ్దంలో మిలియనీర్ల సంఖ్య సుమారు 140% పెరిగింది. ఇక గత 10 ఏళ్లలో రెట్టింపుకు పైగా మిలియనీర్ జనాభా పెరిగిన నగరాలు వరుసగా భారతదేశంలోని బెంగళూరు, హో చి మిన్ సిటీ, వియత్నాం, యూఎస్‌లో అరిజోనాలోని స్కాట్స్‌డేల్ వంటి నగరాలు. కాగా ఆ జాబితాలో సంపన్న నగరంగా దుబాయ్ 21వ స్థానం దక్కించుకోగా, మొనాకో నెంబర్ 1 స్థానంలో ఉంది. మొనాకోలో సుమారు 40%కి పైగా మిలియనీర్లు ఉన్నారని హెన్లీ & పార్ట్‌నర్స్ సర్వే చెబుతోంది.
(చదవండి: సోమవారాల్లో నలిగిన బట్టలే ధరించండి! సీఎస్‌ఐఆర్ పరిశోధన సంస్థ)
Comments
Please login to add a commentAdd a comment